Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 65

 

      "మీరు గోడ దూకెందుకోచ్చారండి బాబుగారూ"

    ఓ నిముషం తరువాత వాడికి తన కర్తవ్వం గుర్తుకు వచ్చి నాలుక కొరుక్కుని చేంపలేస్కుని  లోపలికి పరుగెత్తుకు వెళ్ళి చెంబుతో నీళ్ళు తెచ్చి మొహం మీద చల్లాడు.

    శివరావు కళ్ళు తెరవగానే వెంకన్న పీక పట్టుకున్నాడు.

    "బాబోయ్...నాకేం పాపం తెలిదు బాబూ. తమరు గోడదూకితే  దొంగను కున్నా బాబూ ...నన్ను శమించు ఘోల్లుమన్నాడు వెంకన్న.

    శివరావు ఓసారి బుర్ర తడుముకుని తనకోసం ఎవర్తెనా వచ్చారా అని అడిగాడు.

    వెంకన్న కన్నారావు కాంతామణి గురించి చెప్పాడు. "కాని వారు మీకోసం కాదులేబాబూ. వేరే శివరావు గురించి మచ్చామని చెప్పి వెళ్ళిపోయారు బాబూ..."

    శివరావు పిడికిళ్ళు బిగుసుకున్నాయి.

    "అయితే అలా చెప్పారన్న మాట!.."

    అతను యింట్లోకి వెళ్ళి ఫోనెత్తి ఓ నెంబరు డయల్ చేశాడు.

    "హలో ఎవరు మాట్లాడుతున్నారు? హూ టాకింగ్!" అవతల్నుండిభీమయ్య అడిగాడు.

    "రంగనాయకులు ఉన్నాడా?" గిరగా అడిగాడు శివరావు.

    "లేరండి..ఆయన ఆఫీస్ గోయింగ్. మీరెవరు?..హూ ?.."

    శివరావు ఆ ల్తేను కట్ చేసి రంగనాయకులు ఆఫీస్ నెంబరు తిప్పాడు. ఎంగేజ్ సౌండ్ వచ్చింది. కాస్సేపు ఆగి ఇంకోసారి డయల్ చేశాడు. మళ్ళి ఎంగేజ్ సౌండ్ వచ్చింది.

    ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఎంగేజ్ సౌండ్ వస్తుంది.

    అరగంటసేపు  ప్రయత్నంచి విసుగొచ్చి ఫోన్ పెట్టేశాడు శివరావు.


                                                                  21
   
    కన్నారావు చెప్పింది విని చిట్టబ్బాయ్ ఆశ్చర్యపోయాడు.

    "నువ్వు చెప్తుంది నిజమేనా?"

    నమ్మలేనట్టు చూస్తూ అడిగాడు.

    "నిజమేనండి.." అంది కాంతామణి.

    "మేమిద్దరం శివరావుగాడిని ఫాలో అయ్యి వాళ్ళ యింటి దాకా వెళ్ళాం. అక్కడ వాడి పనివాడినడిగితే ఆ విషయం చెప్పాడు" అన్నాడు కాన్నారావు.

    చిట్టబ్బాయ్ ఆలోచనతో పడ్డాడు.

    అయితే వీరస్వామి అనే మనిషే లేడన్నమాట! పోనీ చిన్నమ్మాయి అతని పేరు తప్పగాద్తప్పగా విందేమో అని అనుకోడానిక్కూడా లేదు. ఎందుకంటే అసలు శివరావు తండ్రి ఈ లోకంలోనే లేడు.

    మరి రంగనాయకులు కూతురికి అబద్దం ఎందుకు చెప్పినట్టూ?...

    ఆ మాటనే ప్తెకి  అన్నాడు చిట్టబ్బాయ్.

    "రంగనాయకులు అబద్దం  ఎందుకు  చెప్పాడో?... అసలు వీరాస్వామి అనే వ్యక్తి లేడు. లేని వ్యక్తి పేరు చెప్పి అతనే తను ప్తెకి రావడానికి కారణమ్తెన వ్యక్తి అని చెప్పడంలో  అతని ఉద్దేశం ఏమిటి?"

    "అదే మాకూ అర్ధం కావడంలేదు" అంది కాంతామణి.

    "ఆ శివరావుగాడితో పెళ్ళికి ఒప్పించాలని చిన్నమ్మాయ్ తో అలా అబద్దం చెప్పి ఉంటాడు" అన్నాడు కన్నారావు.

    "నిజమేగాని... అలా అబద్ద్దాలు చెప్పి పెళ్ళికి ఒప్పించాల్సిన అవసరం ఏముంది వాళ్లు వాళ్ళమ్మాయిని నాకిచ్చి పెళ్ళిచేయడం యిష్టం లేదను కుంటే అదికాదు... వాళ్లు నస్నేంతో యిష్టపడ్డారు. మా అమ్మానాన్నలతో మాట్లాడి తాంబూలాలు కూడా పుచ్చుకున్నారు!"

    ముగ్గురూ ఆలోచనలో పడ్డారు.

    అంతలో గదిలోకి సుడిగాలిలా చిట్టబ్బాయి తల్లిదండ్రులు పార్వతమ్మ  పరమేశ్వర్రావులు  దూసుకుని వచ్చారు.

    గదిలోనే రాగానే ఇంతెత్తున ఎగిరాడు పరమేశ్వర్రావు.

    "అసలు ఆయన ఏమనుకుంటున్నాడూ?... తాంబూలాలు పుచ్చుకుని సంబంధం కుడుర్చుకున్నాక ఇప్పుడు వద్దంటాడా? ఎందుకు వద్దంటా? పెళ్ళంటే ఆటలుగా ఉందా?.. ని పెళ్ళి ఫలానావారి అమ్మాయితో జరుగుతుందని ఊరంతా చెప్పానే?... ఇప్పుడు కాదంటే ఎలా? ఊళ్ళో వాళ్ళు అడిగితే వాళ్ళే మళ్ళి వద్దనుకున్నారు మా అబ్బాయికి అని  చెప్పనా? నీ ఉత్తరం అందగానే సంగతి తేల్చుకుందామని వచ్చేశాం సిగ తరగ."

    "ఏమండి! ఈ సంబంధం తప్పిపోతే నేను ఆత్మహత్య చేస్కుంటానండి. నాకు చిన్నమ్మాయ్ చాలా నచ్చిందండి..."అంది పార్వతమ్మ.

    "అబ్బా! మధ్యలో ని గోలేంటే?" విసుక్కున్నాడు పరమేశ్వర్రావు.

     "చిన్నమ్మాయి కాకుండా వాడికి నచ్చని అమ్మాయిని  చేస్తే నేనూర్కోను... ఆత్మహత్య చేస్కుంటా."

    పరమేశ్వరరావు తలపట్టుకున్నాడు.

    "సర్లె, సర్లె. అలాగే చేస్కుందువుగాని " అని కొడుకువ్తెపు తిరిగాడు "ఇంతకి వాళ్ళు హఠాత్తుగా మన సంబంధం వద్దని అనుకోవడానికి కారణం ఏంటి?"

    ముగ్గురూ మొహమొహాలు చూస్కున్నారు. కొన్ని క్షణాల తరువాత చిట్టబ్బాయ్ మెల్లగా అన్నాడు.

    "దాన్ని గురించే మేమూ ఆలోచిస్తున్నాం నాన్నా...కారణం ఏమ్తె ఉంటుందా అని."


                                    *               *               *


    రాత్రి ఎనిమిది గంటల్తెంది.

    తన గదిలో ఏవేవో ఆలోచనలతో సతమతమవుతూ కూర్చుని ఉంది చిన్నమ్మాయి. తను చూసిన ఫోటోల గురించి ఆలోచించిన కొద్ది ఆమెలో ఆందోళన ఎక్కువ కాసాగింది. ఆ ఫోటోల గురించి తల్లితో చెప్పలేదు.

    తను బాధపడ్తున్నది చాలదా? తల్లిని కూడా ఎందుకు బాధ పెట్టడం?

    నాన్న అంత మంచివారే!!.. ఎందుకిలా చేశారు?...ఎందుకు?

    ఆలోచనలతో ఆమెకి పోచ్చేక్కి పోతూంది.

    అప్పడే హలో ఫోన్ మోగడం మొదలుబెట్టింది. ఫోన్ మోతతో చిన్నమ్మాయి ఆలోచనలకు అంతరాయం ఏర్పడింది.

    ఫోన్ మోగుతూనే ఉంది.

    ఎవరూ ఎత్తరేం?...హలో ఎవరూ లేరా?

    అమ్మ వంటింట్లో ఉన్నట్టుంది! నాన్న ఏం చేస్తున్నారు? భీమయ్య ఇంట్లో లేడా?

       ఇలా ఆలోచించసాగింది చిన్నమ్మాయి. ఆ గదిలోనే ఎక్స్ టెన్షన్ ఫోన్ ఉంది ఒక మూలగా.

    హల్లో ఫోన్ ఎవరూ ఎత్తడం లేదని చిన్నమ్మాయి లేచి గదిలోని ఫోన్ ఎత్తింది.  కాని సరిగ్గా అదే సమయంలో  హల్లో రంగనాయకులు ఫోన్ ఎత్తాడు. హల్లో ఫోన్ మోగడం అతనూ వింటున్నాడుగాని  లోపల ఎవర్తెనా ఎత్తుతార్లె అని కదలకుండా కూర్చున్నాడు. చివరికి అతనికి పడక్కుర్చిలోంచి లేవక తప్పలేదు.

    "హలో..."అంది అవతల  కంఠం.

    చిన్నమ్మాయి సమాధానం ఇవ్వబొయింది. అంతలోనే రంగనాయకులు గొంతు "హలో..." అనడం వినిపించింది ఆమెకి.

    నాన్న ఫోన్ ఎత్తారన్నమాట!

    చిన్నమ్మాయి రిసీవర్ ని క్రెడిల్  చేసింది. వెనక్కి తిరిగి కుర్చివ్తెపు రెండు అడుగులు వేసి ఠక్కున  ఆగిపోయింది చిన్నమ్మాయి.

    కొన్ని క్షణాల క్రితం ఫోన్లో తాను విన్న గొంతు గురించి ఆలోచించసాగింది ఆమె.

    యస్...అది శివరావు గొంతే...సందేహంలేదు...

    వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో వినాలనిపించింది చిన్నమ్మాయికి.

    ఆ ఆలోచన రాగానే గిరుక్కున వెనక్కి తిరిగి రిసివారు ప్తెకి తీసింది  చిన్నమ్మాయి.

    శివరావు, రంగనాయకులు సంభాషణని జాగ్రత్తగా వినసాగింది.

    "వాళ్లు నువ్వు పంపిన మనుషులు కారా?"

    అది శివరావు గొంతు

    "కాదు.." రంగనాయకులు సమాధానం.

    "ఉదయం మీ ఇంటి నుండి నా వెనకాలే ఫాలో అయ్యి మాన్ ఇంటి దాకా వచ్చారు... వాళ్లు నన్నెందుకు ఫాలో అయినట్టు?"

    "ఏమో నాకేం తెలుసు?"

    "అయితే కన్నారావు, కాంతామణి శివరావుని ఇంటిదాకా ఫాలో అయ్యారన్నమాట!!..." అనుకుంది చిన్నమ్మాయి.

    "నిజంగా నీకు తెలిదా?.... లేకపోతే వేషాలేస్తున్నావా?... నాకేమో వాళ్ళు సి.ఐ.డి. డిపార్టుమెంటు వాళ్ళేమోనని అనుమానం వచ్చింది..."

    చిన్నమ్మాయి కోపంతో పిడికిలి బిగించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS