చిరంజీవి మైకు పట్టుకోగానే సూదిపడితే వినపడేంత నిశ్శబ్దం. అతడి ముందు దూరదర్శన్, ఆకాశావాణి వాళ్ళ మైకులతో కలిపి ఇరవై అయిదు మైకులున్నాయి . ప్రెసిడెంట్ కి కూడా పదహారుకన్నా యెక్కువ వుపయోగించరు.
"మహాజనులారా! నా భారత మిత్రులారా. "
సముద్ర కేరటంలా చప్పట్లు _ వెంటనే నిశ్శబ్దం. అందరూ ఉస్తుకతతో అతడు చెప్పాబోయేది వింటున్నారు.
"భారత దేశంలో ఉరిశిక్ష రద్దు చేయటానికి వీలులేదు అని కోర్టు మొన్నే మొన్నే (మే 9, 1981 న) బచ్చన్ సింగ్ పర్సేస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో తీర్పు ఇచ్చింది! నాలో ఆవేశం రాగాలటానికి కారణం అదే! ప్రపంచం అంతా ఉరిశిక్ష రద్దుకోసం ఆలోచిస్తూ వుంటే మనదేశం అమాయకుల్ని, విప్లవకారుల్ని ఉరి తీస్తుంది. బలమైనవాడు హత్యచేసి, బలహీనుడిమీద ఋజువుల్తో సహా రుద్దితే___ వాడు వురికంబం ఎక్కుతున్నాడు."
విపరీతమైన చప్పట్లు _అపమన్నట్టూ చిరంజీవి చెయ్యీ ఎత్తి, చెప్పటం మొదలుపెట్టాడు.
"...... బాత్రాకేసులో సెక్షన్స్ జడ్జి వోహ్రా..... 'సినిల్ బాత్రా అనే ఈ ముద్దాయిని చాలా దారుణమైన వ్యక్తిగా గుర్తించి అతడికి ఉరిశిక్షే సరి అయినడిగా భావిస్తున్నాను' అని జడ్జిమెంటు ఇచ్చాడు. 1981 లో ఇదే కేసు సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు జస్టిస్ సర్కారియా జడ్జిమెంటు చెబుతూ, 'మరణశిక్ష అనెదిఉ Rarest of the rare సందర్బాల్లోనే విధించాలి. ఈ కేసుని అంత దారుణమైన దాన్నిగా నేను పరిగినించటం లేదు. ముద్దాయి మరణశిక్షని యావజ్జేవ కారాగార శిక్షగా మారుస్తున్నాను' అన్నాడు.
ఒక మనిషిని చంపాలా. బ్రతికించి వుంచాలా అన్న వేర్వేరు దృక్పథాలు ఏంట కొద్దిలో మారుతున్నాయావుగామనిమ్చంది. మనిషి మరణానికీ, బ్రతుక్కి తేడా ఇంత చిన్నదా అని అలోచించినప్పుడు నా కర్తవ్యం నాకు బోధపడి ఇఇపోర్తానికి నన్ను ఆయత్తం చేసింది. మీ అందరి ఆశీర్వాదాలతో గెల్చాను."
వందలాది కెమెరాలు క్లిక్ మన్నాయ్ ..ల్. ఎవరో నీళ్ళు అందించారు... అవి తాగి చిరంజీవి ఉపన్యాసం కొనసాగించెడు.
"క్రిమినల్ ప్రొసీజర్ కొద కి కొత్తగా జత చేయబడిన సెక్షన్ 235 (2) మరింత అయోమయంలో పడేస్తుంది. హత్యల్లో పొడిచినా అవతలివ్యక్తి మరణించకపోతే మీకు ఉరిశిక్ష పడదు. మీరు మోచేతితో పొడిచి, వాడు ఛస్తే ఉరిశిక్ష ఖాయం. ఇంత బెవర్సుగా వుండి మన న్యాయశాస్రం ."
అతడామాట అనేసరికి జనం ఉత్సాహం కట్టలు తెంచుకుంది. తమ ప్రియతమ నాయుకుడికి దూరంగా వుండలేకపోయేరు. ప్రవాహంలా దగ్గర కొచ్చేసేరు. అమ్మాయిలూ చుట్టూముట్టి ఆటోగ్రాఫ్ లా కోసం ఎగపడ్డారు ఒకమ్మాయి ముద్దు పెట్టేసుకుంది కూడా. "ఏ కాలేజీ మీది" అడిగేడు "మేరీస్టెల్లా " అంది రహస్యంగా. ఒక చేత్తో సరిపోవటంలేదు, రెండు చేతుల్తో ఆటోగ్రాఫ్ లు పెట్టెస్తున్నాడు.
"ఒరేయ్ ! కళ్ళు మూసుకుని ఏమిట్రా ఆ భారతనాట్యం?"
గ్ంట్లి .... గ్ంట్లీ.....
చప్పున ఈ ప్రపంచంలోకి వచ్చేసేడు. తనవైపే తేల్లబోయి చూస్తున్నా స్పూర్తికి తన కళ విషయం చెప్పేడు.
"పగటికల కూడా సరీగ్గా కనలేవా బ్రదర్. ఢీల్లీలో మేరీస్టేల్లా కాలేజి యెక్కడుంది? విజయవాడలో కదా వున్నాది!"
"అంతేనంటావా. పోనీ ఢీల్లీ ఎక్స్ కర్షన్ కొచ్చారనుకోరాదూ అమ్మాయిలు !"
"ఎక్స్ కర్షన్ కొచ్చినవాళ్ళు కుతభ్ మీనార్, కొచ్చ్రనుకోరాదూ అమ్మాయిలు!"
"ఎక్స్ కర్షన్ కొచ్చినవాళ్ళు కుతభ్ మీనారూ, ఎర్రకోట చూడకుండా నీ ఉపన్యాసానికి ఎందుకోస్తారు!"
"కుతభ్ మీనారూ, ఎర్రకోటా చరిత్రలో ఎలా నిల్చిపోయాయో అలాగే చిరంజీవి పేరూ చిరంజీవి అవుతుంది. చూస్తూ వుండు."
"పోస్టు " అంటూ కవరు విసిరేసి వెళ్ళిపోయాడు పోస్టు బంట్రోతు.
అందమైన కవరు.పైన నీట గా 'చిరంజీవి' అని టిఫ్ చేసి వుంది. విప్పి చూసేడు. అందులో ఇలా వుండి ఇంగ్లీషు లో _
"ప్రియమైన మీకు (డియర్ సర్) .
జనవరి ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం ఆరింటికి మా ఇంట్లో ఇచ్చే 'కాక టెయిల్ ' పార్టీ కి మీరు వచ్చి, మీ కంపెనీతో నన్ను ఆనందింపచేయ ప్రార్ధన.
ఇట్లు
" సర్వోత్తమరావు, అడ్వకేటు."
కెవ్వున కేక పెట్టపోయి తమాయిమ్చుకున్నాడు చిరంజీవి.
సర్వోత్తమరావు!
దేశానికి పాల్కీవాలా ఎలాగో క్రిమినల్ లోలా సర్వోత్తమరావు అలాగా. అలాటి సర్వోత్తమరావు తనని పార్టీకి పిలవటం ఏమిటి? అతడు కవరు తిప్పి అడ్రసు చూసుకున్నాడు. తనదే!
"గురూ ఇది మనదే నంటావా?" అన్నాడు చిరంజీవి.
"నిస్సంశయంగా మనదే" అని నవ్వి "కాదని ఎలా అనికోమంటావ్? ఆ పాల్కీవాలా కారు డ్రైవరుకి మనకన్నా రెండురెట్లు ఎక్కువ జీతం రావొచ్చుగాక.... అయినా ఈ పార్టీకి నువ్వేళ్తున్నావ్" అన్నారు స్పూర్తి.
చిరంజీవి విస్మయంతో తలెత్తి చూసేడు.
"అవును గురూ. నువ్వీ పార్టీకి వెళ్తున్నావ్. 'తెలివైనవాడు అవకాశాల్ని వెతుక్కుంటాడు, అని వచ్చేవరకూ కాచుకుని కూర్చోడు అని ఆనాడు కవి కాళిదాసు. అలాంటిది పొరపాటో, గ్రహాపాటో నీకో ఆహ్వానం వచ్చింది. తంతే బూర్లెబుట్టలో పడ్డావు. రకరకాల బూరెలు, క్రిమినల్ లాయర్లు, హైకోర్టు జడ్జీలు, రాజకీయ నాయుకులు, గవర్నరు __ పాల్కీవాలా ఇంట్లో పార్టీ అంటే అందరూ వస్తారు. నువ్వూ వెళ్ళాలి . వెళ్తున్నావ్ " అని చిరంజీవి చేతిలోకవారు వణకటం చూసి, "అదేమిటి" అన్నాడు.
"భయం వేస్తూంది గురూ."
