Previous Page Next Page 
డేంజర్ డేంజర్ పేజి 50

   
    సతీదేవి మంచం మీదనుంచి లేచి పక్కగది తలుపులు తీసింది.    
    రెడీగా కుర్చీలో కూర్చున్న కీర్తి సతీదేవిని చూస్తూనే చటుక్కున పైకి లేచింది.    
    "మందు పనిచేసింది. గిల్లికూడా చూశాను లేవలేదు." సతీదేవి చెప్పింది.    
    "గుడ్. వెళదాం పదండి." అంటూ కీర్తి ముందుకు దారి తీసింది.    
    ఇరువురూ గదిలోకి వచ్చారు.    
    సతీదేవి మంచంకి ఓ పక్కగా నుంచుంది, కీర్తి అతని పక్కనే మంచం మీద కూర్చుని కన్ను ముక్కు దగ్గర నుంచి కొన్ని పరీక్షలు చేసింది. అనుమానం నివుర్తి కాగానే లేచి నిలబడింది.    
    "అవును కదూ!" డగ్గుత్తికతో అడిగింది సతీదేవి.    
    కీర్తి మాట్లాడకుండా తల తాటించింది.    
    "ఇహపై ప్రతి నిమిషం మనకి అమూల్యమైనది. గుర్తుంచుకోండి. ఏచిన్న పొరపాటు జరిగినా మొదటికే మోసం వస్తుంది దాంతో చాలా ఘోరాలు జరగవచ్చు." కీర్తి అంది.    
    నిజమేనన్నట్లు తల తాటించింది సతీదేవి.    
    సతీదేవిని అక్కడే వుండమని కీర్తి పెరట్లోకిదారి తీసింది.    
    ఇరవై నిముషాల తర్వాత ఆ యింట్లో చాలా మార్పులు జరిగాయి రెండో కంటికి తెలియకుండా.    
    మంచం మీద మత్తులో గాఢ నిద్రపోతున్న మాధవ్ గురుదేవ్ ని ఇరువురు వ్యక్తులు పెరటి మార్గం గుండా బయటికి తరలించారు.    
    మాధవ్ గురుదేవ్ లా తయారయిన ఓవ్యక్తి ఆదరాబాదరాగ మెట్లు దిగి అర్జంట్ పని వున్నదంటూ మోటార్ బైకు మీద చాలా వేగంగా బయటికి వెళ్ళిపోయాడు.    
    మాధవ్ గురుదేవ్ అలా బయటికి వెళ్ళటం ఆ యింట్లో పనివాళ్ళు ముగ్గురు చూశారు. ఆయనతో చిన్న బ్రీఫ్ కేసు వుంది.    
    ఇదంతా పూర్తయేసరికి దాదాపు గంట పట్టింది.    
    అంతా పూర్తయి గదిలో మిగిలిన సతీదేవి మంచంమీద పడుకుని దిండులో ముఖం దాచుకుని కుళ్ళికుళ్ళి ఏడుస్తుంటే కీర్తి ఆమె భుజం మీద చేయి వేసి ఊరడింపుగ రాస్తూ వుండిపోయింది.    
    అంతకు మించి కీర్తి మాత్రం ఏం చేయగలదు,
    
                                     34
    
    సరీగ నాలుగు రోజులు,    
    రాత్రివంటి గంట వేళ మాధవ్ గురుదేవ్ మోటారు బయికు మీద ఇల్లు విడచి వెళ్ళి ఈరోజుకి సరీగా నాలుగురోజులయింది.    
    ఎక్కడికి వెళ్ళాడు.    
    ఏమో!    
    అర్జంట్ గ అర్ధరాత్రి వెళ్ళే అవసరం ఏమిటి?    
    ఏమో ఎవరికీ తెలుసు?    
    మాధవ్ గురుదేవ్ ఇంట్లోంచి కంగారుగా మోటారు బైకుదాకా వచ్చి వేగంగ బయటికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళటం ఆ యింట్లో పనివాళ్ళు ముగ్గురు చూశారు. ఆ తర్వాత ఈ రోజు వరకూ అతను తిరగి రాలేదు.    
    సతీదేవి ముఖంలో దిగులు, మాధవగురుదేవు రాకపోవటంతో దాశీలు నౌకర్లు గుసగుస లాడుకున్నారు.    
    ఆనంద్ మూర్తి సతీదేవి దగ్గరకు వచ్చాడు. "అమ్మా!" అన్నాడు వినయంగా.    
    "అయ్యగారు ఎక్కడికి వెళ్ళారామ్మా" మళ్ళీ వెంటనే అడిగాడు.    
    "ఎందుకు?" సతీదేవి మామూలుగా అడిగింది.    
    "మేనేజర్ సాబ్ అడిగారు."    
    సతీదేవి కొద్దిసేపు ఆలోచించి "ఓసారి మేనేజరుగారిని రమ్మను." అంది.    
    "అలాగే, అయ్యగారు ఎక్కడికి వెళ్ళారమ్మా!" మళ్ళీ అడిగాడు ఆనంద్ మూర్తి.    
    "అయ్యగారితో అంత అవసరమా?"    
    "అవునమ్మా!"    
    "ఏమిటా అవసరం?"    
    "కొద్దిగా డబ్బు అడిగాను అవసరం పడి, యిస్తానన్నారు."    
    "అలాగా" అంది సతీదేవి అంతేగాని డబ్బు నేనుయిస్తాననిగాని ఫలానా అప్పుడు అయ్యగారు వస్తారు వారుఇస్తారులే అనిగాని అనలేదు.    
    "అయ్యగారు ఎక్కడికి వెళ్ళారమ్మా!"    
    "ఎక్కడికి వెళితే నీకెందుకు, ఈ ప్రశ్నకు జవాబు అంత అవసరమా?"    
    "ఉహు ఉహు" అంటూ తడబడ్డాడు ఆనందమూర్తి.    
    ఆ తర్వాత సతీదేవి ఏదో పని వున్నట్లు లేచి అక్కడ నుంచి వెళ్ళిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS