శా|| ఊర్ధ్వస్థాచ్యుతపాదపారసలసన్మాద్వీద్యుషన్ని న్ను గా
పీఠా దూర్ధ్వగతా ద్విహాయ సువథా త్ర్పాప్యాధరం పీఠకం
స్వస్థానాశ్రయ తత్పరాకన ఖలం తత్రైవ నానాదిశో
ధావంతీ న పునః పపాత ధరణీ శ్రీవేంకటేంద్రప్రభో. 619
చ|| సిరినెఱి మించునెమ్మిపురిఁ జెన్నుగ నౌదలఁ దాల్చి మేల్మిబం
గురు మొలనూలిగంట గలుగల్లున మ్రోయఁగ మోముఁదామరం
జిఱునగ వొప్పఁ దల్లికడఁ జిందులు ద్రొక్కుచు నాడునల్ల వే
ల్పు రహి నొసంగు నీకుఁ గలుము ల్దయ దామరవేంకటాధిపా. 620
క|| కృష్ణుఁడు పదకమలనయ
జ్జిష్ణుఁడు నరకాదిదైత్య జిత్వర కేళీ
ధృష్ణుఁడు భక్తశ్రీవ
ర్ధిష్ణుఁడు వేంకటనరేంద్రుఁ దిరముగఁ బ్రోచున్. 621
కంకతికా వర్ణనము
చ|| హిమకరకీర్తి వేంకటమహీరమణా కలధౌతదంతవ
త్రములు ప్రదీప్త్యహంకృతిఁ బరస్పరము న్గలహించె...చె
య్యమరఁగఁ బట్టి నీసముఖమం దొగి నత్తగవెల్లఁ దీర్పఁగా
సమయనిరీక్షణక్రమము సల్పుచు నిల్చె నచంచలాకృతి. 622
చ|| అనుపమ రాజాతద్యుతిసమంచితమై భవదీయసన్నిధి
దనరును దంతకంకతము తావకకీర్తులకుం దరంబుగా
క నొగిలి పుత్రి గంగ దలఁ గ్రక్కునఁ దాలిచి స్రుక్కి కొల్వ న
చ్చినయజహత్స్వపాదహిమశృంగియ నాఁదగు వేంకటాధిపా. 623
ఉ|| అర్ణవమేఖలావసన మై తగునీదుయశంబుఁ గాంచి దు
ర్వర్ణత నంటి వెండి మదవారణసద్ద్విజకంకతాస్తిస
ద్వర్ణము వంటి నిన్నుఁ గొలువంగ భవత్కరపాళియైత్వద
భ్యర్ణము చెందె వేంకటధరాధివ నూరిజనోదయత్కృపా. 624
గీ||సారగురుబుధ మిత్రమందారమహిమఁ
దనరునీమేడఁ గని దివం బనుచు నుచిత
గతి రజతకంకతాకృతిఁ గవియు శశియుఁ
బొంకముగఁ గూడి నిలిచిరి వేంకటేంద్ర. 625
ఉ|| దామరవేంకటక్షితివః తావకహర్మ్యము తావరీవెనూ
దామర పట్టి విట్టినుడి తప్పగునేని భవత్ప్రకాశమం
దేమఱ కెప్పుడు న్నిలుచునే రజతచ్చదపక్షవృత్తిలీ
లామహనీయకంకతమరాళకులాగ్రణి యిట్టు లొద్దిక. 626
ఉ|| దామరవేంకటేంద్ర! సతతంబును నీమహనీయసద్గుణ
స్తోమము లెక్క పెట్టుటకుఁ జొప్పడు చొప్పుగ నాత్మ నెంచు నా
గ్రామకరంబు నాకలితరౌవ్యశిరోఘనకంకతంబు ల
క్ష్మీమహితస్థితిం దగఁ బ్రకీర్ణతదీయరథాళి వ్రేళ్ళుగా. 627
సీ|| దేవకీ కలవసుదేవునకును మనో
రంజనముగ మధురం జనించి
యమునఁ దరించి న్యాయముగ యశోదకుఁ
బట్టియై సతులఁ జేవట్టి ప్రోచి
గోవసుతులతోడ గోపాలన మొనర్చి
సుర లుల్లసిలఁగ నసురులఁ ద్రుంచి
ధరమెత్తి వ్రజజనోద్దరణం బొనర్చి యు
వెడఁగైనకాళియు వెడల నడఁచి
గీ|| తరణిజహ్రదంబు నిర్దోషతరముఁ జేసి
ప్రజలు శ్రీకృష్ణుఁ డెప్పుడు ప్రబలఁజేయు
నీమ హైశ్వర్య మంతయు నేను మమర
కృతినళినహేళి వేంకటక్షితివమౌళి. 628
పారిజాత వర్ణనము
ఉ|| నే నిలఁ బారిజాత మని నిక్కము గాఁగఁ బ్రసిద్ధిఁ గాంచితిం
దానును బారిజాత మఁట దైవతసూనము తప్పిదంచుఁజు
మ్మీనన యాయతాత్యరుణవృంతముపేరిటిదీర్ఘకోపముం
బూనెను శ్రీకుమారపదపూర్వక వేంకటభూమినాయకా. 629
శోణవృంతము పారిజాతకసూన మొప్పగు వెంకట
క్షోణినాయక యత్తమామలఁ గొల్వు సేయ మరుంగునన్
రాణ నొద్దిక మీఱ నిల్చిననల్వచెల్వ సముల్లస
చ్చోణిమాయతచిత్రకాంకనశోభమానముఖంబు నాన్. 630
సీ|| మహిఁ గలకొలఁకుల విహరింప సరసిజా
సనవాహనావతంస మొకనాఁడు
చనుదెంచి గతిగర్వమున మించు నిందలి
రాయంచగమిఁ గని రాణమాట
వాసిగ సిరినడవడువున నెందును
లేమి తెల్లము గర్వ మేమి మనకు
నన విని సిరి యెందుఁ గన నగు నని భువి
వెదకుచు నీయింట వెలసియున్న
గీ|| సిరిని వెరపున మైమాటిచెంత నిలిచి
కాంచునంచల సహచంచుకముఖము లనఁ
దనరు నీపారిజాతము ల్ద్యైర్యనయవి
వేకనిస్తంద్ర దామరవేంకటేంద్ర. 631
శ్రీపాస్య...వరదాస్యకృతిప్రసిద్ద్యై
భూపారిజాత కుసుమోవధి రాజ ఎషః
వృంతచ్చలారుణమణీమయవేత్రధారీ
ప్రాంతస్థిత సపది వేంకటభూపమౌళే. 632
భాభాంతి పారిజాతప్రసవాః కురువిందదండసంకలితాః
హీరమయా స్తాటంకా ఇవ లక్ష్య్మా వేంకటావనీరమణ. 633
భూపారిజాతమధునా సిక్తోయ శ్శ్రీపతి స్త్వయా
భూపారిజాత మధునా వేంకటేంద్ర ధునోతి తే. 634
పాణౌ వేంకటభూపాల పారిజాతం తవాధునా
దానపత్రాంకనారోద్యన్ముద్రి కేవ విరాజతే. 635
సిందూర పేటికాంత
స్సిందూరాకర్షణాత్తరేఖ్యోయం
వృంతయుతపారిజాత
ప్రసవః శ్రీవేంకటేంద్ర పద్మాయాః. 636
వృంతాంచత్పారిజాతప్రసూనం వేంకటనాయక
సంధ్యాభ్రలేఖాగ్రలసత్కవిభ్రమదవిభ్రమః 637
శ్రీచూర్ణకర్ణికా వర్జనము
చ|| ఘన మగుధైర్యలక్ష్మి మును గాసిలఁ జేసితి విప్పు డీవు సే
యునియతహేమదానముల నొక్కటఁ జిక్కితి నంచు మేరు విం
క నను భవత్కటాక్షమునఁ గగ్గొని రక్షణ సేయు మంచు నే
డ్కొను నిను బంగరుంగణికడొంకున వేంకటభూమినాయకా. 638
