"శతాబ్దాల క్రితంనుంచీ పెళ్ళి నిశ్చయమైనప్పుడు గాని, పెళ్ళిలో గాని చిటికిన వేలికి పక్కనే వున్న వెలికి ఉంగరాలు తొడిగే సంప్రదాయం మొదలైంది గ్రీకు దేశస్థులనుంచి" క్షణం ఆగి అన్నాడు- "సరిగ్గా ఆ వేలికే ఉంగరం తొడగడంలో అంతరార్ధం ఏమిటి?"
చెప్పింది సంకోచించకుండా- "గుడ్మేకి రక్తం తీసుకువెళ్ళే నరం 'వీనా అమోరిస్' సరిగ్గా ఆ వేలినుంచే హృదయం దాకా విస్తరించిందన్న నమ్మకం. ఇది నిజం కాకపోయినా తన భాగస్వామిని హృదయంలో పదిలముగా దాచుకోవాలనే భావానికి గుర్తుగా ఇప్పటికీ అదే సాంప్రదాయం కొనసాగుతూంది."
మరో చెంబుడు నీళ్ళు గుమ్మరించుకోవడం తప్పనిసరైంది ఆదిత్యకి.
నవ్వకుండా ఉండలేకపోయింది "మీ కోటలో పాగావేసి మిమ్మల్ని ఇలా సాధిస్తున్నందుకు కోపంగా ఉందేమో కదూ?"
వెంటనే అన్నాడు- "కోటలో పాగా అన్న నానుడి ఎలా వాడుకలోకి వచ్చిందో చెప్పండి?"
అవాక్కయి చూసిన ప్రబంధ చూపుల్ని బట్టి గ్రహించాడు ఆమెకు జవాబు తెలీదని.
"మీరు సిద్దపడిన నాలుగు ప్రశ్నల్లో ఒకటి మిమ్మల్ని ఇబ్బందిలోకి నెట్టినట్టుంది కదూ?"
"దీనిమీద వ్యాఖ్యానం అనవసరం. జవాబు చెప్పండి."
"పూర్వం రాజదర్భారులో ఉద్యోగం చేసే వ్యక్తులు విధిగా పాగాలు ధరించేవారు. చాలా శ్రమతో కోటలో ఉద్యోగం సంపాదించటాన్ని కోటలో పాగా వేయటం అనేవారు."
తల తిప్పి చూడలేదు ఆదిత్య. కాని చీర ఓ మూలపడి వుంది.
"ఆపేయనా?" మరో అవకాశం ఇచ్చాడు.
"జాలి చూపించనక్కర్లేదు!"
చిర్రెత్తుకొచ్చింది ఆదిత్యకి. "అమెరికాలో పెళ్ళయే సమయంలో వధువు ధరించే తెల్లని గౌనుకి వాళ్ళ సాంప్రదాయం చెప్పే అర్ధం స్వచ్చత, సౌశీల్యమూ... అయితే జపానులోని వధువు కూడా తెల్లని గౌను వుపయోగించినా దానికి మరో అర్ధాన్ని చెబుతారక్కడ ఏమిటది?"
చెప్పలేకపోయింది. ఆమె ఏం చేస్తున్నదీ అతడు గ్రహించేలోగానే బ్రా పడింది నేలపైన.
ఆదిత్య పలభాగం పైన స్వేదం పేరుకుంటూంది. ఆమె తెలిసి చెప్పలేదో, లేక తెలియక నిశ్శబ్దంగా తన నియమాన్ని పాటిస్తూందో తోచడం లేదు. నిజానికి అడిగింది అంత జటిలమయిన ప్రశ్న కాదు.... ఆమెను ఇబ్బంది పెట్టకూడదన్న ఆలోచనతో చాలా మామూలు ప్రశ్న అడిగాడు.
"జవాబు చెప్పండి...?" గుర్తు చేస్తున్నట్టుగా ఆమె కంఠం వినిపించింది.
నేలచూపులు చూస్తూనే అన్నాడు- "జపానులో తమ ఆత్మీయులు మరణించినప్పుడు శ్రద్దాంజలి ఘటించడానికే అక్కడ అమ్మాయిలు వైట్ గౌన్స్ వేసుకుంటారు. పెళ్ళిలో వైట్ గౌను దరించటానికి వాళ్ళు చెప్పే అర్ధం వివాహంతో ఆమె తల్లిదండ్రులకు తను మరణించిన కూతురుగా తెలియజెప్పడం."
మరోప్రశ్న అడగాలో వద్దో తెలీక సందిగ్ధంగా అతడు నిలబడి ఉండగానే, గదిలో కాదు, కిటికీ వారగా ఓ మెరుపు మెరిసింది.
ఒక్క అంగలో ప్రబంధ అదిత్యని చేరుకుంది. అది భయమో, లేక అతడి చాటుగా తనను దాచుకోవడమో అతడికీ తెలీదు. మరోసారి మెరుపు ఫ్లాష్ లైట్ లా.
స్పష్టంగా అర్దమైపోయింది. అది ఉరుములతోబాటు వచ్చినమెరుపుకాదు, ఒక్క అంగలో ద్వారం తెరిచి బయటకు పరిగెత్తాడు.
కనిపించలేదెవ్వరూ? తనతో బాటు ప్రబంధ కూడా పొరపాటు పడిందా?
అది మెరుపా, లేక ఎవరన్నా రహస్యంగా ఫోటో తీస్తుంటే వెలిగిన ఫ్లాష్ లైటా?
ద్వారం బయటే నిలబడిపోయాడు చాలాసేపటిదాకా. క్రమంగా తేరుకున్నాడు. ఇంతసేపూ తామిద్దరం ఏం చేశారు? ఏ ఉన్మాదం ఇద్దర్నీ ఇలా ఆవేశపరిచింది?"
గదిలోకి వెళ్ళలేకపోయాడు. "చీరకట్టుకోండి ప్రబంధా! అనలేదు....బిడియంగా అనిపించడంతో అలాగే గోడవారగా చతికిలబడి కూర్చుండిపోయాడు.
నిజంగానీ, అబద్దం గానీ ఇప్పుడెదురయిన అవాంతరం ఇద్దరికీ మేలు చేసింది.
"ఒకవేళ పోటీ నిరాఘాటంగా కొనసాగి వుంటే చివరికి ఏం జరిగేది?"
అసలు... అనిత తనకు దూరంగా వున్న సమయంలో ఇలాంటి జుగుప్సాకరమైన పోటీకి తనెలా సిద్దపడగలిగాడు?
ప్రక్కన అడుగుల చప్పుడు వినిపించడంతో తల తిప్పి చూశాడు.
ప్రబంధ నిలబడి వుంది. తడిసిన చీరతో కాదు, అనిత చీర కట్టుకుని.
ఏది చేయమని ఆమె రాగానే అడిగాడో, అది ఇప్పటికి పూర్తిచేసిన ప్రబంధ నెమ్మదిగా అడిగింది- "బయట కూర్చున్నారు, చలిగా లేదూ?"
తను ఏం అనుమానించి బయటికొచ్చిందీ చర్చించలేదు. నిజానికి తనకన్నా ముందు కమగారుపడింది ప్రబంధే కాబట్టి, తనంత తానుగా చర్చించాల్సిన అవసరమూ కనిపించలేదు.
"సారీ!" అన్నాడు తలవంచుకుని.
"దేనికి?"
"సభ్యతను మరిచి ఇలాంటి పోటీకి మిమ్మల్ని ప్ర్రేరేపించినందుకు."
"ఓ విషయం మీరు గుర్తుంచుకోవాలి."
తల పైకెత్తి చూశాడు.
"నా కంటూ ఇష్టం లేనప్పుడు నన్నెవరూ బలవంతపెట్టలేరు" ఆ తరువాత ఆమె లోపలికి వెళ్ళిపోయింది.
తన ఇష్టాన్ని ఇంత నిర్మొహమాటంగా వ్యక్తం చేసిన ప్రబంధ గురించి అతడలా ఆలోచిస్తూ ఎంతసేపు కూర్చున్నాడో గుర్తులేదు.
వర్షం తెరిపి ఇచ్చిన పది నిముషాలకి నిద్ర గుర్తుకొచ్చింది. అంతే కాదు, ఆ రాత్రికి ప్రబంధ ఇక్కడే నిద్రపోవాలనుకుంటుందా అనుకుంటూ లోపలికెళ్ళాడు.
