అందుకే గోడదూకి ఇంట్లోకి ప్రవేశించి కిటికిగుండా ఇంట్లోకి చూసి ఎవరూలేరని నిర్ధారించుకున్నాకే ఇంట్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు శివరావు.
"మీరు ఇక్కడే ఉండండి...నేను ఒక్క నిముషంలో వస్తాను. పారిపోవడానికి ప్రయత్నిస్తే రోడ్డు మీదే పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేస్తా" అని చిన్నమ్మాయికి, కాంతామణికి వార్నింగ్ ఇచ్చి కాంపౌండ్ వాల్ ఎక్కి గోడ అవతలకి దూకాడు శివరావు.
మరుక్షణం అతని తలమీద దుడ్డుకర్ర ఒకటి తపిమని శబ్దం చేస్తూ తాకింది.
'బాబోయ్' అంటూ గావుకేక పెట్టి మార్చపోయాడు శివరావు.
"హయ్ బాబోయ్... ఎంత ఘోరం జరిగిపోయింది అయ్గారూ...దర్జాగా గేట్లోంచి రాక, మళ్ళి గోడదూకి లోపలకోచ్చారేంటి అయ్ గారూ...మిమ్మల్ని నేను దోంగాడని అనుకున్నాను కద అయ్ గారూ."
గుండెలు బాదుకుంటూ ఘోల్లుమన్నాడు శివరావు పనివాడు వెంకన్న.
జీపు శివరావు ఇంటిముందు కానిస్టేబులు ఏడుకొండలు జీపు వెనక నుంచి కిందికి దూకి గెటువ్తెపు పరుగుతిశాడు.
"ఏయ్... ఏయ్ నువ్వాగు. లేకపోతే మర్డరు చేస్తా" అంటూ జీపు లోంచి దిగుతూ అరిచాడు ఇన్ స్పెక్టర్ బంగార్రాజు.
"అదేంటిసార్ అలా అంటారు? నేనేం తప్ప చేశానని?" బిక్కమొహం వేస్తూ అన్నాడు ఏడుకొండలు.
"మాట్లాడావంటే మర్డరు చేస్తా. అసలు ఇన్ స్పెక్టర్ నేనా నువ్వా?"
"మిరేసార్!" నసిగాడు ఏడుకొండలు.
"మరి నాకంటే ముందు పరుగేత్తుతావేం?"
"సారిసార్.. మిరే ముందు పరుగెత్తండి. నేను మీ వెనకోస్తా"
బంగార్రాజు గర్వంగా నవ్వాడు.
"మీరంతా కూడా నన్ను ఫాలోకండి" అంటూ వెనక్కి తిరిగి జీపు వంక చూసిన బంగార్రాజు తెల్లమొహం వేశాడు.
"ఏరి? జీపులో వున్నవాళ్ళంతా ఏమయ్యారు?" అని డ్రైవర్ని అడిగాడు.
"వాళ్ళంతా ఎప్పుడో ఇంట్లోకి వెళ్ళిపోయారుసార్" అన్నాడు జీపు డ్రైవరు.
"ఆ! ఇన్ స్పెక్టర్ ని నన్ను వదిలిపెట్టి లోపలికి వెళ్ళిపోయారా?... నేరస్తులంటే అంత భయం లేకుండా పోయిందా వీళ్ళకి?" అన్నాడు బంగార్రాజు పిడికిళ్ళు బిగించి.
"నేరస్తులంటేనే కాదుసార్... మీరంటే కూడా భయంలేకుండా పోయింది.
లేకపోతే మిమ్మల్ని వదిలిపెట్టి అలా వెళ్ళిపోతారా?!" అన్నాడు కానిస్టేబుల్ ఏడుకొండలు.
"ఓహ్ సెవెన్ హిల్స్! ని మాటల్తో నన్ను చిత్రవధ చేస్తున్నావు కదయ్యా... అబ్బా!" అంటూ జుట్టు పిక్కోడానికి ప్రయత్నించాడు బంగార్రాజు. అతని చేతికి జుట్టు తగల్లెదుగాని చేతిగోళ్ళు మాత్రం గరగరా శబ్దం చేశాయి.
"సార్! నెత్తిన టోపీ వుండగా జుట్టేలా పిక్కుంటారు? మీ టోపిని నేను తేసేదా సార్?" వినయంగా ప్రశ్నించాడు కానిస్టేబుల్ ఏడుకొండలు.
"షటప్... అతిగా మాట్లాడావంటే మర్డరు చేస్తా. ఇప్పుడు టోపీ తీస్తా నంటావ్ రేపు టోపీ వేస్తానని అంటావ్. నిన్ను మర్డర్ చేయ్యలసలు" అన్నాడు బంగార్రాజు పిస్టల్ తీస్తూ.
"సర్! మర్డర్ చెయ్యాల్సినోళ్ళు లోపల చాలామంది వున్నారు సార్....ఆ విషయం మార్చిపోతున్నారు మీరు " గుర్తు చేశాడు ఏడుకొండలు.
బంగార్రాజు నాలుక కొరుక్కున్నాడు.
"అర్రే...ఆ విషయమే మర్చిపోయాను కదూ? పదపద లోపలేం ఘోరాలు జరిగిపోతున్నాయో ఎంటో?!"
బంగార్రాజు వెనుకనుండి కిసుక్కున సౌండు వినిపించింది.
వెనక్కి తిరిగి చూస్తే డ్రైవరు నవ్వడం కనిపించింది.
"ఎందుకోయ్ నవ్వుతున్నావ్? మర్డరుగాని చెయ్యలా?" కోపంగా అడిగాడు బంగార్రాజు.
డ్రైవరు నోటి మీద చెయ్యి పెట్టుకుని తల అడ్డంగా ఊపాడు.
ఇంతలో లోపలి నుండి గట్టిగా కెవ్వుమని అరిచిన శబ్దాలు వినిపించాయి.
"సార్! లోపల ఘోరాలు జరిగిపోతున్నాయి సార్" కంగారుగా అన్నాడు కానిస్టేబులు ఏడుకొండలు శివరావు ఇంటివ్తెపు చూస్తూ.
"పదపద...ఘోరాలు చేసే అందర్నీ మర్డరు చేద్దాం" పిస్టల్ ని పొజిషన్ లో పట్టుకొని ముందుకు పరుగుతిస్తూ అన్నాడు బంగార్రాజు.
శివరావు ఇంట్లోకి ప్రవేశించి హాల్లోకి దృశ్యం చూసిన ఇన్ స్పెక్టర్ బంగార్రాజు "హవ్వ వ్వ వ్వ " అంటూ నోటిమీద ఎడమచేత్తో కొట్టుకున్నాడు.
హలో సీలింగ్ కి ఉన్న దూలం నుండి ముగ్గురు వ్యక్తులు తలకిందులుగా వేళ్ళాడుతున్నారు.
బంగార్రాజు వెంటనే గురిచూసి కాల్చాడు.
"ఢాం..."
పిస్టల్ శబ్దం హల్లో మారు మోగింది.
హాల్లోని అందరూ కెవ్వుకెవ్వుమని అరిచారు.
బంగార్రాజు పేల్చినా బుల్లెట్ తాడుకి తగిలి తాడుతెగి దూలం నుండి వేళ్ళాడుతున్న ముగ్గురిలో ఒకడు నేలమీద పడ్డాడు.
ఆ పడేందేవరో కాదు.
శివరావు!!
బంగార్రాజు పిస్టల్ ని మళ్ళి గురిపెట్టాడు.
"సార్ సార్" గావుకేక పెట్టాడు కన్నారావు.
"ఏంటయ్యా ఆ కేక?... చెయ్యి వణుకుతూంది. గురి తప్పతుంది" విసుక్కుంటూ అన్నాడు బంగార్రాజు.
"లేకపోతే ఏంటిసార్?... ఎవరయినా మంచోళ్ళని విలన్ బారి నుండి రక్షిస్తారు. మీరేమో విలన్ నే రక్షిస్తున్నారు!!"
"ఆ! అయితే విడేనన్నమాట శివరావు?" ఆశ్చర్యంగా శివరావు వంక చూస్తూ అన్నాడు బంగార్రాజు.
"అవునండి... వాడే..." అన్నాడు కన్నారావు.
"వాడినేవారు అలా తలకిందులుగా వెళ్లాడగాట్టేరు?..."
"మేమే ఇన్స్ పెక్టర్! మాయదారి సంత!! వాదినేండుకట్టా విడిపించారు??"
"ఎందుకలా వేళ్ళాడగట్టారు?"
"విలన్లు మంచోళ్ళని అలా తలకిందులుగా వెళ్ళాడగట్టి హింసపెడ్తారుగా? వీడు కూడా అలా ఎందర్ని వేళ్ళాడదిశాడో ఎంటో?! అలా చేస్తే ఎలా వుంటుందో రుచి చూపించుదామని మేమలా చేశాం ఇన్స్ పెక్టర్ అంది చిన్నమ్మాయ్.
"మేం కూడా బాస్!!" అన్నారు వెళ్లాడ్తున్న మరో ఇద్దరు వ్యక్తులు.
"నోర్ముయ్యండి. మీలాంటి సన్నాసులని అసిస్టెంట్లులుగా పెట్టుకోవడం వాళ్ళే నాకి బాదలు వచ్చిపడ్డాయ్" విసుక్కుంటూ అన్నాడు శివరావు.
"కాదుబాబూ కాదు!.... ఈ కష్టాలన్నింటికీ మూలకారణం నేనే బాబూ నేను. సరిగా చూసుకోకుండా గోడదూకుతున్న మిమ్మల్ని బుర్రకాయ్ మీద బడితతో కొట్టబట్టే కదబాబూ మీరు మూర్చపోయారు? మీరు మూర్చపోడం వల్లెకదబాబూ ఈళ్ళంతా కలసి మిమ్మల్ని బందించేశారు... నేను సేసిన పాపం ఏం చేసినా పోడుబాబూ..." ఓ పక్కగా నిల్చున్న పనివాడు వెంకన్న బాధగా అన్నాడు.
"అబ్బా!" బాధతో జుట్టు పిక్కున్నాడు కన్నారావు.
"ఇన్స్ పెక్టరయ్యగారూ ఈడ్ని మళ్ళి తలకిందలుగా వెళ్లాడదిద్దాం సార్... ఎస్ సార్" అన్నాడు భీమయ్య.
"అవును నాన్నా! అప్పుడు ఎంచక్కా ముగ్గురికిందా మంటలు పెడ్తాం. సినిమాల్లో చూపిస్తారె, అలా" అంది కాంతామణి.
"నేను మధ్య మధ్యలో డొక్కలో పోట్లు పొడుస్తా మాయదారిసంత" అన్నాడు రంగనాయకులు.
"మీరేనా ఏంటి? నేను కూడా పోడుస్తాను బావగారూ" హుషారుగా అన్నాడు పరమేశ్వరావు.
"ఏవండి!నాకాత్మహత్య చేసుకోవాలని వుందండి" అంది పార్వతమ్మా.
"ఎందుకూ?" ఆశ్చర్యంగా భార్యని అడిగాడు పరమేశ్వర్రావు.
"నేను ఏంచెయ్యాలో తోచడం లేదండి" దినంగా అంది పార్వతమ్మ.
"నువ్వు గారిత కాల్చి వాతలు పెట్టు!
"అలాగేనండి..." ఆనందబాష్పాలు రాలుస్తూ అంది పార్వతమ్మ.
