Previous Page Next Page 
ఆగ్నిశ్వాస పేజి 60


    ఏ బంధంతో నిన్ను రంజింపచేస్తే శాశ్వతంగా నాకు బంధీవవుతావో తెలుసుకోడానికి." ఫోన్ పెట్టేసింది.


    అప్పుడు టైం రాత్రి ఎనిమిది కావస్తూంది.


                               *    *    *    *


    అర్థరాత్రికి సరిగ్గా పది నిముషాలుందనగా సోఫియా బెడ్ రూంలో అడుగుపెట్టిన శశాంక ఆశ్చర్యంగా చూశాడు చుట్టూ.


    శోభనం గదిలా అలంకరించబడి వుంది.


    కళ్ళు మిరమిట్లు గొలిపేట్టు ఒంటికి హత్తుకు పోయిన గోల్డ్ కలర్ ట్రేస్ సూట్ లాంటిది వేసుకున్న సోఫియా ప్రియుడి సమాగమం కోసం ఒక యుగం నుంచి వేచి చూస్తున్నట్టు అతడి ముందు నిలబడింది.


    అదీ అరక్షణమె...


    గుండెలపై జిప్ లాగింది తొలి ఆహ్వానంలా...


    ఓ క్షణంపాటు ఉద్విగ్నుడై తల వంచుకున్నాడు.


    "నేలమీద ఇదేంటి" అన్నాడు తివాసిపై వున్న పరుపును చూస్తూ. "అక్కడ ఫోంబెడి వుందిగా!"


    "అలసట తీర్చుకోడానికి ఆనక దాన్ని ఉపయోగిద్దాం... అప్పటికే ఆమె సూట్ ని తొలగించింది.


    వేడి సెగలు చుట్టుముడుతుంటే కొద్దిగా ముందుకు జరిగాడు.


    మరుక్షణం అతణ్ణి బలవంతంగా పరుపుపైకి తోసింది.


    అవధులులేని ఉన్మాదంతో శశాంకపైన బడిన సోఫియా "వాత్స్యాయనుడికి నీలాంటి మగాడు తారసపడి వుండడు" అంది గొణుగుతున్నట్టుగా. "ఏం" సోఫియాకి సహకరిస్తున్నట్టు అభినయిస్తూనే అడిగాడు.


    "తారసపడి వుంటే తన శాస్త్రాన్ని తిరగరాసేవాడు. అవును శశీ ఆమె చేతులు అలజడిగా అతడి ఒంటిపై కదులుతున్నాయి. "నిన్ను సంతృప్తి పరచాలీ అంటే ప్రత్యేక సూత్రాలు కావాలి."


    మరో రెండు నిమిషాలు గడిచాయి.


    రతికూజితాల్లా ఆమె గొంతు నుంచి మూలుగులు ఉధృతమౌతున్నాయి.


    సరిగ్గా అప్పుడు పోయింది కరెంట్...


    చుట్టూ చీకటి...


    పరిసరాల్ని ఎప్పుడో మరిచిపోయిన సోఫియా అదేం పట్టించుకోలేదు.


    "ఉక్కగా వుంది" పక్కకు జరిగి కిటికీని చేరిన శశాంక "ఈ ఏరియాలో ఎక్కడా వున్నట్టు లేదు" అన్నాడు పరిశీలనగా చూస్తూ.


    "ప్లీజ్" చాలా చేరువగా వినిపించింది సోఫియా గొంతు. "అదే వస్తుంది నువ్వు రా..."


    గోడపై ల్యూమినసీ డిజిటల్ క్లాక్ సరిగ్గా పన్నెండు గంటలు సూచిస్తూంది.


    ఆమెను అమాంతం పైకెత్తి బెడ్ పైకి విసిరాడు.


    సన్నని నిట్టూర్పు నేలపైనుంచి.


    "రమ్మంటుంటే" చీకటిలోనే చేతులు సాచింది. కొన్ని క్షణాల ఆలస్యంగా ఆమెపైకి చేరుకున్న ఆకారాన్ని బలంగా చుట్టేసింది.


    మరో మూడు నిమిషాలు గడిచాయి.


    హఠాత్తుగా ఏదో చప్పుడు.

    
    'దబ్'మని నేలపైకి దొర్లిందో ఆకారం...


    గదిలో లైటు వెలిగింది మరుక్షణం.


    తనను ఆక్రమించుకోబోతున్న వ్యక్తి శశాంక కాదని తెలుసుకోవడానికి పట్టింది అరక్షణమే.


    "యూ రెచ్చెడ్..." వెనువెంటనే ఆమె చేతిలోని రివాల్వర్ గర్జించి దామోదర్ కంఠంలోని ఫేరింక్స్ ని చీల్చేసింది.


    మరో తూటా...


    ఈసారి అది దామోదర్ నుదురులోంచి దూసుకుపోయింది.


    పది సెకండ్లపాటు నేలపై గిలగిలా కొట్టుకున్న దామోదర్ శవం రక్తపు మడుగులో అచేతనంగా వుండిపోయింది.


    ఒంటికి బట్టలు చుట్టుకున్న సోఫియా ఉద్రేకంగా ఓ గదిలోకి నడిచి చూసింది కాని అప్పటికే వినీల వెళ్ళిపోయింది.


    'మిస్టర్ శశాంకా' ఆ భవంతిలో ఎక్కడా కనిపించని శశాంకని గుర్తు చేసుకుంటూ కసిగా తలపంకించింది.


    శవాన్ని తరలించమని అనుచరులని ఆజ్ఞాపించిన సోఫియా తేరుకోలేని ఉన్మాదంతో ఈజీ చైర్ లో కూర్చుని ఆలోచిస్తూంది.


    దామోదర్ చావు ఆమెను కలత పెట్టలేదు.


    అతడ్నే అసలు 'ఇన్ ఫార్మర్'గా గుర్తించి ఎప్పుడు కడతేర్చాలా అనుకుంటుండగా ఇలాంటి అవకాశ మొచ్చింది.


    ఇంత జరిగినా ఆమె నమ్మలేకపోతూంది దామోదర్ తన చేతిక్రింద బానిసలా పడున్న ఓ అనుచరుడు అతి ముఖ్యుడైతేనేం ఇలా తనపై చొరవ తీసుకోగలగడాన్ని హర్షించలేకపోతూంది.


    జీవితంలో తొలిసారి ఇలాంటి సంఘటనలో ఓటమి పొందిన ఆమె 'మార్టినీ' అందుకుని తాగబోతుండగా ఫోన్ రింగైంది.


    "హల్లో"


    "సారీ" శశాంక కంఠం వినిపించింది ఆవలి వేపు నుంచి.


    "యూ ఆర్ నాటోన్లీ ఇంపొటెంట్ బాస్టర్డ్..."


    "నీ ఆవేశం చల్లారేదాకా తిట్టు అభ్యంతరం లేదు."


    "ఏమనుకున్నావు నా గురించి... యూ ఫిల్తీ రాస్కెల్. నేను ఎవరిననుకున్నావు..." రొప్పుతూంది సోఫియా.


    కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత శశాంక అన్నాడు "నిన్ను నేను తక్కువగా అంచనా వేయలేదు సోఫియా... నేను చెప్పేది నన్నూ తక్కువగా అంచనా వేయొద్దని"


    "ఇది గెలుపనుకుంటున్నావా"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS