స్పూర్తి విసుగ్గా చూసి "ఇఇలేక్కన నువ్వు పీనల్ కోడ్ కాదు కదా_ పిన్ కోడ్ కూడా మార్చలేవ్" అన్నాడు.
"కోప్పడకు _వెళ్తాన్లే " అన్నాడు చిరంజీవి బిక్కమోహం పేట్టి.
* * * *
"సూటయితే పన్నెండు రూపాయలు. లోపల చొక్కాకూడా తీసుకుంటే యింకో రెండ్రూరూపాయ లేక్కువ.... రేప్పొద్దునకల్లా తెచ్చి యిచ్చేయ్యాలి" అన్నాడు లాండ్రీవాడు.
"టై ఎంత?"
"ఎర్ర టై అర్ధరూపాయి, నల్లటై అయితే రూపాయి."
"ఉట్టి పాటెంత?"
"నాలుగు రూపాయలు."
"ఉట్టి కోటు?"
"ఎనిమిది రూపాయలు."
"అయితే ఉట్టికోటూ, ఎర్ర టై ఇవ్వు _ చాలు" ఎనిమిదిన్నర తీసియిస్తూ అన్నాడు.
"మరి షర్టూ ,పాంటు గురో " అని మధ్యలో కల్పించుకున్నాడు చిరంజీవి.
"నీ దగ్గర నల్లపంతు లేదా?"
"ఉంది కనీ అక్కడక్కడా చిరిగిపోయింది."
"షర్టు కోటులోపలి వుంటుంది కాబట్టి చిరిగినా ఫర్లేదు. నల్లపాంటు ఎకోటు మీదకైనా సూటవుతుంది. కాబట్టి మరీ ఫరవాలేదు. అదీ గాక మనదగ్గర ఈడ్చితంతే పడిరూపాయలకన్నా ఎక్కువలేవు. అసలు విషయం అదీ....
ఇది జరిగినయిరవై ఆరు గంటలకి అంటే ఆమరుసటిరోజు ఆరుగంటలకి _నల్ల పాంటుమీద బ్రౌను కోటు వేసుకుని దానిమీద ఎర్ర టై కట్టుకొని "మేరానాం జోకర్" లో రాజ కపూర్ లాతాడు సర్వోత్తమరావు యింటికి బయలుదేరాడు.
3
విశాలమైనా కాంపౌండ్. ప్రహరి గోడనానుకొనే అశోకవృక్షాలూ లోపలకి ఎర్రమట్టి రోడ్డు.... రోడ్డు కిరువైపులా తెల్లసున్నం వేసిన ఇటు రాళ్ళూ...చిన్న పోర్తుకో... అందమైన బంగాళా.
మెయిన్ రోడ్డుమీదవిజల్ వేసుకుంటూ అతూయితూరేమ్దిసర్లునదిచేడు చిరంజీవి. ఇంకో రెండుసార్లు నడిచేవాడే. కానీ, పరుగుకూడాగూర్ఖా అనుమాన పడ్తాడే మోనని అనుమనపడ్డాడు. కార్లేగానీ పరుగుకూడా లోపలకి నడిచి వెళ్లటంలేదు. పరుగు లేలాగోనడవ్వు. అది వేరే సంగతి.
ఒక్కసారి మనసారా దేవుణ్ణి స్మరించి పాంటు జేబులో వున్న ఇన్విటేషన్ కార్ధుని జేబులో చేయ్యిపెట్టుకుని గట్టిగా పట్టుకుని బికంగా లోపలికినడిచేడు. గూర్ఖాని దాటుతూంటే గుండె వేగంగా కొట్టుకోసాగింది. వాడివైపు ఓ చిరునవ్వు పారేసి, ఆ నవ్వుకివాడు రెస్పాన్స్ ఇవ్వకపోఎసరికి దాన్ని చిన్న దగ్గుగా మార్చి లోపలి హుందాగా నడిచేడు.
మెట్లకానుకుని నిలువెత్తు అద్దాల తలుపులు తోసుకుని లోపల ప్రవేశించాడు. ఒక క్షణం లోపల వావుభావాన్ని చూసి అవాక్కై నిలబడిపోయాడు. ఆసియాలో కెళ్ళా పెద్ద షాడ్లీయర్ ఆగ్రా మొగల్ షెల్టాన్ హొటల్లో వుందని ఎక్కడో చదివేడు. అంత పెద్దదీపం హాలుమధ్య వేలాడుతూంది. దాంట్లోంచి వెలువడుతున్న రకరకాల కాంతులు కింద మనుష్యుల మధ్య అందంగా ప్రతిబింబిస్తున్నాయి. గుమ్మం దగ్గర్నుంచి హాలు అటు చివర పై మెట్లవరకూ వేసిన వాల్ టు వాల్ కార్పేటుకి అయిన ఖర్చు ఒక కుటుంభాన్ని జీవితాంతం పోషిస్తుంది.
చిరంజీవి ఉక్కిరి బిక్కిరి అయ్యేడు. పొరపాటున వచ్చినట్టు, అక్కణ్ణుంచి స్టయిల్ గా వెనక్కీ వెళ్ళిపోదామనుకున్నాడుగానీ, 'హాల్లో' అన్న పలకరింపు వినిపించి, ఉలిక్కిపడి తిరిగి చూసేడు.
డాక్టర్ ప్రకాష్ _పక్కనే ట్రేతోవెయిటర్.
గొంతులో వెలక్కాయ పడటం అంటే ఏమిటో అప్పుడు అర్ధమయింది చిరంజీవికి. మొత్తం పదహారు గ్లాసులున్నాయి. ఎనిమిది నిండుగా వున్నాయి. రెండు ముప్పాతిక వంతులున్నాయి, నాలుగు సగంవున్నాయి. రెండింటిలో రెండేసి గుక్కలు చొప్పునవున్నాయి. నిండుగా వున్న గ్లాసుల్లో మూడింటిలో పచ్చటి ద్రవం వున్నది. నాలుగింటిలో తెల్లది, ఒకదాన్లో ఎర్రడి సగం గ్లాసులు నల్లవి. అందులో కొన్ని లేమనేడ్ కలసిన జిన్నులు _కొన్ని రంములు, కొన్ని సం పిష్ వారి తయారీ! కానీ ఏదీ తీసుకోవటం? ..... పెద్దగ్లాసు తీసుకుంటే కక్కుర్తి అని నవ్వుతారేమో.....
మరిక ఆలస్యంచేస్తే బావోదనిమనసు చెప్పగానే చాకులా చెయ్యి కదల్చి (ట్రేలో అన్నిటికన్నా తక్కువ ద్రవం వున్నగ్లాసు) తీసుకున్నాడు.
అది త్రిబుల్ ఎక్స్ రమ్!!!!
రేప్ తప్పనిసరి అయినప్పుడు కళ్ళు మూసుకుని హాయిగా అనుభవించమన్నాడు. కవి కాళిదాసు. ఏ గ్లాసులో ఏమున్నదో, తెలియనప్పుడు కక్కుర్తిపడ్డాడూ అనిపించుకోవటం కంటేఅదే మంచిది.
గ్లాసు నోటి దగ్గరికి తీసుకుంటూ, అకస్మాత్తుగా ప్రకాష్ కళ్ళలో ఆశ్చర్యం గమనించి ఎమిటన్నట్లు చూసేడు. "రియల్లీ వండ్రపుల్. మీరు పైకి అలా కనబడుతున్నారుగానీ ...... అమ్మో" అన్నాడు విస్మయం, సంభ్రమం నిండిన గొంతుతో.
"యస్ మిస్టర్ ప్రకాష్, మీరేమీ చెప్పాదల్చుకున్నారు?" అన్నట్టు కళ్ళేగరేసేడు చిరంజీవి. ప్రకాష్ ఏమీ చెప్పలేదు కానీ, గ్లాసు పైకెత్తి 'చీర్స్' అన్నాడు అమ్మ! ఇంతసేపటికి ఈ వాతావరణంలో తనకి తెలిసిన పదం ఒకటి వినబడింది. తనూ 'చీర్స్' అని గ్లాసులోంచి ఒక గుటక నోట్లో పోసుకున్నాడు. అయితే ఆపిల్ జ్యూస్ కి చీర్స్ చెప్పారని అతడికి తెలీదు. ఎప్పుడూ మందు కొట్టనివాడు మొదటిసారి కొడ్తే ఆ తరువాత అతడి అవస్థని అయిదు భాగాలుగా విడగొట్టవచ్చు. మొదటి క్షణం ఏమీ తెలియదు, అంటే నిరామయ లక్ష కారక అయోమాయస్థితి అన్నమాట. యోగులకూ సాదువులకూ తపస్సు చేస్తే లభ్యమయ్యే స్థితి అది. ఆ తరువాత మంట! బాగా వెలుగుతూన్న కాగాడాన్ని గొంతులో దూర్చినట్టు!!!! ఆ తరువాత పెవుల్లో చిన్న కదలిక. ఆ కదలిక ఊపిరితిత్తుల్ని కదల్చగా, అక్కడవున్న అక్కడ అంత చోటులేక నోటినుంచి వచ్చేయటానికిచేసిన ఘర్షణ మూడో స్థితి __ ఆ పోర పోవటాన్ని ఆపే ప్రయత్నంలో వచ్చిన దగ్గు....! అనిటికన్నా అయిదో స్థితిగొప్పది. స్వామీ అద్వైతానంద చెప్పింది.... మన బాధని మనలోనే దాచుకుని ఇతరులకి చిరునవ్వు పంచి యివ్వటం అనేది.
