"ప్లీజ్. పిచ్చివేషాలు వేయకండి" అన్నది కామినీ.
అతను మనోహరంగా నవ్వాడు.
"వీటిని పిచ్చి వేషాలనరు కామినీ!శృంగార రసఘట్టా లంటారు. అనుభవం లేనిదానివి కదా! అంచేత నీకు తెలిసి వుండకపోవచ్చు"
ఆమె కోపంగా చూసిందతనికేసి.
"తెలుసుకోవాల్సిన అవసరం నాకేం లేదిప్పుడు!"అంది.
"ముందు బెట్టు చేయకుండా ఏ ఆడదీ ఏ మగాడికి లొంగిపోదు. ఆ విషయం నాకూ తెలుసు. బహుశా నీకూ తెలిసివుండాలి." అన్నాడతను.
"నేనేమీ బెట్టు చేయడం లేదు. నాకిష్టంలేదు అంతే! దయచేసి నాకు కోపం తెప్పించకండి" అంది కామినీ విసురుగా.
"నీ మాటల్లోనే నాకు దొరికిపోయావు కామినీ. కోపం తెప్పించ కండి అంటే, ఇంతవరకూ కోపం రాలేదనే మాటని నువ్వే అంగీకరిస్తున్నావు. అవునా?"
అవకాశం అనేది చాలా రేర్ గా దొరుకుతుంది. దొరికిన అవకాశాన్ని చేజార్చుకోకూడదు.
దాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
నీకు తెలీదు. ఇలా జరిగే విషయాలని ఎప్పుడైనా తీరిక సమయంలో గుర్తు చేసుకొంటే, అదో అధ్బుతమైన మధురానుభూతిగా నీ స్మృతి పథంలో చిరస్థాయిగా మిగిలిపోతుంది. టైం వేస్ట్ చేయకు ప్లీజ్. నువ్వు నాకు నచ్చావు.
నువ్వు కావాలని నా మనసు ఆరాటపడుతోంది. మనసుని కాదని చంపుకోడం నాకు అలవాటు లేదు.
గుడికెళ్లిన మీ అమ్మ ఇంటికి రాకముందే భజన కార్యక్రమం పూర్తి చేసుకొని పునీతులం అయిపోదాం"
"న్నో" ఆమె మొహంలో రంగులు మారుతున్నాయి.
"నేను అలాంటిదాన్ని కాను" ఆమెకి అతని మాటలు వింటుంటే ఏడుపొస్తోంది.
"అలాంటి దానివి కాదని తెలుసు. కనుకనే ఇంతగా అడగాల్సి వస్తోంది. ఎవరికీ ఈ విషయం తెలీదు కనుక నిన్ను 'అలాంటిది' 'ఇలాంటిది' అని ఎవరూ అనుకోరు అంతే గప్ చిప్ గా జరిగిపోతుంది.
నీకు తెలీని సుఖం ఎలా వుంటుందో చూపించాలనే నా తపననీ, తాపత్రయాన్నీ నువ్వు అర్దం చేసుకోగలగాలి!"
"ప్రశాంత్!నువ్వు చాలా అసహ్యంగా మాట్లాడుతున్నావు. నీ మాటలు వింటుంటే నా వంటిమీద తేళ్లూ, జెర్రులూ పాకుతున్నట్లుగా వుంది. ప్లీజ్ గెటవుట్" అంది.
"నిజమే! సెక్స్ కి సంబంధించిన విషయాలు చేతల్లో వున్నంత మధురంగా మాటల్లో వుండవు. ఆ విషయాన్ని నేను ఒప్పుకొంటాను. అందుకే అసలు కార్యక్రమానికి వచ్చేయ్."
ఆమె పెదవులు అదురుతున్నాయి.
శరీరం సన్నగా కంపించసాగింది.
అతను తనని విడిచిపెట్టేలా లేడు. ఆమె మనసులో ఆందోళన అధికం కాసాగింది.
అమ్మ అప్పుడే రాదని ఆమెకి తెలుసు.
అరిస్తే చుట్టు పక్కల ఇళ్లలోనూ, వాడకట్టులోనూ పరువు పోతుంది. ఇల్లు ఖాళీ చేయవలసి వస్తుంది. కుటుంబం నడవడానికి అతను సాయం చేయడం మానేస్తాడు. అతనప్పుడప్పుడూ ఇంటికి రావడం అతను సాయం చేయడం అందరికి తెలుసు.
ఇప్పుడేం చేయాలి?
దారి ఏది? దిక్కుతోచక ఆ పరిస్థితిలో ఆమె ఆలోచిస్తూనే వుంది.
లొంగిపోక తప్పదు!
అంతకంటే చావు నయం.
కానీ ఆమె అంతరాంతరాల్లో ఓ చిన్న ఆలోచన... ఉదయించగా మెల్లగా అడిగింది.
"నేనంటే నీకిష్టమా?"
ఆమె దారిలో కొస్తుందని గ్రహించా డతను.
"ఇష్టం కనుకనే అడిగాడను" ఆమె దగ్గరగా అడుగువేశాడు. అతని పెదవులపైన అసహ్యంగా నవ్వు....
పులి మీదకొస్తున్నట్లు బెదురుచూపుల్తో తడబడే అడుగులతో వెనక్కి కదులుతోంది కామినీ.
"నన్ను ప్రేమిస్తున్నావా?" మళ్లీ అడిగింది. ఆమె గొంతు వణికింది.
ప్రశాంత్ వెకిలిగా నవ్వాడు.
"సారీ కామినీ!నాకు ప్రేమమీద నమ్మకం లేదు. అవన్నీకథ ల్లోనూ, సినిమాల్లోనూ వినేమాటలు. ఐ హేట్ లవ్. " అన్నాడు.
"ప్రేమ గురించి ఎంతో అందంగా రాసి పాఠకుల అభిమాన రచయితవైన నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నాకు అసహ్యంగా వుంది." ఈసడింపుగా అంది కామినీ.
ప్రశాంత్ ఆమె భుజంపైన చేయి వేశాడు! అతని చేతివేళ్లు ఆమె భుజంలో గుచ్చుకొంటున్నాయి. ఆమె కళ్లనించి కన్నీరు జారుతోంది. కాళ్లు వణుకుతున్నాయి. గుండె అదురుతోంది. కడుపులో చల్లగా అయిపోతోంది.
"అవన్నీ నీ అన్న సూరిబాబు నా పేరుపైన చలామణీ చేస్తున్న రచనలు కామినీ!
నాకు ఆడదన్నా, డబ్బన్నా వీక్ నెస్ ఎక్కువ.
