తను ఎదిరించినా ఒట్టి చేతులతో అంతమందిని తను యేమీ చేయలేనని తెలుసు కాబట్టి తప్పించుకునే మార్గం కోసం వెదుక్కోసాగింది.
"ఒరేయ్... పిటపిటలాడే దాని యవ్వనం ఊరిస్తుంది. మంచి పొగరుమీద వున్న ఆడగుర్రం అది. వెళ్ళి దాని అందాలతో ఆడుకోండి మీ ఇష్టం వచ్చినట్టు మజా చేసుకోండి. ఆనందాన్ని అనుభవించండి"
కబీర్ దాదా అనుచరులను ఉసిగొలిపాడు.
వెనువెంటనే క్రూరమృగాల్లా ఆమె చుట్టుముట్టారు.
ధీరజ చిగురుటాకులా వణికిపోయింది.
ఏటూ పారిపోయే వీలులేకుండా ఆమె చుట్టూ గుండ్రంగా నిలబడ్డారు. ఆమె లేత శరీరంమీద పడ్డాయి వాళ్ళ మొరటు చేతులు. ఆమె బుష్ షర్ట్ చిరిగిపోయింది. తల్లని బ్రా కనువిందు చేసింది. జీన్స్ పాంట్ ని లాగేయడం కుదరక అందినచోటల్లా కత్తులతో ఆమె అందమయిన తోడలు బహిర్గతం కాసాగాయి.
ధీరజలో దైర్యం దిగజారిపోతుంది.
స్త్రీ సహజమైన బిడియం ఆమెను కమ్మేసింది. క్రూరమృగాల కోరలకు చిక్కున లేడిపిల్లలా విలవిల్లాడిపోసాగింది.
"ఎవరూ వచ్చి నిన్ను రక్షించరు. నిన్ను కూడా నీ స్నేహితుని దగ్గరకు పంపేయడానికే ఈ సెటప్..." కబీర్ దాదా పగలబడి నవ్వుతూ అన్నాడు.
"అంటే సుధాకర్ ను చంపింది నువ్వేనన్నమాట"
"అవును... నెగిటివ్ లు ఎక్కడ వున్నాయో చెప్పమని అడిగాను. చెప్పనన్నాడు.
అందుకే ఎవరికీ చెప్పే అవకాశం లేకుండా శాశ్వితంగా నోరు మూసేశాను. నువ్వుకూడా ఉండవలసిన హద్దులలో ఉండకుండా మితిమీరి ప్రవర్తించావు.
అందుకే నీ బ్రతుక్కి ఫుల్ స్టాప్ పెట్టడానికే ముహూర్తం నిర్ణయించాను."
అర్దనంగ్నంగా కనిపిస్తున్న ధీరాజ అందాలను చూస్తూ పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తూ అన్నాడు కబీర్ దాదా.
"అది నీ తరంకాదురా లుచ్చా..."
పెద్దపులి గాండ్రింపులాంటి కేక వినిపించింది అక్కడ.
ఒక వ్యక్తి సింహంలా ప్రత్యక్షయ్యాడు. వంటిమీద ఎర్రగొంగళి కప్పుకుని వున్నాడు.
రక్తపు ముద్దలా వున్న కనుగుడ్లు, చెదిరిన జుట్టు, చూపులలో తీక్షణత...
"ఎవరు నువ్వు?"
"రణధీర్.... విప్లవ నేత రణధీర్ పేరు వినలేదా?"
ఆ కంఠం ఖంగుమంది.
ఆ మాట విన్న మరుక్షణం కబీర్ దాదాతోపాటు అతని అనుచరగణం అంతా బెంబేలు పడిపోయారు.
ఉక్కు పిడికిళ్ళవంటి రెండు చేతులతో ఇద్దరు అనుచరుల ముఖాలను చరిచాడు. కళ్ళు పచ్చబడుతుండగా మోకాళ్ళపై కూలపడిపోయారు అ ఇద్దరూ.
కాబీర్ దాదా చట్టుక్కున రివాల్వర్ తీయబోయాడు.
అతనికన్నా వేగంగా రణధీర్ తన చేతిలోని ఏ.కె 47 గన్ ను ఆటోలో పెట్టి పైర్ చేశాడు. కబీర్ దాదా శరీరాన్ని బుల్లెట్లు చిన్నభిన్నం చేశాయి. అతని చావులేక విన్నాక చేతోలోని గన్ ను అనుచరుల వేపు తిప్పాడు.
గజగజ వణికిపోతున్నారంతా.
పిట్టలురాలి కింద పడినట్టు వరుసగా నేల కూలిపోయారు తరువాత ధీరజ వైపు నడిచాడు. తన ఒంటిమీదనున్న కంబళిని ఆమెకు అందించాడు.
ఆమె కృతజ్ఞతాపూర్వకంగా చూసింది అతనివేపు.
రణధీర్ ఆమెను తీసుకుని రహస్య స్థావరానికి వెళ్ళిపోయాడు.
అక్కడి దృశ్యం చూసి ధీరజ అదిరిపోయింది. నులకమంచం మీద కూర్చునివున్న ఆనందరావును చూసి అవాక్కయిపోయింది.
"రవితేజా! నువ్వు బతికి వున్నావంటే నమ్మలేకపోతున్నాను."
"నేను ఇలా ప్రాణాలతో వున్ననంటే దానికి కారణం రణధీర్"
"అవును ధీరజా! ఆరోజు రవితేజను పోలీసులు తరుముతూ కాల్పులు జరిపారు కానీ, అప్పుడు కాల్పులలో చనిపోయింది రవితేజ కాదు. అభినయ్ ను చంపడానికి వెళ్ళింది రవితేజ కాదు.అయన వేషంలో వెళ్ళిన మా కామ్రేట్..."
రణధీర్ జరిగింది వివరించాడు.
"మీ సాహసాన్ని ప్రత్యక్షంగా చూశాను రణధీర్ గారూ!మీలో వున్న మానవత్వం నాకు నచ్చింది.
దేశాన్నీ, ప్రజలనూ ఉద్దరిస్తాం అంటూ వేదికల మీద ప్రసంగాలు వినిపించి వాగ్దానాలు చేసే నాయుకులంతా మీకు దాసోహం చేయాలి" అన్నది ధీరజ.
"మ సిద్దాంతాలను గౌరవించేమనిషి ఆనందరావుగారు. ఒక విధంగా మా అభిమాని కూడా...
మా కోసమే ఎన్నికలలో నిలబడింది. కానీ విధి వక్రించి జయచంద్ర పన్నిన పద్మవ్యూహంతో చిక్కుకుపోయి అపనిందల పాలయ్యారు.
అందుకే అతని కొడుకుని రక్షించి అతనికి అప్పగించాం. నువ్వు కూడా మా బాటలోనే ప్రయాణిస్తున్నావు కాబట్టి నిన్నూ రక్షించాను. మన అందరి ధ్యేయం ఒకటే.... జయచంద్ర ఆగడాలను అరికట్టి అతనిని జైలుకు పంపడానికి ఎవరి కృషి వాళ్ళు చేయాలి."
జయచంద్ర పై ఎదురుదాడి ప్రారంభించడానికి పధక రచనలో మునిగిపోయారందరూ.
* * * *
రవితేజ బతికే వున్నాడు అన్న వార్తను ధీరజ పత్రికలలో ప్రచురించి సంచలనం సృష్టించింది.
ఆ వార్త పక్కనే ముకుళితహస్తాలతో చిరునవ్వు నవ్వుతున్న రవితేజ ఫోటోకూడా వేయడంతో ప్రజలు, ప్రభుత్వం నమ్మక తప్పలేదు.
జయచంద్ర కు మతిపోయినంత పనయింది.
సత్యమోహన్ ఖంగుతిన్నాడు.
రవితేజను స్వయంగా కాల్చిచంపిన సబ్ ఇన్ స్పెక్టర్ శక్తి హతాశుడయ్యాడు.
