2. విశ్వసందేశ లహరి
విశ్వయోగి దీక్ష విశ్వమానవ రక్ష
విశ్వయోగి దృష్టి విజయ వృష్టి
విశ్వయోగి బోధ విజ్ఞానమయ గాథ
విశ్వయోగి మాట! వెలుగుబాట!
* * * *
శ్రీ గురుదత్తాష్టకమ్
అఖండ సచ్చిదానందం అవధూత శిరోమణిం
అపార కరుణాసింధుం దత్తం వందే జగద్గురుమ్
భర్తారం సర్వలోకానాం హర్తారం విశ్వవిద్విషాం
కర్తారం పుణ్యకార్యాణాం దత్తం వందే జగద్గురుమ్
అనసూయా మహాసాధ్వీ హృదయానంద వర్ధనం
సద్పృత్తం సుమహోదాత్తం దత్తం వందే జగద్గురుమ్
మహాయోగీంద్ర మంతవ్యం దివ్య తేజో విరాజితం
భావ్యం త్రైలోక్య సంభావ్యం దత్తం వందే జగద్గురుమ్
ఉద్యద్భాను సహస్రాభం హృద్య మజ్ఞాన భంజనం
అనవద్యం త్రయీవేద్యం దత్తం వందే జగద్గురుమ్
విశ్వప్రియం విశ్వమయం విశ్వకల్యాణ కారిణం
విశ్వేశం విశ్వవిఖ్యాతం దత్తం వందే జగద్గురుమ్
త్రిముఖం త్రిగుణాతీతం త్రిమూర్తిం త్రిదళార్చితం
త్రిలోకారాధ్య చారిత్రం దత్తం వందే జగద్గురుమ్
అత్రి మౌనీంద్ర నిస్తంద్ర నిత్య సత్య తపఃఫలం
ప్రజ్ఞాన ప్రతిభాయత్తం దత్తం వందే జగద్గురుమ్
