Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 56

 

    భయంకరమైన పిడకలలా ఉంది.

    చిన్నమ్మాయి దూరం అయ్యిందనే బాధ ఒక ఎత్తేతే చిన్నమ్మాయి, ఆమె యింట్లోవాళ్ళూ వింతగా అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో తెలీని ఆ బాధ మరో ఎత్తు.

    పోనీ వాళ్ళ ప్రవర్తనకి కారణం తెలిస్తే, తన మీద కోపం ఎందుకో తెలిస్తే, ఆ కోపాన్ని పోగొట్టడానికి అవకాశమే ఇవ్వడంలేదు!...

    బాధగా జుట్టులోనికి వెళ్ళుపోనిచ్చి గట్టిగా పట్టుకున్నాడు చిట్టబ్బాయ్.

    అంత బాధలో కూడా కన్నారావు మీద చికాకు కలిగింది చిట్టబ్బాయికి.

    'నేను అసలే బాధల్లో మునిగి ఉంటే నన్ను ఒంటరిగా వదిలేసి వీడు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో!" అనుకున్నాడు. కాని ఇతను మాట్లాడకుండా ఉన్నాడని  విసుగుపుట్టి కన్నారావు బయటికి వెళ్ళడానే విషయం అతనికి తట్టలేదు.

    అయినా కన్నారావు తన చిక్కకుల్లో తాను ఉంటే చిత్తబ్బాయిని ఎక్కడ పట్టించుకుంటాడు?

    ఒంటరిగా కూర్చోడం వల్ల చటుక్కున లేచి నిలబడ్డాడు చిట్టబ్బాయ్.

    "ఈ వేళ ఆటో ఇటో తేల్చుకోవాలి! రజని అలా ప్రవర్తించడానికి కారణం కనుక్కోవాలి!!" అనుకున్నాడు.

    వెంటనే చెప్పులు వేస్కుని యింటితాళం పెట్టి సెంటర్ కి వెళ్ళాడు.

    అక్కడ ఒక షాపులోంచి చిన్నమ్మాయికి ఫోన్ చేశాడు.

    చిట్టబ్బాయ్ అదృష్టం బాగుండి ఫోన్ చిన్నమ్మయే ఎత్తింది.

    "రజ్జూ.. ప్లీజ్ ఫోన్ పెట్టేయ్యకు. నేను చెప్పేది పూర్తిగా విను!" ప్రాధేయ పూర్వకంగా అన్నాడు చిట్టబ్బాయి.

    కొన్ని క్షణాల మౌనం తర్వాత అడిగింది చిన్నమ్మాయి.

    "ఏమిటి?..."

    ఆమె గొంతులో ద్తెన్యం పలికింది.

    "అసలు నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావ్? నేనేమ్తేనా తప్పగా ప్రవర్తించానా?...ఒకవేశ నాకు తెలీకుండా నీకు నచ్చని విధంగా ప్రవర్తిస్తే నన్ను క్షమించు రజ్జూ. అంతేగాని నన్ను కలవకుండా , కనీసం ఫోన్లో కూడా మాట్లాడకుండా ఇంతటి భయంకరమైన  శిక్ష విదించకు రజ్జూ....నన్ను క్షమించవా?" అబాదాగా అన్నాడు చిట్టబ్బాయి.

    "ప్లీజ్ చిట్టి...అలా అని నన్ను మరి బాధించకు. అసలు నువ్వే నన్ను క్షమించాలి!"

    "నేనంటే నీకు ప్రేమ ఉంది కదు రజ్జూ?"

    "మనకి ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది కనుకనే కదా ఇంతగా బాధ పడడం!"

    "మరి...మరి నువ్వు ఇలా తెగతెంపులు చేస్కునేవిధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నావ్?... చెప్పవా ప్లీజ్ ..." బ్రతిమాలాడ్తూ అడిగాడు.

    చిన్నమ్మాయి సమాధానం ఏమి చెప్పలేదు. మౌనంగా ఉండిపోయింది.

    "కారణాలు చెప్పడం ని కిష్టం లేదా?..."

    "అలా అని కాదు... ఫోన్ లో  చెప్పలేను..." మెల్లగా అంది చిన్నమ్మాయి.

    "పోనీ మీ యింటికి రానా?"

    "వద్దు...మా నాన్నాగారు యింట్లోనే ఉన్నారు..."

    "మరి ఎలా?"

    "నువ్వు ఎక్కడినుండి ఫోన్ చేస్తున్నావ్?"

    "విజయనగర్ కాలని సెంటర్ నుండి"

    "నేను అక్కడికి ఒక అయిదు నిమిషాల్లో వస్తాను... ఏ రెస్టారెంట్లోనయినా కూర్చుని మాట్లాడుకుందాం..." చెప్పింది చిన్నమ్మాయి.

    "అలాగే...త్వరగా వచ్చేయ్..."

    "ఊ..."ఫోన్ డిస్కనెక్ట్ చేసింది.


                       *             *              *      

 
    న్యూస్ పేపర్ని లాగేసిన బంగార్రాజు కన్నరావుని చూసి ఆశ్చర్యపోయాడు. కన్నారావు బంగార్రాజుని చూసి బిక్క మొహం వేశాడు.

    "హొరి నువ్వటోయ్ కన్నరావ్? దూరం నుండి చూసి నిన్ను గుర్తు పట్టా లేదు.. అయినా నువ్వు మమ్మల్ని సరిగా చూడనిస్తేగా? ఒకటే పరుగు తిశావ్.." అన్నాడు బంగార్రాజు నవ్వుతూ.

    ఇన్  స్పెక్టర్ని  నావ్వుతూ చూసేసరికి కన్నరావుకి కాస్త ద్తేర్యం వచ్చింది. కన్నారావు కూడా ఓ వెర్రి నవ్వు నవ్వి ఇలా అన్నాడు.

    "అంటే...  పరుగు   ఎందుకు    తిశానంట    మారేమ     నేనురన్నింగా పాక్టిసుచేస్తున్నా...హి!"

    బంగార్రాజు చేతు వాచ్ వంక చూశాడు.

    "ఏంటి?.. ఈ టైంలో రన్నింగ్ ప్రాక్టిసా? అది ఇంత ఎఅద్ది స్ధలంలోనా? నమ్మంటావ్?... అదో సరే... రన్నింగ్ ప్రాక్టిసు చేస్తున్నవాడివి ఈ షాపుదగ్గర ఆగి, న్యూస్ పేపరు కొనుక్కుని మొహం మీద కప్పకున్నవేం?... నిజం చెప్పు... లేకపోతే మర్డరు చేస్తా..."అన్నాడు బంగార్రాజు.

    "అది కాదండి ఇన్ స్పెక్టర్ గారూ... మరేమో ఆ పక్కనున్నాయన మొహానికి దగ్గర పెట్టుకుని పేపరు  చదువుతుంటే  మీరేమో లాక్కున్నారు కదండి...అప్పుడు ఆయన్ని మీరు చెప్పాడు.  అప్పుడు  అనిపించింది. నా మొహానికి అంత దగ్గరగా పేపరు పెట్టుకుని చూస్తే ఎలా ఉంటుందా అని.  అందుకని మొహానికి దగ్గరగా అల పేపరు పెట్టుకుని చూస్తే ఎలా ఉంటుందా అని. అందుకని మొహానికి దగ్గరగా పేపరు పెట్టుకుని చూస్తే ఎలా ఉంటుందా అని. అందుకని మొహానికి దగ్గరగా అలా పేపరు పెట్టుకున్నానన్నమాట!! హిహి..." బలవంతంగా నవ్వుతూ అన్నాడు కన్నారావు.

    "అబద్ధం... ఈయన మనల్ని చూసే భయపడ్డాడు సార్. అందుకే కంగారుగా అలా పారిపోయాడు. ఈయన్ని మర్డరు చేసేయాల్సిందేసార్!" అన్నాడు కానిస్టేబులు ఏడుకొండలు.

    "షటప్... ఎవర్ని పట్టుకోవాలో, ఎవర్ని మర్డరు చేయాలో నాకు తెలిదా? అసలు ఇన్ స్పెక్టర్  నేనా నువ్వా?"

    "మిరేసార్!..."

    'అలాగయితే జరిగేది నోర్మూస్కుని చూడు. లేకపోతే మర్డరు చేసేయ్యగల్ను...."

    బంగార్రాజు కన్నారావు వంక తిరిగి మళ్ళి ప్రశ్నించాడు.

    "చెప్పు...నన్ను చూసి ఎందుకు భయపడ్డావు?"

    "మీరంటే అందరికి సింహస్వప్నం కదుసార్.. అందుకని!!... హి!" ఇబ్బందిగా నవ్వాడు కన్నారావు.

    "అందరికి కాదు... కేవలం నేరస్దులకి మాత్రమే నేను సింహస్వప్నాన్ని.
మర్యాదగా చెప్పు నువ్వేం నేరం చేశావ్? దొంగతనమా? హత్యా? రేపా?? త్వరగా చెప్పు. లేకపోతే మర్డరు చేస్తా...." అన్నాడు బంగార్రాజు పళ్ళు కొరుకుతూ కన్నారావు వంక చూస్తూ,

    "హమ్మనాయనో.. నాకేం తెలిదురా దేవుడోయ్ అంటే వినరేంటండి నేను నేరస్దుడిలా ఉన్నానా?" కన్నారావు బంగార్రాజు తలపట్టుకున్నాడు.

    "ఎవర్తెనా బాధపడినప్పుడు ఎవరి తలని వాళ్ళే పట్టుకుంటారు. వేరే వాళ్ళ తలని పట్టుకోరు!!" కోపంగా చూస్తూ అన్నాడు బంగార్రాజు!

    కన్నారావు నాలుక్కోరుక్కుని, బంగార్రాజు తలని వదిలిపెట్టి చేంపలేస్కుని ఆ తర్వాత తన తలని పట్టుకున్నాడు.

    "మర్తెతే నేనిప్పుడు ఇహ వెళ్ళిపోవచ్చా?" అడిగాడు కన్నారావు తలమీద నుండి చేతులు తియ్యకుండానే.

    "హమ్మా ఆశ? అంతిజిగా వదిలి పెట్టేయ్యడానికేనా నిన్ను పట్టుకున్నాను.... మాతో పద ని సంగతి తేల్చాలి!!..."  కనారావు రెక్క పుచ్చుకుని అన్నాడు బంగార్రాజు.

    "ఎక్కడికి?" తెల్లమొహం వేశాడు కన్నారావు.

    "ఎక్కడికేంటి?... పిలిస్ స్టేషనుకి!!..."

    కన్నారావు కంగారుపడ్డాడు.

    "సార్ సార్. నన్ను వదలి పెట్టండి సార్. నేను అమాయకుడిని సార్. నా మొహంలోకి చూడండి సార్. నేను అమయాకుడిలా లేనా సార్?..." అన్నాడు కన్నారావు బ్రతిమాలాడ్తు.

    "మొహంబట్టి నేరాలు నిర్ణయించేట్టయితే  ఇంక పొలిసు దిపార్టుమెంటేందుకు, న్యాయస్దానాలు ఎందుకూ? పచ్చిరక్తం తాగేవాళ్ళు కూడా నీకంటే అమాయకంగా కనిపిస్తారు పద..."   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS