అతన్ని ఎక్కువ మాట్లాడకుండా కట్ చేయాలి. కానీ ఎలా చెప్పాలనేదే తెలీడం లేదు.
ప్రశాంత్ అప్పుడప్పుడూ వచ్చినా అతనితో ఇంతసేపు ఒంటరిగా మాట్లాడ్డం ఇదేమొదటిసారి. ఎప్పుడూ అమ్మ
మాట్లాడేది!
"అమ్మ ఇప్పుడే రాదు" అంది. ఆ మాటతో అతను వెళ్లిపోతాడని ఆశించింది.
"వెరీగుడ్! మనకి కావాల్సింది కూడా అదే కామినీ! ఐ లైక్ ప్రైవసీ. రా ఇలా వచ్చి కూర్చో"
అన్నాడు.
కామినీ కిప్పుడు అతను గీస్తున్న లైను ఎలాంటిదో పూర్తిగా తేట తెల్లమైంది.
మనసు కీడు శంకిస్తోంది.
అమ్మలేదు. ఇంటి పక్కవాళ్లు కూడా లేరు. ఏదో సాకు చెప్పి తనే బయటికి వెళ్లిపోతే? అతనికి కోపం
వస్తే?
"కామినీ!" పిలిచాడు.
ఆమె తలెత్తి చూసింది.
"మీ అన్నయ్యని సాధ్యమైనంత త్వరలో బయటికి తీసుకొస్తాను"
నాలుగేళ్లుగా అజ్ఞాతవాసంలో వున్నాడు. పోలీసులకి దొరక్కుండా చేసి అతన్ని కాపాడాడు ప్రశాంత్.
"అన్నయ్య ఎలా వున్నాడు?"
"బాగానే వున్నాడు. డోంట్ వర్రీ. కేస్ లేకుండా చేసి అతన్ని బయటికి తీసుకొస్తాను."
"మాకోసారి అన్నయ్యని చూపించగలరా?" ఆశగా అడిగింది.
"అది చాలా ప్రమాదం. పోలీసులు అతనికోసం అనుక్షణం ప్రయత్నిస్తూనే వున్నారు" చెప్పాడు ప్రశాంత్.
కానీ ఒక విషయం ఆమె ఆలోచించలేకపోయింది. సూరిబాబు నిజంగా నేరం చేసినట్టయితే పోలీసులు వచ్చి
సూరిబాబు కోసం అమ్మనిగానీ, తననిగానీ ప్రశ్నించేవారేనన్న నిజాన్ని ఆమె తెలుసుకోలేక పోయింది.
తన మాటల గారడీతోనే వాళ్లని నమ్మించాడన్న విషయం ప్రశాంత్ కి మాత్రమే తెలుసు.
కామినీ కళ్ళలో నీరు నిలిచింది.
"పిచ్చిదానా! ఏడుస్తున్నావా? ఊరుకో!" అంటూ చొరవగా ఆమె దగ్గరకి వచ్చి కన్నీరు తుడిచాడు.
అనుకోని ఆ సంఘటనకి ఆమె బెదిరింది. రెండడుగులు వెనక్కి వేసింది.
ప్రశాంత్ కి అసహనంగా వుంది.
ఆఫ్ట్రాల్ ఓ సూరిబాబుగాడి చెల్లెలు, పేదది, దిక్కులేనిది, ఇంత బెట్టు చేయడం అతనికి చిరాకుని
కలిగిస్తోంది.
అతను కుర్చీలో కూర్చుని సిగరెట్ వెలిగించాడు. జేబులోంచి పర్స్ ని తీశాడు.
"కామినీ నీ చీరలన్నీ బాగా పాతవైపోయినాయి. నేనే కొని తీసుకు రావాలనుకున్నాను. ఆడవాళ్ళకి
చీరలు వాళ్లు కొనుక్కుంటేగానీ నచ్చవు. అందుకని వచ్చేశాను. ఈ డబ్బుతో నీకు నచ్చినవి కొనుక్కో."
పది వంద కాగితాలను తీసి అందించబోయాడు.
అతనే ఇదివరకు అమ్మకీ తనకీ చీరలు అప్పుడప్పుడూ తెచ్చేవాడు. తీసుకోకూడదు అనే ఆంక్షలేమీ లేవు.
కారణం తాము తింటున్నదే అతని సొమ్ము.
ఆమె అంతవరకే ఆలోచించిందికానీ, నిజానికి అతను తన అన్న చేత పుస్తకాలు రాయించి తన పేర్న
చలామణీ చేసుకుంటూ వేలకి వేలు సంపాదించుకుంటూ తమని ఉద్దరిస్తున్నట్లు నటిస్తున్నాడని ఆమెకి తెలీదు.
"అక్కడ పెట్టండి!' అంది.
అతను తమాషాగా నవ్వాడు.
"ఏం చేత్తో తీసుకోకూడదా?"
"కాఫీ తెస్తాను" అని లోపలికి నడిచింది కామినీ.
ప్రశాంత్ సిగరెట్ ని గుమ్మంలోంచి బయటికి విసిరేశాడు.
మెల్లగా చప్పుడు కాకుండా తలుపు గెడపెట్టి వంటగది గుమ్మంలో కొచ్చి నించున్నాడు.
కామినీ స్టౌ మీద గిన్నె పెట్టింది.
ఆమెని వెనుక నుంచి చూస్తుంటే అతనిలో వాంఛ చెలరేగింది.
పెద్ద జడ, సన్నని నడుము, ఎత్తయిన పిరుదులు, బలమైన తొడలు,..... కాలి పిక్కలు...
మెల్లగా ఆమె వెనక్కి వెళ్ళి భుజాలమీద చేతులేసి ఆమె చెంప మీద ముద్దు పెట్టుకున్నాడు ప్రశాంత్.
27
కామినీ ఉలిక్కిపడింది.
అతని చేతుల్ని విసురుగా తోసేసింది. ఊహించని ఆ పరిణామానికి ఆమె నివ్వెరపోయింది.
ప్రశాంత్ నవ్వి ఓ అడుగు ముందుకు వేశాడు. "ముద్దు బాగోలేదా?" అడిగాడు. అతనలా అడగటమే
చాలా అవమానంగా అనిపించింది కామినికి. ఆమె మొహం అవమానంతో ఎర్రబడింది.
ముక్కుపైన చిరుచెమట పోసింది. వస్తున్న కోపాన్ని గొంతులోనే దిగమింగుకొని.
