Previous Page Next Page 
చాటు పద్యమణి మంజరి పేజి 5


    
    సీ.    అరయ నిర్వదియొక్క యక్షాహిణులతోడ
                  నిర్వదియొక్క మా ఱేఁగు దేంచే
        మధుర పై విడిసినమత్తు జరాసంధు
                   దునిమించె భీముచే దురమునందుఁ    
        గాలయవనుఁ డుగ్రుగతి నేత్తిరా వాని
                 ముచికుందుచే మృతిఁ బొందఁజేసే
        ఆశమంతకరత్న మరుదారఁగాఁ దెచ్చె
                  జాంబవంతుని గెల్చే జాంబవతిని
    
    ఆ.      వేడ్క బెండియాడె వెడలించె నపనింద
         జగతి కెల్ల మేలు సంఘటించే
         తెగి సృగాలవాసు దేవునిఁ దెగటార్చేఁ
         గృష్ణుఁ డితఁడు సర్వజిష్ణుఁ డితఁడు.

    సీ.     బదరికావనములోఁ బరగు ఘంటాకర్ణుఁ
                  డిచ్చఁ గొల్చినమోక్ష మిచ్చే నండ్రు
        కైలాసగిరిమీఁదఁ గాలకంధరముల
                   విబుధ సంస్తుతులచే వెలయునండ్రు
        గురువు తన్ వేఁడిన గురుదక్షణార్దమై
                   చచ్చినసుతునిఁ దెచ్చి చ్చెనండ్రు
        దుర్యోధనాధులు ద్రుపదనందన వల్వ
    
    ఆ.    కామగమన మగుచుఁ గడునోప్పు సౌంభకా
        ఖ్యానపురము జలధిఁ గలసేనండ్రు
        చరిత పుణ్యధనుఁడు భరితగోవర్ధన
        కందరుండు లోక సుందరుండు.

    సీ.    సమరంబులో జరాసంధా'దులను ద్రోలి
                    ప్రేమతో రుక్మిణిం బెండ్లి యాడె
        మురదానవునిఁ  గూల్చి నరకునిఁ బరి మార్చి
                    దివ్యకుండలములు దెచ్చుకొనియే
        విబుధకన్యలఁ బదార్వేలను విడిపించి
                    దయఁ జూచి మణిపర్వతంబు దెచ్చె
        సురలోకమున కేఁగి సురపతి నోడించి
                     సురభూరుహము దెచ్చె సురలు మెచ్చఁ

    ఆ.    బౌండ్ర వాసుదేవు బంధుయుక్తంబుగాఁ
        ద్రుంచి కాశిరాజుత్రు ళ్ళడంచె
        వాసుదేవు మహిమ వర్ణింప శక్యమే
        ఫాలనేత్రుకయిన బ్రహ్మ కయిన.

    సీ.    పరగ బాణాసురుపై నేఁగి యాతని
                   శోణిత పురమెల్లఁ జూఱలాడె
        ఆవురిఁ గాల్చి త్రేతాగ్నులు చల్లార్చి
                   పురపాశములు ద్రెంచి మురునిఁ గూల్చె
        బాణాసురుని వేయుబాహువులుఁ దెగనేసి
                    చండిక వేడినఁ జంపకునికి
        శివుఁడు దాఁ గోపించి శీతజ్వరము వైవ
                    వైష్ణవజ్వరమును వైచె నతఁడు

    గీ.    జృంభకాస్త్రంబుచే సొలఁ జేసె శివునిఁ
        బ్రేమతో ననిరుద్దునిఁబెండ్లిచెసేఁ
        గరుణ బాణునిఁ బట్టంబు గట్టె నితఁడు
        మూఁడుమూర్తుల కవ్వలిమూర్తి యితఁడు.

    సీ.    పాండు తనూజులపక్షమై  నోగ లెక్కి
                   రెండు సేనలయందు నిండియున్న
        బంధుజనంబుల బావల మఱఁదుల
                   నన్నధమ్ములఁ జూచి యనికిఁ దొడఁగి
        అనుకంపఁ జేసిన యార్తుని బోధించి    
                   పార్దుకు విశ్వరూపంబు సూపె
        అచ్చటఁ ఐదునెన్మి దక్షౌహిణులతోడ
                    భీష్మాది యోధుల పీఁచ మడఁచె

    ఆ.    ధరను మఱియుఁ బుట్టి దనుజులఁ బరిమార్చె
        భూమిభార మెల్లఁబుచ్చి వైచె
        నాదిదేవుఁ డయిన యాకృష్ణుఁ బ్రార్థించు
        నట్టివారు ముక్తు లయినవారు.
    
               అష్ట దిక్బాలకులు
               దుక్బాల స్తుతి

    
    చ.    హరిశిఖి ధర్మదైత్యవరుణా నిలయక్షశివుల్ గజాజకా
        సరనరనక్ర కైణహయశాక్వరయానులు వజ్రశక్తిము
        ద్గరశరపాశకుంత సృణికార్ముక హస్తులు భోగశుద్ధిసం
        గరజయశౌర్య సర్వజవకావ్యవిభూతులు మాకు నీవుతన్.

                     ఇంద్రుఁడు

    సీ.    బరావతో చైశ్శ్రవోదిరూఢుడుఁ నీల    
                   దివ్యదేహుడు పూర్వ దిగ్విభుఁడు
        శతమహాధ్వరకర్త శతకోటి హస్తుండు
                    బహుమహా పర్వత పక్షహర్త
        సౌందర్య లక్షణానంది శచీప్రియుం
                    డనుపమనందన వనవిహారి
        శతపత్రనిభదశశతదీర్ఘ నేత్రుండు
                    వారివాహ సమూహ వాహనుండు

    గీ.    యుక్తసన్మంత్రమఘఫలభోక్త నిత్య
        మఖినవ సుధార సైక పానాభిరతుఁడు
        విక్రమక్రమ దేవతా చక్రవర్తి
        శ్రీలు మీఱంగ మిమ్ము రక్షించుఁగాత.

    
                        అగ్ని
    
    సీ.    మేషవాహనుఁడు సుస్మితుఁడు చతుశ్శృంగ
                   ధరుఁడు విస్పురిత పక్షద్వయుండు
        సప్తసంఖ్యార్చిరం చద్భాహు జిహ్వుండు
                    మహనీయ పాదపద్మత్రయుండు
        స్వాహాస్వదాసతీ సహితపార్శ్వద్వయం
                     డరుణ సువర్ణ భాస్వరతనుండు
        లోహిత మహితవిలోచనుఁ డాజ్యపా
                     త్రస్రూక్సు వాదికో ద్యతకరుండు
    
    గీ.    అఖిలపితృ దేవతార్పితహవ్యకవ్య
        ధరుఁడు సర్వతోముఖుఁడు నిత్యశుచి యనలుఁ
        డిహపరానందముల నిచ్చి యేల్ల వేళ
        నంచితోన్నతి మిమ్ము రక్షించుఁగాత.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS