Previous Page Next Page 
చాటు పద్యమణి మంజరి పేజి 7

 

               రామచంద్రుండు.....

    సీ.    సీతావదూమణి మాతల్లి భుృగురామ
                    గర్వాపహారి మా కన్న తండ్రి
        దశరధాత్మజుఁడు మా దాత విశ్వామిత్ర
                    మఘరక్షణచణుండు మాకుఁ గర్త
        మరీచదమనుండు మాయిలువేలుపు
                   కోదండపాణి మాకులగురుండు
        జనక జానేత మా నెనరై నచుట్టంబు
                   రావణహంత మా జీవధనము

    గీ.    కైక యీప్సితకారుఁడు మాకు హితుఁడు
        హేమమృగ చర్మశాయి మా స్వామి జలది
        బందనుఁడు మాకు సంసార భారవహుఁడు
         రామచంద్రుండు మాకు సర్వస్వ మర్దయ.
    
    సీ.    వనరాశిఁ దనయంప మొనకుఁ దెప్పించిన
                  కోదండధరుఁడు మా కులగురుండు
        తారక బ్రహ్మ విద్యాస్వరూపం బైన
                  వేదవేధ్యుండు మావిమల విద్య
        దండకాంతర మౌని మండలిఁ గాచిన
                  మనువంశ తిలకుండు మాకుఁబ్రాపు
        పగవాని తమ్మునిఁ బట్టంబు గట్టిన
                  కరుణాపయోధి మా పరమదాత
    
    గీ.    శబరీ యొసఁగిన ఫలములు చవులు గొన్న
        భక్తీ మా త్రైకదర్శి మాపాలివిందు
        కఠినదశ కంఠభుజగర్వ గౌరవంబు
        మట్టు పెట్టిన విలుకాఁడు మా బలంబు.

                   రామా! ఆర్త రాక్షామాణీ!

    మ.     శర ణన్నన్ గరుణింతు వన్న బిరుదుల్ జాలంబులే చాలునో
        శర ణోహో యన రా వదేమి వినహో సంసారతాపత్రయం
        బెరుగన్నీ యదో యిందు లేవో చెపుమా యీ నిర్దయాబుద్ది నే
        మఱితే ముందు విభీషనాదులకు రామా! ఆర్త రక్షామణీ!
    
    మ.    పరులన్ శిష్యులఁ దల్లిఁ దండ్రి గురులన్ భ్రాత్రాదులన్ మిత్రులన్
        శర ణన్నంతనే యాపదల్ పరిహరించన్ రాముఁ డుండంగ నే
        వెర పెలంచును బిన్న పెద్దలు బుధుల్ వేదాంత శాస్త్రంబులున్
        మఱియుం ఐల్క్జేడుపల్కు నమ్మితిని రామా! ఆర్త రక్షామణీ!

    మ.    పరుగై రావదే త్రోవ గానవో సురల్ ప్రార్ధించిరో సామగా
        నరుచిం జొక్కితో యాంజనేయుని వడిన్ రావించితో జానకీ
        చరణాబ్జంబులు నొచ్చెనో యితర దేశ ప్రాణి సంరక్ష నే
        మఱితో జాల మిదేలనయ్య రఘురామా! ఆర్త రక్షామణీ!

    మ.     శర ణన్న క్షణమే విభీషణున కాచంద్రార్క మైనట్టిదే
        వర లంకాపురి దారావోసి తనుచున్ వాల్మికి రామాయణా
        ది రహస్యంబులు తెల్చుటల్ నిజములైతే నన్ను రక్షింపుమీ
        మఱుమాటాడగ నింక నానసుమి రామా! ఆర్త రక్షామణీ!

                             శివస్తుతి

    చ.    భసితము కన్నులం బడినఁ బాములు బుస్సనఁ గంట మంట పె
        ల్లెసఁగి విధుండుగంద నొకయింత గజాసురు చర్మ మూఁగీనన్
        గసరుచు నల్ల పెద్ద పులి గండ్రన గిత్తయుఁ దత్తరిల్లఁ జేఁ
        బొసఁగిన లేడి కుందువడ భూతభయంబున గౌరీ లేవ న
        వ్వేసఁగఁగ సంతరించుకొను నీశ్వరుఁ డిచ్చుట మీ కభీష్టముల్.

    సీ.    సర్వసర్వంసహసముదయంబు రధంబు
                    రధమధ్యమున నున్నరాయి విల్లు
         విల్లువెంబడిఁ దిర్గువెలుఁగులు చక్రాలు
                     చక్రాలకును వైరి చారువారి
        నారిఁ బట్టుక తిర్గునాగరకుఁడు గరి
                     గరి మీఁద విహరించుఘనుఁడు
        శరము నాభిక నున్న శతవృద్దు సారధి
                     సారధి మాటలు సైందవములు

    గీ.    గాఁగ నేగుదెంచి కణఁకతోఁ బురములు
        గెలిచినట్టి ఘనుఁడు గిరిజతోడఁ
        గలసి యుండునట్టి కరుణాసముద్రుండు
        నిష్ఠసిద్దు లోసఁగు నెలమి మనకు.

    సీ.    తారకాసుర భుజాదర్పంబు దెగటార్చు
                     ఘనుఁ గన్నతండ్రి మాయమఁగు వేల్పు
        కుండలిజ్యావల్లి కొండవింటను గూర్చు
                     విలుకాండ్రమేటి మాకులగురుండు
        తలిరాకుబాకు గద్దరివజీరుని క్రొవ్వు
                     మట్టు పెట్టినదిట్ట మాకుఁ బ్రాపు
        హత్తితెల్లనిగిత్తకత్తలాణము నెక్కి
                     మహి మించునేఱకాఁడు మాధనంబు

    గీ.    జాటజూటాగ్రవీధిని జహ్నుకన్య
        మమత నిడుకొన్న వగకాఁడు మాబలంబు
        పార్వతీసాద్వి సామేనఁ బాదుకొల్పి
        వెలయుపటుశీలి మాపాలివేల్పు మొదవు

            మృడునిఁ గనుగొంటి

    సీ.    అర్ధంబు సత్పురుషాకృతిగాంచిన
                వెండిచాయల పెద్ద కొండఁ గంటి
        ఆకొండపార్శ్వమం దంటి పాయఁగలేక
                  సగమైన యొకమహా శక్తిఁ గంటి
        ఆశక్తి కుడి వంక నద్రిశృంగము మీఁద
                   నద్భుతం బైనకాఱడవిఁ గంటి
        అక్కానలోఁ గంటి నరుదైన యొక యేఱు
                    నయ్యేటిదరులయం దమృత మొలుక

    గీ.    పాఱి తడుపారు నొకపాలపాఁపఁ గంటి
        యదియు నదియును నదియును నదియు నదియు
        హరిశిరోజూటగంగాబ్జు లగుట గంటి
        మృడునిఁ గనుఁగొంటి నంతట మేలుకొంటి.

    సీ.    శీతాదరియామ్యాదిక్సీమభూములు గంటిఁ
                  జేలువైన కేదారశిఖరిఁ గంటి
        ఉగ్రుని నిజకాంత నుమఁ జెంతఁ గనుఁగొంటి.
                  మధుమాధవుని దైత్యమధనుఁ గంటి
        కంటి విఘ్నేశ్వరు గణనాధుఁ గనుఁగొంటిఁ
                  జండభైరవుని గోస్వామిఁగంటి
        ఉత్తమసంస్తుత్యు నుత్తరార్కునిఁ గంటిఁ
                   గాలభైరవు చన్నఘంటఁ గంటి
    
    గీ.     కంటి వటవృక్ష మాదిమగంగఁ గంటి
        గంటిఁ గేదార కుండోదకములు గ్రోలి
        మహితవృషరాజు నెక్కిన మహిమవాని
        మృడుని గనుఁగొంటి నంతట మేలుకొంటి.

    సీ.      అలపోతులఱేని నాతనిపగ వాని
                  బెంపంగఁ జాంపంగఁ బెంపు గలిగి
        హాలాహాలపు మందు హల్లకముల విందుఁ
                  గుడువంగ ముడువంగఁ గోర్కిగల్గి
        ఎడమదిక్కువధూటి జడల మక్కువబోటి
                  బొలపింప వలపింపఁ బొందు గలిగి
        పచ్చియేనిక తోలు ప్రాఁతకంగఱికాలు
                  కట్టంగఁ బట్టంగఁ గణఁక గల్గి   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS