Previous Page Next Page 
మొగుడే కావాలా? పేజి 61


    కారు మెత్తగా పరుగుదీస్తోంది.


    మనోహర్ చెయ్యి ఆమె సన్నని నడుము మీదకి  జారుతోంది.


    భారతి వళ్ళు ఝల్లుమంది. ఓ విధమైన కంపన ఆమె శరీరంలో కలిగింది.


    అతని చెయ్యి తన ఒంటిని తాకితే ఏదో అమృతవర్షం తన పైన కురుస్తున్నట్టుగా అనిపిస్తోంది.


    ఈ ప్రపంచం స్థంభించి ఆ క్షణంలో అక్కడే సరిగ్గా అక్కడే ఆగిపోతే బావుండుననిపిస్తోంది.


    "ఎందరినో, మరెన్నో కళ్ళని ఊరిస్తూ ఇన్నాళ్ళుగా తనలోదాచుకున్న యవ్వన సంపదని మనోహర్ కి కానుకగా ఇవ్వాలనిపిస్తోంది.


    ఆ ఆరడుగుల మనిషి మత్తైయిన కౌగిలిలో ఇమిడిపోయి జీవితమంతా ఆ కౌగిలిలోనే వుండిపోవాలనిపిస్తోంది.


    మనోహర్ చెయ్యి కొంచెం ముందుకిపోయి ఆమె పొట్టపైకి వచ్చింది. చేత్తో మృదువుగా ఆమె పొట్టపైన రాస్తూ క్రీగంట భారతిని చూసి అడిగాడు మనోహర్.


    "ఏమిటి నీ ఫ్రెండ్స్ హడావుడి చేస్తున్నట్టున్నారు" అన్నాడు.


    భారతి మధురంగా నవ్వింది.


    "వాళ్ళకి అడ్వాన్స్ గా పార్టీ కావాలట" అంది.


    "దేనికి?" అన్నాడు.


    భారతి అతనికేసి ఓసారి చూసి సిగ్గుతో తలొంచుకుంది.


    "నాక్కూడా చెప్పకూడదా?" పిడికిలిలో ఆమె నడుముని బిగించి అడిగాడు.


    "ఉహు, అదేం కాదు"


    "మరి!" అతని చెయ్యి ఆమె చేతులకింద నించి మరి కొంచెం పైకి పోయింది.


    భారతి కొంచెం సర్దుకొని కూర్చుంది కానీ అతని చెయ్యి ఆమె పొట్టకి కొంచెంపైగా ఉంది. అతని చేతి వేళ్ళకి ఆమె గుండెల అంచులు రబ్బర్ లా తగులుతున్నాయి.


    "చెప్పవా!" అడిగాడు.


    కారు వెళుతూనే వుంది.


    ఆమె ఇంచుమించుగా అతని మీదికి వాలిపోయింది. ఆమెనలాగే పొదివి పట్టుకొన్నాడు మనోహర్. అతని చూపులు వేలు ఆమె కుడిపక్క గుండె అంచుని మృదువుగా నొక్కుతోంది.


    భారతి మునిపళ్ళతో కింది పెదవిని నొక్కి పట్టింది. ఆమె మనసు శరీరము కూడా స్వాధీనం తప్పుతున్నాయి. చచ్చేంత సిగ్గుగా ఉంది. కానీ కానీ అలాని అతనికి దూరంగా జరిగి కూర్చోవాలని అనిపించడం లేదు. ఇంకా దగ్గరగా జరగాలనిపిస్తోంది. అతని నీడని సైతం భరించలేని తను ఇప్పుడు అతని సమక్షంనించి క్షణంకూడా దూరం కాకూడదనుకుంటోంది.


    ఎంత చిత్రం?


    భారతికి నమ్మశక్యం కావడంలేదు.


    ఇది కలకాదు కదా? అనిపిస్తోంది.


    "అడిగిందానికి సమాధానం రాలేదు" అన్నాడు.


    "ఎలా చెప్పను?" అన్నది ఆమె కంఠంలో సన్నని వణుకు.


    "వాళ్లేమంటారో అదిచెప్పు."


    భారతి ఫ్రెండ్స్ తో జరిగిన సంభాషణ గుర్తుకొచ్చి -


    "ఛీ పాడు" అంది చేతులతో మొహాన్ని కప్పేసుకొంటూ.


    "అంత సెన్సార్ లేకుండా ఎలా మాట్లాడుకున్నారు మరి?" నవ్వుతూ అడిగాడు మనోహర్.


    "వాళ్ళకసలు సిగ్గులేదు."


    "సరే ఆ సిగ్గులేనివాళ్ళేమన్నారట?"


    మనోహర్ ఆమె చెంపకి తన చెంపని ఆనించాడు.


    "ఏమిటిది! కారు దారి తప్పితే" అంది భారతి చిరుకోపంతో.


    "మనోహర్ చేతిలో ఏదీ దారి తప్పదు" అన్నాడు. అతనిచెయ్యి మెల్లగా ఆమె తొడపైకి పాకింది. ఆమె కట్టుకున్న కాష్మీర్ సిల్క్ చీర కిందినించి ఆమె తొడమెత్తగా తగులుతోంది అతని చేతికి. అతనక్కడ అరచేత్తో గట్టిగా నొక్కుతూ అన్నాడు.


    "పోనీ చెప్పడానికి నీకు సిగ్గయితే వాళ్లేమన్నది నేనే చెపుతాను. మనం సరదాగా తిరుగుతున్నాం. పెళ్ళికాకుండానే అడ్వాన్స్ గా మనం ఇలా జాలీగా తిరుగుతున్నాం కనక అడ్వాన్స్ పార్టీ ఇమ్మన్నారు అవునా!"


    భారతి మనోహర్ కేసి ఆశ్చర్యంగా చూసింది.


    "మీకెలా తెలుసు?"


    "ఇలాంటివి తెలుసుకోవడం వెరీ సింపుల్" అన్నాడు.


    "అవును మరి బోలెడంత ఎక్స్ పీరియన్స్ వుందిగా మీకు అందుకే తెలుసుకోగలిగారు" అంది రోషంగా.


    మనోహర్ ఆమె తొడపైన చేత్తో గిల్లాడు. "అబ్బా ఏమిటిది?"

 
    "ఏం లేదు పార్టీ ఇస్తామని చెప్పు"


    "నయం. పార్టీ ఇస్తే వాళ్ళనుకొనేదంతా నిజమనుకోరా!"


    "నష్టం ఏమి లేదుగా!"


    "ఇప్పటిదాకా వాళ్ళు చంపాడు. ఇప్పుడు మీరు మొదలుపెట్టారు" అంది సిగ్గుతో.


    మనోహర్ ఆమె మెడచుట్టు చేతిని వేసి దగ్గరగా లాక్కున్నాడు.


    "నా దగ్గరకూడా సిగ్గుదేనికి?"


    "లేకపోతే ఏమిటి? మనం పెళ్ళికాకుండానే ముద్దూ ముచ్చటా తీర్చుకొంటున్నామట. ఇప్పుడు పార్టీఇస్తే నిజంగానే....."


    "అనుకోనీ?"


    "ఇంకానయం."


    "పోనీ నేనడిగితే కాదంటావా?"


    "ఏమిటి?"


    "ఓ ముద్దు. మరో ముచ్చట? నవ్వుతూ అన్నాడు.


    "ఆ ఆటలేం సాగవు"


    "పోనీ ఏ ఆటని సాగనిస్తావో చెప్పు"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS