Previous Page Next Page 
అభిలాష పేజి 8

    "నేనిలా మీ బెడ్ రూమ్ _అదే ఐమీన్ _మీ గదిలోకి రావటం అదే ఆ దృక్పథం నాకు కలగటం_ అంటే_ బాత్ రూమ్_బాత్ రూమ్ బట్ రూమ్ నీళ్ళు అవి కావాల్సి రావటం యాద్ _యాద్_యాద్..."
   
    "యాద్రుశ్చకం" అండా అమ్మాయి.
   
    "అవును యద్రుశ్చకం" అన్నాడు చిరంజీవి,కొంచెం ధైర్యంవచ్చింది. "హాలో... నా పేరు చిరంజీవి బి.య్యే. ఎల్లెల్సీ ... ఉస్మానియా యూనివర్సిటీ, సి.కే.పీ."
   
    ఆమె కళ్ళలోంచి విస్మయంగా పూర్తిగా తొలగిపోలేదు. అదేస్వరంలో "నాపేరు అర్చన. మెడిసన్ అయిపోయింది. అంకుల్ నాకు అంకుల్ అదే_ ఐమీన్ నేను_ అంకుల్ కి ... నేను..." తడబడింది.
   
    "మేనకోడలు " అన్నాడు చోరంజీవి.
       
                        *    *    *
   
    ఆక్కడ ఆ సంబాషణ అలా జరుగుతూంటే క్రింద హల్లో సర్వోత్తమరావు ఉపన్యాసం  చివరి దశకి వచ్చింది..... "కాబట్టి ప్రెండ్స్ _ఈ ఉరిశిక్షకి వ్యతిరేకతఅన్నది ఉద్యమంలా సాగాలి! పార్లమెంటులో యిది చర్చానీయశం కావాలి. సభ్యులు మనవైపే ఓటువేసి, రాజ్యాంగాన్ని మార్చాలి. మిమ్మల్ని ఈ రోజు యిక్కడికి పిలవటానికి కారణం అదే నాకు కొద్దిగా చేయూత నివ్వండి, అంటే నేను కోరేది."
   
    'ష్యూర్ _ తప్పకుండా ' లాటి పదాలు ప్రతీవారి నోటివెంట వచ్చినయ్ . ప్రకాష్ లేచి వరండాలోంచి పైకి బయలుదేరాడు. అర్చన అక్కడినుమ్హి అంతకుముందే వెళ్ళిపోవటం టాడు గమనించేడు.
   
                                                         *    *    *    *    
   
    "మావయ్యదంటా బోరు. ఈ ఉరు సమస్యనే మెడకు ఉరిలా వేసుకున్నాడు." అమ్తూమ్ది పైన అర్చన. చిరంజీవి వణుకుతూ "అంతమాత అనకండి" అన్నాడు  ఆవేశంతో. అయితే వణుకు ఆవేశంవల్ల వచ్చింది కాదు, చలివల్ల వచ్చింది.
   
    "అ కోతువిప్పంది, రేపు పంపిస్తాను."
   
    మనసులో 'అమ్మో_ ఎనిమిదిరూపాయలు'  అనుకున్నాడు పైకిమాత్రం నవ్వి 'ఫర్వాలేదులేండి' అన్నాడు. ఈ లోపున వరండాలో అడుగుల శబ్దం చప్పుడు వినిపించింది. ఆ ప్రయత్నంగా బీరువా వెనక్కీ వెళ్ళాడు. వచ్చింది ప్రకాష్. గుమ్మం దగ్గర నిలబడి ఏం? మధ్యలో వచ్చేసేవ్" అన్నాడు. అతను ఆమెని ఏకవచనంలో సంబోధించటంచిరంజీవి గమనించేడు.
   
    "ఏంలేడుకోద్దిగా తలనొప్పిగా వుంటేనూ."
       
    "తలనొప్పా? ఏదైనా ఇంజక్షన్ ...."
   
    "తలనొప్పికి ఇంజెక్షనేమిటి డాక్టర్ ప్రకాష్! మేరుమరీనూ" అంది అర్చన బలవంతంగా నవ్వి.  ప్రకాష్ గుమ్మం దగ్గర నుంచి కదలలేదు. "ఇదేమిటి తివాచీ తడిసింది!" అన్నాడు. బీరువా పక్కన నిలబడ్డ చిరంజీవి పక్కలో బాంబు పడ్డట్టు ఉలిక్కిపడ్డాడు. అర్చన మాత్రం కదలలేదు. కళ్ళు తిప్పి కొద్దిగా తివాచీని చూసి, వెంటనే తలతిప్పి "ఈ రాత్రి దానిగురించి మనం చర్చించటం అంత అవసరమూ ప్రకాష్ " అంది స్వచ్చమైనా ఇంగ్లీషు లో ఆమె సూటిగా అడిగేసరికి ప్రకాష్ తడబడి"వెళ్ళొస్తాను" అన్నాడు.
   
    "మంచిది"   
   
    ఆమె అతడిని అలానిబెట్టి, కమేమ్ద్ తో హేండిల్ చెయ్యటం చిరంజీవికి తలమునలయ్యెంటంత ఆశ్చర్యంగా వుండి. అయితే అతడికి తెలియని విషయం ఏమిటంటే:' అర్చన పైకి మామూలుకనబడే అల్లరి అమ్మయేగాని, తరచిచూస్తే  చాలా లోతైంది.

    ఆ మాటకొస్తే ఆ యింట్లో వున్న ముగ్గురు నౌకర్లు తోసహా చివరికి ఆ ప్రసిద్ధి కెక్కిన లాయర్ తోసహా అందరూ ఆమె అంటే భయపడతారు. ఆమె గురించి ఏమీ తెలీదు కాబట్టే చిరంజీవి అలా ఆమె బెడ్ రూమ్ లో తివాచీని దారుణంగా తడపగలిగేడు. తడిపికూడా ధైర్యంగా (ఆఫ్ కోర్స్_ చలికి వణుకుతూ) నిలబడగలిగెడు.
   
    ప్రకాష్ వెళ్ళిపోగానే అతడు మొహంలో అంతకు ముందున్న ప్రశాంత లేకపోవటాన్ని  గమనించి, నిచ్చుకుంటూ ___ "ఐయామ్ సారీ" అన్నాడు. ఆమె విస్మయంతో "ఎందుకు" అన్నది.
   
    "మిమ్మల్ని ఇబ్బందితో పేట్టినందుకు " అన్నాడు.
   
    ఆమె నవ్వి "ఇబ్బందేమిటి" అన్నది. వెంటవెంటనే తమ ఫీలింగ్ మూడ్స్ మార్చుకోగలిగే గొప్ప విద్య చాలా కొద్దిమందికే వుంటుంది.
   
    ఆమె మామూలుగా నవ్వేయటం చూసి అతడు సంత్రుప్తుడై "మీ బావావున్నారండీ " అన్నాడు అమయాకంగా__ సిన్సియర్ గా.
   
    ఆ అమతలకి ఆమె బిత్తరపోయి చివుక్కున తలెత్తెంది. చిరంజీవికి తన తప్పు అర్ధమయి బిక్కచిక్కిపోయేడు..." అదేనండీ అంటే.... నావుద్దేశ్యం, మీరు ... మీరు ప్రకాష్ తో మాట్లాడేటప్పుడు కన్నా నాతోమాట్లాడేడప్పుడు బావున్నారని.... అన్నాడు నసుగుతూ. ఆమె మోహంకోపంతో మరింత ఎర్రబాడటం చూసి, తన మాటల్లో  ఇంకా ఏదో తప్పుండని గ్రహించి, తనకొచ్చిన కొద్ది తెలుగుని తిట్టుకుంటూ " అంటే మీరు ఒకరితో మాట్లాడినప్పుడు బావుంటారనీ, ఒకరితో మాట్లాడినప్పుడు బావోరని కాదండీ_ అసలు మీరు మాట్లాడకపోయినా బావుం..." అతడికి చప్పున అర్ధమైంది. తనెం మాట్లాడుతున్నాడో. తల విదిలిస్తూ "ఇదేంలాభంలేదండీ, వెళ్ళొస్తాను" అన్నాడు.
   
    ఆమెకి లోపల్నుంచి ఉవ్వెత్తుగా నవ్వు తననుకోస్తూంది. అయినా సీరియస్ గా "ఊం" అంది. అతడు కాళ్ళీడ్చుకుంటూ వెనుదిరిగేడు. ఈ రిజు ఇంత వేవర్సుగా గడుస్తుందని అతడు కలలో కూదా వూహించలేదు. అతడు గుమ్మం దాటుతూ వుంటే " చూడండి" అన్న పిలిపు వినిపించింది. అతడు ఆగి వెనుదిరిగేడు.
   
    "మీ కోటు వూడి పడిపోయింది, యిదిగో"
   
    అప్పుడు చూసుకున్నాడు అతడు తనవైపు. తెరుచుకుని వున్న కోటులోంచి తెల్లచొక్కా బైటకొచ్చింది. ఆ చొక్కాకి వున్న రూపాయి కాసంత చిరుగు స్పష్టంగా కనిపిస్తోంది. అతడోక్షణం దాన్ని చూసి నిశ్చేడయ్యాడు. అయితే సర్దుకునే ప్రయత్నం చేయలేదు. నెమ్మదిగా తలెత్తాడు. ఆమె అతడినే చూస్తుంది. నవ్వేడు నవ్వి "చొక్కా నాదేనండి చొక్కాఒకటేనండి" అని వెనుతిరిగి వడివడిగా అక్కణ్ణుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయేడు.
   
    తన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ని మొట్టమొదటిసారి అతడు జయించిన క్షణం అది.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS