Previous Page Next Page 
ఆగ్నిశ్వాస పేజి 51


    ఆనందం ఆయాస పెడుతుందామెను.


    ఆయాసం క్రమంగా ఆవేశంగా మారుతుంది.


    "ఎంతటి దమ్మున్న మగాడివి" ఆమె కనురెప్పలు బరువుగా వాలిపోతున్నాయి. ఒక పెద్ద గేంగుకి సైతం సాధ్యం కాని అతి ప్రమాద భూయిష్టమైన కార్యాన్ని ఇంత సునాయాసంగా నిర్వర్తించగలిగిన ఓ పురుషుడా! నీ పొందుతో నా ఆడజన్మ సార్ధకత చెందాలనుకుంటూంది."


    ఆమె ఉన్మాదిగా మారుతున్నట్టు ఉచ్వాసనిశ్వాసాలు వేడి సెగల్ని చిమ్ముతున్నాయి. కాంక్ష ఉద్దీపితమౌతున్న సూచనగా ఆమె శరీరపు ఒంపులు రంపాల్లా అతడికి గుచ్చుకుంటున్నాయి.


    "డియర్ వాత్సాయనా" ఆమెలోని అరక్షణం క్రితపు సెలయేరు లాంటి తృష్ణ ఇప్పుడు జలపాతంగా మారింది. కోర్కె ఒంటిని శిలువ చేస్తుంటే కొండచిలువై పూర్తిగా అతడ్ని చుట్టుకు పోయింది. "రా... పాపం అలసి పోయుంటావు... ఈ జారుడు బల్లపై రవ్వంత సేపు విశ్రమించు... మత్తుగా మెత్తగా జారే అవకాశమిస్తాను. రాత్రంతా జాగరణ చేస్తానంటే ఈ శశాంకని అల్లుకుపోతాను. జాబిల్లిగా మారి కామశాస్త్రపు సరిహద్దుల దాకా తీసుకుపోతాను" పట్టు మరింత బిగుసుకుపోయింది.


    ఆమె ఒరిపిడిలో తల్పంపై తూలిన అనుభూతి. ఖజురహో శిల్పానికి ప్రాణమొచ్చినట్టు ఆమె సౌష్టవాన్ని కదిలిస్తుంటే కాల్చే కాంక్షకు వారధి వేస్తూ పట్టు విడిపించుకున్నాడు.


    "ఏం... జారవా" అంది ఓ జారుడు బల్లలా అతడి ముందు వాలుగా వాలిపోతూ.


    "జారినంతసేపు మత్తుగా మెత్తగా వున్నా ఎంత దిగజారిందీ జారేక గాని తెలీదు సోఫియా" శశాంక గొంతులోనే కాదు కళ్ళలో సైతం చెదరని నిశ్చలత్వం.


    "ఏం" ఆమె సన్నగా ప్రకంపించి పోతూంది నిన్ను సుఖపెట్టడానికి నేను పనికిరానా."


    "వచ్చింది ఓ పని కోసమే కాని సుఖం కోసం కాదు"


    "నిన్ను చూసిన నాటి నుంచి నేను కాలిపోతున్నానే" రొప్పుతుందామె.


    "అటువంటి ఆత్మీయతని వర్షించే ఆసరా కోసం ప్రయత్నించు... ఫలితముంటుంది"


    ఎక్కడి మగాడితడు. తన ఇంద్రియాలపై ఎంతటి నిగ్రహం. "ప్రేమించడానికి నేను అర్హురాలిని కానా" అసహనంగా పెనుగులాడుతూ అంది.


    "ప్రేమంటే శరీరాన్ని ఇష్టపడటం కాదు సోఫియా. మనసు అట్టడుగు పొరల్ని స్పృశించి అక్కడ నుంచి శరీరాన్ని స్పందింప చేయడం".


    "తెలుసు" ఏ స్మృతి శకలం మెదిలిందో ఏ గుండె అట్టడుగు పోత కదిలిందో ఆమె కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి. "ఎస్. ప్రేమంటే నాకూ తెలుసు."


    భావుకుడిలా నవ్వాడు. "ప్రేమకి అర్థం కోరుకున్నవాడి కోసం తనను తాను పోగొట్టుకోవడం సోఫియా. కోరిన వాడ్ని పోగొట్టుకునేటంత అశ్రద్ధగా వుండడం కాదు."


    శశాంక భావం ముందామెకి అర్థం కాలేదు.


    "నేను... నేను... నీకోసం నన్ను నేనైనా పోగొట్టుకోవడానికి సిద్ధపడనని ఎలా అనుకుంటున్నావు"


    "అంత జాగ్రత్తపడేదానివే అయితే" ఓ క్షణం ఆగేడు. "నేను వెళ్తున్న విషయం జయచంద్రకి తెలీయకుండా వుండేట్టు శ్రద్ధ తీసుకునేదానివి.


    షాక్ తిన్నట్టుగా చూసింది.


    "ఇక్కడ నేను నీజు గుర్తుచేస్తున్నది నాకు ప్రాణహాని జరుగబోయిందీ అన్న విషయం కాదు సోఫియా. ప్రేమంటే ఏమిటో తెలియచెప్పుతున్నాను. ఎస్. అంతే. బహుశా జాగ్రత్త తీసుకునే దానివేమో. కాని వ్యాపార బంధాలకే తప్ప మానసికమైన బంధాలకు అలవాటు పడకుండా పెరిగి వుండడంలో నువ్వు అసలు సిసలైన వ్యాపార దక్షతని మాత్రమే ప్రదర్శించావు కదూ."


    వెళ్ళిపోయాడు శశాంక.


    "వ్యాపార బంధాలకే తప్ప మానసికమైన బంధాలకు" అతడి మాటలు ఆ గదిలో ఇంకా ప్రతిధ్వనిస్తుంటే ఆమె కళ్ళు ఉక్రోషంగా నీళ్ళను వర్షించాయి.


    వేదనకి రోదనకీ వైవిధ్యత తెలీని స్థితిలో ఆమె గడగడా తాగింది. 'షివాస్ రీగల్'ని అందుకుని.


    అయిదు నిమిషాలు పట్టింది ఆమె తేరుకోవడానికి.


    అంతే. క్రోధంగా బాటిల్ ని నేలకి విసిరింది.


    "యూ సన్నాఫ్ బీచ్" కసిగా తిట్టింది శశాంకని.


    "ఎవరు నువ్వు. అసలు నిన్నెందుకు నేను కోరుకుంటున్నాను... కోరి ఎందుకు నా స్థానం నుంచి జారిపోతున్నాను. యూ డేమ్ ఫూల్... నాకు వ్యాపారబంధం కాక మానసిక బంధానికి అర్థమెలా తెలుస్తుంది." ఆమె ఉద్విగ్నతని అధిగమిస్తూ వెక్కిళ్ళు ఉధృతమౌతుంటే మామూలు ఆడపిల్లలా ఏడ్చేస్తూంది" నేను కోరని స్మృతుల శకలాన్ని సున్నితంగానైనా స్పృశిస్తున్న శశాంకా...  


    నేనెవరిననుకుంటున్నావు. నాలో ఏ రక్తం ప్రవహిస్తుందనుకుంటున్నావు. మూడేళ్ళ ప్రాయంలోనే అమ్మ పొత్తిళ్ళనుంచి నిర్దాక్షిణ్యంగా నేల జారిన ఆడపిల్లనయ్యా... ఒక్క లిక్కట్ బాటిల్ కోసం అప్పుడెప్పుడో కన్నతండ్రి చేతనే అమ్మబడిన అరుదైన అదృష్టవంతురాలిని. ఇంతకు మించి సంస్కారాన్ని నా నుండి ఎలా ఆశిస్తున్నావు... ఆ"


    నిభాయించుకోలేక పోతూనే లేచింది ఒక శక్తిలా... కాళిలా...


                                                          *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS