దీన్ని లీ చీనా భాషలో నా యెడమప్రక్క నున్న ఉద్యోగికి చెప్పాడు. అయన గొల్లున నవ్వి, నాకు చెప్పమని చీనా భాషలో లీకి చెప్పిన దాని అర్ధం ఇది.
We have an old Chinese saying "When old friends meet, aa thiousand cups are not enough, it says."
"మాలో పాత సామెత వుంది. పాత స్నేహితులు కలుసుకున్నప్పుడు వెయ్యి కప్పులు కూడా చాలవంటుందది!"
కప్పులంటే టీ కప్పులు కావని నేను వేరే చెప్పనక్కరలేదు.
మరునాడు (10-12-76) డాక్టర్ కోట్నీస్ స్మారక వైద్యశాలను చూశాము. అతి ప్రాచీనమైన ఆక్యుపంచర్ టెక్నిక్ తో అతి నవీనమైన శస్త్ర వైద్యం జరపడం చీనావారి ప్రత్యేకత. మా ప్రతినిధి వర్గంలో ఇద్దరు డాక్టర్లున్నారు. మా నాయకుడు డాక్టర్ బి.కె. బాసూ , డాక్టర్ కోట్నీస్ సోదరి డాక్టర్ వత్సలా కోట్నీస్ , ఇద్దరూ ఈ విశిష్ట పద్దతిలో నిష్ణాతులే.
"చైనా వైద్యమూ, ఔషధ శాస్త్రమూ అమూల్యమైన నిధులు. వాటిని శోధించి ఇంకా ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలి. " అన్న మావో బోధన ననుసరించి చైనీస్ శాస్త్రజ్ఞులు వైద్య విధానంలో కొత్త పాటల మేలు కలయిక సాధించారు.
ఇరవయి నిమిషాల పాటు సాగిన ఆపరేషన్ మేము చూశాము. వైద్యులు కడుపులోని ప్రేగులు కోస్తూనే వున్నారు. రోగి స్పృహలోనే వున్నాడు. "యేమయినా నొప్పి తెలుస్తోందా" అన మేము అడిగించాము. "యేమీలేదని" అతడన్నాడు.
కొన్ని నెలల క్రిందట చీనాలో పుట్టిన భూకంపంలో ఒకరికి గుండె ఆగిపోయింది. ఆ రోగిని మేము చూశాము. చచ్చిపోయాడనే అందరూ అనుకున్నారు. కాని ఇప్పుడతను చక్కగా లేచి తిరుగుతున్నాడు.
ఇంకొకతని మాట పడిపోయింది. ఇప్పుడతను ధారాళంగా మాట్లాడుతున్నాడు.
మెడికల్ సైన్సు సాధించిన ఇటువంటి అద్భుతాలు పెట్టుబడిదారీ దేశాల్లోనూ జరుగుతాయి. చైనాలో వైద్యసాహాయం ప్రతి ఒక్కరికీ ఉచితం.
పెట్టుబడిదారీ దేశాల్లో రోగి వైద్యుణ్ణి వెతుక్కుంటూ వెళతాడు. చైనాలో వైద్యులే రోగి వద్దకు వెళ్తారు. ఇది పెద్ద పెద్ద నగరాల్లోనే కాదు, చిన్న చిన్న గ్రామాల్లో కూడా సర్వసామాన్యం.
ఏడు
మూలికల ప్రభావాన్ని కూడా చైనా వైద్యులు గుర్తించారు. వారికి సమృద్ధమైన అరణ్య సంపద ఉంది. వ్యక్తీ స్వాతంత్ర్యం పేరిట ఎవరిక్కావలసిన చెట్టు వాళ్ళు నరుకుకొని పోకుండా తగినన్ని కట్టుదిట్టాలున్నాయి. ఎక్కడెక్కడ నుండో ఏరి తెచ్చిన రకరకాల మొక్కలతో వాళ్ళు పరిశోధనలు సాగిస్తున్నారు. బెతూన్ మెమోరియల్ వైద్యశాలలో ఒక భాగంగా ఉన్న హీర్చేరియంను ఆ సాయంత్రం మేము చూశాము. ఆ మూలికలతోనే మళ్ళీ ఆధినిక పద్దతిలో మందులూ, మాత్రలూ తయారు చేసే ఫ్యాక్టరీ లేన్నిటినో వీరు నిర్మించుకున్నారు. అత్యంత నవీనమైన శాస్త్ర పరికరాలను వారు స్వదేశంలోనే నిర్మిస్తున్నారు.
రష్యాతో సహకారాన్ని చవి చూసిన తర్వాత వారు ఏ వస్తువు కోసమైనా సరే, ఇతర దేశాల మీద ఆధారపడకూడదనే నిర్ణయానికి వచ్చారు. టూత్ బ్రష్షులు మొదలు, ఆటంబాంబుల దాకా స్వదేశంలోనే స్వశక్తితోనే తయారు చేసుకొంటున్నారు.
అన్ని కమ్యునిస్టు దేశాలలోలాగే చైనాలో కూడా ప్రతి వ్యక్తికీ పుట్టింది లగాయతు చనిపోయేదాకా వైద్య సదుపాయం ఉచితం. చీనా వారు ఇంకో మెట్టు పైకి వెళ్ళి దీన్ని ఉచితమే కాక నిర్బంధం కూడా చేశారు. (స్వేచ్చా ప్రియులకిదో చేదుమాత్ర కావచ్చును!) చిన్న చిన్న గ్రామాల్లో సహా జోళ్ళు లేని డాక్టర్లు ఇంటింటికీ వెళ్ళి పరీక్షిస్తారు. రుగ్మతలను మొగ్గలోనే త్రుంచి వేస్తారు. ప్రతివీది చివరా ఒక మందులషాపు వుంటుంది.
ఇప్పుడిప్పుడే ఈ విషయాలను అమెరికన్ పత్రికలలో చదవడం వల్ల ఇవి నిజమే అని మనవాళ్ళు ఒప్పుకుంటున్నారు. లేకపోతే కండక్టర్ టూర్లలో చీనా వాళ్ళు చూపించినవన్నీ చూసి గోరంతలు కొండంతలుగా నాకూ ఆంధ్రపత్రిక "కూ జరిగిన పోరాటమూ, నన్ను మాస్కో మానస పుత్రుడుగా అభివర్ణించడమూ నా జీవితంలో నేను మరచిపోలేని సంఘటనలు.)
"వైద్యుడు రోగి వద్దకు వెళ్ళాలి గాని, రోగి వైద్యుడి దగ్గరకు వెళ్ళకూడ"దన్న నార్మన్ బెతూన్ సుభాషితాన్ని గోడల మీద రాసినందుకు ఈ మధ్యనే నలుగురు మెడికల్ విద్యార్ధుల మీద చెయ్యి చేసుకొనడం జరిగిందని ఒక నమ్మదగ్గ మిత్రుడు చెప్పగా విన్నాను. అలా చెయ్యి చేసుకున్న వాళ్ళ పోలీసులా, మరొకరూ మరొకరూనా అన్న వివరాల జోలికి నేను పోలేదు. పెట్టుబడిదారీ విధానాన్ని చెక్కుచెదరకుండా నిలబెట్టాలనే తాపత్రయం ఉన్నవాళ్ళేవరైనా ఈ పని చేసి వుండవచ్చును.
ఈ వ్యవస్థలో వైద్యులయినా, ఇంకే ఇతర వృత్తులలో ఉన్న వారి కయినా ధనార్జనమే ప్రధానం. ప్రభుత్వ ఉచిత వైద్యశాలలతో సహా ఎన్నెన్ని మోసాలు జరుగుతూ వుంటాయో, అవి నిత్యమూ మనకు అనుభవవేద్యమైనవే. ఒకప్పుడు మన దేశంలో అన్న విక్రయం పంచమహపాతకాలలో ఒకటిగా పరిగనించబడేది. ఇప్పుడు కల్తీ మందుల విక్రయం ఒక భారీ పరిశ్రమగా తయారయింది.
వైద్యుల ప్రసక్తి వచ్చింది కాబట్టి ఇక్కడ నేనో కధ చెప్పదలచుకున్నాను. కధ అంటున్నానని కల్పితమని ఎవరూ భావించనక్కరలేదు. ఇందులోని కేపిటలిస్ట్ మనస్తత్వం గల వైద్యుడు నేను చెప్పబోతున్నట్టు కాకుండా ఇంకో విధంగా ప్రవర్తిస్తేనే ఆశ్చర్యపడాలి.
అనగా, అనగా ఒక పెద్ద డాక్టరు గారున్నారు. పాతిక సంవత్సరాల ప్రాక్టీసులో పుష్కలంగా ధనం సంపాదించాడు. ఆయనకో కొడుకు. అతన్ని కూడా పెద్ద డాక్టర్ని చేసే సంకల్పంతో బి.ఏ. చెప్పించి ఏం.బి.బి. యస్ చదివించి పై చదువులకు గ్లాస్గో, ఎడింబరో పట్టణాలకు పంపించి ఆ కుర్రవాడ్ని ఇంచుమించు తనంత గొప్ప డాక్టర్ని చేశాడు.
