"ఒరేయ్.. న పిస్టల్ ఇస్తావా?... తన్ననా??" కోపంగా అరిచాడు శివరావు.
"అలా అరుస్తావేం?... అలాగేత్తే నీకు తుపాకి నేను ఇవ్వనే ఇవ్వను. అచ్చంగా నేనే తిసేస్కుంటాను... సరేగాని ని దగ్గార క్యాప్స్ ఉన్నాయా... కాస్సేపు పేల్చుకుంటాను?" అన్నాడు పండు కళ్ళుతిప్పుతూ.
"అది దీపావళి పిస్తోలు కాదమ్మా... నిజం పిస్తోలు!!.. నీకు మంచిది వేరే పిస్తోలు కొనిస్తాగా?... అది ఇచ్చేయ్..." బ్రతిమాలద్తూ అన్నాడు శివరావు.
"ఏం వద్దు. నాకిదే బాగుంది. మీ అందర్నీ డాం - డాం అని పెల్చేస్తా... హిహి..." అంటూ ట్రిగ్గర్ నొక్కాడు పండు.
"డాం-"
పిస్తోలు పేలిన శబ్దం ఆ గదిలో మారుమ్రోగింది.
బుల్లెట్ శివరావు చెవి పక్కనుండి "ఝుం" అని శబ్దం చేస్తూ దూసుకు పోయింది.
ఆదేబ్బాకి భయంతో కెవ్వున అరిచి సోఫా వెనకాల నాక్కాదు శివరావు.
ఎక్కడ పండు మళ్ళి ట్రిగ్గర్ నొక్కుతాడో, ఎక్కడ బుల్లెట్ వచ్చి తగుల్తుందోనని భయంతో అందరూ సోఫాల వెనకాల, తలుపు మూలల్లో దాక్కున్నారు.
"అయ్యో! అమ్మో ఏంటో శబ్దం" వంట గదిలోంచి అరిస్తూ రాబోయింది చాముండేశ్వరి.
"మాయదారి సంత. నువ్వు గదిలోకి రాకు. తుపాకి గుండు తగుల్తుంది" కంగారుగా అరిచాడు రంగనాయకులు.
చాముండేశ్వరి ఆ ముందు గదిలోనే ఆగిపోయింది.
పెరట్లోని భిమయ్యకి కూడా పిస్తోలు శబ్దం వినిపించింది.
"వాట్ బాబూ! ఆ సౌండ్ వాట్?" అంటూ ఇంట్లోకి పరుగెత్తుకు వచ్చాడు.
"ఒరేయ్ సన్నాసి! అక్కడే ఆగు... లోపలికి వేళ్ళకు... ఎవరో తుపాకి పేలుస్తున్నారు. గుండు తగిలి చస్తావ్" అంది చాముండేశ్వరి భయంగా.
ఆ మాట వింటూనే 'బాబోయ్' అని అరుస్తూ భీమయ్య ఆ గదిలో మంచం కింద దూరాడు.
కాస్సేపు ముందు హల్లో నిశ్శబ్దం తండవించింది.
మళ్ళి పేల్చడం? ఈ పండుగాడు ఏం చేస్తున్నాడు??
అందరి మనసుల్లో ఇదే ఆలోచన! కానీ ఊహించని ఆ శబ్దానికి అంత చిన్న పిల్లాడ్తేన పండు పరిస్ధితి ఎలా ఉంటుందన్న ఆలోచన ఏ ఒక్కరికి కలగలేదు.
శివరావు సోఫా వెనకనుండి గబుక్కున బయటికి వచ్చాడు. కాని శివరావుతో బాటే పండుని గ గమనించిన రంగనాయకులు అంతకంటే వేగంగా ముందుకి వచ్చి కిందపడి వున్నా పిస్టల్ ని అందుకున్నాడు. అంతకంటే వేగంగా శివరావు పండుని రెక్కపట్టుకుని లాగి, ఎత్తుకుని జేబులోంచి బటన్ చాకు తిసి పండు మెడదగ్గర పెట్టి నవ్వాడు.
"మర్యాదగా ఆ పిస్టల్ ఇటు విసిరెయ్ మామ" అన్నాడు.
దక్కున స్ధలాల నుండి ఒక్కొక్కరే బయటికి వచ్చారు.
"నో అయ్యగారు-నో" అంటూ భిమయ్యా ముందుకు వచ్చాడు.
"నాన్నా! ఆ పిస్టల్ వాడికి ఇవ్వొద్దు" అంది చిన్నమ్మాయి.
"అవునంకుల్ ఇవ్వకండి" అంది కాంతామణి.
"మాయదారి సచ్చినాడా, నికిదేం పోయేకాలంరా" అంటూ అరిచింది చాముండేశ్వరి.
"అల్లుడ్ని అలా తిట్టకూడదు అత్తా! మర్యాదగా మీ ఆయన్ని ఆ పిస్టల్ ఇటు పారేయ్యమను లేకపోతే ని కొడుకుని సఫా చేస్తా. కోడిని కోసినట్టు కోసి పారేస్తా" అన్నాడు శివారావు.
పండు పెద్ద గోంతేస్కుని ఏడవడం మొదలుబెట్టాడు.
భీమయ్య పిడికిళ్ళు బిగించి రెండడుగులు శివరావు వ్తెపు వేసాడు.
శివరావు చాకుని పండు మెడకి ఆనించి భిమయ్యకి వార్నింగ్ ఇచ్చాడు! "నువ్వు మరో అడుగు ముందుకు వేసావో పండుగాడి పీక తెగిపోతుంది."
"ఒరేయ్ నువ్వు ఆగరా. వాడు అన్నంత పని చేసినా చేస్తాడు. దరిద్రం సంత" కంగారుగా అన్నాడు రంగనాయకులు.
భీమయ్య ఆగిపోయాడు.
"ఊ! ఇంకా ఆలస్యం చెయ్యకుండా ఆ పిస్టల్ ఇటు పారెయి మామా" అన్నాడు శివరావు.
రంగనాయకులు పిస్టల్ ని శివరావు విసిరాడు. పిస్టల్ శివరావు పాదాల దగ్గర పడింది.
శివరావు కిందికి వంగి పిస్టల్ ని అందుకున్నాడు.
తర్వాత పిస్టల్ ని చిన్నమ్మాయికి గురిపెట్టి "నువ్వు నాతో పద" అన్నాడు.
"నేను నితోరాను. కావాలంటే నన్ను కాల్చి చంపు... నా ప్రాణం పోయినా ఫరవాలేదు..." అంది చిన్నమ్మాయ్.
"నీ ప్రాణం అంటే నీకు లెక్కలేదని నాకు తెల్సు... కాని పండుగాడి ప్రాణం అంటే మీ అందరికి తిపెకదా?... హహహ..." నావ్వుతూ పండు తలకి గురిపెట్టాడు. అతని వేలు ట్రిగ్గర్ మీదికి వెళ్ళింది.
"వద్దు... వాడినేమి చేయ్యుద్దు" రంగనాయకులు బాధగా అన్నాడు.
"రాంగ్ బాబూ రాంగ్... చిన్న పిల్లాడికి కీడు చెయ్యడం రాంగ్" అన్నాడు భీమయ్య.
"సచ్చినోడా నికిదేం పోయేకాలంరా" చాముండేశ్వరి మెటికలు విరిచింది.
"ఊ... ఊ నోరు జారడం అంత మంచిదికాదు" పండు తలకి పిస్టల్ ని ఆనించాడు.
"వా...."పండు గోలగోలగా ఏడవసాగాడు.
"ఊ....త్వరగా ....నేను మూడు లేక్కబెట్టేలోగా నాతో రావాలి. లేకపోతే పండుగాడి బుర్ర పేలిపోతుంది... వన్... టూ..."
"ఆగు.... నేను నికూడా వస్తాను" చిన్నమ్మాయి శివరావు వ్తెపు అడుగులు వేసింది.
శివరావు పకపకా నవ్వాడు.
"నువ్వు మా అమ్మాయిని తిస్కెళ్ళి ఏం చేస్తావు?" అందోళనాగా చూస్తూ అడిగాడు రంగనాయకులు.
"భయపడకు మామా, మీ అమ్మాయిని ఏమి చెయ్యను. పెళ్ళిచేస్కుంటా..." అని చిన్నమ్మాయ్ వంక చూసి "పద..."అంటూ అడుగులు ముందుకు వేసాడు. అతని చంకలో పండు ఉన్నాడు. చిన్నమ్మాయ్ ఓసారి దినంగా తల్లిద్రండుల వంక చూస్తూ శివరావుని అనుసరించింది.
"పండుగాడిని ఎందుకు తిస్కెళ్తూన్నావ్?" కాంతామణి శివరావుని అడిగింది.
"చిన్నమ్మాయ్ నన్ను పెళ్ళి చేస్కోనని మేరాయిస్తే వీడిని సఫా చేస్తా"
"నేను కూడా మీ వెంట వస్తా..." అంది కాంతామణి అడుగులు ముందుకు వేస్తూ.
"నువ్వెందుకూ?" ఆశ్చర్యంగా చూశాడు శివరావు.
"మరి చిన్నమ్మాయ్ ని పెళ్ళికూతుర్ని చెయ్యుద్దు? నీక్కూడా పెళ్ల్లి చెయ్యాలిగా?" వ్యంగ్యంగా అంది కాంతామణి.
"వెరీగుడ్. అలాగయితే నువ్వు కూడా రా. పెళ్లయ్యేదాకా పనికోస్తావ్. మామా.... మని నీ కారు తాళాలిలా పారెయ్... మేం వెళ్ళిపోతాం" అన్నాడు శివరావు.
రంగనాయకులు కారు తాళాలు తెచ్చి శివరావుకి ఇచ్చాడు. శివరావు పండుని, చిన్నమ్మాయ్, కాంతామణి ని వెంటబెట్టుకుని గదిలోంచి బయటికి నడిచాడు.
"బాబూ...రాంగ్ బాబూ... అట్టా సేయ్యకూడదు బాబూ" వెనుకనుండి అరిచాడు భీమయ్య.
"వీడు చేతులిరగా... కాళ్ళు పడిపోనూ" శాపనార్ధాలు పెట్టసాగింది చాముండేశ్వరి.
"మాయదారి సంత, దరిద్రం సంత, దిక్కుమాలిన సంత, ముదనస్టపు సంత" తిట్టుకోదాగాడు రంగనాయకులు.
బయట కారు స్టార్టయిన శబ్దం అయింది.
"ఒరేయి భీమయ్య!పదా" రంగనాయకులు భిమయ్యకి స్తేగా చేశాడు తన వెనకే రమ్మని.
"ఎస్ అయ్యగారూ" అన్నాడు భీమయ్య.
రంగనాయకులు భీమయ్య గబగబా బయటికి పరుగుతిసారు. అప్పడే కారు కాంపౌండ్ లోంచి మెల్లగా బయటికి వెళ్ళసాగింది.
వాళ్ళు ఇద్దారూ పరుగెత్తుకు వెళ్ళి దిక్కి ఎత్తి వెనకవ్తెపు కూర్చున్నారు. వాళ్ళు అలా కూర్చోడం శివరావు గమనించలేదు.
కారు రాయిన ముందుకు కదిలింది.
అదే సమయంలో కాలనీలో రోడ్డు మీద నడుస్తున్న పరమేశ్వర్రావు పార్వతమ్మల కంటపడింది ఆ కారు.
"చూశావా చూశావా? ఆ కారులో ఎవడి వెంటో పోతోంది చిన్నమ్మాయి! అందుకే మనబ్బాయిని చేస్కోనంతుందేమో! సిగతరగ, అన్నాడు పరమేశ్వర్రావు భార్యతో.
