అదే సమయానికి మెడపైన స్థంభం వెనుకనుంచి ఒక వ్యక్తి నెమ్మదిగా బైటకొచ్చాడు. వెళ్తున్న కారువంక నిదానంగా చూసేడు. ఆమొహంలో ఏ భావమూ కనబడటం లేదు. కానీ జాగ్రత్తగా గమనిస్తే ఆ కళ్ళు___
కోనప్రాణంతో పడివున్న లేగాదూడపైనఎగురుతున్న డేగకళ్ళు లా వున్నాయి.
* * * *
కార్లో ఇద్దరూ ఎక్కువుగా మాట్లాడుకోలేదు. మాములుగా మాట్లాడేడప్పుడు ఎంత హుషారుగా వుంటుందో, ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు అర్చన అంత మౌనంగా వుండటాన్ని అతడు గమనించేడు. ఈ లోపులోకారు పెద్ద హొటల్ ముందు ఆగింది. "రండి" అంటూ అమే దిగి అడుగు ముందుకు వేసింది.
హొటల్ ప్రొప్రైటర్వచ్చి తలుపు తెరుస్తాదేమోనని కారు అద్దం గుండా బైట చూసేడు చిరంజీవి. ప్రొప్రైటరూమేనేజరూ కాదుకదా కనీసం గేటుదగ్గర గూర్ఖాకూడా యిటువైపు చూడటం లేదు. అయినా వాళ్ళకి ఈ కార్ల తలుపులు తెరవటం తప్ప యింకేం పన్లూ వుండవా అనుకుని, తన డోర్ తనే తీసుకుందామన్న నిశ్చయానికి వచ్చాడు.
అతడంతకుముందు ఏ కదిలే వాహనమూ ఎక్కలేదనికాదు, సిటీబస్సు చాలాసార్లు ఎక్కాడు. కాని సిటీబస్సులకి తలుపులు వుండవుకదా అందులోనూ అది ఇంపోర్డ్ డ్ కారాయే!
అతడో క్షణం సూటిగా, తీక్షణంగా డోర్ వైపు చూసేడు. నికిల్ ప్లేతిమ్గ్ వున్న రూపాయికాసంత బిళ్ళ తళతళా మెరుస్తూంది. దానిపక్కేచిన్న హాండిల్ వుండి. దానికి కొద్దిగా క్రిందుగా అరచేతి మందనా ఒక రాడ్ వుంది. అ మూడిటిలో ఏది తలుపుని తెరుస్తుంది అన్న మీమాంసలోపడ్డాడు. ముందు చూపుడు వేలితో నాజుకుగా రూపాయికాసుని నొక్కి, అది కేవలం అందంకోసం బిగించిన స్క్రూ అని తెలుసుకుని, దాని పక్కనే వున్న హాండిల్ ని పట్టుకుని తోప్పేడు. కిటికీ అద్దం నెమ్మదిగా క్రిందకి దిగటం ప్రారంభమవాటంతో కంగారుపడి మధ్యలో ఆపుచేసేడు. ఈ లోపున అర్చన వెనక్కీ తిరిగి చూసింది. అతడు అతి ప్రయత్నం మీద దగ్గుని తెప్పించుకున్నాడు. ఆమె వచ్చి తలుపు తీయగానే దగ్గు ఆగింది.
అందమైన అమ్మాయితో కలసి ఖరీదయిన హొటల్లోకి అడుగు పెట్టటం అరుదైన అనుభవం అయితే ఆ హొటల్ టాపోగ్రాఫీ తెలియకపోవటం దురద్రుష్టకరం. ఆమె అతడి ముందుకు. వేణూకార్డు తోసి "చెప్పండి" అంది.
అతడు దాన్ని తీసుకుని చూసి, అర్ధంకాక అయోమయంలో పడ్డాడు.ఉప్మా_ వాడా దోసె లాటి పదార్దాలు అందులోలేవు.
మొగలాయీ జాల్ ప్రేజీ_ రోగన్జోష్ _పిలేట్స్ ఆఫ్ షోమ్ ఫ్రేట్, మషాలా హొర్స్ 'డి' ఓవ్ రేస్_ స్పినాక్స్ 'ఆ' గ్రా టిన్ .
విశ్వనాథ సత్యానారాయణగారు వాల్మీకి రామాయణాన్ని పరిశీలించినట్టు ఆ కార్డుని మొదటినుంచిచివరివరకూ ఏకాగ్రతతో అతడు చదివిన తరువాత వారిద్దరిమధ్యా సంబాషణ ఇంగ్లీషులో ఇలా జరిగింది.
అతడు : ఒక్కొక్క హొటలు ఒక్కొక్క పదార్ధానికి ప్రత్యేకత కలిగివుండును. దురదృష్టువశాత్తు నేనీ హొటలుకుఎప్పుడూ రాలేదు.
అందువలన ఆర్డరు మీరే ఇవ్వండి.
ఆమె : ఈ హొటలులోని అన్ని పదార్ధాలు బాగానే వుంటాయి.
అతడు : అయినా నా కంతగా ఆకలిగా లేదు. (అని కార్డువైపు చూసి_ అన్నిటికన్నా తక్కువ ధరలో వున్న పదార్ధాన్ని గుర్తించి)
నేను మొగలాయీ పాపడ్ జఫ్రానీ తీసుకుంటాను.
ఆమె : (ఆశ్చర్యంతో ) వ్హ్వాట్ ?
అతడు : అవును అర్చనగారూ! నాకు చాలు.
ఆమె : ఒక్క అప్పడంతో సరిపెట్టుకుంటారా చిరంజీవి!
అతడు : (గతుక్కుమని _స్వగతంతో) మొగలాయి పాపిడి జఫ్రానీ అంటే అప్పడమా? అద్దాల బీరువాలో అర్ధరూపాయి పేట్టి రూపాయికి అమ్మటంఅంటే ఇదే కాబోలు! (ప్రకాశాముగా) అవును, నాకు ఆకలిగా లేదు. కేవలం మీకు కంపెనీ ఇవ్వటం కోసమే వచ్చాను.
ఆమె : (నవ్వి) చాలా థాంక్స్.
అందమైన ప్లేటులో అప్పడమూ పక్కన కట్టీ, ఫోర్కూ నాఫ్ కిన్నూపెట్టి, అప్పడంతినేశాక బఫుల్ లో నిమ్మకాయ చెక్క వేసిన వేడినీళ్ళు చేతులు కడుక్కోవడానికి ఇచ్చి, అయిదు రూపాయిలు వసూలు చేసేడు హొటల్ వాడు.
బిల్ ఇచ్చి ఇద్దరూ బయటికొచ్చాక "ఎటు వెళ్ళాలి మీరు" అని అడిగింది. తన రూమ్ కి పర్లాంగు దూరం వరకూయా పొడవాటి కారు వెళ్ళదని గ్రహించి "లైబ్రరీకి" అన్నాడు.
"మిమ్మల్ని డ్రాఫ్ చేసి వెళ్తాను.."
"వద్దు మీకు శ్రమ."
"నేనెలాగో మా ప్యాక్టరీకి వెళ్తున్నాను" అన్నదామె. అక్కడికి వెళ్ళేసరికి లైబ్రరీ ఆ రోజు కట్టేసి వుంది. "ప్యాక్టరీకికూడా సెలవే, కానీ నేను కొంచెం అకౌంట్స్ చూడవలసివుంది. మీకు అభ్యంతరం లేక పోతే రండి." అంది. మూసివున్న లైబ్రరరీ తలుపులు చూసి_ మే చెయ్యాలో తోచని చిరంజీవితో. ఆమె కంపెనీ అతడికి ఒకవైపు అనందంగానూ, మరోవైపు ఇబ్బందిగానూ వుంది. అనందం ఇబ్బంది కన్నా ఎక్కువపాళ్ళలో వుండటంతోసరేనన్నట్టు తలూపేడు. పడి నిముషాల్లో వాళ్ళ కారు విశాలమైన ప్యాక్టరీ ఆవరణంలో ప్రవేశించింది.
ఆఫీసు గదిలో ప్యాక్టరీ మేనేజరుతోనూ అకౌంటు గుమస్తాతోనూ ఆమె మాట్లాడే విధానం చూసి అతడు ఆశ్చర్యపోయాడు. ఒక మెడిసిన్ ఫైనలియరమ్మాయి ఫ్యాక్టరీ తాలూకు వుత్పత్తి, అమ్మకం, ఇన్ కంటాక్స్ మొదలైన విషయాలు అవలీలనగా చర్చించటం అతడికివిస్మయాన్ని కలిగిమ్చిమ్ది. అరగంటలో ఆమె పని పూర్తయింది.
"రండి, ప్యాక్టరీ చూద్దాం" అందామె లేస్తూ. అతదమేని అనుసరించేడు. వాచ్ మెన్ తలుపులు తీసి నమ్రతగా నిలబడ్డాడు. ఇద్దరూ లోపల ప్రవేశించాడు.
చాలా పెద్దపెద్ద మిషన్లున్నాయి లోపల. బాయిలరు పక్కనే ఎక్స్ ట్రూడర్మిషను, దాని పక్కనుంచి కన్ వేయర్ బెల్టు, ఒకపక్క గుట్టగా పోసివున్న పొడిసున్నం. అంతా స్తంబ్దంగా నిర్మానుషంగా వుంది.
"చాలా ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ఇక్కడ అంతా. అందువల్ల లేబర్ సమస్య అంతగా లేదు. నాలుగయిదు సంవత్సరాలవరకూ నష్టంలో నడుస్తూ వుండేది ఫ్యాక్టరీ. క్రితం సంవత్సరం ఈ మిషన్ జెర్మనీ నుంచి తెప్పించాం దామ్తావులాభాలు రావటం ప్రారంభిచాయి."
