4
"నువ్వో వెధవ్వి, ఇడియట్ వి, పూల్ వి, అన్నాడు స్పూర్తి. చిరంజీవి మాట్లాడలేదు. తల వంచుకుని కూర్చున్నాడు.
"నువ్వు వాళ్ళ మధ్యకి వెళితే నీకూ గుర్తింపు వస్తుందనుకొన్నాను. నువ్వు అంచెలంచెలుగా పైకి వెళ్తే, నిన్ను పట్టుకుని నేను రావచ్చుననుకున్నాను. ఈ చెట్టుక్రింద ప్లీదరి తప్పుతుందని భావించేను, నువ్వేమో పూర్తిగా మందు కొట్టేసి అంతా రాసాభాస చేసి వచ్చావ్."
చిరంజీవి మాట్లాడలేదు. ఎదుటివాడు తిడ్తున్నప్పుడు బొటన వేలూ. చూపుడువేలూ కలపి కదుపుతూ కూర్చోమన్నాడు జ్ఞానందస్వామి. అలాగే చేస్తున్నాడు చిరంజీవి.
"నేనెంత తిట్టినా అంతేనా?"
"ఏమిటి"
ఆ వేళ్ళు కదపటం ఆపు" మరింత కోపంగా అరిచేడు. చిరంజీవి దులుపుకోవడం ఆపుచేసేడు.
చాలాసేపు నిశ్చబ్ధం తరువాత స్పూర్తి సాలోచనగా అన్నాడు. "మనమేదైనా చెయ్యాలి" అని ఆగి మళ్ళీ తనే "సర్వోత్తమరావుగారితో పరిచయం కావటం అమ్తతెలికైన విషమేమీ కాదు. దాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలి. లే..." అన్నాడు.
"ఎక్కడికి?"
"చెప్తా"
అరగంట తరువాత ఇద్దరూ సెంట్రల్ లైబ్రరీలో పుస్తకాలన్నీ వెతికేయ్యటం మొదలుపెట్టారు.
ఊరిమీద నోట్సు వ్రాసుకుని, ఆ నోట్సు తీసుకుని మరుసటిరోజు సర్వోత్తమరావు గారింటికి బయల్దేరాడు చిరంజీవి.
* * * *
"ముందు అపాయింట్ మెంట్ తీసుకున్నారా?"
"లేదు."
"లేకపోతేఅయన కల్సుకోరు."
"ఉరి గురించి అని చెప్పండి_ కల్సికోకపోతే వెళ్ళిపోతాను...."
క్లర్కు లోపలి వెళ్ళాడు. పదినిమిషాల తరువాత అయన వచ్చేరు. చిరంజీవి లేచి నిలబడ్డాడు.
"ఏమిటి సంగతి" అన్నారాయన కూర్చావుమన్నట్టు సైగచేస్తూ.
"మొన్న మీ పార్టికి వచ్చాను. ఉరిశిక్ష రద్దు గురించి మాట్లాడింది నిజంగా, నిజంగా..." ఆ తరువాత ఏం మాట్లాడాలో అతడికి అర్ధంకాలేదు. అతడు చాలా ఎగ్జయిట్ మెంట్ తో వున్నాడు. అయితే అనుభజ్ఞడైన సర్వోత్తమరావుగారికి అతడుచేప్పదల్చుకుంది అర్ధమయింది. "మీ పేరేమిటి? పార్టీకి ఎవరితో కలసివచ్చేరు" అడిగేరు.
చిరంజీవి తెల్లబోయేడు. ఈ ప్రశ్న ఎదురవుతుందనే యస్సేయ్ స్పూర్తి అతడితోపాటూ కర్దు తీసుకెళ్ళమన్నాడు. దాన్ని ఆయనకి అందించెడు. దానిమీద చిరంజీవి అన్న పేరు చూసి, అయన మరింత ఉస్తుహకతతో పరీక్షిగా చూసేడు. ఆ తరువాత బిగ్గరగా నవ్వుతూ "ఇది సుప్రీంకోర్టు జస్టిస్ చిరంజీవిగారి కోసం పంపింది. మాక్లార్కు అయన చిరినమా టైప్ చేయ్యబోయి మీది చేసేడు" అన్నాడు.
చిరంజేవి మోహం పాలిపోయింది. అయితే అయన నవ్వుతో అతడికి కొంచెం ధైర్యం వచ్చింది.
"అయితే అబ్బాయ్, నువ్వూ లాయర్ వెనన్నమాట " అన్నాడు.
"అవును .బి.య్యే. ఎల్లెల్సీ ఉస్మానియా యూనివర్సిటీ సి.కే.పి." అన్నాడు.
సి.కే.పి అన్న పదానికి అయన మరింత బిగ్గరగా నవ్వుతూ "భలేవాడివే " అన్నాడు. చిరంజీవి కొద్దిగా తలవంచి లోపలి చూసేడు (ఎందుకో అతడికీ మీకూ తెలుసు) ఈ లోపున సర్వోత్తమరావు "అయితే నీకూ ఈ పరీక్షా రద్దుమీద ఉత్సాహం వుందన్నమాట " అనటంతో చప్పున ఈ లోకంలోకి వచ్చేడు.
"అవున్సార్" అన్నాడు తరువాత ముందుకు వంగి అపురూపమైన రహస్యం చెబుతున్నవాడిలా_ చీకటి సందుల్లో ఎన్నో ఏళ్ళనుంచీ కప్పికుపోయిన గ్రంధాలని వెలికితీసి..." అన్నాడు.
"ఏమిటా వివరాలు?"
"ఏ.యే దేశాలు, ఎప్పుడెప్పుడు ఉరిశిక్షని రద్దుచేసేయో వినండి.
ఇటలీ: 1948.
వేస్టు జర్మనీ : 1949.
బెల్జియం : ఆఖరి మరణశిక్ష 1863లో.
డెన్మార్క్ : 1930. (ఆఖరి మరణశిక్ష అమలు జరిగింది. 1892 లో )
హాలెండ్ : 1872. (ఆఖరి మరణశిక్ష 1860)"
అని కాగితం తీసి చదువుతూంటే__ మధ్యలో అయన కంఠం అందుకుంది. "ఆస్ట్రేలియా 1826. అబ్బాయ్, నేను ఉరిశిక్ష రద్దుకోసం పదిహేను సంవత్సారాల్నుంఛీ పాటుపడ్తున్నాను. నేను మొదటిసంవత్సరం సర్వేలో సంపాదించి నువ్వుప్పుడు చీకటిసందుల్లోంచి సేకరించిన గ్రంధాల్లోంచి చెబ్తున్న వివరాలు.... ఇవన్నీ నేను ఉపన్యాసల్లో చెబుతూ వస్తున్న స్టాటిస్టిక్స్ వివరాలే? " అన్నాడు. చిరంజేవితెల్లబోయాడు.
అతడేదో చెప్పాబోతుంటే, అతడిని రక్షించతానికా అన్నట్టు "హాయ్" అన్న కంఠస్వరం వినిపించింది. తల తిప్పి చూస్తె అర్చన.
"నీకు తెలుసా అమ్మాయ్ ఇతను."
"ఎక్కడో చూశాను" అంది వస్తున్న నవ్వు ఆపుకుని.
"చిరంజీవి అని__ లాయరు."
ఆమె తలూపి, అంతలో ఏదో జ్ఞాపకం వచ్చినట్టూ వచ్చి చూసుకుని "మైగాడ్, మీటింగ్ టైమయిపోయింది వెళ్ళాలి" అంది.
చిరంజీవి కూడా నిస్సత్తువగా లేచి, "నేనూ వెళ్ళొస్తాను" అన్నాడు.
"మీరు ఎటువైపు వేళ్ళాలి?"
అతడుచెప్పాడు.
"రండి నేనూ అటే...." అని చిరంజీవి సమాధానం కోసం చూడకుండా, నీ టయోటో తీసుకెళ్తున్నా అంకుల్." అంది పక్కకి తిరిగి.
"దానేకేముంది, తీసుకెళ్ళామ్మా " అన్నారు.
చిరంజీవి, అర్చన బైటకొచ్చారు. అర్చన డ్రైవింగ్ సీట్ లో కూర్చొని_ వంగి ప్రంటుడోర్ తెరిచింది, చిరంజీవి కూర్చున్నాడు. చిన్న జెర్క్ టో కారు కదిలింది.
