నిమషంలో పై బాధలన్నీ అనుభవించేసి, నవ్వుతూ, "చెప్పండి ఏమిటి విశేషాలు" అన్నాడు చిరంజీవి. ప్రకాష్ నవ్వలేదు చిరంజీవివైపు ఆరాధనపూర్వకంగా చూస్తూ "ఐస్ కూడా వేసుకోకుండా తాగేస్తున్నారే! రియల్లీ గ్రేట్" అన్నాడు ప్రకాష్ దొరికేవ్ కదా!
ఆ తరువాత వారిద్దరి మధ్యా సంభాషణ యిలా జరిగింది.
"అవును మిస్టర్ ప్రకాష్! మొదట్లో బాధాగానే వుంటుంది. కానీ ఒకసారి అలవాటయితే చాలా బావుంటుంది."
"అయితే దీనికి చాలా అనుభవమూ, నరాలమీద కంట్రోలు కావాలని నా వుద్దేశ్యం."
"అవును మొదట్లో కష్టం. అయినా మీ రెందుకు ప్రయత్నించకూడదు?"
"నాకు భయం"
"భయం మనిషిని కృంగదీస్తుంది. మిస్టర్ ప్రకాష్. జీవితంలో పైకి రావాలంటే దూసుకుపోవాలి బేరర్ ..... ఇదుగో."
"అయిదు నిముషాల్లో రేండో పెగ్? మైగాడ్. మిమ్మల్ని చూసినవారెవరూ మీరింత గిప్పవరనుకోరు సార్."
"అష్ కవర్డ్ ఫైర్ అన్న సామెత మీ రేప్పుడూ వినలేదా మిస్టర్ ప్రకాష్ " సంబాషణ స్వచ్చమైన ఇంగ్లీషులో జరుగుతూంది.
"బేగే పార్టేన్ సర్ "
"నివురు కప్పిన నిప్పు .... మిస్టర్ ప్రకాష్! అష్ కవర్డ్ ఫైర్."
ఈ లోపులో అక్కడ వున్నట్టుండి వాతావరణం నిశ్శబ్దం అయింది. అందరూ అటుచూడటం చూసి, చిరంజీవి కూడా అటు తిరిగేడు. కొంచెం ఎత్తయిన ప్లేస్ మీద సర్వోత్తమారావు గారు నిలబడి వున్నారు. అయన మాట్లాడాదల్చుకొన్నారని అర్ధమై అందుకోసం రెండు నిమిషాలు మౌనంగా వుండదల్చేడు చిరంజీవి.
"మైడియర్ లేర్నేడ్ ప్రెండ్స్!" అయన కంఠం గంభీరంగా పలికింది.
మీ అందర్నీ యిక్కడికి ఈ రోజు యిలా ఆహ్వానించటంలో ఒక అంతరర్ధం వుండి. మీరందరూ బాగా చదువుకున్నవారు. మీ మీ వృత్తుల్లోనిష్టాతులు. క్షమించాలి నాకు తెలుగు సరీగ్గా రాడు. (నవ్వులు)మీలో లాయరున్నారు, డాక్టర్లున్నారు ఇద్దరు పార్లమేంటేరియన్లుకూడా వున్నారు" అయన కొంచెం ఆగి, తిరిగి మాట్లాడసాగేరు.
"నా గురించి మీకు తెలుసు దాదాపు ఇరవై అయిదు సంవత్సల్నుంచీప్రాక్టీసు చేస్తున్నాను. క్రిమినల్ లాయర్ గా కొద్దో గొప్పో పేరు సంపాదించాను."
ఒక ఖద్దరు చొక్కా అయన కల్పించుకుని "కొద్దేమిటీ? దేశంలో వున్న కొద్దిలో ఒకరిగా" అన్నాడు. మళ్ళీ నవ్వులు. సర్వత్తమరావు కూడా నవ్వేరు. అంతలోనే అయన మొహంలో నవ్వు మాయమైంది. ఒక క్షణం మౌనంగా వుండి అయన చెప్పటం మొదలుపెట్టారు.
"నా ఇరవై అయిదు సంవత్సరాల న్యాయవాదవృత్తిలో ఎన్నో కేసులు వాదించాను. కొన్ని గెల్చాను, కొన్ని ఓడిపోయాను. అయితే క్రిమినల్ లాయర్ ని అవటంవల్ల నా దగ్గర కొచ్చే వాళ్ళందరూ జూడర్లూ, తాగుబోతులూ, హంతుకులే ."
శ్రోతులు నవ్వబోయి, అయన మోహం సీరియస్ గా వుండటం చూసి మానేశారు.
"ప్రెండ్స్ ! నా దగ్గర కొచ్చిన ప్రతి కేసూ నేను తీసుకోలేదు. ముద్దాయి నిర్దోషి అని మనస్పూర్తిగా నేను నమ్మిన తరువాతే ఆ కేసుటేకప్ చేస్తూ వచ్చాను. దానికోసం సుప్రీంకోర్టు వరకూ వెళ్ళిన సండర్భాలుచాలా వున్నాయి. ఆ విషయం మీకుతెలుసు."
ఆ విషయం అక్కడ చాలామందికి తెలుసు, అంతేకాదు, ముద్దాయి నిర్దోషి అని నమ్మితే, స్వంత ఖర్చులతో పైకోర్టులో అప్పీలు చేస్తారని ప్రతీతి . అందుకే నలభై అయిదు సంవత్సరాల వయస్సులోనే దేశంలో కెళ్ళా విశిష్టమైన లాయర్ గా పేరుతెచ్చుకున్నారు. " ఒక్కోసారి ప్రాసిక్యూషన్ ఆధారాల్లో నా క్లయింటు నిజంగా నేరం చేసేడని నేనుకూడానేమ్మేస్థితి యేర్పడుతుంది. అప్పుడు ముద్దాయికి శిక్ష పడితే నేను అంత చింతించను కానీ... కానీ" అయన అగేడు. "ప్రాసిక్యూషన్ టప్పుడు సాక్ష్యాలతో ముద్దాయిమీద బలవంతంగా నెరాన్ని రుద్ధినప్పుడు అది నాకూముద్దాయికి మాత్రమే తెలుస్తుంది. నా కళ్ళముందే ఆ నిర్దోషి కి శిక్ష పడుతుంటే నిస్సహాయంగా చూస్తూ వూరుకోవల్సినా సందర్బాలు చాలా వున్నాయి. ఆ శిక్ష మరణశిక్ష అయితే అంతకన్నా దారుణం ఇంకొకటి లేదు. ఆ జ్ఞాపకాలు నన్నేప్పటికి వెంటాడుతూ వుంటాయి. అందుకే____ దేశంలో మరణశిక్ష పూర్తిగా రద్దు చేయాలని వాదిస్తూ వచ్చాను. నేను స్వరం కోల్పోయినాసరే, మరణించే లోపులే ఆ ఆశయాన్ని సాధించగలననే ఆశిస్తున్నాను."
"హుర్రేర్రేర్రేర్రే..." అంటూ గాలోలోకి చేతులు ఎగరేస్తూ. ఒక్కసారిగా లోపల్నుంచి తననుకొచ్చిన ఉద్వేగం తననుకొస్తుంది. "నా జీవితంశయంకూడా అదే గురూగారూ... గ్రేట్ మెన్ థింక్ ఎలైక్ ...." అంటూ చెప్పబోయాడు. అంతలో ఎవరో "ష్" అన్నారు. దాంతో కొంచెం స్పృహా లోకి వచ్చి పెద్ద యాక్టరు వస్తున్నాడని తెలిసి పల్లెటూర్నుంచివచ్చి, వేదికమీడ మాట్లాడుతున్న ఆ పెద్ద యాక్టరు తనతో చిన్నప్పుడు గోడిబిళ్ళ అడినవాడేనని గుర్తించి, అంతమంది జనం మధ్యనుంచి "ఒరేయ్! నేనురా.... ఇక్కడ__" అని అరవాలనిపించేలా వుండి. కానీ గుర్తించేదీ ఎవరు?
సర్వోత్తమరావు తిరిగి మొదలుపెట్టారు.
"మరణశిక్ష గురించి మొదట వ్రాసిన వాడు మనువు. ఎనిమిదోప్రకరణంలో (వశిష్ట _19 'తప్పుచేసిన మనిషిని దేముడి దగ్గరకు పంపేహక్కు వున్నదని' అతడు చెప్పాడు) హిందూ ధర్మశాస్రంలో హత్యపంచ మహాపాతకల్లో ఒకటిగా చెప్పబడింది. హంతుకుడి నీడని కూడా నాశనం చెయ్యాలని వ్రాసివుంది.
కాని తరువాత, తరువాత మనిషి అభిప్రాయం మారుతూ వచ్చింది. అయినాగరికపు రోజుల్లో దారుణమైన విషయాలు జరుగుతూ వుండేవి.
