Previous Page Next Page 
యుద్దక్షేత్రం పేజి 53


    కామినీ మీద మహా వృక్షంలా వాలాడు. చేతులని వెనక్కి  విరిచేశాడు. మోకాళ్లతో ఆమె కాళ్లని ఎడం

చేశాడు. అతను రొప్పుతూ ఆమెని ఆక్రమించుకొన్నాడు.

     ఆమె కెవ్వుమని అరిచింది.

     సర్వనాశనం  జరిగిపోయింది.

     చేతుల్లో మొహాన్ని దాచేసుకుంది కామినీ.

     ఆమెమీంచి లేచి మంచం దిగి మొహంమీదికి పడిన జుత్తుని చేత్తో వెనక్కి తోసుకున్నాడు ప్రశాంత్.

     "నా మాట వింటే గుట్టుగా పని జరిగిపోతుంది. స్వర్గాన్ని చూసే దానివి. కానీ నీకా యోగంలేదు.

     కామినీ, నువ్వు నీ అన్న సూరిబాబుగాడు నన్ను రెచ్చగొట్టినా ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని

కించపరచేలా మాట్లాడినందుకు నీకు, నీ అన్నకీ నేను చెప్పిన గుణపాఠం ఇది." అన్నాడతను.

     ఆమె మంచం మీదనించి లేవలేదు. అతన్నో పురుగుని చూసినట్టు చూసింది.

     "నువ్వింకా మాట్లాడ్డానికి సిగ్గులేదూ! నువ్వు మనిషివి కాదురా! నీకంటే పశువు నయం."

     ప్రశాంత్ వికృతంగా నవ్వాడు.

     ఒక ఆడదానికి ఇంతకంటే పరాభవం అవసరం లేదను కొంటాను.

     కానీఒక్క విషయం మాత్రం నేను ఒప్పుకొంటున్నాను.

    నీ కిష్టం లేకపోయనా  అధ్బుతమైన సుఖాన్ని పొందాను" అన్నాడు విలాసంగా సిగరెట్ వెలిగిస్తూ ప్రశాంత్.
 
    ఆమె కళ్ళు అగ్ని గోళాలవుతూ అతని వేపు తిరిగినయి.

     రోషంతో, ఆవేశంతో ఆమె గుండెలు ఎగిరిపడుతున్నాయి.

    మంచం  మీద నించి కిందికి దుమికింది. విడిపోయిన జడ కురులు మొహంపైనించి ఆమె వక్షోజాలపైన

కప్పుకొన్నాయి.

     ఆడ పులిలా అతని మీదికి చెంగున దుమికి పీకని పట్టుకుంది.

      "నిన్ను చంపేసి నీ రక్తం తాగుతానురా దుర్మార్గుడా!"

    అనుకోని ఆమె చర్యకి ప్రశాంత్ ముందుగా నిర్ఘాంతపోయినా, తేరుకుని ఆమెని విదిలించి కొట్టాడు.

     పులిముందు లేడిపిల్ల బలం ఏపాటిది? ఆ విసురుకి దురంగా వెళ్లి గోడకి తగిలి కింద పడిపోయింది.

     "ఇంకా రోషం చావలేదే నీకు. నీకిదే చెప్తున్నావు.

    కుక్కిన పేనులా పడుండు.
 
     నోరెత్తి ఈ విషయాన్ని బయట పెట్టావో నీ కుటుంబాన్ని నాశనం చేస్తాను" అని తలుపులు తీసుకొని బయటికి

నడిచాడు ప్రశాంత్.

     కామినీకి తను అధోపాతాళానికి నెట్టివేయబడినట్టు బావురుమంటూ నేలమీద పడి విలపిస్తోంది.

    ఆమె కలలో కూడా ఊహించని దారుణం జరిగిపోయింది.

     ఏమీ చేయలేని  అసహాయత.

    ఎవరికీ చెప్పుకోలేని దౌర్బాగ్యం.

     ఇప్పుడు తనదో బతుకేనా?

     కుక్క ముట్టుకున్న  అన్నంకుండని ఎవరైనా ఏం చేస్తారు?

     ఏం చేయాలి?

     ఆమె మనసు ఘోషిస్తోంది.

    హృదయం తల్లడిల్లిపోతోంది.

     పరిష్కారమార్గం ఆమెకి తెలుసు!

     వెల్లువలా  దుఃఖం పొంగింది. తనని తాను అంతం చేసుకోవాలన్న నిర్ణయానికి రాంగానే"అమ్మా!" అని

ఆర్తనాదం చేసింది.

    తలని నేలకేసి కొట్టుకొంది.

     ఏడవడానికి కూడా ఓపిక నశించిపోగా ఆమె గొంతు పెగలడం లేదు.

     వెక్కిళ్లు వస్తున్నాయి.

     తన శరీరం నించి వేరు చేయబడిన చీర మంచం పక్కనే పడివుంది.

     నేలమీంచి లేచింది కామినీ. వంటిమీద చిరిగిన జాకెట్ ని  సరిచేసుకొంది. చీరని చేతిలోకి తీసుకొని చిన్న

బల్లమీద ఎక్కి చీరని సీలింగ్ ఫాన్ కి కట్టింది.

     రెండోవేపు మెడకి ముడివేసుకొంది.

     మరికొన్ని క్షణాల్లో తన బతుకుని అంతం చేసుకోబోతోంది కామినీ.

     చెప్పలేని విరక్తి, అలవానికాని దుఃఖం

    ఆమెకి  ఆత్మహత్యకంటే మరోమార్గం కనిపించడంలేదు.

     ఎదురు తిరిగి, నలుగురిలో తనకి అతను చేసిన అన్యాయాన్ని గురించి చెప్పి తన బతుకుని

చక్కదిద్దుకోగలననే ఆలోచన ఆమెకా క్షణంలో తట్టకపోవడంకూడా దురదృష్టమే!

    అయితే నమ్మి ఓ మగాడిచేత వంచింపబడినప్పుడు ఏం చేయాలన్న దాని గురించి ఆలోచించే అవకాశం

వుంటుందేమో తప్ప, అనుకోకుండా, ఇలాంటి విపరీతం జరిగితే మానసికంగా అలాంటి సంఘటనకి సిద్దంగా లేకపోవడం వలన

సామాన్యమైన ఆడదానికి భవిష్యత్తు గురించిన ఆలోచన రాదేమో!

     సరిగ్గా కామినీ విషయంలో అలాగే జరిగింది.
 
     ఆమెకి తల్లీ, అన్న గుర్తుకొచ్చారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS