ఆ తరువాత చేయిచాచి దాన్ని అందుకోవాలని ప్రయత్నింస్తుంది. వీలైతే నోటికిఅందించుకోవాలని వుబలాట పడుతుంది. ప్రాణికి ప్రకృతి నిర్దేశించిన విచిత్ర సహజాతాలు ఇలాంటివన్నీ! స్వచ్చమైన మనసుతో, ఓ విధమైన ఆసక్తితో తాకిచూడాలని ప్రయత్నించాడు అర్ధ మానవుడు.
ఆ తరువాత చేయిచాచి దాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తుంది. వీలైతే నోటికి అందించుకోవాలని వుబలాట పడుతుంది. ప్రాణికి ప్రకృతి నిర్దేశించిన విచిత్రవాహజాతాలు ఇలాంటివన్నీ! స్వచ్చమైన మనసుతో, ఓ విధమైన ఆసక్తితో తాకిచూడాలని ప్రయత్నించాడు అర్ధ మానవుడు.
అతడు పసి బాలునివంటి మనస్తత్వం కలిగిన వాడని గ్రహించిన కెప్టెన్ మాలతి అతని ఆసక్తిని నిరోధించలేదు. అతడు చెంపలమీది చేతులుతీసి మెడమీదవేశాడు. భుజాలను తడిమి చూచాడు. గోళ్ళు తగిలి చురుకుమంటున్నాయి. కాని కెప్టెన్ మాలతి అభ్యంతర పెట్టలేదు.
తెలుసుకోవాలన్న తపన మనిషి సహజాతం. అది లేకపోతే మానవుడీనాడు ఇంతవాడు అయ్యేవాడుకాడేమో; ఈ వేళ అంతరిక్షంలోకి నక్షత్ర సీమలలోకి చొచ్చుకు పోతున్నాడంటే దానికి ఒకనాటి తొలిబీజం తెలుసు కోవాలన్న తపన. అది మానవ నైజం.
"ప్రిమిటిన్ మాన్" అయిన ఇతడు అటువంటి నైజాన్ని ప్రదర్శిస్తున్నాడు. అందునించి కెప్టెన్ మాలతి రవంత అయినా అభ్యంతర పరచలేదు. తన శరీరాన్ని అర్ధం చేసుకోవాలన్న తపన అతని నవ జాతమైతే అందుకు ఆమె ఒక మెరుపులా అన్ని విధాలా సహకారాన్ని అందించింది.
అతడు శిరోజాలను లాగుతున్నప్పుడు గోళ్ళ మద్య వెంట్రుకలు చిక్కుపడి చురుకుమన్నాయి. అయినా ఆమె సహనంతో అదంతా భరించి ఊరుకుంది. ఆమె కిమ్మనలేదు.
నోరు తెరచి చూపించమని సైగలుచేశాడు అతడు మాధవి నోరు తెరచింది. నాలుకపట్టి మొరటుగా బయటకు లాగాడు. ఆమెకు రవ్వంత బాధ అనిపించింది.
అయినా భుజాలమీదికి కన్న బిడ్డను ఎక్కించుకుంటే అతడు కాలు చాచి ముఖంమీద తంతాడు. తల్లికి రవ్వంత బాధ అనిపించినా ఓర్చుకుంటుంది. ఏవో మధురానుభూతులను స్మరించి ఆ బాధను ఆనందంగా అనుభవిస్తుంది.
అటువంటి మధురానుభూతులేవీ తనకులభించక పోయినా అంతా వాత్సల్యంతో అతడు పెడుతున్న బాధ లన్నింటినీ భరించింది మాలతి. కన్నబిడ్డపట్ల తల్లి ఎలాంటి ఓరిమిని సహకారాన్ని ప్రదర్శించగలదో తానూ అంతట సహనాన్ని ప్రదర్శించగలిగినదామె.
చిన్న బిడ్డ తల్లి శరీరాన్ని స్పృశించినట్లే అతడు తన ఎదుట ప్రత్యక్షమైన మరొక మనిషిని అర్ధం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతఃపూర్వం అతని ప్రపంచం చాలా పరిమితమైనది. అనివార్యంగా ఒంటరి, తనానికి అలవాటు పడిపోయిన ప్రాణి.
తనలాంటి మరొక ప్రాణి వుంటుందని ఎరుగడు. అందునించి అతడి ఆసక్తి అధికాధికం అవుతోంది. అతడి మనోమయ ప్రపంచంలోని అనుభవాలు చాలా సంక్షిప్తమైనవి. గుహలో తల దాచుకోవటం చలిని ఎండను వర్షాన్ని తట్టుకోవటం.
చమరీ మృగాల్ని ఎలుగుల్నీ అడవి దున్నల్ని వేటాడటం వాటి మాంసాన్ని తాను తయారు చేసుకున్న పదును ఐన రాళ్ళతో (చాపర్స్) ముక్కలు కోయటం వాటిని మరింత చిన్న ముక్కలుగా తయారు చేసుకోవడానికి మరింత పదును ఐన చిన్న చిన్న రాతి ముమాల్ని తయారుచేసుకోవటం.
ఇదే అతడు అనుభవంలోకి తెచ్చుకున్న ప్రాపంచిక మయిన దృశ్యాలు. సామాజికులయినవారికి ఉండే అనుభవాలేవీ అతనికి ఉండవు తనలాంటి మరొక ప్రాణిని చూడటం ప్రధమం.
అతని మనసులో వాస్తవానికి ఇప్పుడొక విచిత్ర మయిన అనుభవం కలుగుతోంది. అది ఆనందం తాలూకు భావం క్రొత్తగా ప్రపంచంలోకి కాలుపెట్టిన పసివాడు లోకాన్ని చిర విస్మయంగా చూస్తూవుంటే ఎటువంటి అనుభూతులు కలుగుతాయో అలాంటి కదలికలే అతనిలోనూ ప్ర్రారంభమయినాయి. ఆ అనుభూతి శాశ్వతంగా ఉండాలనో పదేపదే కావాలనో అనిపిస్తోంది అతనికి.
రవంతసేపు అయినతరువాత అతడు ఆమెను చేయిబట్టి లాగాడు. కొద్ది గంటలక్రితం తన ప్రాణాలను బలి గొంటాడని భావించిన ఆ విచిత్ర మానవుడు మైత్రీభావాన్ని ప్రదర్శించడం ప్ర్రారంభించినాడని అర్ధం చేసుకుంది కెప్టెన్ మాలతి.
ఆమె భయమంతా తీరిపోయింది.
తాను ఈ ఏకాంత ప్రదేశంనించి, దూరమయిన అడవి నించి భయంకరమయిన లోయనుమ్చి బయటపడటం సాధ్యమవుతుందో కాదో యిప్పుడిప్పుడే తెలియదు. పరిసరాలను పరిశీలించాలి. అర్ధం చేసుకోవాలి.
కాని అందాకా ఈచలిని భరించడం అసాధ్యమనిపించేలా ఉంది. ఆ మానవుడు ఎలా భరిస్తున్నాడో తెలియదు. కెప్టెన్ మాలతి అతని వెంట నడుస్తోంది. అతడు చిరకాలపు మిత్రునిలా ఆమె చేయిపట్టి ముందుకు నడవసాగాడు.
తన ఏకాంత జీవితం ఆసాంతమయిన ఆక్షణాలు అతనికి అమితమయిన ఆనందాన్ని అందించుతున్నాయి. తన సంపదలన్నీ ఆమెకు పరిచయం చేయాలనీ అతనికి అనిపిస్తోంది.
నేరుగా గుహ అంతర్భాగానికి తీసుకుపోయినాడతడు. లోపల యిప్పుడు వెలుగు పరుచుకుపోయింది. రవికాంతులు గుహాంతర్భాగానికి కూడ ప్రవేశించినాయి ఆ వెలుగులో ఆమెకు అతడు ఉపయోగించే చిత్ర విచిత్ర మయిన వస్తుసంచయ మంతా ప్రత్యక్షమవుతోంది.
కొన్నిచోట్ల చిన్న చిన్న ఎముకలు ప్రోగులు ఏది ఉన్నాయని అతడు తీరికగా కూర్చుని ఆహరం తినేందుకు ఆ చోటున ఎత్తయిన శిలా వేదికలు నిర్మించుకున్నాడు.
