Previous Page Next Page 
చైనా యానం పేజి 8


    "డాక్టర్ కోట్నీస్ వలె మనం కూడా అంతర్జాతీయ కార్మిక విప్లవోద్యమంలో పూర్తిగా సహకరిస్తూ భారత ప్రజలతో చెయీ చెయీ కలిపి సామ్రాజ్యవాదానికీ, పెత్తందారీ విధానానికి వ్యతిరేకంగా పరస్పర సహకారం చేస్తూ చిరంపరంపరాగాతమైన చీనా ఇండియా ప్రజల స్నేహభిమానాలు ఇంకా స్థిరపడి ఇంకా అభివృద్ధి కావడానికి కృషి సాగించాలి" అన్నారాయన.
    అవిష్కరనోత్సవంలో పాల్గొనడానికి భారతీయ మిత్రులను హృదయపూర్వకంగా స్వాగతం చెబుతూ వారి ద్వారా భారతదేశ ప్రజలకు చీనావారి గౌరవాదరాలను అందజేశారు.
    తర్వాత భారత ప్రతినిధి వర్గ నాయకుడు డాక్టర్ బాసూ మాట్లడుతూ "డాక్టర్ బెతూన్ అడుగు జాడల్లో నడచి, చైర్మన్ మావో రచనలను అధ్యయనం చేసి డాక్టర్ కోట్నీస్ సామ్రాజ్యవాద వ్యతిరేకసమరంలో ముక్కాకలు తీరీన సైనికుడై చీనా ప్రజలకు ప్రియతమ బంధువయినాడన్నారు.
    "ఈ సంవత్సరం మీరు ముగ్గురు యోధాగ్రేసరులను కోల్పోయిన దుఖములో కూడా దాన్నే మీ బలంగా మార్చుకొని మావో చూపిన మార్గంలో మీ దేశాన్నీ మరింత పటిష్టమైన సామ్యవాద రాజ్యంగా రూపొందించుకుంటున్నారు...."
    "మన ఉభయ దేశాల మహాప్రజల మైత్రి దినదిన ప్రవర్ధమానం కావాలి....." అన్నారు డాక్టర్ బాసూ.
    భారత రాయబారి నారాయణన్ కూడా ఉత్సవంలో ప్రసంగించారు. డాక్టర్ కోట్నీస్ అంతర్జాతీయ దృక్పధాన్ని ఉగ్గడించారు. చైనా ప్రజలకూ , ప్రభుత్వానికి భారత ప్రజల, భారతీయ ప్రభిత్వపు సుహృత్కంక్షలందజేశారు. "ఈ మెమోరియల్ హల ప్రారంబోత్సవం భారత చైనా ప్రజల మైత్రి మున్ముందు ఇంకా బలపడుతుందని ఆశించడానికి గొప్ప నిదర్శనమని" అభివర్ణించారు. సభలో పాల్గొన్న వారిలో డాక్టర్ కోట్నీస్ భార్య కోచింగ్ లాన్, అయన మిత్రులయిన రేవీఅలీ, డాక్టర్ జార్జ్ హటేమ్, హన్స్ ముల్లర్ మొదలగు వారున్నారు.
    చైర్మన్ లియూ సుహూ రిబ్బన్ కత్తిరించారు. మెమోరియల్ హాల్ ను చీనా, ఇండియా మిత్రులు సాకల్యంగా సందర్శించారు.
    హాలుకు సంబంధించిన అనేక వివరాలు చీనా వార్తా సంస్థ ప్రకటించింది.
    యుద్ద రంగంలో ముప్పయ్యేళ్ళ కిందటి తైలవర్ణ చిత్రాలు ఫోటో గ్రాఫ్ లు, డాక్టర్ కోట్నీస్ రాసిన ఉత్తారాలు, ఉపయోగించిన పరికరాలు ఇటువంటివే ఎన్నో.
    ఆ సాయంత్రం డాక్టర్ బెతూన్, డాక్టర్ కోట్నీస్ ల సమాధుల మీద, సభలో పాల్గొన్న అనేక సంస్థల ప్రతినిధులూ, భారతీయ ప్రతినిధులూ ,డాక్టర్ కోట్నీస్ భార్యా పుష్పాంజలలు ఘటించారు.
    ఆ రాత్రి స్మారకమందిర సన్నాహక సమితి వారు భారతీయ మిత్రులకు ఒక విందు చేశారు.
    ఇదీ వార్తా సంస్థ ప్రకటన. ఆ మధ్యాహ్నం నా రూమ్ నం|| 240 లో ఒక చైనీస్ మిత్రుడు నన్ను కలుసుకుని తెలుగు భాష గురించీ, ఆంధ్రరాష్ట్రం గురించి తన ఆసక్తిని తెలియజేశాడు.
            
                                             ఆరు
    
    "తెలుగు భాష గురించి మీరింతగా ఆసక్తి కనబరుస్తున్నారు కదా! మరి పీకింగ్ విశ్వవిద్యాలయంలో తెలుగు తరగతులు ప్రారంభించడం లేదేం? లెనిన్ గ్రాన్ విశ్వవిద్యాలయంలో మాస్కో విశ్వవిద్యాలయంలో ఎందరో రష్యన్లు మా భాషను నేర్చుకుంటున్నారు" అన్నాన్నేను.
    మిత్రుడు విన్ "తెలుగు నేర్పే అధ్యాపకుణ్ణి పంపించండి. తప్పకుండా మీరు చెప్పిన ఏర్పాట్లు జరుగుతాయి." అన్నాడు.
    "ఎవరో ఎందుకు? నేనే వస్తాను.
    'అయితే మరీ మంచిది.
    అంతలో యిద్దరమూ నవ్వేసి ఊరుకున్నాం. నిజంగానే ఆ సమయంలో చైనాలో ఆరు నెలల పాటు ఉండిపోయి కనీసం వందమంది కయినా తెలుగు భాష నేర్పుదామనిపించింది. అయితే ఇవన్నీఅనుకున్నంత సులువుగా జరిగే పనులు కావు. విన్ చిరునామా తీసుకున్నాను. స్వదేశం వచ్చి రెండు నెలలవుతుంది. ఇంకా ఉత్తరం రాయలేదు. దైనందిన జీవితమనే మహా సముద్రంలో ఉక్కిరి బిక్కిరి అయిపోతూ , చేద్దామనుకున్న మంచి పనులు కూడా చెయ్యలేకపోవడం నాకేమీ కొత్త కాదు.
    9-12-76 వ తేదీని (ఆవిష్కరణం జరిగిన నాడు) నేనింకా చెప్పని విశేషాలు ఇంకో రెండు ఉన్నాయి.
    4P.M. visisted Revilutionary Martyrs Cemetery. అని నా డైరీలో నోట్ చేసుకున్నాను. అంతర్యుద్దంలో పాల్గొని, విజయాన్ని కళ్ళజూడడానికి ముందే చనిపోయిన విప్లవ వీరులు వేలసంఖ్యలో సమాధి చేయబడిన స్థలం అది. ఒక హాలు నిండా వాళ్ళ ఫోటోగ్రాఫులు వందల సంఖ్యలో వున్నాయి. వారిలో చాలామంది పాతికా, ముప్పయ్యేళ్ళలోపు యువతీ యువకులే. (ఏ యుద్డంలోనైనా ఆహుతి అయిపోయేది ఇలాంటి వాళ్ళే కదా!)
    రెండో విశేషం ఆ రాత్రి జరిగిన విందు. అన్ని విందుల్లాగే అది కూడా 8 గంటల నుంచి 12 దాకా సాగింది. ఏమిటి పెట్టేరు. ఏమిటి తిన్నారు. అనేది కాదిక్కడ ముఖ్యం. అప్పుడు జరిగిన ఒక చిన్న సంభాషణను నేనెప్పుడూ మరచిపోలేను.
    సుమారు ఇరవై కుర్చీలున్న గుండ్రని టేబిల్ ముందు నా కుడి పక్కని లీ వున్నాడు. (ఇంగ్లీషు యం.ఎ. మాకు భాషాంతరీకరణ చేసే మిత్రుడు) ఎడమ ప్రక్కను ఒక పెద్ద ప్రభుత్యోద్యోగి వున్నాడు. చాలా టోస్టులు ముగిసిపోయాక నేను మోతాదు మించి తాగేస్తున్నానేమో అన్న అనుమానం కలిగింది. ఆ మైకంలోనే నేనిలా అన్నాను ఇంగ్లీషులో.
    "మద్రాసు నుంచి బయలుదేరేటప్పుడు మా వాళ్ళు నాకో హెచ్చ్ధరిక చేశారు . జాగ్రత్త సుమా చీనావాళ్ళూ దేవాంతకులు- నిన్ను తాగుడులో ముంచేస్తారు అని. వాళ్ళతో అన్నాను కదా - చీనాకు నేను వెళ్ళడం తాగుడులో మునిగిపోవడానికి కాదు ఈదులాడడానికి" అని .


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS