Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 71

    ఏడుకొండలు లాఠిని ఊగిస్తూ ముందుకొచ్చాడు. రోజీ చటుక్కున ప్తెట సరిగా కప్పుకుని "ఒద్దు... వద్దు. నన్ను కొట్టకండి..." అంటూ ప్రాధేయపడింది.


    "మరి ఆ రోజు ఏమ్తేందో చెప్పు. లేకపోతే మర్డరు చేస్తా"పిస్టలు తీస్తూ అన్నాడు బంగార్రాజు.


    రోజీ చెప్పడం ప్రారంభించింది.



                                                                      24

    కాంతామణి చెప్పిందంతా కుతూహలంగా విన్నారు రంగనాయకులు ఇంట్లో అందరూ.


    "అయితే ఇప్పుడు మీ నాన్నగారు వాళ్ళు రోజీని అరెస్టు చేయడానికి  వెళ్ళారన్నమాట!!" అన్నాడు రంగనాయకులు.


    "అవునండి..." చేతి వాచ్ వంక చూస్తూ అంది కాంతామణి. "అసలు ఈపాటికి రిటర్న్ అవుతూ వుండాలి మరి... వాళ్ళు వెళ్ళి చాలాసేపు అయ్యింది."


    "అసలింతకి ఆ రోజిముండ  విల్లకి దొరికిందో లేదో!..." అంది చాముండేశ్వరి మొహం చిత్కిస్తూ. కాంతామణి కిసుక్కున నవ్వింది.


    "మాయదారి సంత ఎంతా తిట్లూ, నోటిని కాస్త అదుపులో  పెట్టుకో" అన్నాడు రంగనాయకులు చిరాగ్గా చూస్తూ.


    "అట్టా అనకుండా రోజీ విడో అనండమ్మగారూ... తమరు తిట్టినట్టూ ఉంటుంది సేడ్డమాట అన్నట్టూ ఉంటుంది" అన్నాడు భీమయ్య.


    "నువ్వు కాస్సేపు నోరుమూస్కో...." భీమయ్యని  కసిరింది చిన్నమ్మాయి.


    అప్పడే ఫోన్ మోగింది.


    ఒక్క ఉదుటున లేచి ఫోన్ అందుకుంది చిన్నమ్మాయి.


    "హలో..."


    "హలో నేనే చిట్టబ్బయిని" అన్నాడు చిట్టబ్బాయి అవతల నుండి.


    "ఎక్కడి నుండి?"


    "రోజీ ఇంటి దగ్గర్నుండి. సమస్య పూర్తిగా సాల్వ్ అయిపోయింది."


    "నిజంగా?" సంతోషంగా అడిగింది చిన్నమ్మాయి.


    "అవును. ఇప్పడే ఇన స్పెక్టర్ బంగార్రాజు రోజిని అరెస్టు చేశారు. మీ నాన్నగారు అమాయకులు. ఆయనకేం తెలిదు."


          "మరి ఆ పొటోలు?"


    "ఆ శివరావుగాడిని మీ నాన్నగారు ఉద్యోగంలోంచి  తీసేశారు కదా దాంతో వాడు మీ నాన్నగారి మీద పగబట్టాడు. ఎలా దేబ్బకోట్టాలా అని ఎదురు చూస్తున్నాడు. చివరికి రోజితో కలిసి ఒక పధకం ఆలోచించి మీ నాన్నగారికి ఫోన్ చేసి కంపెనీలో ఇంకా ఎవరెవరు సబ్బు కాజేస్తున్నారో చెప్తాను ఇంటికి రమ్మన్నడు. మీ నాన్నగారేమో వాడి మాటలు అమాయకంగా  నమ్మి వాడింటికి వెళ్ళారు. అప్పుడు శివరావు రోజిని ఆయనకీ తన బంధువులమ్మయిగా పరిచయం చేసి మీ నాన్నగారికి బ్రందిలో మత్తు మందు కలిపి ఇచ్చాడు. మీ నాన్నగార్ని దాన్ని తాగి స్పృహ కోల్పోయారు. అప్పుడు రోజిని మీ నాన్నగారి అర్ధనగ్నంగా పడుకోబెట్టి ఫోటోలు తీశాడు. తరువాత రక్తంలాగా అనిపించే ఎర్రని రంగు రోజీ ఒంటిమీద చల్లి కత్తిని ఆమె పక్కన పడేసి ఫోటోలు తీశాడు."


    "తర్వాత?..."కుతూహలంగా అడిగింది చిన్నమ్మాయి.


    "తర్వాత ఏముంది? మీ నాన్నగారు మత్తులోంచి  లేచింతర్వాత తాగిన మ్తెకంలో నువ్వు నా బందువులఅమ్మాయిని రెప చేసి చంపెశావ్ అంటూ బెదరగోట్టాడు. మీ నాన్నాగారు  చాలా భయపడిపోయాడు. నిజంగానే వొళ్ళు తెలీని స్ధితిలో తను అలా చేశానని అనుకున్నారు. అప్పాడు శివరావు మీ నాన్నగారిని భయపడోద్దని...శవాన్ని మాయం చేసి హత్య మీద పడకుండా చేస్తానని. కాని దానికి ఒక షరుతూవుందని, మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్ళి చేయాలనీ కోరాడు. అందుకు బలంతంగా మీ నాన్నగారు ఒప్పకున్నారు...ఒకసారి నువ్వు మీ నాన్నగార్ని కలవడం కోసం కంపెనీకి వెళ్తే అప్పుడు శివరావు నిన్ను చూసి ని మీద కన్నేశాడట!! ఈ విషయాలన్నీ రోజీ మాకు చెప్పింది"


    "అవునా?  హమయ్య!! ఇప్పడేం చేస్తున్నారు మీరు?"


    "ఏముంది? రోజిని పోలిస్ స్టేషన్ లో పడేసి ఆ శివరావుగాడి  ఇంటికెళ్ళి వాడిని కూడా పట్టుకోవాలి! వాడిని అరెస్టు చేశాక  నేను మీ ఇంటికి వస్తాను."


    "త్వరగా వచ్చేయ్..."


    "అలాగే రజ్జూ. నేనిక ఉంటాను"


    "బెస్ట్ ఆఫ్ లాక్"


    "థాంక్యూ"


    రిసీవర్ పెట్టేసి వెనక్కి తిరిగింది చిన్నమ్మాయి.


    "నాన్నా...నువ్వు నిర్దోషివి నాన్నా! ఆ ఫోటోల్లోనిదంతా నిజం కాదు" సంతోషంగా చెప్పింది చిన్నమ్మాయి.


    "ఏ ఫోటోలు...." చాముండేశ్వరి. అడిగింది.


    "వాట్ ఫొటోస్ అయ్యగారూ... వాట్?" అన్నాడు భీమయ్య.


    "నికెందుకూ మాయదారి సంత?... అనవసరంగా మాటల మధ్య దూర్తావ్?... లోపలికి వెళ్ళి కాఫీ పెట్టుకుని రా...ఒరేయ్ భిమయ్యా నువ్వు పెరట్లోకి  వెళ్ళి మొక్కలకి నీళ్ళు పెట్టు... వెళ్ళు..." కసిరాడు రంగనాయకులు.


    చాముండేశ్వరి వంటగదిలోకి , బిమయ్య పెరట్లోకి వెళ్ళాడు.


    "ఆ!ఏంటి చెప్పమ్మా?..." అన్నాడు రంగనాయకులు చిన్నమ్మాయ్ వ్తెపు తిరిగి.


    ఫోన్లో చిట్టబ్బాయి చెప్పిన విషయాలన్నీ తండ్రికి చెప్పింది చిన్నమ్మాయ్ .


    "హమ్మా దరిద్రం సంతోయ్... ఎంత మోసం చేశాడు వీడు!" గుండెల మీద చేయ్యేస్కున్నాడు రంగనాయకులు.


    "పోన్లెండి అంకుల్ ... ఇంక మీ కష్టాలు గట్టేక్కినట్టే కదా..." అంది కాంతామణి.


    కాంతామణి వాక్యం పూర్తయ్యి అవగానే ఆ గొంతు ఖంగుమని మోగింది.


    "హలో మామయ్యా..."


    అందరూ తలలు తిప్పి చూశారు.


    గుమ్మంలో శివరావు నిల్చుని వున్నాడు. రంగనాయకులు అతన్ని నిర్లక్ష్యం గా చూశాడు.


    శివరామ్ గదిలోకి వచ్చాడు. అతని దృష్టి కాంతామణి మీద పడింది. అతను కాంతామణి వంక అనుమానంగా చూశాడు.


    "ఎందుకొచ్చావ్?..." విసురుగా అడిగాడు రంగనాయకులు వంక చూశాడు.


    "అర్జెంటుగా నాకో పదివేలు కావలసి వచ్చింది... డబ్బు నా మొహనపడేస్తే నా దార్న నేను వెళ్ళిపోతాను..."


    అది వింటూనే రంగనాయకులు పకాపకా  నవ్వాడు.


    "ముదనష్టపు సంత... నీకింకా డబ్బులిస్తానని అనుకుంటున్నావా?నువ్వుత్తి మోసగాడివి... ఆ ఫోటోలతో నువ్వేం చెయ్యలేవు. ఆ రోజీ బతికే ఉందని నాకు తెల్సింది. ఇక నీకు ఒక్క ప్తెసా కూడా ఇవ్వను" అన్నాడు.


    "డబ్బులివ్వకపోతే ఇవ్వకపోయావ్ కాని పెళ్ళికి  త్వరగా ముహూర్తం పెట్టించు..." చిన్నమ్మాయ్  వంక చూస్తూ అన్నాడు శివరావు.


    "ఇదెక్కడో అమాయకపు సంతలాగుందే!! నీకింకా పెళ్ళి కూడా కావాలా?... ఇంకోసారి గుమ్మంలో కాలుపెద్తే కర్రతో పెళ్ళి చేస్తా...దరిద్రం సంత...ముందు వేల్లిక్కడి నుండి...." సీరియస్ గా అన్నాడు రంగనాయకులు.


    "ఎప్పుడో ఒకప్పుడు నువ్విలా అంటావని నాకు తెలుసు... అందుకే నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా మామా..." నావ్వుతూ జేబులోంచి పిస్తోలు తిసి రంగనాయకులుకి గురి పెట్టాడు శివరావు.


    చిన్నమ్మాయి, కాంతామణి భయంతో కెవ్వుమని అరిచారు.


    "హ్హ హ్హా హ్హ..."


    శివరావు నవ్వు ఆ గదిలో ప్రతిధ్వనించింది.


    సరిగ్గా ఆ సమయంలోనే పండు గదిలోకి సుడిగాలిలా వచ్చి శివరావు చేతిలోని పిస్తోలు లాక్కున్నాడు.


    "ఏయ్... ఏయ్ - పిస్తోలు ఇలాతే..." అన్నాడు శివరావు పండు చేతిలోని  పిస్తోలు లాక్కోడానికి చెయ్యి ముందుకు చాపుతూ.


    "హమ్మా.. నేను ఇవ్వను..."


    శివరావు చేతికి చిక్కకుండా పండు పరుగుతిసాడు.


    "ఒరేయ్ పండూ. ఆ పిస్తోలు నాకివ్వరా" అన్నాడు రంగనాయకులు.


    "నేనివ్వను..." మొడింగా అన్నాడు పండు.


    "పండూ నాకివ్వమా... నువ్వు పిస్తోలు ఇస్తే నీకు బోల్డన్ని చాక్లెట్లు ఇస్తా..." అంది చిన్నమ్మాయ్ ముందుకు అడుగులు వేస్తూ.


    ఊహు... నాకు చాక్లెట్లు ఏమి అక్కర్లేదు. నాకి తుపాకియే కావాలి!..." గదిలో మరో మూలకి పరుగుతిస్తూ అన్నాడు పండు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS