"నిచ్చెన పైమెట్టుకి చేతులూ, క్రింద కర్రకి ఒకదానికి కాళ్ళూ కట్టి కర్రని బిగించేడు. చేతులకిందకొవ్వేత్తుల మంట పెట్టేవారు. బాధతో గంగావేర్రులెత్తిన ముద్దాయి చేయని నేరాన్ని కూడావుప్పుకునేవాడు. అప్పడతనికి మరణ శిక్ష విధించేవారు."
శ్రోతుల్లో 'ప్చ్' 'అయ్యో' అన్న మాటలు వినిపించాయి. "మనం యింతకన్నా నాగరికంగా ఏంలేం ప్రెండ్స్! పోతే యింత దారుణంగా కాకుండా కొంచెం జాగ్రత్తగా మెడకి వురుతాడు వేసి చంపుతున్నాం . మనల్ని చూసి, మనం సిగ్గు పడవలసిన స్థితి యిది! దీన్ని ఎదుర్కొవటమే నాజీవితశయం భారతదేశంలో ఉరిశిక్ష రద్దు పేయటం కోసం ఈ సర్వోత్తమరావు...."
వింటున్నా చిరంజీవి వులిక్కిపడ్డాడు ఏమిటీయన పూర్తిగా మందు కొట్టేడా అనుకున్నాడు. ఆ తరువాత- కొట్టింది తనేననీ, చేవులుక్కోడా అది ఎక్కిందనీ అర్ధమైంది. లేచి నిలబడ్డాడు. ఆడపిల్లకు వేవిళ్ళ సమయంలో కలిగే భాధలాంటివి కలిగింది. ఎదురుగా అంతా గౌరవప్రదమైనా సభ్యుల సమాజం ఒక్కడడుగు ముందుకేసి నిలదొక్కుకుని చుట్టూచూసేడు. ముగ్గురు సర్వోత్తమారావులూ, నలుగురు ప్రకాష్ లూ కనిపించేరు. తొందరగా అక్కణ్ణుంచి బైటపడటం మంచిదని అనిపించింది.
సర్వోత్తమరావు అంటున్నారు "నేనూ, నా మేనకోడలూ తప్ప మా కేవరూలేరు. ఆమె తల్లిదండ్రుల తాలూకు ఆస్తే పదితరాలకు సరిపడా వుందికాబట్టి నేను సంపాదించిదంతా ఆశయసిద్దికోసం వినియోగించుకోవచ్చు. నాచెల్లులుకి మరణశయ్యమీద ఇచ్చిన వాగ్దానం ప్రకారం తనని మెడిసన్ చదివించేను. ఇంకో రెండునెలల్లోహౌస్ సర్జరీ పూర్తీకావడంతోఆమె డాక్టరై
పోతుంది. ఇంకా నాకే బంధాలూ వుండవు."
ఇమ్మీడియట్ గా తను కనబడ్తే అటు వెళ్ళాడు. అదో విశాలమైన వరండా. అతడి నడక పరుగులోకి మారింది. కడుపులో ద్రవం పైకి తంతూంది. అవుత లేట్ లేదు. వరండా చివర మెట్లు కనబడితే వెనుకా ముందు చూడకుండా ఎక్కేసేడు. మేడమీద రెండు రూములు చెరోవైపు కనిపించాయి. తెరిచివున్న తలుపు వెనుకనుంచివాష్ బెషన్ కనబడింది. బాణంలా దూసుకువెళ్ళాడులోపలికి. అయిదు పెగ్గుల ద్రవం బైటకొచ్చిఅయిదు నిముషాల తరువాత కొద్దిగా మామూలు మనిషి అయ్యేడు. ప్రపంచంమళ్ళీ ఆశాజనకంగా కనిపించసాగింది. మొహం కడుకుందామని వాష్ బెషిన్ కొళాయి తిప్పితే నీరు రాలేదు. అతడు అయోమయంగా చుట్టూ చూసేడు. ఎందుకో తెలీదుకానీ, ఆక్షణం అతడికి విశ్వనాధ సత్యనారాయణ గారు జ్ఞాపకం వచ్చారు.
చదువరీ! ఆ కుర్రవాడి అవస్థ చూసి నవ్వుకునే అవసరం మనకులేదు. మనం యెప్పుడైనా విమానాశ్రయమునకు వెళ్ళినప్పుడుగానీ, మొదటిసారి మొదటి తరగతి రైలుపెట్టె ఎక్కినప్పుడుగానీ ఈ విధంగా అవస్థపడేదము. అవస్థ అనగా అది చాలా విధములు కొన్ని అవస్థలు.
నీళ్ళు! నీళ్ళు లేకపోతే ఎలా? అనుకుంటూ చుట్టూ చూసి చిరంజీవి, అది బాత్ రూమ్ బెడ్రూమ్ అని అనుమానపడ్డాడు. గోడలన్నీ మేజాయిక్ మెరుపుతో అద్దంలా వున్నాయి. బాత్ టాబ్ పచ్చగా మెరుస్తుంది. దాని పక్కనే వేసిన ప్లాస్టిక్ పాలితిన్ కర్టెన్ అందంగా తెల్లగా వుంది. ఒక రకమైన మత్తైయినవాసన గదంతా వ్యాపించివుంది. సినిమాల్లో తప్పాతాడు ఎప్పుడూ అలాటి బాత్ రూమ్ ను చూడలేదు అంతలో అతడికి కర్తవ్యం గుర్తొచ్చింది.
నీళ్ళు!
అతడు తల కిందకి వంచి నీటివంపు చూసేడు. చిన్నతనంలో గొట్టం దగ్గర వున్న చిన్న చక్రం తిప్పితే నీరు ధారగా పడటం గుర్తొచ్చింది. అలాటి చక్రం కోసం చూసేడు. అదృష్టవశాత్తు అది వాష్ బేష్ ణ్ కింద కనబడింది. జాగ్రత్తగా దాని కిందకి వంగి నెమ్మదిగా దాన్ని తిప్పేడు.
అంతే!
బాత్ టాబ్ కొక్కేనికి పెట్టువున్న గొట్టపు షవర్ లోంచీ, పైన కప్పు దగ్గరున్న షవర్ లోంచీ, వాష్ బేషిన్ కొళాయిలోంచీ, శతృసైనికులు పెద్దగా అరుచుకుంటూ చుట్టుముట్టి ఒక్కసారిగా నీటిధార అన్నివైపుల్నుంఛీ తడిపేసింది.
అతడు మొదటిసారి వేసిన గంతుకి పై బేసిను, తలని సితరంగా ముద్దుపెట్టుకుంది. రేండో గెంతులో కాలు పక్కకి జరిగింది. ఒకకలు కుడుకీ, ఇంకోకాలు ఎడమికీ , ఇంకోకాలు ఎడమికీ ఒకే వేగంతో ప్రయాణం చెయ్యటంతో గరిమనాభి నెలకి దగ్గరయింది. ఈ లోపులో నీళ్ళు తమ పని కానిస్తున్నాయి. గబగబా చక్రాన్ని వెనక్కీ తిప్పేడు. నీళ్ళు ఆగిపోయాయి. కానీ ఇంకా చప్పుడు వస్తూనే వుండటంతో అతడు కొద్దిగా కంగారుపడితన వంటివైపు చూసుకొన్నాడు. తన కోటే ఒకనీటి రిజర్వాయరుగా మారిందని గుర్తించెడు. జేబుల్లోంచి నీరు దారాపాటంగా కారుతూంది.
అంతలో అద్దంలో ఎవర్నో చూసి, చప్పున వెనుదిరేగేడు. ఎవరూ లేరు. అయోమయంగా అద్దంలో తిరిగిచూసి, ఆ గంతుకుడు తానేనని తన రూపం మరిపోయిందనీ గ్రహించేడు.
వెంటనే తువ్వాలు అవసరం గుర్తొచ్చి, అతడు ముందు గదిలోకి వస్తూంటే బైట అడుగుల చప్పుడు వినబడింది. చప్పున బీరువా వెనక్కీ వెళ్ళేడు. వచ్చిన అమ్మాయి సన్నగా హమ్ చేస్తూ డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని డూమెరుగ్గా బుగ్గలకు పౌడరు రాసుకొంటూంది. ఆ తరువాత చిన్న జెర్క్ తో స్టూల్ మీద నుంచి లేచి, చేతులు మెడవెనక్కీ పోనిచ్చి బటన్ విప్పుతూ బీరువాదగ్గర కొచ్చింది.
మరో క్షణం తను అలాగే నిలబడి వుంటే, తడిసిన కోటుతోపాటూతననీ వుతకటం ఖాయమనీ అంజనేయ దాదాకం ఆఖరుసారి చదువుకొని, ధైర్యంగా అడుగు ముందుకేసి "హల్లో" అన్నాడు.
కెవ్వున కేక పెట్టాలన్న ధ్యాసకూడా లేకుండా ఆ అమ్మాయి షాకు తగిలినట్టూ అవాక్కయిపోయింది. కాలో, నిజమో అర్ధంకాలేదు. ఎదుటి మనిషి ఆకారంకూడా అలాగే వుంది. నుదుటిమీద పాయలుకట్టిన జుట్టు_ జుట్టులోంచికారుతున్న నీటిధార__
బ్రౌనుకోటుకాఫీ రంగుకి మారింది. ఎర్రటి టై, కోటు బైటకొచ్చిజేబు పక్కకు అతుక్కుపోయింది. నిలబడ్డ చోట కార్పెట్ చిన్న మడుగులా తాయారయింది.
