Previous Page Next Page 
అర్ధ మానవుడు పేజి 9


    తాను చదువుకున్న ఆనాటి మీ శాస్త్రపరిజ్ఞానమంతా ఒకసారి ఆమె మనోఫలకంమీద ప్రత్యక్షమయింది. ఈభూమి మీద ఈనాడు కన్పించే మహనీయుడయిన మానవుడు ఈ దశకు చేరుకునేందుకు ఎన్నో దశల్ని అధిగమించి వచ్చాడు.
    ఎన్నో ప్రకృతినించి ఎదురయిన పరీక్షలకు ఎదురొడ్డి నిలిచాడు. ఈనాటికి భూమిమీద ప్రాణులన్నంటిలోకి మానవుడు మహాకృతుడయినాడు. కాని అతని ప్రయాణం ఎక్కడినించి ప్ర్రారంభమయిందో అక్కడనించి ఆలోచిస్తే అదొక బృహత్కధనిమించిన మహాకావ్యమవుతుంది.
    అంధకార యుగంలో అతని జీవితం గురించి మేధావులెందరో ఎన్నో కష్టాలను ఎదిరించి పరిశోధనలు చేశారు.
    చైనాలోని చౌకూట యస్ కుటుంబాలగురించి వివరాలను సేకరించాము. టోగనాకాలోని ఆల్ద్ వాయ్ గార్జీ కొండలోయల్లోకి చొచ్చుకుపోయి వివరాలు సేకరించారు. ట్రాక్స్ వాల్ సున్నపు గనుల్లోకి చొచ్చుకుపోయారు.
    ఈ సృష్టిలో ఏఒక్క విషయమూ పరిశోధకుల దృష్టినించి తప్పుకుపోవడమనేది అసాధ్యం.
    మాన్యాన్ గుహ ముఖాలలోని నాగరికత తొలిదశను గుర్తించారు నియాండర్ తత్ మానవుల ఆహార సంపాదన లోని నైపుణ్యాన్ని విశదీకరించారు. ఇంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకో వలసింది చాలావుంది.
    సిగ్మండ్ ఫ్రాయిడ్. యూసక్ లాంటి మహనీయులు మానవజాతి వికాస చరిత్రను ఎంతో సునిశితమయిన ధోరణిలో విశేషించాడు. ఇటీవల పత్రికలలో మంచుదారుల మీద ఆరిత్రావన్ మానవుల అడుగు జాడలకు గుర్తించారు.
    మనిషిలాగే నిలువుకాళ్ళమీద నడిచే "ఎరక్టస్ ప్రాణుల గురించి ఎన్నో వింతలు విశేషాలూ పరిశోధనలలో తేలుతున్నాయి కాని అటువంటి ప్రాణి వాస్తవ జీవితంలో ఎదురుఅయితే ఏం చేయాలి. పారిపోయేందుకయినా వీలుకానిస్థితి.
    అప్పుడే తన స్థితి చూస్తే హొమోరక్టస్ మానవుడు అని అర్ధమవుతోంది అయితే ఈ అర్ధమానవుడు త్రిమూర్తులలో వోకుటుంబానికి చెందినవాడు.
    భూమిమీద మానవులకు మూలపురుషులు ముగ్గురు ఐరోపాలో కానపాయిడ్ జాతి మానవుడు. ఆఫ్రికాలోనే గ్రాయిడ్ మానవుడు. ఆసియాలో మరిశ్యాలాయిడ్ మానవుడు.
    తన ఎదుట నిలబడిఉన్న ఈ అద్భుత అర్ధమానవుడు తీరు తెన్నులు చూస్తోంటే మంగోలాయిడ్ జాతికిచెందిన వాడే అని నిష్పష్టంగా తెలిసిపోతూంది.
    శిరోభాగాన అంటే సహప్రారం గుర్తించాల్సిన చోటున చాల చదునుగా ఉంది. కనుబొమ్మలు ఉబ్బెత్తుగానదీతీరాన పేరుకు  పోయిన యిసుకతిన్నెల్లా ఉన్నాయి నుదురు ఎత్తుగా ఉంది. మెడ కండరాలు బలీయంగా ఉన్నాయి. ఈనాటి మంగోలియన్ జాతిరిలా చాల దృఢంగా ఉన్నాడు.
    ముక్కుపుటాలు వెడల్పుగా ఉన్నాయి. దవడ ఎముకలు ఎత్తుగా భయంగొల్పుతున్నాయి. కన్నులు చింతనిప్పుల్లా మండు తున్నాయి. భుజాలమీది కండరాలు ఉబ్బెత్తుగా ఉన్నాయి. అతడు మంచి ఆరోగ్యవంతమయిన శరీరంతో వున్నాడని చూడగానే తెలుస్తోంది. పాదాలు అనాచ్చాదితంగా వున్నాయి. గోళ్ళు పెరిగి వున్నాయి. అతడు తనను చంపివేయదలచుకుంటే వేరే ఆయుధాలతో నిమిత్తంలేదు. ఆ గోళ్ళుచాలు.
    అవి నిడువుగా పెరిగి వొంకలు తిరిగి ఆయుధాల్లా గానే కన్పిస్తున్నాయి. అతని శరీరంలోని ప్రతి అణువు భయపెడుతూంది. నోటివెంట మాటలు మాత్రం లేవు. కనుచూపు అలా నిలిచిపోయింది. అతడు రెప్పవేయడం ఎప్పుడోమరచినాడు.
    అదేపనిగా మాలతివంక చూస్తూనే వున్నాడు. ఆమెకు ఏమి చేయాలో తోచలేదు.
    అతడు తనను అద్భుతంకోసం తీసుకువచ్చాడో, అపకారం చేసేందుకు తీసుకువచ్చాడో తెలిస్తే కాని తాను ఏమిచేయ వలసింది నిర్ణయించుకునేందుకు వీలుకాదు.
    అతని కన్నులు మెరుస్తున్నాయి. అచంచల మయిన చూపు అది. అతని ముఖంలో ఈ సామిడికుల మనోగత మయిన స్వార్ధం తాలూకు కాలుష్యం లేదు. నాగరికులమని చెప్పుకునే వారి మనసులు పాము పుట్టల్లాంటివి. వాటిలో ఎప్పుడే సర్పాలు పడగవిప్పి పూత్కారం చేస్తాయో తెలియదు.
    కాని అతనిచూపులు చాల నిర్మలంగావున్నాయి. తన ఎదుట ప్రత్యక్షమవుతున్న ఈ విచిత్ర ప్రాణి ఎవరు? అని ప్రశ్నిస్తున్నట్లుగా కన్పిస్తున్నాయి. తనస్థితీ అంతే కావటంనించి కెప్టెన్ మాలతికూడా ప్రశ్నార్ధకంగా అయిపోయింది.
    అయితే అతనికి ఆమెకూ ఉన్నది ఒకేఒక్క తేడా ఆమె చూపుల్లో అతడేదయినా అపకారం చేస్తాడేమోనన్న భయం కన్పిస్తోంది. కాని అతని చూపుల్లో భయం తాలూకూ నీడలులేవు ఆ చూపులు ఎంత నిర్మలంగా వున్నాయో నిర్బయంగా కూడా వున్నాయి. అతని దగ్గర మాట్లాడేందుకు నిస్పష్టమయిన భాషలేదు. ఎదుటివ్యక్తి తనకు లొంగి పోయింది. తాను చాల దూరం ఆమెను భుజాలమీద తీసుకువచ్చాడు. అందునించి తనకు ఆమె వల్ల ఎటువంటి ఆపద లేదని అతనినమ్మకం.
    శతృవర్గంలోని ప్రాణికాదని అతని మనోనిశ్చయం అందునించి చాలాసేపు అలా నిశ్చలంగా చూచిన తరువాత అర్ధ మానవుడు రవంత కదిలాడు. ముందుకు అడుగువేశాడు అతడు అమితమయిన శారీరక శక్తి సంపన్నుడు.
    అందునించి తనకేదైనా అపకారం చేయగలడు. ఏం చేస్తాడో అని భయపడుతోంది మాలతి. మరింత దగ్గరగా వచ్చాడు. కెప్టెన్ మాలని గుండెలు అమృతమయిన వేగంతో కొట్టుకుంటున్నాయి. ద్విపాద పశువు (హ్రోమో ఎరక్టన్) లాంటి అతడువచ్చి ఆమె ప్రక్కన కూర్చున్నాడు.
    సుకుమారమైన చెంపలమీద చేత్తోతాకి చూశాడు. పద్మ రాగవర్ణాన్ని సంతరించుకున్న ఆమె చెంపలు అతని మొరటు హస్తాలు సోకగానే మరింత రాగరంజిత మైనాయి. రక్తవర్ణం పులిమినట్లుగా కన్పించసాగాయి.
    అతని చేతికి గోళ్ళు బాగా పెరిగి వున్నాయి. అవి రాచుకుపోయి చారికలు కన్పించినాయి. ఆమెను హరిసించాలని అతడు అలా చేయలేదు. తన ఎదుట వున్న రూపం వినూత్నమైన లోకాలనించి దిగివచ్చినట్టుగా అతనికి అన్పిస్తోంది. వినూత్నమైన లోకాలనించి వచ్చిన అపురూపమైన రూపాన్ని తాకి చూడాలన్న అభిలాష అతనిది. ప్రాణులకు సహజమైన వికారాల స్పర్శ! ఇప్పుడతడు రెండవ దశకు చేరుకున్నాడు. మొదటి దశను దాటివచ్చాడన్న మాట: ఒక చిన్న పాపాయి ముందు ఏదైనా విచిత్రమైన వస్తువును వుంచితే పాపాయి ఏం చేస్తుంది. ముందు అంబాడుతూ వెళ్ళి దాని దగ్గర చేరుతుంది. ఆ తరువాయి చూపు నిలిపి దాన్ని చిత్ర విచిత్రంగా వీక్షిస్తుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS