Previous Page Next Page 
చాటు పద్యమణి మంజరి పేజి 57


    
    ఉ||  గాలికిఁ దూలు కేతనము ఖడ్గముగా బలవైరిమేడతో
        నోలి నెదుర్ప నీదగు సమున్నతసౌధము కప్పుడాలొగి
        గేల నమర్చి మిన్నలమి కేరుచు నెత్తిన బాహుశాఖ నా
        నీలపుఁగంబ మొప్పు నవనీమత వేంకటనాయకాగ్రణీ.        607
    
    చ|| ఆనవరతంబు నీకుఁ బురుషార్దచతుష్టయిఁ గూర్తు నంచు సూ
        చన మొనరించు నాల్గయిన శౌరిభుజార్గళమో యనంగఁ బై
        నునిచిన ది,మ్మెకై ల్దగ సమున్నతతావకసౌధమం దౌగి
        దనరును నాల్గుగంబబులు దామరవేంకటనాయకాగ్రణీ.    608
    
    చ|| మిలమిల లీనునీపసిఁడి మేడ ప్రకాశము పేరిపుత్రుతో
        నలబలవైరిసౌధరుచి యన్దుహితం జతఁగూర్చి వియ్యపుం
        జెలిమి వసంతముం జిలుకఁజేర్చిననీలపుఁగ్రోవి నాఁగ రా
        జిలు నల రాలకంబమనఁ జెన్నగు దామరవేంకటాగ్రణీ.    609
    
              పీఠికా వర్ణనము
    
    సీ|| కలధౌత రేఖికావలయిత పీఠిస
            మీరణప్రేరణ తీరకలిత
        ఫేనసరసిలోన మానుగఁ బొడమిన
            యలరుప్రవేణి కాప్రావృతతదు
        పరిపీఠికాశోణపంకజ మ్మన మించు
            కనకపీఠికనత్కర్ణిక నొగి
        నివసించుసిరితోడ నెనరూనుమనసునఁ
            గలయ నల్లన నల గరుడవాహుఁ
    
    గీ|| డితఁడె సుమ్ము త్వదీయస తతసుఖాభి
        రూపసౌధాంతరమ్మున రూఢి నిన్నుఁ
        బ్రోవ వచ్చె సమంచితాభ్యుదయశాలి
        వినుతగుణపాశి వేంకటావనివమౌళి.        610

    సీ|| చుట్టు గట్టినవెండికట్టు నీలపుఁబీట    
            క్దీరాబ్దివేష్టితక్షితివలయము
        తదుపరినిహిత సుత్రామామణీగణ
            ఖచిత మౌపీఠము గగనతలము
        దానిపై నెఱచాయ లీనురాంకవకుథా
            స్తరణంబు విస్ఫురత్తరణిబింబ
        మందలి తులసీదలారుణకుసుమాళి
            మరకత మాణిక్యమయనలినము
    
    గీ|| గాఁ దదీయాంతరమ్మున గమల నెనసి
        యున్నదేవుం డితం డిదె నిన్నుఁ బ్రోవ
        వచ్చియున్నాఁడు నీరతి మెచ్చినాఁడు
        వినుతగుణసాంద్ర దామరవేంకటేంద్ర.        611
    
    సీ||  కలదౌత రేఖికావలయి తేంద్రోవల
            పీఠము నిర్ఘరీవృతనాగేంద్ర
        మప్పీఁటపై నొప్పు గప్పు రామని మించు
            పేరియక్కొండకు వెలయుశిరము
        దానిపై నెఱరంగు లీనురాంకవకుథ
            థాతురాగస్ఫురద్దరణితలము
        నామీఁద మరకత కోమలదీప్తుల    
            నలరారు తుళసీదళాలి కవని
    
    గీ|| యది నిరంతర కుసుమస్రగగ్ర మగుట
        నిత్యమాధవసంబంధనియతి నొదవె
        నిదియ నీమహిమోన్నతి గదర సుగుణ
        వార దామరతిమ్మభూవరకుమార.            612
    
    సీ|| అనుదినం బరుణోదయమున గజేంద్రమో
            క్షణపఠనం బీవు సలుపునపుడు
        సిరిమగఁ డేరీతిఁ గరిఁ బ్రోచె నని మదిఁ
            దలఁపఁగ నవ్వేడ్కఁ దెలువఁ గ్రింది
        కరిపీఁట కరియుఁబైఁ గననగు రెండవ
            యది కుంభముగ నందుఁబొదలుతులసి
        కారుణకుసుమంబు లంబులోడనలగ్న
            శైవలకహ్లారసమితి గాఁగ
    
    గీ|| నవ్యకుథకాంతి యాస్ఫాలనక్రియాత్మ
        కరనఖద్యుతి గాఁగ నీ వరయు మనుచు
        నెదుట నిలుచున్నా వైకుంఠుఁ డితఁ డ్నెసుమ్ము
        వినుతరుణధుర్య వేంకటావనిపవర్య.        613
    
    సీ|| తనమోము నిగనిగ ల్దవిలి యిట్టటు సరి
            గాలి నీడ్వఁగ స్వీయగళలు దొరిగే
        నాలుగు తెన్నులై నడుమ మిక్కిలి కంది
            యున్న రూప్యప్రాంతయుక్తపీఠ
        కుముదబంధుఁడు శోణకుథసమా స్తృతతదు
            పరిపీఠభుజగారిపదములఁ బడి
        ద్విజరాజ వీపును ద్విజరాజ నేనును
            సరివాని శరణార్తి నరయఁ గీర్తి
    
    గీ|| యనుచు వేఁడుచు నున్నటు లరసి నగవు
        నెరయ సాక్షాత్కరించెను నియతి నీకు
        నీ వొనర్చినయారాధనావిధిఁ గని
        వినుతగుణపాళి వేంకటావనివమౌళి.        614
    
    సీ|| పౌలస్త్యు దురమున భంజించి చుట్టురా
            మ్రోయురాయంచలమూక నొప్పు
        పుష్పకమున భూమిపుత్రికతో నెక్కి
            నలుప్రక్కలందును గొలుచు కొమ్మ
        మెకముల ముఖకాంతిచకచక ల్వ్యాపింప
            నరుదెంచురాఘవుఁ డనఁగ రజత
        వేష్టి తాంధఃపీఠవిలసదింద్రోవల
            పీఠియం డరుణప్రవేణికాంచ
    
    గీ|| దప్రమేయచ్చవిచ్చట లలమి పర్వఁ
        గూరుచున్న సిరిపతి చెన్నారు నౌర
        శశ్వదార్జిత పుణ్య విశ్వజనగణ్య
        నీతినై పుణ్య వేంకటనృపవరేణ్య.            615
    
    ఉ||  ప్రీతుఁ నైతి నీ తెలివి వేంకటనాయక కాశి కేఁగునీ        
        తాతకు దర్శనం బొసఁగి ధన్యునిఁ జేసితి నిప్డు వచ్చి ని
        జేతు నటంచుఁ బీఠ యుగనీలనగేంద్రముతోడ నాజగ
        న్నేతయె యేతదాకృతిగ నిల్చెఁ బ్రసాద మెసంగఁ జెంగట.    616
    
    శా||  తారాంకా భ్రసరత్పరీవృత మదః పీఠం స్వరూర్ధ్వస్థితం
        పీఠీశోణకుథాబ్జభాపరిగతం సత్యం తత స్తత్పరే
        దివ్యే దామ్న్యరుణప్రసూనతులసీవత్ర ప్రభౌ శ్రీహరి
        ప్రత్యక్షౌ భవతః కి మత్రభవతః శ్రీవేంకటేంద్రప్రభో.        617
    
    గీ||  తారావృతాధరసమున్నతపీఠికాగ్రే
        స్వారుణ్యవత్కుథసమాస్తతపీఠతార్ష్యే
        ఆరా దుపేత్య విదధాతి ముదం సదారో
        నారాయణ స్తవ స దామరవేంకటేంద్ర.        618


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS