ఎగసిపడే కెరటాలను గుర్తుచేసే ఆమె స్థనాలు లైంగిక రహస్యాలను దాచుకున్న కామశాస్త్ర నిఘంటువులై అతడ్ని ఉద్రేకపరుస్తున్నాయి. వాటి అంచుల నుంచి వాలుగా జారిన రెండు రేఖలు కటిభాగాన్ని చేరాయి.
పాదాల నుంచి శిరస్సుదాకా అపూర్వంగా సాగిన మెరుపుల మరకటవో ఓ నగ్నాకాశపు నైసర్గిక స్వరూపాన్ని కళ్ళముందు పరచి ఓ మనోజ్ఞమైన ఉషస్సులా కనిపిస్తోంది.
"ఏంటలా చూస్తున్నావు?" ఇప్పుడామె బెడ్ పై వెల్లకిలా పడుకుంది. రా వాత్సాయనా..." అంది.
"నన్ను వాత్సాయనా అని పిలవకు సోఫియా" లాలనగా అన్నాడు.
"ఏం?"
"అతడు సద్ర్భహ్మచారి. కామశాస్త్రం రాసాడేమో కాని చేతల్లో అనుభవం లేనివాడు" రెండడుగులు ముందుకేశాడు.
"నాతో ఒక్కసారి అనుభవమైతే చాలు. ఇంతకాలం ఇందులోని ఆనందాన్ని పూర్తిగా తెలీని నువ్వు ఒప్పుకుంటావు. సెక్స్ లో నువ్వింకా బ్రహ్మచారివేనని" ఆమె ఊర్పులు గదిలో వేడి సెగల్ని నింపుతున్నాయి. రా శశీ..."
ఆమె అనుభవం కోసం అంగలార్చుకు పోతూంది. కోర్కెల సుడికి గండిపడుతున్న ఆ క్షణానికి నేపథ్యంలా గోడ గడియారం సరిగ్గా పన్నెండు గంటలు కొట్టింది.
సమీపించాడు చాలా చేరువగా. "ఇంతకాలం నా గురించి చాలా తక్కువ తెలిసిన సోఫియా... ఇప్పుడు నేనెలాంటి మగాడ్నో నీకు చూపించబోతున్నాను."
ఆమె శరీరం పాములా మెలితిరిగిపోతుంటే బెడ్ పైకి చేరుకున్నాడు శశాంక.
* * * *
సరిగ్గా ఇదే సమయంలో...
ఓ ఆకారం పిల్లల శరణాలయంలో అడుగుపెట్టింది. గదుల్లో పిల్లలంతా నిద్రలో వున్నారు. అరుగుపై ఓ మూల నిద్రపోతున్న జాకీని ఓ క్షణం చూసిన ఆ వ్యక్తి నెమ్మదిగా తారట్లాడుకుంటూ అన్నపూర్ణ గదిని చేరుకున్నాడు.
"ఎవరూ" తలుపుకొట్టిన చప్పుడు కాగానే ద్వారాన్ని తెరిచింది. అన్నపూర్ణ ఆమె నిద్రపోవడం లేదు. మనసును మెలిపెట్టే గతాన్ని గుర్తు చేసుకుంటూ కూర్చుంది. అది ఆమె దినచర్య.
ముందు అర్థంకాలేదు వచ్చిందెవరో.
"నేనమ్మా... వీరయ్యని."
గదిలోకి అడుగుపెట్టి ఓ మూల నిలబడ్డ వీరయ్యని చూసి ఎంతగా అప్రతిభురాలైందీ అంటే "నువ్వా" అంది సన్నగా ప్రకంపించిపోతూ.
ఇరవయ్యేళ్ళ తన దుఃఖంలో అతడూ భాగస్వామే. అందుకే చూడగానే గుర్తించింది.
"ఇందాక తమరు హాస్పటల్ నుంచి వస్తుంటే చూశానమ్మా. ముందు నమ్మలేకపోయాను. ఇన్నాళ్ళూ జైలులో వున్న నేను విడుదలైంది ఈ మధ్యనే..." తాగివున్నాడేమో ఆ వృద్ధుడి మాటలు తడబడుతున్నాయి. "పగలే వద్దామనుకుంటే ఎవరన్నా నన్ను వెంటాడుతున్నారన్న భయం... పైగా ధీమాగా రావడానికి మొహం చెల్లలేదు."
"ఎందుకొచ్చావు వీరయ్యా? ఇప్పుడైనా నన్నెందుకు కలిశావు" అందామె నీళ్ళు నిండిన కళ్ళతో.
"ఆ రోజు నీ భర్త నాకిచ్చిన నీ పెద్దకూతురి సంగతి చెప్పిపోదామని..."
తత్తరపడుతూ చూసింది ఓ క్షణం.
"అమ్మా... నేనింక ఎక్కువ కాలం బ్రతకననిపిస్తూంది. అందుకే ఆయనపై కోపంతో ఇన్నాళ్ళూ దాచిన రహస్యాన్ని నీకు మాత్రమే చెప్పి చచ్చిపోవాలనిపించింది. నీ చిన్న కూతురు వినీల నీ భర్త దగ్గర సుఖంగానే వున్నా నీ పెద్ద కూతురు మరోచోట గొప్పగానే బ్రతుకుతోందమ్మా. మొన్న నన్ను పట్టుకుని నిలదీసింది. నా తండ్రెవరూ అంటూ నన్ను హింసించి మరీ అడిగింది. ఇక్కడే ఈ వూళ్ళోనే..."
చెవులు మూసుకుంది అన్నపూర్ణ. ఆపాద మస్తకం వణికిపోతూనే వారించింది. "వద్దు వీరయ్యా... ఏ పాడు నోము నోచానో నా వాళ్లందరికీ దూరమయ్యాను. కాని ఎవరూ లేని అనాథ పిల్లలకు మాత్రం అమ్మనై బ్రతుకుతున్నాను. వద్దు... వీళ్ళే నా పిల్లలు. సుఖంగానే వున్నా నా పిల్లల గురించి చెప్పి మళ్ళీ ఆ బంధాల్లో నన్ను లాగకు. వెళ్ళిపో... నా గురించీ వాళ్లకు చెప్పకు. మళ్ళీ ఈ ఛాయలకు రాకు..." అతడి చేతిలో కొంత డబ్బుంచి పంపేసింది.
చెప్పలేకపోయాడు వీరయ్య.
సోఫియాగా బ్రతుకుతున్న అప్పటి సుజాతే ఆమె పెద్ద కూతురని చెప్పే అవకాశం ఇవ్వలేదు అన్నపూర్ణ.
ఎవరికెవరుగానో బ్రతుకుతున్న ఆ కుటుంబపు రహస్యం ఇక్కడ వీరయ్యతోనే సమాధి అయిపోయింది.
వీరయ్య వెళ్ళిన కొన్ని క్షణాల వరకు తేరుకోలేక పోయింది అన్నపూర్ణ. ఓ నిమిషం వరకూ ఓపిక పట్టిన ఆమె గుండె వాగుకి గండి పడినట్టయి వెక్కిపడుతూ కూర్చుండిపోయింది.
"ఎవరమ్మా అతను?"
జాకీ నిలబడి వున్నాడు ఎదురుగా.
అప్పుడు రాత్రి పన్నెండు గంటల ఒక నిమిషమైంది.
అదే సమయంలో...
నగ్నంగా వున్న సోఫియా పక్కన చేరిన శశాంక ఆర్తిగా ఆమె కళ్ళలోకి చూశాడు. "సోఫియా" అనిర్వచనీయమైన భావుకత అతడి కంఠంలో.
