Previous Page Next Page 
డేంజర్ డేంజర్ పేజి 51

   
    ఆనందమూర్తి తీవ్రంగా ఆలోచిస్తూ తలపంకించి పెదవి కొరుక్కోటం తప్ప ఏమీ చేయలేక పోయాడు.    
    సతీదేవి చేత మాధవగురుదేవు ఎక్కడికి వెళ్ళాడు, ఎప్పుడు తిరిగి వస్తాడు అని చెప్పించటానికి ఆయింట్లో ఆనందమూర్తి తర్వాత మరో ముగ్గురు ప్రయత్నించారు. వాళ్ళలో ఒకరు సంగయ్య, మరో నౌకరు, వకదాసీది.    
    లాభం లేక పోయింది.    
    సతీదేవి ఒక్క ముక్క కూడా బయట పెట్టలేదు.    
    ఆ రాత్రి ఎనిమిది గంటల వేళ మేనేజరు మధుమూర్తి సతీదేవిని కల్సుకున్నాడు.    
    ఆ గదిలో సతీదేవి మధుమూర్తి తప్ప ఎవరూ లేరు. అయితే సతీదేవి మేనేజరుతో ఏదో మాట్లాడుతున్నదని గ్రహించి రహస్యంగా వినటానికి కిటికీ పక్కన చేరాడు ఆనందమూర్తి. పవర్ ఫుల్ టేప్ రికార్డ్ చిన్నది ఆన్ చేశాడు.    
    "కూర్చోండి మధుమూర్తిగారూ" అంది సతీదేవి.    
    మధుమూర్తి సోఫాలో కూర్చుంటూ "ఏదో మాట్లాడాలి అన్నారట...." అన్నాడువినయంగా.    
    "అవునుమధుమూర్తిగారు!" అంది సతీదేవి. అంత వరకే ఆ పైన విషయం మాత్రం చెప్పలేదు.    
    "చెప్పండి" అన్నాడు మధుమూర్తి.    
    మీరు ఏనాటి నుంచో ఈ యింటిని కనిపెట్టుకుని ఈ యింట్లో మనిషిలా వున్నవారు. మధుమూర్తిగారు మిమ్మల్ని ఎప్పుడూ మేము పరాయిగా చూడలేదు...    
    "ఇప్పుడు యిదంతా దేనికమ్మా" మధుమూర్తి బిడియంగ అన్నాడు.    
    మీతో ఒక రహస్యం చెప్పటానికి.    
    "రహస్యమా!"    
    "ఊ"    
    "చెప్పండమ్మా."    
    "కొద్ది కాలం నుంచీ వారి ప్రవర్తనలో మార్పు కొట్టోచ్చినట్లు కానవస్తున్నది. మీరేమన్నా గమనించారా!"    
    "ఊ....కాని దానికి బలమైన కారణం వుంది కదా యాక్సిడెంటులో తలకి దెబ్బ తగలటం, చాలా రోజులకిగాని కోలుకోక పోవటం....    
    "ఆ దెబ్బ తగిలింది యాక్సిడెంట్ లో కాదను కుంటున్నాను."    
    "ఏమిటి మీరనేది," మధుమూర్తి ఆశ్చర్యంగా అడిగాడు.    
    "ఏమిటి మీరనేది," మధుమూర్తి ఆశ్చర్యంగా అడిగాడు.    
    కిటికీ చాటున నుంచుని అత్యంత శక్తివంతమైన మినీ టేప్ రికార్డర్ తో వీళ్ళ సంభాషణని రికార్డ్ చేస్తున్న ఆనంద్ మూర్తి ఉలిక్కి పడ్డాడు సతీదేవి చెప్పింది విని.    
    "నా మనసులో మాట చెపుతాను. మీ అభిప్రాయం చెప్పాలి. అంతేకాదు మనమధ్య జరిగిన సంభాషణ రహస్యంగా మనమధ్యనే వుండిపోవాలి మధుమూర్తిగారు."
    "అలాగేనమ్మాచెప్పండి. మీ వుప్పు పులుసు తింటున్న వాడిని." వినయంగా గౌరవం వుట్టిపడే స్వరంలో అన్నాడు.    
    మధుమూర్తి తో ఏదో రహస్యంగా మాట్లాడటానికి స్తహీదేవి పిలిచిందని ఆనంద్ మూర్తి గ్రహించాడు. అందుకే చేతిలో ఇమిడేటంత చిన్న టేపురికార్డర్ తో కిటికీ పక్కన చేరాడు.    
    "వారి తలకి గాయం యాక్సిడెంటులో కాలేదని నా అనుమానం మధుమూర్తిగారు!"    
    "అనుమానానికి ఆధారం కావాలికదమ్మా!"    
    "అదే వివరంగ చెప్పబోతున్నాను వినండి. వారిని ఎవరో దేనికో బెదిరించారు. వారు వినలేదు, దాంతో అవతలి వారు వారి తలమీద కొట్టారు, గాయం బలంగ తగిలి వారు పడిపోయారు. వారింక లేవరనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. తలకి బలమైన గాయం తగిలినా నా అదృష్టం వారు బతికి బైట పడ్డారు.    
    అప్పటి నుంచీ వారు ప్రతిమాటకీ చిరచిర లాడటం మతిమరుపు, పరధ్యానం, అన్నీ వారిలో ఏర్పడ్డాయి. వకమాట పట్టుకుని కోప్పడేవారు, వెంటనే బాధపడే వారు, ఈ మధ్య ఏదో విషయంలో వారు తనలో తాను మధన పడటం చూసి అడిగాను. దానికి ఏదోచెప్పారు అది అంత నమ్మదగ్గ విషయంలా కనబడలేదు. అయినా నేను రెట్టించి అడగలేదు.    
    నాలుగు రోజుల క్రితం వారు ఆరోజు ఎందుకో అనీజీగ ఫీలవుతూ పగలంతా గడిపారు. ఎప్పుడు సర్దుకున్నారో తెలియదు, చిన్న బ్రీఫ్ కేసు సర్దుకుని తాళంవేశారు. పెట్టెలో ఏమి పెట్టారో తెలియదుగాని పెట్టె చాలా బరువుగా వుంది. ఏమిటంటే చెప్పలేదు. రాత్రి పన్నెండు దాటిందాకా వారు కిటికీ దగ్గరనుంచుని బైటికి చూస్తూనే వున్నారు.    
    ఉన్నట్లుండి ఏమైందో తెలియదు. నిమిషాలలో తయారయారు. "చాలా ముఖ్యమైన పనిమీద వెళుతున్నాను. రెండు రోజుల్లో వస్తాను. ఈ విషయం ఎవరికీ ఏమీచెప్పకు." అన్నారు. అంతే వెళ్ళిపోయారు ఆదర బాదరగ.    
    మధుమూర్తి గారూ! నేననుకోటం వారినెవరో బ్లాక్ మెయిల్ చేస్తున్నారేమోనని! బ్రీఫ్ కేసులో వారు పెట్టుకెళ్ళింది కూడా ఏదోవిలువైందే అయివుంటుంది. అదేమిటో మాత్రం నాకుతెలియదు.
    మధుమూర్తిగారు! మీకు ఈ యింటివ్యవహారాన్ని తెలుసు పెద్దవారు పిత్రుసమానులుగా భావించి మీకీవిషయం చెప్పాను. మామగారితో చేపుదామా అనుకుంటే మామగారికి చూపు ఆనటంలేదు. ఆరోగ్యం సరీగాలేదు. వారిని ఈ వయసులో బాధపెట్టటం ఎందుకని చెప్పలేదు. వారు వచ్చింతరువాత మీరు వారినోకంట కనిపెట్టండి. ఎవరైనా వారిని బ్లాక్ మెయిలు చేస్తుంటే వారెవరైనదీ గుర్తించండి, ఆతర్వాత విషయం చూసుకుందాము." అంతవరకూ చెప్పి ఆగింది సతీదేవి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS