Previous Page Next Page 
ఆగ్నిశ్వాస పేజి 59


    ఒక చిన్న సంకల్పం సృష్టికి కారణమైనట్టే అతి స్వల్పకారణాలు ఈ విశ్వాన్ని ఆటవిక వ్యవస్థగా మార్చాయని తెలియని శశాంక.


    ఈ క్షణంలో ఆలోచిస్తున్నది జయచంద్ర 'సూపర్ ఇగో' గురించి.


                              *    *    *    *


    తాగుతున్నాడు శశాంక.


    ఇంకా తనలో మానవత ఏమన్నా వుంటే దాన్ని శాశ్వతంగా మత్తుతో హత్యచేసే ప్రయత్నంగా నిర్విరామంగా తాగుతున్నాడు.


    మనసు రగిలిపోతున్నది.


    మెదడు పగిలేట్టుంది.


    వినీల గుర్తుకొచ్చి అవినాశ్ నుంచి సరాసరి ఆమె కోసం వెళ్ళాడు. వినీల జాడలేదు.


    ఏమై వుంటుంది.


    గుండె కవాటాలు వూడిపడేట్టు చప్పుడు చేస్తుంటే ఏ తలపుల తలుపుల్నో బంధించి ఆశా వాదిలా కబుర్లు చెప్పే వినీలని కలుసుకుని కసిగా తన విషయం చర్చించాలనుకున్నాడు.


    ఏదీ కనిపించదే.


    క్షణక్షణం తనను వెంటాడి కళ్ళెం వేయాలనుకునే వినీలకేమైంది.


    చుట్టూ చీకటి అలుముకుంటూంది.


    లైటు వేయాలనిపించలేదు.


    అప్పుడు ఫోన్ రింగయింది.


    తడుముకుంటూనే వెళ్ళాడు "హల్లో"


    "నేనే"


    "ఎక్కడున్నావు వినీలా... ఇంతసేపూ..." నాలిక మెలిక పడుతుంటే ఫకాలున నవ్వు వినిపించింది. "ఎగతాళిగా వుందా"


    "కాక మరేంటి" ఓ క్షణం నిశ్శబ్దం. "నేను శశీ సోఫియాని..."


    "నువ్వు లైన్లోకి ఎలా వచ్చేవు"


    "నిన్ను లైన్లోకి రప్పించాలని... అవునూ వినీలని అంతగా ఇష్టపడుతున్నావా?"


    నిశ్శబ్దంగా వుండిపోయాడు.


    "నిజమే శశీ... నాకు నువ్వన్నట్టు ప్రేమంటే తెలీదు. కాబట్టి నీ మనసు పొరల్ని స్పృశించడమూ చేతకాదు. అసలు నాకు సెంటిమెంట్స్ లేవు... ఎస్... నువ్వు నువ్వుగా కావాలి. అందుకే నిన్ను ఊ అనిపించాలని అనుక్షణం పరిపరి విధాలా ప్రయత్నిస్తున్నది"


    "నాకు అర్థంకాలేదు"


    "సింపుల్... ఏదన్నా కావాలన్నప్పుడు కొందరు కొంటారు. మరికొందరు దొంగతనం చేస్తారు... ఇంకొందరు బలంతో సాధిస్తారు... ఇంకా"


    "నువ్వే పద్ధతిలో సాధించాలను కుంటున్నావు"


    "లౌక్యంతో"


    "అంటే"


    "నువ్వే అన్నావు గుర్తుందా... ప్రేమంటే కోరినవారికోసం తననుతాను పోగొట్టుకోవడమే అని..."


    ఓ క్షణం మత్తుగా నవ్వినట్టు నిట్టూర్పు. "అందుకే నువ్వు కోరిన మనిషి కోసం నిన్ను నువ్వు పోగొట్టుకుంటావో లేదో అని చిన్న ప్రయత్నం చేశాను."


    "అంటే"


    "వినీలని బంధించి వుంచాను."


    వినీల ఎక్కడున్నదీ అప్పటికి బోధపడిన శశాంక పిడికిళ్ళు రిసీవర్ చుట్టూ బిగుసుకున్నాయి. "అసలు వినీలని మధ్యలోకెందుకులాగేవు"


    "చెప్పానుగా అలా అయితే తప్ప నువ్వు దారిలోకి రావని. అయినా నన్ను మించి వినీలలో నీకేం కనిపించింది."


    "చెక్ చేయాల్సింది"


    "కొద్దిగా 'బ్రా' సైజులో తేడా వుంది. అంతే అదొక్కటే నన్ను మించిన క్వాలిఫికేషను"


    శశాంక గొంతు క్రౌర్యాన్ని నింపుకుంది "మర్యాదగా విడిచిపెట్టు. నన్ను రెచ్చగొట్టకు"


    "రెచ్చిపో శశీ... ఆ తర్వాతే కక్షగా నాపైకి రా... అదిగో అక్కడ సూయజ్ నిడివి కనిపిస్తుంది. పసిఫిక్ లోతూ వుంటుంది. నన్ను నమ్ము శశీ... నువ్వు సహకరించాలేగాని కన్యా కాశ్మీరాన్నై నిన్ను హిమశిఖరాలపై కూర్చోపెట్టి థార్ ఎడారి సైకతాలతో నీకు చేయూతనిస్తూ... ఓహ్... కన్ను మూసి తెరిచేలోగా 'తలం' రసాతలం తేడా చూపిస్తాను" నేనొక కన్యాకుమారినై అప్సర సంధ్యా అందాలను నీ సొంతం చేస్తాను. అవును."


    శశాంక ఆలోచిస్తున్నాడు "వినీలని విడిచిపెట్టాలీ అంటే"


    "నాతో గడపక తప్పదు"


    రెండు క్షణాల నిశ్శబ్దం.


    "సరే... ఈ రాత్రి పదకొండు గంటల ఏభై నిముషాలకి నీ పడక గదిలో వుంటాను."


    "అదేంటి... కాస్త ఎర్లీగా రావచ్చుగా."


    "లేదు సోఫియా... మరో కొత్తరోజు పుట్టే సమయాన నీతో వ్యవహారంలోకి దిగుతాను... అంతే!"


    "గుడ్... దారిలోకొచ్చావు... ఈలోగా వాత్సాయనుడ్ని మరోసారి చదువుతా."

    
    "ఎందుకు"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS