Previous Page Next Page 
చీకటి తొలగిన రాత్రి పేజి 11

 

    "అవే కాదండోయ్ , మర్చిపోయాను మీకు ఓపిక వుంటే యింకా మాచ్ ఖండ్, చిత్ర కాట్" వాటర్ ఫాల్స్ వున్నాయి.... ఆఫ్ కోర్స్ చాలా దూరం కోరాపుట్ డిస్ట్రిక్ట్ లో వున్నాయి.
    "వద్దు బాబు చాలు ఇంకెక్కడికి రాలేను.... మీకో నమస్కారం" నమస్కారం పెట్టేశాడు.
    "పోనీ అవి వద్దు దూరం అంటున్నావు. "నయగారా" అవి ఎలాగు చూశాం, ప్రక్కనున్న ఖండగిరి, ఉదయగిరి చూపించేయి చాలు." అంది మీనాక్షి.
    "ఓ దానిదేముంది . కాస్త రెస్ట్ తీసుకున్నాక "ఓ పూట వెళ్ళొచ్చు" ఓరోజు రెస్టు తీసుకున్నాక ఆ వూర్లో కూడా చూడాల్సిన "లింగరాజ్" ఆలయం మ్యూజియం వగైరాలు చూపించాను. లింగరాజ్ ఆలయం పూరీ దేవాలయం కంటే చాలా పురాతనమైనది. ఇండియాలో దేవాలయాలన్నింటికంటే ఎత్తయిన శిఖరం గలదిట. దేవాలయంలో ఈశ్వరుడి లింగం భూమిలో వుండి కాస్త మాత్రం పైకి కనిపిస్త వుంటుంది. చరిత్ర ప్రసిద్దమైన ఆలయమే. ఇంకా అక్కడున్న రాజారాణి టెంపుల్ కూడా తీసికెళ్ళాను ..... ఒరిస్సా లో దేవాలయాలన్నింటి స్ట్రక్టర్ ఒకలాగే వుండి వైదివ్యం కనపడదు.
    మరో పూట మ్యుజియం చూపించాను. భువనేశ్వర్ లో కంటికి ఆహ్లాదకరంగా ప్రతి బాల్డింగ్ మీద అరంగురంగుల "బోగన్ విల్లాలు" విరగాబోసిన పూలతో అందంగా కనిపిస్తాయి.... మ్యూజియంలో ఆ పూల మొక్కల మధ్య కలర్ ఫోటోలు తీస్తే అద్భుతంగా వస్తాయి .... మ్యూజియంలో ముఖ్యంగా చూడవలసినవి ఒరిస్సా ఆర్ట్ --- క్రాప్ట్స్! హాలులో ప్రవేశించగానే ఎదురుగా కోయవాళ్ళ చేతులు నడుం చుట్టూ కలిపి చేసే డాన్స్ కనిపిస్తుంది. ఆ దృశ్యం గాజుకేసులో కనక బంధించక పొతే నిజంగానే అక్కడ కోయవాళ్ళు - డాన్స్ చేస్తున్నారనిపిస్తుంది. మట్టితో మలచిన లైఫ్ సైజు బొమ్మలకి విగ్గులు, బట్టలు , ఆభరణాలు అన్నీ పెట్టి తయారుచేసిన ఆ ప్రతిమలకి ప్రతి వంపు సోంపు చిన్న చిన్న డిటైల్స్ తో సహా మనుష్యులే అక్కడ నిలబడ్డారా అన్న భ్రమని కలిగిస్తాయి. ఒరిస్సా మట్టితో చేసే బొమ్మలకి ప్రసిద్ది. నవరాత్రి ఉత్సావాలలో,ముఖ్యంగా కటక్ లో దేవీ విగ్రహాలు అద్భుతంగా మలుస్తారు . చూసి తీరాలి! ఓసారి దుర్గ పాదాల దగ్గిర కూర్చొన్న బొమ్మ  "బొమ్మని ముట్టుకు చూస్తేనే గాని ఎవరూ నమ్మలేనంత సహజంగా ఒంటి ముడతలతో , నరాలతో ముసలి మనిషినే కూర్చుండ బెట్టినంత సహజంగా కేవలం మట్టితో మలచిన ఆ శిల్పులని అనినందించకుండా ఉండలేరు ఎవరూ.
     మరో పూట మా ఐ.ఎ.ఎస్. మిత్రులందరి ఇళ్ళకి తీసుకెళ్ళాను ఒక ఆదివారం ఇంగ్లీషు సినిమమార్నింగ్ షోకి వెళ్లాం! రామావతారం విదేశాలలో తీసి ఫొటోలన్నీ "సైడ్ ప్రోజుక్టర్ " తో చూపించాడు.
    ఇరవై రోజులు ఇరవై నిమిషాలలాగ తెలియకుండానే గడిచిపోయాయి. ఆరాత్రి మీనాక్షి వాళ్ళు వెళ్ళే రోజు! టిక్కట్లు హౌరా మెయిల్ కు ముందే బుక్ చేయించాను.
    మీనాక్షి వెళ్ళి పోతుందంటే ఉదయం నించి ఏదో గుబులుగా వుంది .... మీనాక్షి వెళ్ళిపోతుంది ! .... తరువాత ఏముంది? మళ్ళీ నా ఆఫీసు ..... రాతి బొమ్మలా చైతన్యం లేని శాంతి , .... నాకెందుకో దిగులనిపించింది. మీనాక్షి వచ్చింది , వెళ్ళిపోతుంది ! ఏదో అసంతృప్తి .... ఏదో వెలితి! మీనాక్షి వెళ్ళిపోతుంది .... మళ్ళీ ఎన్నాళ్ళకో ... బహుశా అసలు కల్సుకోలేక పోవచ్చు. ఈ ఇరవై రోజులు గుర్తుగా మీనాక్షి రాకకి గుర్తుగా నాకేం మిగులుతుంది ! ఎంత ఫూల్ ని! అంత అద్భుతమైన అవకాశాలు చేతులారా విడిచేశాను.... చెంతకి వచ్చిన ఆనందాన్ని అందాన్ని అనుభవించటం చేత గాని చవటని! ఛీ...... ఉత్త స్టుపిడ్ లా బిహేవ్ చేశాను. మీనాక్షి ఏమనుకుందో! నా అప్రయోజకత్వానికి నవ్వుకుందేమో అంతలా చేరువకి వచ్చిన ఆడదాన్ని సంతృప్తి పరచలేని చవటని.... ఆ ఉదయం అంతా ఏదో చేతులారి అందిన దాన్ని జారవిడిచానన్న భావం నన్ను దిగాలుపరిచింది.... ఏదో జరగవలసింది జరగనీయలేదు నేను. అన్న సంతృప్తి నన్ను క్రుంగదీసింది .....
    వెళ్ళే లోపల మీనాక్షిని ఏకాంతంగా ఒక్కసారి కలుసుకు తీరాలి .... కాని ఎలా? ఎక్కడ? .... ఎలా వీలవుతుంది?
    నాలోచన మీనక్షికే వచ్చిందో, లేక మాములుగా నే అందో గాని ఆ మధ్యాహ్నం రెండు గంటలప్పుడు ...." బావా! ఆఖరికి ఖండగిరి ఉదయగిరి చూపించనే లేదు. నేనూ మర్చిపోయాను ' అంది. నా మనస్సు ఉరికింది ఒక్కసారిగా.
    'అవునవును , మర్చిపోయాను. మధ్యాహ్నం వెడదాం మూడు గంటలకి ఎంతసేపు ప్రక్కనేగా...."
    "నే రాలేనండి . ఎక్కలేను . కాలింకా నొప్పిగానే వుంది. మీరంతా వెళ్ళండి ." అన్నాడు రామావతారం. క్రితం రోజు మ్యూజియం మీద మీది నుంచి దిగి వస్తుంటే అతని కాలు మడతపడి పాదం వాచింది. అయిడక్స్ రాసుకుని కాపడం పెట్టినా యింకా తగ్గలేదు. నా మనస్సులో ఆలోచన గ్రహించినట్టే రామావతారం అలా అనడం నిజంగా సంతోషం అనిపించింది! ప్రశ్నార్ధకంగా శాంతి వంక చూశాను .... "శాంతీ రానంటే బాగుండును" అన్న ఆలోచన నా మొహం మీదే కన్పించిందేమో నా వంక ఒక్క క్షణం చూసి నేనూ రాను .... ఎన్ని సార్లో వెళ్లాను ..... పెద్ద చూడ్డానికి ఏముంది మీరు పిల్లలు వెళ్ళండి . అంది శాంతి ఎటో చూస్తూ మనసులోనే థాంక్స్ చెప్పుకున్నాడు.
    మూడు గంటలకి మీనాక్షి తయారయింది. "వెళ్ళిపోతాను , మా వూరు వెడితే నాకు మళ్ళీ బద్ధకం" అంటూ ఉదయం చక్కగా ఓ గంట అభ్యంగనస్నానం ఆడింది.
    జుట్టు అరలేదని వదులుగా వాలుజడ వేసుకొంది. ఉదయమే శాంతి బొట్టు పెట్టి నేకొన్న సంబల్ పూర్ చీర యిఅచ్చింది మీనాక్షికి. ఒరిస్సాకి వచ్చినందుకు గుర్తుగా ఇంకా ఎన్ని రకాల చీరలు వున్నా కావాలని "సంబల్ పూర్" చీర కొన్నాం. శాంతి నేను మీనాక్షి రాకముందే! సంపెంగ రంగు చీరకి ఎర్రటి బోర్డరు చీల చాలా బాగుంది. మీనాక్షి కట్టుకుంటే చీరకి అందం వచ్చిందో , చీర నించి మీనాక్షికి అందం వచ్చినదో చెప్పలేను గాని, ఆ చీరతో , ఎర్ర జాకట్టు తో తలలో గార్డెను లో విరిసిన చామంతులు, కనకాంబరాలు , మరువం కలిపి కట్టిన మాల, కళ్ళకి కాటుకతో ఆ రోజు సింపుల్ గా అద్భుతంగా కనిపించింది మీనాక్షి.
    రోజూ వేసుకున్న ముడులు, లిప్ స్టిక్ లు, స్లివ్ లెస్ లు మానేస్తేనే ఇవాళ్ళ నేచురల్ గా చాలా అందంగా పాత మీనాక్షి గుర్తు వచ్చేట్టుంది.
    శ్రద్దగా క్రికెట్ మాచ్ ఆడుతున్న పిల్లల్ని ఎంత పిలిచినా రామన్నారు." వుయ్ ఆర్ నాట్ ఇంటరేస్టేడ్ .... యు గోమమ్మి" అంటూ మీనాక్షి పిల్లలు రామని అల్లరి పెట్టారు ,  క్రికెట్ అడుకోవాలని.
    "సరే మీరిద్దరూ వెళ్ళి వచ్చేయండి త్వరగా. మీనా ఇంకా పేకింగ్ అది వుంది. అక్కడుండి పోక త్వరగా రండి" అంటూ హెచ్చరించి మమ్మల్ని వెళ్ళమన్నాడు రామావతారం.
    మీనాక్షితో ఒంటరిగా వుండే చివరి అవకాశం లభ్యమయినందుకు పొంగిపోయాను. యీ సారి యీ అవకాశాన్ని యిది వరకు ఫూల్ లా జార విడవద్దని మనస్సు గట్టిగా హెచ్చరించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS