రాజ్ ఆ పరిస్థితుల్లో పాఠం చెపుదామని చేతికి తీసుకొన్నా మనసు ఎదురు తిరిగింది.
"రేపు చెప్తాలే. వెళ్ళమ్మా" అన్నాడు. అతని పరిస్థితి కొద్దిగా ఊహించు కోగలిగిన సుగుణ మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది.
రాజ్ దీపం అర్పి పడుకొన్నాడు. వసంత దీన వాక్కులు అతని చెవిలో గింగురుమంటున్నాయి. తాను అంగీకరిస్తే ఆమె బ్రతుకు బాగుపడగలదు. తనవలన ఒకరి జీవితం బాగు పడినప్పుడు తనకు అంతకన్నా కావలసిందేముంది? ఏ ఘన కార్యాలూ చేయలేకున్నా కనీసం ఈ పనైనా చేస్తే చాలు. ఏమైనా సరే, మరునాడు వసంత ను కలుసుకొని రాత్రి తన ప్రవర్తనకు క్షమాపణ చెప్పుకొని ఆమె కోరిక నెరవేర్చాలి అని ఆశ్చర్య యించు కొన్నాడు.
క్రొత్త ఉత్సాహంతో కాలేజీ కి బయలు దేరాడు. రజియా అతన్ని చూసి అతనితో కూడ నడిచింది. అది రాజ్ కు కాస్త కష్టం గానే ఉంది. ఆమెను పరిశీలించాడు. ముస్లిం దుస్తులతో ఒక క్రొత్త అందంతో అలరారు తుంది ఆమె సాధారణంగా ముస్లిం ల శరీర చాయ గులాబీ రంగుతో పోటీ చేస్తుంటుంది. అందుకు తోడూ నీ మహా శిల్పో కష్టపడి శిల్పాన్ని చిక్కినట్లున్న అవయవముల పొందిక కలిగి, ఏ అజంతా శిల్ప సుందరో జీవం పోయబడి వచ్చినట్లుంది. ఆమె నడకను చూచి హంసలు సిగ్గుపడి దాక్కోంటాయి రాయంచ నుండి నడక నేర్చుకున్నట్లుంది. అయస్కాంత శక్తి ని మించిన ఆకర్షణ శక్తి ఆమె చూపులకు ఉన్నది. అమాయకత్వం ఉట్టి పడే ఆమె మొహం మనోరంజకంగా ఉంది. ఆమె తన ప్రక్కన నడుస్తుంటే ఏదో తెలియని ఆనందం అతన్ని ఆవరించి గిలిగింతలు పెట్టింది. అదొక గర్వంగా కూడ తలంచాడు రాజ్. ఇతరులు చూసి అసూయ పడేలా ఉంది వారి జంట.
కాలేజీ లో వసంత కోసం వెతికాడు. ఒక విద్యార్ధితో ఏదో కిలకిల నవ్వుతూ మాట్లాడుతున్న వసంత అతన్ని చూసి ఆ విద్యార్ధి చేతిలో చేయి కలిపి ముందుకు తీసుకు పోయింది. అది చూసి రాజ్ మదిలో ఎవరో సుత్తితో కొట్టినట్ల యింది. చేసేది లేక బాధతో వెను దిరిగాడు. వెనుదిరిగి పోతున్న అతన్ని చూసి ఏదో సాధించానని సంతృప్తి పడినా ఆవ్యక్తంగా బాధపడక పోలేదు. వసంత.
కాలేజీ నుండి తిరిగి వస్తుండగా "అదోలా ఉన్నారెందుకు?" అని అడిగింది రజియా.
"ఏం లేదు."
"అబద్దం . ఏదో దాస్తున్నారు. నాతొ చెప్పకూడదా?"
"నాకో సమస్య ఎదురైంది. చక్కటి సలహా యివ్వగలరా? చక్కని సలహా లిచ్చేవారే స్నేహితులన్నారు."
"మీకు సలహా లిచ్చే శక్తి లేదు కానీ నాకు తోచింది చెప్తాను. అదేమిటో చెప్పండి."
"నా స్నేహితుడొకడున్నాడు. అతణ్ణి ఒక అమ్మాయి అతనికి తెలీయకుండా ప్రేమించింది. ఆ అమ్మాయి నడత మంచిది కాదు. గుణమూ అనుమానస్పదమే. ఒకనాడు ఆమె అతనికి తన ప్రేమ వ్యక్త పరచి అంగీకరించమని దీనాతి దీనంగా ప్రార్ధించింది. ఆమె అంటే అతనికి అసహ్యం. ఒప్పుకోలేదు. అతడంగీకరిస్తే తన నడత సరిదిద్దు కుంటానని ప్రాధేయ పడింది. కానీ అతడు కఠినంగా ఆమె కోరిక తిరస్కరించి ఆ తర్వాత ఆమె బేలతనాన్ని తలచుకొని జాలి పడ్డాడు. అతడెం చేయాలి?'
"అతని వల్ల ఒక అబల జీవితం బాగు పడుతుంటే అతడు నిస్వార్ధ పరుడైతే ఆమె కోరిక మన్నించాలి."
"ఆ జవాబు విని తృప్తి పడ్డాడు రాజ్.
'సాటి ఆడదాని పక్షపాత బుద్ది చూపిస్తున్నారా?"
"లేదు. సంస్కారం గల వ్యక్తిగా అతడు నిరూపింపబడతాడనే ఆశతో చెపుతున్నాను."
ఆమె విశాల హృదయానికి సంతోషించాడు రాజ్.
"అతడలాగే నిర్ణయించు కొని ఈరోజు తన మనసులోని మాట చెప్పాలని పోయాడు. కానీ అక్కడ అనుకోని సంఘటన వల్ల తిరిగి వచ్చేశాడు. ప్రశాంతంగా ఉన్న నదిలో రాయి వేస్తె కలకలం బయలుదేరినట్లు సాఫీగా ఉన్న అతని జీవితంలో ఆ సంఘటన అశాంతి రేకెత్తించింది. అతనికి ఒక స్నేహితుడి గా ఏం సలహా యివ్వమంటారు?"
"ఆమె తన తెలివి తక్కువ వలన తన అదృష్టాన్ని కాల దన్ని, దురదృష్టాన్ని కౌగలించు కొంది. అతడికది మేలో, కీదో చెప్పలేం. మొత్తం మీద అతడది మరచిపోవడం మినహా మరేం చెయ్యలేడు. అదొక్కటే దారి. అంతకుమించి మంచి సలహా లివ్వగలిగే శక్తి నాలో లేదు."
"కృతజ్ఞుణ్ణి , ప్రయత్నిస్తాను." అని నిట్టూర్చాడు రాజ్.
ఇంతలో రజియా ఇల్లు సమీపించడంతో "త్వరగా వస్తారు కదూ?" అంది.
అలాగే నని తల ఊపి ముందుకు సాగిపోయాడు.
మరో అరగంట కల్లా రాజ్ అక్కడికి వచ్చాడు. లోపలికి వస్తూ బయట నున్న బోర్డు చూసాడు. "ఏంజల్ నివాస్" అని ఉంది. చిరునవ్వు నవ్వుకొని ముందుకు అడుగేశాడు. ఎదురుగా దేవత నిలబడి ఉంది. ఆ చిరునవ్వు కోక అర్ధాన్ని ఆపాదించు కొన్నాడు రాజ్. ఆ చిరునవ్వే ఎదురుగా ఉన్న రజియాకు ఉత్సాహాన్నిచ్చింది.
అక్కడ టీ త్రాగడం ముగించు కొని బయలుదేరారు.
"మీరు ఈ దుస్తుల్లో ఉంటె ఎవరూ మిమ్మల్ని ముస్లిం లనుకోలేరు. ఏ బ్రహ్మాణ లమ్మాయో నని భ్రమ పడతారు." అన్నాడు. రాజ్ ఆమెను చూసి.
"నిజం గానా, లేక ఎత్తి పోడుస్తున్నారా?' సిగ్గుపడింది రజియా.
"నిజం! దివి నుండి దిగి వచ్చిన దేవకన్య లా ఉన్నారంటే నమ్మండి" అని నాలుక కోరుకున్నాడు.
ఉప్పొంగి పోయిందా లేత హృదయం. ఆ మాటలు ఆమె మనసులో ఆనంద వాహిని పరుగులెత్తించాయి. ఏ క్షణం లో నైనా అది ఆమె మనో దౌర్భల్యాన్ని లొంగ దీసుకొని మతి విహీనురాలిగా చేయవచ్చును. అదే జరిగితే పరిస్థితులు ఎలా దారి తీస్తాయో తెలుసుకోలేం. కానీ వయసులో అందంతో ఉన్న ఆడది తన అందాన్ని గురించి పొగిడి నప్పుడు అంతకాన్నా ఆనందం లేదు. కావలసినది లేదు. ఆ క్షణం లో ఆమె అర్పించ లేనిది లేదు. చెయ్యకూడని పని ఉండదు. సర్వస్వాన్నీ అర్పించగలదు. నచ్చినవారు తన కిష్టమైన పొగడ్త లు చెపితే ఆమె కన్ని సుఖాలు, ఆనందాలు లభించి నట్లే అవుతుంది.
వారు అక్కడ కూర్చున్నారు. ఎవరి నోటా మాటలు రావడం లేదు. మూగగా యేవో మాట్లాడాలని అపెక్షిస్తున్నా అరికట్ట గలిగే శక్తి గలవారు కాబట్టి మౌనం వహించారు. వారి చుట్టూ నిర్మనుష్యమే. నిశ్శబ్దం తాండవిస్తుంది. అప్పుడప్పుడు అలలు వారి కాళ్ళ ను తాకుతున్నాయి. నీటి తుంపరులు మొహాల మీద పడి పులకింపజేస్తున్నాయి. అదో వింత అనుభూతి. వింతలో క్రొత్త ఉంది. ఆ వింత క్రొత్త అనుభూతి లో అంతులేని ఆనందం పెనవేసుకొని ఉంది. అది విడిపోని అనుబంధంగా మారవచ్చు.
ఇద్దరి మనసులూ ఒక విధమైన అవ్యక్తా నందానికి లోనయ్యాయి. రాజ్ హృదయం రజియా సాన్నిహిత్యం లో ఎన్నడూ ఎరుగని పరిపూర్ణ మైన సంతోషాన్ని చవి చూస్తుంది. రజియా తానాశించిన కలలు గన్న ఆనందాన్ని చూర గొంటుంది.
3
తానాశించిన విజయాన్ని సాధిస్తుంది వసంత. అందరిచేతా దాసోహం అనిపించుకొని తృప్తి పడుతుంది. ఆ తృప్తి వెనుకనే దాగి ఉన్న గర్వం ఆమెకు మరింత ప్రోత్సాహాన్నిస్తుంది. ఆమెను ఒక్క విషయం బాధిస్తుంది. క్లాసులో ఒక్క ప్రకాశం మాత్రం తనను లెక్క పెట్టడం లేదు. తన పడిగాపు ప్రియులందరూ తన కటాక్షానికి ఎదురు చూస్తుంటే అతడు కనీసం కన్నెత్తయినా చూడడు. ఎన్నోమార్లు అతని దృష్టి ని ఆకర్షించాలని ప్రయత్నం చేసింది. కానీ అది బూడిద లో పోసిన పన్నీరయింది. ఎందుకో తనను ధిక్కరించే మగవాడి పై ఆడదాని కంత ఇష్టమూ, ఆత్రుతా , ఆశా? కొరకరాని కొయ్యలా, తయారయిన అతడు ఎప్పుడూ వసంత మదిలో మెదులుతుంటాడు.
ఆనాడు క్లాసుకు కొత్త లెక్చరర్ గారు వస్తున్నారన్న సంగతి తెలుసుకొని విద్యార్ధులంతా ఆ వచ్చే లెక్చరర్ గారిని ఎడిపించాలని, భయపెట్టాలని తమ తమ ప్రయత్నాలలో మునిగి తేలుతున్నారు. వసంత కూడా ఆ తమాషా లో పాల్గొనాలని నిశ్చయించుకొంది.

లెక్చరర్ గారు వచ్చారు. చాలా చిన్న వయస్సు లోనే ఉన్నాడాయన. మనిషి చూడడానికి ముచ్చటగా ఉన్నాడు. అందగాడు కాడని చెప్పటానికి వీలులేదు. అటెండేన్సు తీసుకునే ముందు అందరినీ పరిచయం చేసుకోవాలని ఒక్కొక్కరినీ లేపి వారి పేరు, ఊరు మొదలగు విషయాలు తెలుసుకొన్నాడు. అప్పటికే అర్ధ పిరీయడు అయిపొయింది. ఆ తర్వాత అటెండేన్సు తీసుకొంటూ అందరినీ గమనించాడు. తన నంబరు వచ్చినప్పుడు వసంత కావాలని పలుకలేదు. అయన తలెత్తి క్లాసంతా కలియ చూసి తిరిగి పిలిచాడు. అప్పుడు లేచి మెల్లిగా పలికింది.
