Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 92


    "హేమలతారెడ్డి ఎవరోయ్ తెలుగావిడా?" అన్నాడు రామ్మూర్తి.
    "బెంగుళూరు,......." అన్నాడు కులశేఖరరావు.
    "సంస్కార సినిమాలో సామాన్య నటన కాదు. అతి సహజంగా చేసింది" అన్నాడు శ్రీపతి.
    "అన్యాయమోయ్ అట్లా అనడం!" అన్నాడు కులశేఖరరావు.
    "అన్యాయం మనసులోది. ఆ సీన్లో భలేగా చేసిందిలే__ అంటాం. అలా బాగా చేసిందంటే__ బాగా చేసిందనే కాగా సినిమా డైరెక్టరయినా నిజభర్త పక్కనే వుండి చేయిస్తున్నాడు. వంకర అర్థాలు తీస్తే ఆ పాపం నాది కాదు సుమా!" అని నవ్వాడు శ్రీపతి.
    "ఆ పోయే జండా కారెవరిదీ?" అన్నాడు రామ్మూర్తి. బస్టాపు పక్కగా వెళుతున్న పడవకారు చూసి.
    "ఆ పడవకారు గవర్నర్ శారదా ముఖర్జీది. అందుకే వెనక కొన్ని కారుల బారు. ముందు ఆ మోటార్ బైక్" అన్నాడు కులశేఖరరావు.
    "ఈ యెండవేళ ఇటెందుకొచ్చింది? జనతా గవర్నర్ కదా!" అన్నాడు రామ్మూర్తి.
    "వస్తా__పనుంది" అంటూ లేచి బయటికి వెళ్ళిపోయాడు కులశేఖరరావు.
    "దేశమంతటా జనతాలోకి ఒకటే దూకుతున్నారు జనం." అన్నాడు రామ్మూర్తి.
    "సహజం. ఇందిరా కాంగ్రెస్ సుస్థిరంగా వున్న మన రాష్ట్రంలోనే మూకుమ్మడిగా చేరిపోతున్నారు. కాంగ్రెస్ కుళ్ళిపోయింది. అది దేశానికి సేవచెయ్యలేదు. జనతావే సేన చెయ్యగలదు అని ఓ ప్రకటనిచ్చి వెంకన్న, దగ్గరికెళ్ళి గుండు కొట్టించుకుని లెంపలేసుకునో, కుంకుడు రసంతో తలంటోసుకునో, ముఖాన కుంకుంబొట్టెట్టుకునో వెళ్ళి తలుపు తడితే సరి. దీన్ని పార్టీ ఫిరాయింపని అన్యాయంగా అనకండి! దేశ క్షేమం దృష్ట్యా ప్రతి రాజకీయ నాయకుడి వ్యక్తిగత బాధ్యత. యేది చేసినా ప్రజాసేవ కోసమేగా__ రైసుమిల్లు పెట్టినా, కరెన్సీ నోట్లు అచ్చుగుద్దినా, పరదేశం సొమ్ము మనదేశం చేరవేసినా, పెళ్ళానికి కడుపు చేసినా, కొడుక్కి ఫారెన్ ఫెరోషివ్ ఇప్పించినా__ యేది చేసినా ప్రజాసేవకోసం. లేకపోతే వాళ్ళకేంపట్టింది ఇవన్నీ చెయ్యడానికి. బాలభానుడుగానీ జనతాలో చేరదలిస్తే నూరుపైసలా నాన్ ఫిరాయింపు అనాల్సొస్తుంది. ఇందిరే ఇండియా, ఇండియాయే ఇందిరన్న బారువా దగ్గర్నుంచి, బాలభానుడు కొత్తగూడెం వొఁస్తే _ మోసిన రాష్ట్రరాజకీయ నాయకులదాకా అందరూ ఇందిరని దుమ్మెత్తిపోస్తున్నారు. షా కమిషన్ ముందు__మాకే పాపం తెలియదు__ అని చేతులు కడిగేసుకుంటున్నారు అంతా. మన రామాయణ సంప్రదాయంలో ఒక ధర్మ సూక్ష్మం వుంది__ వాలి చచ్చాక జనంలో అలజడి వస్తే _ రాజు యెవరైనా రాణిని నేనే__ అంది తార. అదే వొరవడిలో__ యే పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీలోనే నా సభ్యత్వం_" అన్నాడు.
    "అన్నట్లు మా తార మల్దీ మిలియనియరై పడవకారు జాఁమ్మని డ్రైవ్ చేస్తూ__" అని రామ్మూర్తి మధ్యలోనే అందుకుంటే రామ్మూర్తిని పూర్తిచెయ్యనివ్వకుండా, "మీ తారెనరోయ్?" అన్నాడు వరాహశాస్త్రి.
    "మా తార అంటే మా సోషియాలజీ చదివిన తారని శాస్త్రీ. మరేంకాదు. తార మనలాంటి సామాన్యులకి అందుబాటులో వుండదు. మల్దీ మిలియన్స్. గొప్ప పేలస్, ఫైబర్ గ్లాస్ స్విమ్మింగ్ పూల్__ అంత సెక్సయిటింగ్ డెల్యూజ్ ముందు మనలాంటి చెత్తాచెదారం కొట్టుకుపోక తప్పదు" అన్నాడు రామ్మూర్తి.
    "కానీ తమాషా యేమిటంటే ఆమె కళ్ళలో సెక్సీతనం బొత్తిగా లేదు." అన్నాడు శ్రీపతి.
    యెండలో నల్లగా మెరుస్తూ బయటినుంచి లోనకి వచ్చిన సుధీర్, "మురార్జీ, చరణ్ ల లేఖలు ప్రతిపక్షాలవాళ్ళు చూశారు కదా, వాటిని పార్లమెంటులో పెట్టమంటే నీలుగుతున్నాడు" అన్నాడు ఇంగ్లీషులో.
    'నీకు స్త్రీకి వున్న అవయవాలన్నీ వున్నాయిగా, నేను చూశాగా, ఆ చీర విప్పేసి వీధిలోకి రమ్మని స్త్రీని అడగటం భావ్యం కాదుకదా! అదేదో వాళ్ళిద్దరి ప్రేమలేఖలు నీ చేతిలో పడి చూశావే అనుకో, చూశాగా, అందరికీ చూపిస్తాను, పత్రికల్లో అచ్చేస్తాను అనటం భావ్యమా చెప్పు సుధీర్! రాజకీయ ప్రముఖులకి పుత్ర సంతానం వుంటే బతికుండగానే పున్నామ నరకం కాంతిభాయీ, బాలభానుడు__చిన్న సవరణ చరణ్ లాంటి వాళ్ళకి గద్దరర్ధాంగోసర్జన్లుడో. కాలం యెప్పుడూ వొక్కలాగా వుండదు. యెప్పటివరకు కష్టాలొస్తాయో చెప్పలేం' అని మన పెద్దలేదో చెబుతూంటారు. పాపం, ఇప్పుడు ఇందిరమ్మ పడరాని కష్టాలు పడుతోంది. గతంలో తుమ్మినదానికీ నవ్వినదానికీ యేడ్చినదానికీ ఓ కమిషన్ వేసి నిలదీస్తున్నారు. కులదీపనయ్యరు తీర్పులతో రెండు ముఖాలిందిరనే మిస్సుమతో. డెబ్బయ్ వొకటిలో గెలవటానికి కారణం బ్యాలెట్ పేపర్లు రష్యాలో చాటుగా అచ్చువేయించి తెప్పించిందట. ఓట్ల లెక్కింపు వేళకి వాటిమీదకి ఆటోమేటిగ్గా ఆవుదూడ గుర్తు పడిపోతుందట. రుద్రాక్షమాలతో తంత్రమంత్రాలూ చింతకాయలూ నేర్చిందట వంటి వాటితో వూదరపెడుతున్నారు. అక్కడికీ ముక్కుమూసుకుని మూలగదిలో మౌనంగానే వుంటోంది. సందు చూసుకుని. ఏనుగు బతికున్నా వెయ్యే చచ్చినా వెయ్యే అన్నట్లుగా, ఓడినా కాంగ్రెస్ కాంగ్రెసే అని అధ్యక్ష పదవినలంకరించి కాసు ముసిముసిగా నవ్వుకుంటున్నాడు. అందరికంటే అదృష్టవంతుడు సుఖభోగి నీలం సంజీవుడు__ అదృష్టం అంటే అలా వుండాలి__ రాజకీయ వలువలొలిచేసి సేద్యం చేసుకుంటున్నవాడు రాష్ట్రాన్ని కంతటికీ వొంటూపిరినాడైనా నక్కని తొక్కివొచ్చినట్లుగా చీకూ చింతా వుండని రాజభోగి అయ్యాడు"
    "జనతా యేమి చెయ్యగల్గుతది__ కమిషన్లు వేసి కూర్చొనుడుతప్ప అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెసే. లేక నాన్ జనతా. మన దగ్గరచూడు__ వెంగళ్రావు నిరంకుశ పాలన సాగుతున్నది గదా! వీనికి నక్సలిజం ఫోబియా వున్నది. వీన్ని ఎర్రగడ్డలో అడ్మిట్ చెయ్యాల. ఎమర్జన్సీల ఒపినీయన్స్ చెప్పిన అందర్నీ దేశద్రోహులని ఇందిరమ్మ అరెస్ట్ చేసిన లెక్క వీడు వాని పనులను సమర్ధించని వాండ్లను నక్సలైట్స్ క్రిమినల్స్ అని అరెస్టు చేస్తున్నాడు" అన్నాడు సుధీర్.
    "యెవడి వెర్రి వాడికి ఆనందం" అన్నాడు రామ్మూర్తి.
    "అంతవరకూ ఐతే ఆనందమే. నా వెర్రి నువ్వూ ఆనందించు అంటేనే?" అని లేచాడు వరాహశాస్త్రి.
    "యెవడి వెర్రి వాడికి ఆనందం" అన్నాడు రామ్మూర్తి.
    "అంతవరకూ ఐతే ఆనందమే. నా వెర్రి నువ్వూ ఆనందించు అంటేనే?" అని లేచాడు వరాహశాస్త్రి.
    ఈ లెక్చరర్ వుద్యోగం రావటానికి మార్గాలు తెలిస్తే చెప్పమని శ్రీపతిని అడగాలని, రామ్మూర్తి లేచి, "శ్రీపతీ అట్లా వెళ్దాం రావయ్యా" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS