Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 73

 

   
    "ఆ! నక్కాబోమే కోడలు ఇలాంటి దా? ఏవండి నాకు ఆత్మహత్య  చేస్కోవాలని అనిపిస్తుందండి" అంది పార్వతమ్మ.

    "ముందు నువ్వు నోర్ముయ్" భార్యని కసిరి ఆ దారెంట వెళ్తున్న ఆటోని ఆపి "ఆ కారుని వెంబడించు "అంటూ ఎక్కి కూర్చున్నాడు పరమేశ్వర్రావు. పార్వతమ్మ కూడా ఆటో ఎక్కి భార్తపక్కన  కూర్చుంది. ఆటో రయ్యిన ముందుకు దూకింది.

    "ఆ అమ్మాయి సంగతేంటో కనుక్కోవాలి!" అన్నాడు పరమేశ్వర్రావు పళ్ళు నూర్తూ.

    "ఏవండి!ఏవండి కారు డిక్కీలో చూడండి. ఎవరో కూర్చుని ఉన్నట్టులేదూ?" అంది పార్వతమ్మ ఆటకి కాస్త ముందుగా వెళ్తున్న కారు వంక చూస్తూ.

    "అదే...అదే... అన్ని విషయాలూ కాసేప్పట్లో తెలుస్తాయి" మళ్ళి  పళ్ళు నూరాడు పరమేశ్వర్రావు.

    ఇది జరిగిన పావుగంట తర్వాత పొలిసు సిపు వచ్చి రంగనాయకులు ఇంటి ముందు ఆగింది.

    అమ్డుఅలోంచి  చిట్టబ్బాయి, కన్నారావు, ఇన్ స్పెక్టర్ బంగార్రాజు , కానిస్టేబులు  ఏడుకొండలు  బిలబిలా దిగారు.

    చిట్టబ్బాయి రివ్వున ఇంట్లోకి పరిగెత్తి ఎదురుపడిన చాముండేశ్వరితో  "గుడ్ న్యూస్ అంటి" అన్నాడు సంతోషంతో.

    "ఏం గుడ్ న్యూసో నాయనా! ఆ ముదనష్టపోడు వచ్చి  చినమ్మయిని పండుని ఎత్తుకెళ్ళిపోయాడు" అంది చాముండేశ్వరి  దిగులుగా.

    "ఎవరు...శివరావుగాడేనా?" కంగారుగా అడిగాడు చిట్టబ్బాయి.

    ఆగదిలోకి కన్నారావు, బంగార్రాజు, ఏడుకొండలు  కూడా వచ్చేశారు.

    "ఇంకెవరు నాయనా...ఆ సచ్చినోడే! చిన్నమ్మాయితో బాటు కాంతామణి కూడా తిస్కెళ్ళిపోయాడు" చెప్పింది చాముండేశ్వరి.

    "ఆ...! కాంతామణి కూడా ఎత్తుకెళ్ళాడా?... అయినా వాడికి కాంతామణి తో  ఏంటి సంబంధం?  చిన్నమ్మయినయితే వాడు పెళ్ళి చేస్కోవాలని అనుకున్నాడు కాబట్టి తిస్కెళ్ళినా అర్ధం ఉంది" చిందులు వేశాడు కన్నారావు.

    "అయితే చిన్నమ్మాయిని తిస్కెళ్ళిపోతే  ఫరవాలేదన్నంమాట?" చిట్టబ్బాయి పళ్ళు నూరాడు.

    "అలాగని నేనన్నానా?" కాంతామణిని ఎందుకు తిస్కెళ్ళడూ అని అన్నానుగాని..."

    "మీరిద్దరూ నోళ్ళు ముయ్యండి... అమ్మో... అమ్మో ... వాడికెంత ద్తేర్యం? మా అమ్మాయిని తిస్కెళ్ళిపోతాడా?  వాడిని మర్డరు చేస్తా" గుండెలు బాదుకుంటూ అన్నాడు బంగార్రాజు.

    "మీ అమ్మాయినే కాదు, చిన్నమ్మయిని కూడా తిస్కెళ్ళడండి" గుర్తుచేశాడు చిట్టబ్బాయ్.

    "అవునయ్యా...ఎంతమందిని తిస్కెళ్ళినా  ఒక్కసారె కదా మర్డరు చేయగలిగేది!" విసుక్కున్నాడు బంగార్రాజు.

    "పండుని కూడా తిస్కెళ్ళడు  ఇన్ స్పెక్టరు గారూ" అంది దినంగా చాముండేశ్వరి.

    ఇన్ స్పెక్టర్ బంగార్రాజు తలపట్టుకున్నాడు.

    "అబ్బా!ఇప్పడే కదమ్మా చెప్పాను... ఎంతమందిని తిస్కెళ్ళినా ఒకసారే మర్డరు చేయగలనని" విసుక్కుంటూ అన్నాడు బంగార్రాజు.

    "సార్... నాకో బ్రిలియంట్ అయిడియా వచ్చింది" అన్నాడు కానిస్టేబుల్ ఏడుకొండలు.

    "ఏంటది?" ప్రశ్నార్ధకంగా ఏడుకొండలువైపు చూశాడు బంగార్రాజు.

    "వాడు ముగ్గుర్ని కదుసార్ తిస్కెళ్ళింది?"

    "అవునూ... అయితే?"

    "మీరు మూడుసార్లు ఘాట్ చేసి మర్డరు చేయండిసార్... లెక్క సరి పోతుంది" హుషారుగా అన్నాడు కానిస్టేబుల్ ఏడుకొండలు.

    "అవునండి. అలా చెయ్యండి బాగుంటుంది" అన్నాడు కన్నారావు. "మీ  కానిస్టేబుల్  చెప్పినది చక్కగా ఉందండి" అన్నాడు చిట్టబ్బాయి కూడా. "మీరందరూ  కాస్త నోర్మూసుకోండి" కసురుకుంటూ అరిచాడు బంగార్రాజు.

    అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు.

    "ఊ...అసలేం  జరిగిందో వివరంగా చెప్పండమ్మా" చాముండేశ్వరి వంక తిరిగి అడిగాడు బంగార్రాజు.

    చాముండేశ్వరి శివరావు వచ్చి చిన్నమ్మాయిని, పండుని కాంతామణిని  ఎలా తిస్కెళ్ళిపోయింది చెప్పింది. రంగనాయకులూ, భిమయ్యా కారు డిక్కీలో కూర్చుని వాళ్ళ వెంట వెళ్ళిన కూడా చెప్పింది.

    అంతా విని బంగార్రాజు హడావిడిపడిపోతూ అరిచాడు.

    "పదండి... మనం ఆ శివరావుగాడిని పట్టుకుని మర్డరు చేయాలి"

    "నేను కూడా వస్తానండి ఇన్ స్పెక్టరుగారూ" అంది చాముండేశ్వారి. అక్కాడ వాడు మా ఆయన్ని ఏం  చేస్తున్నాడో ఏంటో?"

    "రామ్మా...రా"

    "వాడు చిన్నమ్మాయిని  ఏం చేస్తున్నాడో!" అన్నాడు చిట్టబ్బాయి.

    "నా కాంతామణి ఏం చేస్తున్నాడో!!" అన్నాడు కన్నారావు.

    "ఇంక చాలు ఆపండి మీ గోల... ఇప్పటికే చాల ఆలస్యం అయిపోయింది. అక్కాడ ఎన్ని మర్డర్లు  జరిగిపోతున్నాయో ఏంటో!!" అని అంటూ హడావిడిగా బయటికి పరుగుతీసాడు బంగార్రాజు.

    అతని వెనకాలే అందరూ వెళ్ళారు. చాముండేశ్వరి  ఇంటికి తాళం వేసేసరికి అందరూ జీపు ఎక్కి కూర్చున్నారు.

    "త్వరగా రామ్మా... అవతల మర్డర్లు జరిగిపోతున్నాయి" జిపులోంచి అరిచాడు బంగార్రాజు.

    చాముండేశ్వరి గబగబా వెళ్ళి జీపు ఎక్కింది. జీపు రివ్వున ముందుకు కదిలింది.

                                                                                     25

    కారు శివరావు ఇంటి ముందు ఆగింది.

    కారుకి కొద్ది గజాల దూరంలో ఆటో ఆగింది.

    శివరావు ఇంజను ఆఫ్ చేసి కారు తాళం చెవులు జేబులో వేస్కున్నాడు. దొర తెరిచి ముందు తను దిగి "ఊ... మీరూ దిగండి" అన్నాడు.

    కారులోంచి చిన్నమ్మాయ్, కాంతామణి, పండు దిగారు.

    "అయ్యగారు! మనం కూడా కార్లోంచి దిగుదామా? డిక్కీలో కూర్చుని కిళ్ళట్టుకు పోయాయ్" అన్నాడు భిమయ్యా.

    "స్... నెమ్మదిగా. వాడు వినగలడు.. వాళ్ళు లోపలికి వెళ్ళిన తరువాత డిక్కిలోంచి బయటికి వెళ్దాం" అన్నాడు రంగనాయకులు.

    దూరంగా ఆగిన ఆటో....

    విడిక్కడ ఆపెడేంటి కారుని?... వాడి ఇల్లు ఇక్కడేనా? అదిగో కారు కూడా దిగాడు" అన్నాడు పరమేశ్వర్రావు.

    "సార్...మీరు దిగుతూండ్రా?" ఆటోవాడు అడిగాడు.

    "చూసారా చూసారా? చిన్నమ్మాయి కూడా కార్లోంచి  దిగింది. హేవండి.... మనకి కాబోయే కోడలు వేరేవాడితో కార్లో షికార్లు చేస్తుందేవిటండి... నాకాత్మహత్య చేస్కోవాలని అనిపిస్తుంది" అంది పార్వతమ్మ.

    "సార్! ఆటోలోంచి దిగుతూండ్రా!"

    "షికార్లు కొట్టడం ఏమిటి నీ మొహం? షికార్లు కొట్టేవాళ్లు ఒంటరిగా కొడ్తారుగాని మంది మార్బలంతో కొడ్తారా? చూడు కార్లోంచి మరో అమ్మాయి కూడా దిగుతుంది. అడుగో...రంగనాయకులు అబ్బాయి కూడా ఉన్నాడు..."

    "దిగారా సాబ్?" ఆటోవాడి గోల.

    పరంధామయ్యకి ఒళ్ళు మండింది.

    "నివ్వు కాసేపు నోర్ముసుకో ...దిగకుండా ని ఆటోలోనే కూర్చుంటామా? సిగతరగ.."

    శివరావు రెండడుగులు ముందుకు వేసి  అనుమానం వచ్చి ఆగిపోయాడు.

    తనతో వచ్చిన అమ్మాయి, ఇంకో అబ్బాయితోపాటు రెండు రోజుల క్రితం ఇంటిదాకా ఫాలో అయింది...ఎందుకు?

    ఆ విషయం తెల్సుకుందామనే శివరావు కాంతామణిని తమతో రానిచ్చాడు.

    "ఈ అమ్మాయి నాతో ఇంత ద్తేర్యంగా వచ్చిందింటే కారణం ఏమిటి? ఇక్కడికి ఎవరయినా వచ్చి రక్షిస్తారని  ముందే తెలుసా? ఆ అబ్బాయి ఇప్పుడు వస్తాడా? లేదా నేను లేనప్పుడు ఎవరయినా వచ్చ్చి ఇంట్లో ఉన్నారా?" అనుకున్నాడు.

    ఈ అనుమానం రాగానే శివరావు ఇంట్లోకి వెళ్ళడానికి సందేహించాడు. కాంపౌండ్ వాల్ గెట్లోంచి వెళ్తే ఇంట్లో ఉన్నవాళ్ళకి తను రావడం కనిపిస్తుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS