Previous Page Next Page 
మొగుడే కావాలా? పేజి 62


    "ప్రస్తుతానికి ఏ ఆటా వద్దు. పెద్దవాళ్ళ అనుమతి దొరికేవరకూ ఇలా ఫ్రెండ్స్ లాగే వుందాం."


    "అంటే ఫ్రెండ్స్ ఆడుకోకూడదా?"


    "కూడదు"


    "కూడదనే రూలుందా?"


    "వుంది."


    "ఎక్కడ"


    "నా దగ్గర"


    "చాలా గడుసుదానివి" అన్నాడు మనోహర్ భారతి ముక్కుని పట్టుకొని ఆడిస్తూ.


    భారతి అతని చేతిని తోసేస్తూ -


    "చాలా పెంకిదాన్ని కూడా" అంది.


    "అవున్నిజమే. లేకపోతే నన్నిన్ని ఆటలాడించగలిగేదానివా?"


    "నేనేమీ ఆడించలేదు. మీరే నావెంటపడ్డారు. పోనీకదాని జాలిపడి స్నేహం చేస్తున్నాను."


    "అలాగా, అయితే నేను చొరవచేస్తే ఏం చేస్తావు!"


    భారతి నవ్వింది.


    "ముక్కు కోసేస్తాను. నా బ్యాగ్ లో బ్లేడుకూడా వుంది."


    "ఆ తర్వాత నువ్వే బాధపడాలి ముక్కులేని అబ్బాయితో."


    "నేనేం బాధపడను" అంది భారతి.


    "ఇప్పుడెక్కడి కెళదాం" అడిగాడు మనోహర్.


    "ఎక్కడికెళ్ళాలని వచ్చారు?"


    "నువ్వు చెబుతావనుకొన్నాను"


    "నాకు అలవాటు లేదు. మీరే చెప్పండి"


    "యాదగిరిగుట్ట కెళదామా?"


    "అంత దూరమా?"


    "ఎంతదూరం! ఏక్సిలేటర్ని బలంగా తొక్కితే అరగంటలో అక్కడుంటాము."


    "అయితే బలం చూపించండి" అంది భారతి.


    కారు వెనక్కి తిరిగింది.


    యాదగిరి గుట్ట చేరాక అక్కడ యాదగిరి నరసింహస్వామి దర్శనం చేసుకున్నారు.


    భారతి భక్తితో ఆ దేవుడ్ని వేడుకొంది. సాధ్యమైనంత త్వరలో వాళ్ళిద్దర్నీ ఒక్కటి చేయమని.


    గుడిలోంచి బయటకొచ్చాక మనోహర్ అడిగాడు.


    "నమ్ముతాను. అలాని చెప్పి ఆయన్ని నాకోరికలు తీర్చమని ముడుపులు చెల్లిస్తానని వేడుకోను. ఆఖరికి గుడికి కూడా వెళ్ళను. నా దారిలో ఏ గుడి కనబడినా చేతులు జోడిస్తాను. ఇంట్లోంచి బయటికొచ్చేప్పుడు కూడా ఎదురుగా కనబడే దేవుడి పటానికి నమస్కారం చేస్తాను. ఆయనంటే భక్తీ, భయం రెండూ వున్నాయి. అలాని చెప్పి ఆ దేవుడిపైన నా భారాన్ని వేయను. నా శక్తిని నేను నమ్ముతాను"


    భారతి అతని మాటల్ని శ్రద్ధగా విన్నది.


    అతను తనపట్ల తనకిగల నమ్మకాన్ని గురించి వివరించి చెప్పినట్లుగా అనిపించింది.


    ఆమె కొంచెం పక్కకి తిరిగి రెండు చేతులని భుజాలపైన వేసింది.


    అరచేతులతో ఆమె నున్నని ఎర్రని చెంపలని, సవరదీస్తూ ఆమె మొహాన్ని దగ్గరగా తీసుకొన్నాడు.


    మెల్లగా, అతిమెల్లగా ఆమె పెదవుల్ని అందుకొన్నాడు మనోహర్.


    భారతి అతని మెడచుట్టూ చేతుల్ని బిగించింది.


    తన రెండు చేతుల్ని ఆమె చేతులకిందగా పోనిచ్చి ఆమెని బలంగా చుట్టేసి గట్టిగా కౌగలించుకొన్నాడు మనోహర్.


    భారతి అభ్యంతరం చెప్పలేదు. ఆమె బిగువైన గుండెలు అతని ఛాతీపైన నలిగిపోతున్నాయి.


    అదే తొలి అనుభవం. కొత్తగా వింతగా వుంది భారతికి, పిచ్చిగా, వెర్రిగా వుంది భారతికి.


    అతన్ని చుట్టుకుపోవాలని వుంది. అతని బాహువుల్లో కరిగిపోవాలనివుంది. ఊపిరి సలపకుండా అతని చేతుల్లో నలిగిపోవాలని వుంది. కాలం అక్కడే ఆగిపోతే బాగుండుననిపిస్తోంది. ఆమె ఊపిరి వెచ్చగా అతని మెడపైన తగులుతోంది.


    "ఇది నీకు నా మొదటి ముద్దు" అన్నాడు మనోహర్.


    భారతి చురుగ్గా చూసింది.


    "నా జీవితమంతా గుర్తుంచుకుంటాను. మనోహర్" అంది భారతి మత్తుగా.


    "థాంక్యూ"


    భారతి అతని మెడపైన ముద్దుపెట్టుకొంది మనోహర్ చేతివేళ్ళు చురుగ్గా పనిచేస్తున్నాయి. ఆమెలో నెక్ బ్లౌజ్ హుక్స్ ఒక్కొక్కటి తీసేశాడు.

 
    "ఏయ్ ఏమిటిది?"


    "నువ్వే చూస్తున్నావుగా?"


    బ్రాసీయర్ హుక్ క్లిక్ మని తొలగిపోయింది.


    తొలిసారిగా ప్రేమించిన ప్రియుడికి కానుకగా ఆమె అందిస్తోన్న ఆ బంగారు బంతుల వంపు సొంపులు అతనిలోని మగసిరిని రెచ్చగొట్టాయి. ఆమె భుజాలని పట్టుకొన్నాడతను.


    అతను మత్తుగా ఆమెమీదికి వంగి ఆ సన్నని గుండ్రని వక్షోజాల పైన ముద్దుపెట్టుకున్నాడు - ఆమెకి ఒళ్ళు పులకరించినట్టయింది.


    ఆమెకి మైకం కమ్మినట్టయింది. మత్తుగా సగంమూసిన కళ్ళతో అతని కేసి చూసింది భారతి.


    "నన్ను చంపేస్తున్నావు మనోహర్" అంది భారతి అతన్ని తనమీదికి తీసుకుంటూ.....
    మనోహర్ చేతుల్లో ఆమె పూర్తిగా ఒదిగిపోయింది. మనోహర్ ఆమెని ఆక్రమిస్తున్నాడు..... ఆమె కాలం ఆగిపోవాలనుకొంది.


    ఊపిరి ఆడకుండా, మరో ఆలోచనకి తావివ్వకుండా అతనితో, ఆ అనుభవాన్ని పొందుతూ ఇక అక్కడే..... అక్కడే...... ఎప్పుడూ అలాగే ఇంకెప్పుడూ అలాగే....... ఈ జన్మేకాదు, జన్మ జన్మలకీ అతనితో అలాగే, ఇలాంటి అనుభవాన్ని పొందుతూ జీవితమంతా గడపాలనుంది ఆమెకి. ఆమెకు తెలీని వింతయినా ఓ లోకంలో ఎక్కడో విహరిస్తోంది ఆమె లేత మనసు...... కానీ కాలం ఆగిపోలేదు.


    మనోహర్ లేచి సిగరెట్ వెలిగించాడు.


    భారతి నీరసంగా అలాగే పడుకొని అతనికేసి చూసింది.


    "ఏమిటి జరిగింది?" ఆమె శరీరం జలదరించింది. చిరుగాలికి మాత్రమే వణికిపోయే లేత ఆకులా వణికిపోయింది భారతి.


    అతని వీపుపైన చూపుడు వేలితో రాస్తూ......


    "మనోహర్" అని పిలిచింది భారతి.


    "ఊ"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS