సీ|| శ్రీమించునెమ్మోము తామరవిరి తళ్కుఁ
గన్నులు విరిసినకైరవములు
కుదురైనరదనముల్ కుందకుట్మలములు
తీరైనననాసిక తిలసుమంబు
తరలాధరోష్టంబు దాసానిపుష్పంబు
పొలుపైనపొక్కిలి పొన్నపువ్వు
అదొఁక లగుజంఘ లరఁటిపూమొగ్గలు
చక్కనిమెయి శిరీషప్రసూన
గీ|| మహహ మును మంచిమంచిపూ లరసి తెచ్చి
పొదవి నెమ్మేనుఁ జేసెఁ గాఁబోలు బ్రహ్మ
దాన నిలఁ గల యెల్ల సుందరులలోన
మాకు స్పృహణీయ వైతి రామావధూటి. 592
సీ|| నారంగములు బృహన్నారంగములు గల్గి
విలసిల్లునుద్యాన వీధులందుఁ
గాదంబములు పద్మ కాదంబములు గల్గి
తనరారు కాసారతటములందుఁ
బర్యంకములు మహోపర్యంకములు గల్గి
వినుతి కెక్కిన సౌధవీధులందు
మణిపుత్త్రికలు నభో మణిపుత్త్రికలు గల్గి
సౌరు మీఱినచంద్రశాలలందు
గీ|| మనము మనముల మోహ ముమ్మరముగాఁగ
మరునిఁ బూజించి మించి యేడ్తెఱను రతుల
నతులగతులను దేలి సమ్మతుల మీఱి
ఠీవి నుంటిమి గదవె రామావధూటి. 593
శిష్టుకృష్టమూర్తికవి
శంఖ వర్ణనము
సీ|| చిగురునిల్తునియప్ప చేఁబూనునడిదంపు
రకపుఁ బసిండి పరం జనంగఁ
గొనసాగి దెస లలి కొసఁ బ్రాకు నతనికీ
ర్తిప్రతాపములచేరిక యనంగఁ
జెలియలి కనువేడ్కఁ జెంత కరుగుదెంచి
నిలుచున్నా చిన్ని జాబిలి యనంగ
నాబిడ గీల్గంట సమరింపఁ గూర్చిన
కొమరారుబంగరుకుప్పె యసఁగఁ
గీ|| బరఁగు నిందలి దక్షిణావర్తశంఖ
మౌర దామెరకులకలశాబ్దిసోమ
విభవనిర్జితసుత్రామ విమలనామ
సద్గుణస్తోమ వేంకటసార్వభౌమ. 594
చ|| తరువున బర్హి యంతరపథంబున నిగనయంబు నీరజా
కరమునఁ గ్రౌంచము బొదపి కంబభిదశ్రుతిసూర్య ఘోటము
సరిమవధంబుల క్రమత సక్రమత దఱిఁ బల్క శుద్ధసా
హొరి యిపు డాలపించు నన నొప్పెను గాననసీమ నయ్యెడ. 595
చాటువులు :-
శ్లో|| ప్రీత్యా దామర వేంకటేంద్ర భవతా నిత్యార్చిత స్సంతతం
కృత్యాకృత్య వివేచకోక్తిపదవీవృత్యాధికవ్యక్తిభా
సత్యాదీశముఖామరార్పితవదః సత్యానుసృత్యాదరో
దైత్యారాతి రయం తవాసనకళా మత్యాద్యపాక్షాదభూత్. 596
ఆర్యా: కాంచనపిశంగవసనః
కవితారుణవర్ణ పీఠ సంవసనః
తరుణతర మందహసనః
త్వా మవతా ద్వేంకటేంద్ర సవిలసనః. 597
లక్ష్మీస్తనభరకుంకుమ, లాంఛితవక్షస్థ్స రాంచితః కృష్ణః
దామరకుమారావేంకట, ధరణీనేతార మవతు సుకుమారం. 598
కుండిననాయక తనయా
కుచయుగ కాశ్మీరముద్రితోరస్కః
కురుతా త్కువలయనీలః
కోపి పుమా వ్వేంకటేంద్ర తవ కుతుకం. 599
శా|| ఛిద్రాన్వేషణతత్పరో నను రమాసూను స్సపంచాశుగీ
ముద్రాముద్రితదోర్యుగ ప్రవిలసత్కాంతారబాణాసనః
సద్రాగద్య నిరీక్ష్య తే మమ తనుం సంతర్ధయన్నిర్దయం
నిద్రా నైతి నిశా న యాతి తరుణీ నాయాతి కాయతనా. 600
శా|| యాతా కాచనదూతికా మదుదితం వ్యాఖ్యాతుమేతర్హి సా
నాయతా బత పంచబాణపృతనాకోలాహలో ద్యోతతే
ఏకాకీ న్యవసం వసంతసమయే దైవా దహం నిష్కటే
నిద్రా నైతి నిశాన యాతి తరుణీ నాయతి కాయతనా. 601
జవః స్థిరత్వం రేఖా చ భ్రమణం దృష్టి రశ్రమః
ఆ స్వేదః పటువాగ్రూపం పాత్రప్రాణా ఇమే దశ. 602
శ్రీశిష్టు కృష్ణమూర్తి కనిచంద్రుఁడు రాజానల్లపరాజ మీర్జాసాహెబు వెంకట నీలాద్రిరాజు గారిని దర్శించినపుడు చెప్పిన పద్యము.
శ్లో|| లక్ష్మీవక్షోజకుంభ ద్వితయపరిసర ప్రస్ఫురత్కుంకుమశ్రీ
శోణానూనాగ్ర సంధ్యారుచిరుచిరఘన భ్రాంతి కృత్కాంతివక్షాః
పద్మాక్ష స్సర్వ విద్వద్వినుత గుణగణాధ్యక్ష మక్షీణశౌర్యం
మీర్జానీలాద్రి రాజ ప్రభుమణి మవతు స్సారకారుణ్యధ్యా|| 603
శిష్టు సర్వశాస్త్రి
దామరవేంకట భూపాలుని యాజ్ఞాప్రకారము శిష్టు సర్వశాస్త్రి చెప్పిన చాటువులు
దక్షిణావర్త శంఖము
క|| కలిమిచెలి బొడ్డుబిడ్డకుఁ
బొలుపుగఁ బాల్వోయ నిడినపొంబాలడ నా
నలరారు నిందుఁ దగుని
వ్వలమురి వేంకటనృపాల వరగునశీలా. 604
చ|| తరుణశశాంక శేఖరుఁడు దామర వేంకటభూమిపాలుఁ డా
దరమునఁ జల్పుపూజనల దానముల న్ముదమంది మిత్రుఁడౌ
సిరి నిడువాని కాన యిడఁ జెచ్చెర నాతఁడు వంప వచ్చి సు
స్థిర మగుశంఖ సేవధిగ ధీఁ దలపోయుదు దివ్యశంఖము. 605
స్తంభ వర్ణనము
సీ|| సంతతంబును సుప్రసాదత మించుప్రా
సాదలక్ష్మి వహించుజడ యనంగ
రత్న సంపదఁ జూడ రహి మరంగున నిల్చు
వరుణుఁ డెక్కినదంతికర మనంగ
రాజ్యరక్షకు రామారమణుఁడు నిల్పినఁ
గన్పట్టుతనదగుగద యనంగ
నిచటి చాగము విని యే నెంత యని కంది
కొల్వ వచ్చిన దేవకుజ మనంగ
గీ|| భావుక భవత్సభాంతర భాసమాన
రాజరత్న మయస్తంభరాజ మొప్పుఁ
బోషితబుధాళి తోషితభూజనాళి
కృతినళినహేళి వేంకటక్షితివమౌళి. 606
