Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 93


                              114

    తార ముస్తాబు పూర్తి చేసుకుని లేచి పవిట భుజం మీదకి వేసుకుని మరొకసారి అద్దంలో తననితను చూసుకుంటే పెదాలమీది లిప్ స్టిక్ మీద ఒకచోట నల్లని నలుసు కనిపించింది.
    లిప్ స్టిక్ ఒకపొర తుడిచేసి మళ్ళీ పుయ్యటం పూర్తిచేసి, సెంట్ స్ప్రే చేసుకుంటూండగా తలుపు తెరుచుకుని సూర్యప్రకాశ్ వచ్చాడు.
    సాయంత్రం నాలుగూ పది.
    ఆమె దగ్గిరికి వచ్చి కావిలించుకున్నాడు. ముద్దెట్టుకున్నాడు. పెదాలతో సుతారంగా అతని బుగ్గ కొరికి అతని వీపు చుట్టూ తన చేతులు చుట్టి స్తనాలను అతని ఛాతీలోకి గుచ్చింది.
    మంచంవైపు నడిపించబోతే, "యెప్పుడంటే అప్పుడేనా? వేళాపాళా లేకుండా రాత్రికి. సరేనా?" అని చేరుమాలతో అతని నల్లని బుగ్గమీద యెర్రని లిప్ స్టిక్ మరక తుడిచింది, అతని పెదాలూ తుడిచింది.
    "అన్నట్లు కాశ్మీర్ వెళ్ళాలన్నావు. ఈ ఆగస్టులో దేనికి? మొన్న మార్చిలో వెళ్ళొచ్చాంగా" అన్నాడు.
    "మీకిష్టం లేకపోతే వెళ్ళన్లెండి" అంది.
    "ఇష్టం లేక కాదు తారా. ఇద్దరం కలిసి వెళ్దామని. నెల తరవాత ఒకవారం నాకు తీరిక వుంటుంది అప్పుడు" అన్నాడు.
    "అంతకంటేనా? యెక్కడికి రమ్మన్నా తప్పించుకుంటూ వుంటారు" అంది.
    తార ఒంటరిగా యెటు తిరిగినా అతనికి అయిష్టంగా అనిపించదు. తార ఏ పురుషుణ్ణీ కాంక్షించదనీ, ఆ సంపర్కమే యిష్టం లేదనీ, తనతో ఆమె ప్రవర్తనంతా సంతోషపెట్టటం కోసం నటించటం అని అతను ఏనాడో గ్రహించాడు.
    ఆ రూపం, ఆ అవయవాలు, ఆ కదలికలు, సెక్సైటించే, వెర్రెత్తించే, కవ్వించే వరదలా ముంచెత్తివేసే ఆ అసాధారణ శక్తిలో పడి కొట్టుకుపోతున్నప్పుడు, అది నటన అనే అనిపించదు అతనికి.
    "మొన్న బాంబేనుండి పాపాలాల్ అని వచ్చాడు చూడు__ అతను నీ గురించి ఏమన్నాడో తెలుసా? యు ఆర్ ది సెక్సీయెస్ట్ బ్యూటీ ఇన్ ది ఎంటైర్ వరల్డ్_అట. నువ్వెంత అదృష్టవంతుడివోయ్ అని వొకటే బోరు కొట్టాడనుకో"
    "ఆ ముసలాయనకి అంతిదిగా అనిపించానా?"
    "అంత ముసలివాడేంకాదు. యాభయ్ ఐదుంటాయ్. ఆయనకనేమిటి సమస్త మానవులకే కాదు సమస్త ప్రాణకోటికీ నువ్వు అట్లాగే అనిపిస్తావు తారా!"
    "ఐతే నేను సెక్త్సారనన్నమాట" అని వొళ్ళు విరుచుకుంది.
    తార వొళ్ళు విరుచుకుంటే__ వికారంగానే బద్ధకంగానో వుండదు. వొకలాంటి వయ్యారంగా వగరుపోయినట్లుగా కవ్వించినట్లుగా అనిపిస్తుంది.
    "ఈ సాయంత్రం అతను నీకు పార్టీ ఇస్తానన్నాడు. పాపాలాల్ అంటే బొంబేలో వేళ్ళమీద లెక్కపెట్టి తగిన ధనవంతులలో, సమర్ధులలో వొకడు. మనకి చాలా ముఖ్యమైన కావాల్సిన వ్యక్తి" అన్నాడు సూర్యప్రకాశ్.
    అంతలో తలుపుమీద చప్పుడైంది సూర్యప్రకాశ్. వడివడిగా వెళ్ళి తలుపు తెరిచాడు పాపాలాల్. సిల్కుజుబ్బా గ్లాస్కో ధోవతి బొర్రా. సూర్యప్రకాశ్ ప్రక్కన అతనే బావున్నాడు __ యీ వికృత రూపం పక్కన.
    "రండి రండి. యెంత సుదినం. మీ అంతట మీరే రావడం!" అని హిందీలో అని సోఫాలో కూర్చోబెట్టాడు సూర్యప్రకాశ్.
    "వుదయమే వెళ్ళిపోవాలి. ఈలోగా మీ పనులు ముగిస్తే బాగుంటుంది కదా" అని సోఫాలో యేటవాలుగా జారాడు.
    "యేం తీసుకుంటారు?" అన్నాడు సూర్యప్రకాశ్.
    "నాకిష్టమైందే"
    సూర్యప్రకాశ్ ఓ బీరువా తెరిచి, ఫ్రెంచి షాంపేన్ సీసా తీసి తారకి అందించాడు.
    అందమైన తెల్లని గాజుగ్లాసులు బల్లమీద పెట్టాడు సూర్యప్రకాశ్.
    "తార ఆకాశంలోనే కాదు. కాసేపు మాముందు సోఫాలో కూర్చుంటే మాకు మహాద్భాగ్యంగా వుంటుంది" అన్నాడు పాపాలాల్ హిందీలో.
    తారకి అర్ధమైంది. ఐనా సూర్యప్రకాశ్ తెలుగులో చెప్పాడు.
    పుచ్చుకుంటున్నారు. తార నలుగురితో పాటు నాలుగు గుక్కలు వెయ్యటం తప్ప తాగాలని అంతగా వుండదు. తప్పతాగాలని అసలే వుండదు. మనసు వికలమైనప్పుడు బాగా తాగి వొంటరిగా పడుకుంటుంది కానీ అది సాధారణంగా జరగదు. ఆమె మనసు బాగోకపోవటానికి కారణాలు సాధారణంగా వుండవు. అవి కారణాలు అయ్యేటట్లయితే ఆమె మనసు వొక్కక్షణం కూడా బావుండే అవకాశం వుండదు.
    "ఒక నిమిషంలో వస్తాను" అని పాపాలాల్ తో హిందీలో అని, "తారా ఆయన సంగతి చూడు. నేనిప్పుడే వస్తాను" అని గది బయటకు వెళ్ళాడు.
    మరో రెండు రౌండ్లు పుచ్చుకున్నాడు పాపాలాల్. అతని కళ్ళు ఆమె స్తనాల మీంచీ జబ్బల మీంచీ బొడ్డుమీంచీ పొత్తి కడుపు మీంచీ చెదరటం లేదు. ఆ సెక్సైటింగ్ వలయంలో పడి కొట్టుకులాడుతున్నాడు.
    లేచి, తార కూర్చున్న సోఫాలో ఆమె ప్రక్కన కూర్చుని భుజాల మీద చెయ్యివేశాడు. జరగబోయింది. కావిలించుకున్నాడు.  
    బలంగా వొక తోపు తోసింది. బల్లమీద పడి తివాసీ మీదకి వొరిగాడు. గ్లాసుల సీసా తివాసీమీద పడ్డాయి.
    "తారా మంచిగా ఒప్పుకో" అన్నాడు హిందీలో.
    "షటప్" అంది.
    "నా సంగతి నీకు తెలియదు."
    "ఆయన్ని రానీ నీపని చెప్తా" అంది ఇంగ్లీషులో.
    "యెవరు? ప్రకాషా? నా కోర్కె తీర్చకుండా వుండజాలడు.
    "గెటవుట్."
    "నువ్వు నన్ను ఆ మాట అంటే నీకే ఆ గతి పడుతుంది. కానీ నేనిక్కడినుండి వెళ్ళక్కరలేదు. నేను వుదయం విమానంలో వెళ్తున్నాను. రాత్రి పన్నెండు వరకు నీకు టైం ఇస్తున్నాను" అని లేచి బయటకు వెళ్ళిపోయాడు.
    మరు నిమిషంలో సూర్యప్రకాశ్ వచ్చాడు.
    "వాడేంటి పిచ్చివేషాలేస్తున్నాడు?" అంది మండిపడుతూ.
    "యేదో మోజుపడి వుంటాడు. చెప్పాగా అతనికి నువ్వంటే యెంతిగా అనిపించిందో!"
    "నీది భార్యని తార్చే పనేనా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS