Previous Page Next Page 
యుద్దక్షేత్రం పేజి 52


    నిన్నప్పుడప్పుడు చూశానేతప్ప నీలోని అందాలనీ, ఎత్తు పల్లాలనీ, లోయలనీ, గుట్టలనీ నేను అబ్జర్వు

చేయలేదు. కళ్లపడ్డాక ఈ అందాన్ని అనుభవించకుండా వుండలేను"

    నీ కెంత డబ్బైనా ఇస్తాను. నా కోరిక తీరాలి" అన్నాడతను.

     "నాకు డబ్బు అవసరం లేదు. పెళ్లి చేసుకో."

    అతని చేయి ఆమె మెడపైన పడింది.

     "ఆశకైనా ఓ హద్దు వుండాలి. నిన్ను పెళ్లి చేసుకొంటే నా ఇమేజ్ దెబ్బతింటుంది కామినీ! కనుక  ఆ

ప్రసస్తే అవసరం లేదు.

     నేను నిన్ను పొందిన తర్వాత నీకు అన్యాయం జరగకుండా నేనే నీకు పెళ్లి జరిపిస్తాను" అన్నాడు.

     "నేను పేదింటి పిల్లని. ఓ సూరిబాబుకి చెల్లెలిని కనక నన్ను పెళ్లి చేసుకోడానికి నీకు అబ్యంతరం. నాకు

శీలం లేకపోయినా ఓ  అనామకుడిని  బలిపశువుగా చేసి నన్ను కట్టబెట్టాలనుకొంటున్నావు.

     చాలా బాగుంది.

     కానీ... డబ్బుండీ, స్టేటస్ వున్న శీలంలేని ఆడపిల్లని పెళ్లి చేసుకోగలవా నువ్వు!" అడిగింది

కామినీ.

     "కామినీ!' అతను పళ్లు కొరికాడు. అతని దవడకండరం బిగుసుకొంది.

    "నీకు చాలా బాధ కలిగినట్టుంది పాపం" ఆమె వెటకారంగా అంది.

     "ఇలా కాదే! నీ పొగరణుస్తాను. జీవితమంతా నేను నీకు గుర్తుండేలా చేస్తాను" అంటూనే ఆమెని

అమాంతం  కౌగిలించుకొన్నాడు.

     కామినీ అతని బలమైన కౌగిలిలో విడిపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది.

     అతను తలవంచి ఆమె మొహం మీదకి వంగి ఆమె పెదవులపైన గట్టిగా కొరికాడు.

     "అబ్బా!" అంది బాధగా.

     ఆమె పెదిమనించి రక్తం కారుతోంది. అతని జుత్తు పట్టుకుని అతని తలని వెనక్కి తోసేయడానికి

ప్రయత్నిస్తోంది.  కామినీ. అతని చేయి ఆమె మెడమీదకి పాకింది. జాకెట్ ని పర్రుమని చింపేశాడు.

     "విడిచిపెట్టు. ఇప్పటికీ నిన్ను గౌరవిస్తున్నాను. లేకపోతే అరిచి అల్లరి చేస్తాను" ఆమె కీచుగా

అరిచింది.

     "అల్లరైపోయేది నువ్వే !' ఆమె నోటిని గట్టిగా చేత్తో నొక్కాడు.

    ఆమె బాధతో కళ్లు మూసుకొంది.

    ఆమె బ్రాసియరి హుక్ తెగిపోయింది. బయటపడిన ఆమె  వక్షోజాలపైన మొహంతో రుద్దుకొంటున్నాడు.

     అతనిలో ఆవేశం, వివేకం పూర్తిగా నశించిపోయినయి.

     కుడివైపు ఆవేశం, వివేకం పళ్లతో పట్టికొరికాడు.

     "అమ్మా!' దీనంగా ఆర్తనాదం చేసింది కామినీ.

    ఆమె కళ్లనించి నీరు జలజలమని రాలి అతని చేతులని తడుపుతోంది.
 
     అయినా కూడా అతను జాలిపడడం లేదు. కోరికతో విజృంభిస్తున్నాడతను. ఆమె ఎముకలు 

విరిగిపోయేలా నలిపేస్తున్నాడు. విడిపించుకోడానికి ఆమె చేస్తున్న ప్రయత్నం  ప్రయత్నంగానే మిగిలిపోతోంది.

    "ఆఖరుసారి చెప్తున్నాను ప్రశాంత్. నన్ను విడిచిపెట్టు. నేనెవరికీ నువ్విలా చేశావని చెప్పను.
 
     నా జోలికి రాకు.

     నా జీవితాన్ని బలి తీసుకోకు. నువ్వేం చేసినా నేను చచ్చిపోతాను. ఆమె దీనంగా వేడుకొంది. చేతులు

జోడించింది.

     "నువ్వు చచ్చిపోతే ఈ దేశానికీ, ఈ రాష్ట్రానికీ పెద్ద నష్టం లేదు.

    నా కోరిక తీరకపోతే మాత్రం నేను చాలా బాధపడిపోతాను. అది నాకిష్టం  వుండదు."

     ఆమె చీర కుచ్చెళ్లు ఊడిపోయినయి. ఆమె వంటిమీద లంగా మాత్రం వుంది. జుత్తు చెదిరిపోయింది.

     పశువులా ఆమెని కొరుకుతున్నాడు. నలుపుతున్నాడు.

     ఆమె విలపిస్తోంది.

     అల్లాడిపోతోంది.

     తనని తాను రక్షించుకోలేని నిస్సహాయతకి ఆక్రందన చేస్తోంది కామినీ.

     అమాంతం రెండు చేతులతో ఆమెని ఒడుపుగా పట్టుకున్నాడు.

     ఈడ్చి అతని చెంపపైన కొట్టబోయింది. వాటంగా తప్పించుకొన్నాడు ప్రశాంత్.

     అతన్ని రక్కి, గిచ్చి,విడిపించుకోడానికి ప్రయత్నిస్తోంది.

    చేతికి ఏదైనా వస్తువు దొరికితే అతని తలని పగలగొట్టాలని వుంది. అతన్ని చంపేయాలనుకుంది.
 
    కానీ అవకాశం ఇవ్వడం లేదతను. అతని చేతిపైన కొరికింది కామినీ.

    "రాక్షసీ!"

    అంటూ ఆమె జుత్తుని పట్టుకుని మంచం దగ్గరికి ఈడ్చుకెళ్లాడు.

    కామినీకి అర్దం అయిపోయింది.

    మరికొన్ని క్షణాల్లో తన బతుకు, తన శరీరం కుక్కచింపిన విస్తరి కాబోతోంది.

     "ఇన్నాళ్లు నా డబ్బు తిని, పెంచిన నీ శరీరంపైన నాకు హక్కుందే! నిన్ను . .నిన్ను విషయించందే

నేను విడిచి పెట్టను."

     కామినీని ఎత్తి మంచం పైన పడేశాడు. ఆమె కాళ్లు రెండు బిగించింది. చేతులని రొమ్ములకి అడ్డంగా

పెట్టుకుంది. కానీ అతని బలాన్ని ఎదుర్కోలేక పోతోంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS