నాన్నతో ఎంత అమర్యాదగా మాట్లాడుతున్నాడో వీడు!
"నిజంగా వాళ్ళేవరో నాకు తెలిదు. అనవసరంగా అనుమానించకు మాయదారిసంత...ప్లీజ్.."
"సర్లె -సర్లె ... ఒకవేళ నువ్వు పోలీసులకి కంప్లయింట్ ఇచ్చిన నికే నష్టం...ఇలా బ్లాక్ మెయిల్ చేస్తున్నందుకు నేను జ్తేల్లో పడోచ్చుగాని నువ్వయితే ఉరికంబం ఎక్కుతావ్....అందమ్తెన అమ్మాయిని అనుభవించి హత్య చేస్తే ఆ పాపం ఊర్కే పోతుందా?...హ -హ...."
చిన్నమ్మాయి ఉలిక్కిపడింది.
తన తండ్రి అందుకేనా శివరావ్ కి ఇచ్చి తనని చేయాలని అనుకుంది?
అయితే శివరావే తన తండ్రి కి ఆ ఫోటోలు పంపించాడా?
శివరావు ఉచ్చులో ఆయన పూర్తిగా బిగుసుకున్నారన్నమాట!!
శివరావు దుర్మార్గుడే కావచ్చు!...కాని ఈయన కూడా ఇంత నిచమ్తెన పనిని ఎందుకు ఎలా చేయగలిగారు?
వాళ్లు ఫోన్లో మరో నిమిషం సేపు మాట్లాడుకున్నారు. ఆ సంభాషణ మొత్తం విన్న చిన్నమ్మయి౮ నేలమీద కుప్పకూలిపోయింది.
జీవితం ఆశ ఆమెకి పూర్తిగా చచ్చిపోయింది.
* * *
"చిట్టి..."
ఆ పిలుపు వింటూనే గిరుక్కున పక్కకి తిరిగి చూసారు చిట్టబ్బాయి కాన్నారావులు. వాళ్ళిద్దరూ ఇందిరాపార్కు గేటు దగ్గర నిలబడి చిన్నమ్మాయి కోసం ఎదురు చూస్తున్నారు. అంతకు అరగంట క్రిఅతం చిత్తబ్బ్యి ఆమెకి ఫోన్ చేసి అక్కడికి రమ్మన్నాడు.
"ఓ... నువ్వు వచ్చేసావా?... పద లోపలికి వెళ్ళి కూర్చుందాం" అన్నాడు చిట్టబ్బాయ్.
ముగ్గురూ లోపలికి వెళ్ళి ఓ మూలగా పచ్చికమిద కూర్చున్నారు.
"ఎందుకు ఎంమని పిలిచావ్!" చిట్టబ్బాయ్ వంక చూస్తూ ప్రశ్నించింది చిన్నమ్మాయి. ఆమె మొహం పాలిపోయి ఉంది.
"ఫోన్లోనే చెప్పానుగా నీకో ముఖ్యమ్తెన విషయం చెప్పాలని-"అన్నాడు చిట్టబ్బాయి.
"ఏమిటది?" ప్రశ్నార్ధకంగా చూసింది చిన్నమ్మాయి.
చిత్తబ్బి కన్నారావు వంక చూసాడు నువ్వే చెప్పు అనట్టు.
చిన్నమ్మాయి కన్నారావు చెప్తుంది శ్రద్దగా వినసాగింది.
కన్నారావు తనూ కాంతామణి చిన్నమ్మాయికి ఫోన్ చేసిన తరువాత శివరావుని ఫాలో అవడం, శివరావు ఇంటిదాకా వెళ్ళడం, ఆక్కడ శివరావు పనివాడు వెంకన్నద్వారా శివరావుకి తండ్రి లేకపోవడం మొదలయిన విషయాలు గుక్క తిప్పకోకుండా చెప్పాడు.
కన్నారావు చెప్పడం ఆపిన తర్వాత చిట్టబ్బాయి ఇలా అన్నాడు.
"చూశావా?" మీ నాన్నగారు శివరావు తండ్రి వీరాస్వామి కృతజ్ఞతగా ఉండడం కోసం నిన్ను వాడికిచ్చి కట్టబెడ్తున్నానని అన్నారు. కాని ఆ శివరావు తండ్రి అనేవాడు ఈ లోకంలోనే లేడు. అంతేకాక అతని తండ్రి పేరు వీరస్వామి కానేకాదు. దీన్నిబట్టి క్లియర్ గా అర్ధం కావడం లేదూ, మీ నాన్నగారు అబద్దం చెప్తున్నారని? ఆ విషయం చెప్పడానికే నిన్ను ఇక్కడికి రమ్మని పిలిచాను"
చిన్నమ్మాయి విరక్తిగా నవ్వింది.
"మా నాన్న అబద్దం చెప్తున్నారనే విషయం నాకు తెల్సు"
"తెలుసా?...ఎప్పుడు??" ఆశ్చర్యంగా అడిగాడు చిట్టబ్బాయి.
"నిన్న రాత్రే తెలిసింది"
"మరి మీ నాన్నగారిని అడిగావా?"
"ఏమని అడగను?"
చేతుల్లో మొహం కప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.
"ఏం జరిగింది రజని?" ఆమె వంక జాలిగా చూస్తూ మెల్లగా అడిగాడు చిట్టబ్బాయి.
చిన్నమ్మాయి రెండు నిముషాలపాటు చేతుల చాటున మొహం దాచుకుని ఏడ్చింది.
తరువాత మొహం మిడి నుండి చేతులు తిసేసింది. ఆమె కళ్ళు ఎర్రగా మందారాల్లా ఉన్నాయి.
చిర కొంగుతో మొహం తుడుచుకుని హాండ్ బ్యాగ్ లోంచి ఓ కవరు తిసి చిట్టబ్బాయి వ్తేపుకు చూపింది.
చిట్టబ్బాయి ఆ కవరు అందుకుంటూ అడిగాడు "ఏముంది ఇందులో?"
"చూడు"అంది చిన్నమ్మాయి.
చిట్టబ్బాయి కవరు తెరిచి చూశాడు.
ఫోటోలు!!
ఎవరివి!!
ఆత్రంగా బయటికి తిసి చూశాడు.
"ఓ మ్తేగాడ్ .." ఆప్రయత్నంగా అతని పెదాల వేమబడి వచ్చాయి ఆ మాటలు.
"మానాన్న ఆ అమ్మాయిని అనుభవించి చంపెశారట!... నిన్న శివారావూ, మా నాన్నగారూ ఫోన్లో మాట్లాడుకుంటుంటే నాక విషయం తెలిసింది. శివరావు మా నాన్నని ఆ అమ్మాయితో ఫోటోలు తిసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నన్ను వాడికిచ్చి పెళ్ళి చేయకపోతే శివరావు ఈ పోటోల కాపీలు పోలీసులకి అందజేస్తాడు. అయినా మా నాన్నగారు ఇలాంటి పని ఎలా చేశారో నాకు అర్ధం కావడం లేదు. ఆయన చేసిన పాపానికి శిక్షని నేను అనుభవిస్తున్నాను" కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ అంది చిన్నమ్మాయి.
"ఏవి... అ ఫోటోలు ఇలాతే...." చిట్టబ్బాయి వంక చేయిచాపాడు కన్నారావు.
చిట్టబ్బాయ్ అతనికి ఫోటోలు అందించాడు.
కన్నారావు ఆ ఫోటోలు ఒక్కొక్కటి చూశాడు. అందులో రంగానాయక్య్లీ అర్ధనగ్నంగా ఉన్న ఒక అమ్మయితో పడుకుని వున్నట్టు ఫోటోలు ఉన్నాయి. ఆఖరి ఫోటోలు ఆ ఆమ్మాయి రక్తం మడుగులో పది వుంది, పక్కనే రక్తంతో తడిచిన కత్తి కూడా ఉంది.
వెత్తూరు మడుగులో మొహం క్లియర్ గా కనిపిస్తుంది.
కన్నారావు మరోసారి గబగబా అన్ని ఫోటోలు చూసి 'కెవ్వు' మని అరిచాడు.
"ఫోటోలు చూసి ఎదురుగా హత్య జరిగినంత యాదిగా భయపడ్తావేంట్రా సన్నాసి" ఆన్నాడు చిట్టబ్బాయి కాన్నరావుతో విసుగ్గా.
"నేనేం భయంతో అరవలేదు... సంతోషంతో అరిచాను" చెప్పాడు కన్నారావు ఆనందంగా.
"ఏం?... మా నాన్న హంతకుడ్తేనందుకు మీకంత సంతోషంగా ఉందా?" మొహం చిట్లించి ఆదోమదిరిగా చూస్తూ అడిగింది చిన్నమ్మాయి.
"నా సంతోషం అది కాదండి, మీరు అనుకుంటున్నట్టు ఈ అమ్మాయి చనిపోలేదు...బ్రతికే ఉంది!"
"మికెలా తెల్సు?" ఆతృతగా అడిగింది చిన్నమాయి.
"మొన్ననే ఈ అమ్మాయిని నేను చూసాను"
"ఎక్కాడా?... ఎక్కాడా? ఎక్కాడా?"
చిట్టబ్బాయి కన్నారావు పికపట్టుకుని ఊపేస్తూ ఆత్రంగా అడిగాడు.
22
గుమ్మంలో అలికిడి అయితే తలెత్తి చూసిన రంగనాయకులు గుండె జారిపోయింది.
పరమేశ్వరరావు,పార్వాతామ్మలు!
"రండి... రండి... కం... కం" అన్నాడు భీమయ్య వాళ్ళకి ఎదురేళ్తూ. వెంటనే రంగనాయకులు కూడా తేరుకుని సోఫాలోంచి లెచి నిలబడి వాళ్ళని ఆహ్వానించడు.
"రండిబావగారూ..రండిచెల్లెమ్మా.. బాగున్నారా?"
"ఆ..మీ దయవల్ల ఇప్పటిదాక బాగానే వున్నాం" గొంతులో వ్యంగ్యంపలికిస్తూ అన్నాడు పర్తమేశ్వర్రావు.
"అసలు మాకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుంది తెల్సా అన్నయ్యగారు!" పార్వతమ్మ కూడా పుల్ల విరుపుగా అంది.
రంగనాయకులు గతుక్కుమన్నాడు. వెంటనే సర్దుకుని "అలా నిలబడి పోఎరేం?....కూర్చోండి బావగారు..." అన్నాడు.
"సిట్టండి అయ్యగారూ... సిట్టండి అమ్మగారూ..." అన్నాడు భీమయ్య వినయంగా.
వాళ్ళిద్దరూ ఒక సోపాలో కూర్చున్నారు.
"చామూ...మీ అన్నయ్యగారు వచ్చారు.... ఇలారా...' కోపలికి చూస్తూ అరిచాడు రంగనాయకులు.
లోపలి నుండి చాముండేశ్వరి గబగబా వచ్చింది. ఆమె వెనకాలే పండూ కూడా పరిగెత్తుకు వచ్చాడు వాడి చేతిలో లడ్డూ ఉంది.
