"సరే...నన్నేం చేయమంటారో చెప్పండి" పార్ధసారధి అడిగాడు.
"ఒక రెండ్రోజులు మీ యింట్లో షెల్టర్ యిస్తే చాలు. మా ఫ్రెండ్ బెంగుళూరు వెళ్లింది. తను ఈ లోపు వస్తుంది. తను రాగానే నేను వెళ్లిపోతాను" చెప్పింది చాందిని.
"అలాగే...నో ప్రాబ్లం... యీ ఇంట్లో నేను, నౌకర్లు తప్ప మరెవరూ వుండరు. నౌకర్లు రాత్రి కాగానే వెళ్లిపోతారు. మరి మీకేం అభ్యంతరం లేదా?" పార్ధసారధి అడిగాడు.
"ఆపదలో వున్న ఆడపిల్లకు సాయం చేయాలన్న మీ మంచి మనసు నాకు తెలుసు...మీ దగ్గర సేప్టీగావుండగాలన్ను...మరో రిక్వెస్ట్...నేను మీ నౌకర్లకు కూడా కనిపించకూడదు...నాకేదైనా మూల గది యిస్తే అందులో ఈ రెండ్రోజులు తల దాచుకుంటాను" అంది చాందిని.
"అదేం...?"
"నా గురించి పేపరులో పడింది. టి.విలో చూపించినా ఆశ్చర్యం లేదు. అలాంటి పరిస్ధితుల్లో మీ నౌకర్లు నన్ను చూస్తే..."
ఆమె భయం అతనికర్ధమైంది.
"అలాగే...మేడ మీద నాగదిలోకి ఎవరూ రారు. నేను పిలచేవరకు...నేను మరో గదిలో సర్దుకుంటాను" పార్ధసారధి అన్నాడు.
"అయ్యయ్యో...అలా వద్దు...నేను నేలమీద పడుకుంటాను. మీరు మరో గదిలో పడుకుంటే అనుమానం వస్తుంది మీ నౌకర్లకు" చాందిని భయంగా అంది.
అదీ నిజమేననిపించింది పార్ధసారధికి.
"అలాగే...ముందు నా గదిలోకి వెళ్దాం పదండి"అంటూ లేచాడు పార్ధసారధి.
"చిన్నరిక్వెస్ట్" అంది చాందిని.
"చెప్పండి"అన్నట్టు చూసాడు పార్ధసారధి.
"నేను మీ కంటే వయసులో చిన్నదాన్ని...నన్ను చాందిని అని పిలవండి చాలు"
ఒక్క క్షణం మౌనంగా వుండి ఆ తర్వాత అన్నాడు 'సరే' అని.
అర్దరాత్రి ఒంటిగంట.
పార్ధసారధి రివాల్వింగ్ చైర్ లో కూచుని ఆలోచిస్తున్నాడు. అతనికి గమ్మత్తుగా వుంది. ఓ అందమైన అమ్మాయి తన ఆశ్రయం కోరడం, అది తన గదిలోనే వుంటాననండం...
అతని భార్య చనిపోయాక చాలామంది మళ్లీ పెళ్లి చేసుకోమన్నా కూతురి కోసం పెళ్లి చేసుకోలేదు.
పార్ధసారధి గడమీద వున్న కూతురి ఫోటో వైపు చూసి...తల తిప్పి...పడుకున్న చాందిని వైపు చూసాడు.తన కూతురి వయసే వుంటుంది కానీ ఆమె మొహంలో తన కూతురు కనపడడంలేదు.
చాందిని హాయిగా నిద్రపోతుంది. పైట పక్కకు తప్పుకొని, ఆమె వక్ష సౌందర్యాన్ని వీక్షించ మంటున్నట్టుంది.
చీర కాసింత పైకి జరిగి ఆమె కాలి పిక్కలను చూపిస్తోంది. ఆమె పడుకున్న భంగిమ అతడ్ని రెచ్చగొడుతున్నట్టుంది.
చళ్లున ఎవరో చర్నాకోలాతో కొడుతున్నట్టు ఉలిక్కిపడ్డాడు. తనకిలాంటి ఆలోచనలోస్తున్నాయేంటి? ఎప్పడూ లేని ఈ ఆలోచనలు...
అతని మెదడు మొద్దుబారిపోయింది. వెంటనే లేచి, ర్యాక్ లో నుంచి బ్రాందీ బాటిల్ తీసి, గ్లాసులోకి వొంపుకుని అలాగే 'రా' తాగేసాడు.
గొంతులో మంట మొదలైంది.
అలా అరగంటసేపూ తాగుతూనే వున్నాడు. తర్వాత తూలుతూ మంచం దగ్గరికి వెళ్లాడు. తర్వాతేమైందో అతనికే తెలియదు.
ఎవరోవో రెండు చేతులూ తన నడుంను చుట్టడం తెలుస్తూ వుంది.అయినా మత్తులో వున్నాడు. బలవంతంగా కళ్లు తెరిచాడు.
తను...తను...చాందిని గుండెలమీద తల పెట్టి వున్నాడు.
"అయాం...అయాం వెరీ వెరీ సారీ" మత్తుగా అన్నాడు.
"నోప్రాబ్లం" అంది అతడ్ని మరింత దగ్గరగా హత్తుకుంటూ.
"ఇది...యిది తప్పకదూ"అతను మత్తుగా అన్నాడు.
"మనిద్దరికి యిష్టమైతే తప్పేమీ లేదు.మీరు మగ, నేను ఆడ"తన చిర కొంగును పక్కనపెట్టి అంది చాందిని.
"నో...నాకు నాకు నీ వయసున్న కూతురు...కూతురు వుంది" గొణుగుతున్నాడు పార్ధసారధి.
"ష్...మాట్లాడొద్దు డియర్... నాలాంటి కూతురేగానీ...నేను కూతుర్ని కాదుగా...డోంట్ బి సిల్లీ" అతడ్ని మీదికి లాక్కుంది.
పార్ధసారధికి ఏమిటేమిటో అయిపోతోంది. తనకేదో అయిపోతుందని అర్ధమైంది. అతని మనసు, అతని అధీనం తప్పింది. అతని శరీరం ఆమెకు అధీనమైంది.
ఆ అర్దరాత్రి ఓ చీకటి తప్ప జరిగిపోయింది. బలంగా వీచిన ఈ దురుగాలికి...ఎదురుగా గోడకు వేలాడుతోన్న పార్ధసారధి ఫోటో కిందపడి పగిలిపోయింది.
పార్ధసారధి పూర్తిగా ఆమె మీద వొరిగిపోయి " థాంక్యూ...థ్యాంక్యూ డాళింగ్...నీ కోసం...ఏం చేయమన్నా చేస్తాను" అంటున్నాడు.
"నాక్కావలసింది అదే" అనుకుంది చాందిని.
ఓ పదినిమిషాల తర్వాత లేచి, దుస్తులు సరిచేసుకుని బాత్రూంలోకి వెళ్లి ప్రెషన్ అయి బయటకు వచ్చింది.
ఎదురుగా బుక్ ర్యాక్ పక్కకు అమర్చిన వీడియో కెమెరాలో నుంచి క్యాసెట్ బయటకు తీసింది. ఇది నా చేతిలో వున్నంతవరకు యూ ఆర్ అండర్ అరెస్ట్ అనుకుంది క్యాసెట్ వైపు చూస్తూ, వికృతంగా నవ్వుతూ చాందిని..
* * *
ఈ వీడియో ఏర్పటు చాందిని చేసిందేనని పార్ధసారధికి తెలిసే అవకాశం లేదు. ఇదంతా ప్లాన్డ్ గా జరిగిందని కూడా అతనికి తెలియదు.
పార్ధసారది ఎప్పడైతే మందు నిషాల్లోకి వెళ్లిపోయాడో...అప్పడే చాందిని అన్ని ఏర్పాట్లు చకచక చేసేసింది.
బద్ధకంగా లేచి ఒళ్లు విరుచుకున్న పార్ధసారధి ఓసారి తన శరీరంవైపు చూసాడు. తన ఒంటిమీద దుస్తుల్లేవ్...మంచమ్మీద తనతో పాటు చాందిని వుంది...తనలాగే బట్టల్లేకుండా..
చిన్న వణుకు కలిగిందతని శరీరంలో...తనకేమైంది...తను చాందినిని ఏం చేసాడు? రాత్రి ఏం జరిగింది?ఆలోచిస్తూ వుండిపోయేడు.
రాత్రి తను కాస్త ఎక్కువ మోతాదులో బ్రాందీతాగాడు...ఆ తర్వాత...ఆ తర్వాతేమైంది?
అతని మెదడు వేడెక్కిపోతోంది. తెలియని మత్తులో, మత్తు తాలూకు ఆవేశంతో తను చాందినీని...
చాందిని మోకాళ్లు మధ్య తల పెట్టుకొని వెక్కుతోంది.
విభ్రాంతికర పరిస్ధితిలో వున్నాడు పార్ధసారధి. ఖచ్చితంగా చెప్పాలంటే షాక్ లో వుండిపోయాడు. ఇన్నేళ్లుగా చేయని తప్ప...యిప్పుడు చేసాడు...అదీ ఓ పెళ్లికాని ఆడపిల్లను...
రెండు చేతులతో తల పట్టుకున్నాడు.
బెడ్రూం తలుపు మీద చిన్నగా తట్టిన శబ్దం...
ఉలిక్కిపడ్డాడు.
పనివాళ్లయి వుంటారు..తనకు కాఫి తీసుకు రావడానికి వచ్చి వుంటారు.
ఇప్పుడేం చేయాలి?
అతనికే ఆలోచనా రావడంలేదు.
తలుపుమీద శబ్దం ఎక్కువైంది.
నైట్ గౌన్ తీస్కొని వేసుకున్నాడు.
చాందిని తన బట్టలు తీసుకొని బాత్రూంలోకి వెళ్లింది. పార్ధసారధి తలుపు సగం తెరిచి తల బయటకు పెట్టి నౌకరు వైపు కోపంగా చూసాడు.
"ఏంటి?" అడిగాడు చికాగ్గా.
"కాఫీ"
"ఇప్పుడేం వద్దు" అని తలుపు వేసుకోబోయేడు.
"మరి టిఫిన్?" కోపంగా అని తలుపు వేయబోతూ నౌకరుని పిలిచి...
" నేను చెప్పేవరకు ఎవరూ నా గది దగ్గరికి రావద్దు...యింపార్టెంట్ వర్క్ వుంది. డిస్ట్రబ్ చేయొద్దు. లంచ్ కు, డిన్నర్ కు కూడా పిలవోద్దు...అవసరమైతే నేను పిలుస్తాను"అని చెప్పాడు.
"అలాగేనండి" అంటూ నౌకరు భయంభయంగా వెళ్లిపోయాడు.
యజమాని ప్రవర్తన ఆ నౌకరుకు విచిత్రంగా తోచింది. ఎప్పడూ ఎతో కలుపుగోలుగా వుండే యాజమాని చికాకుపడుతూ వుండడం మొదటిసారిగా చూసేడు.
* * *
తలుపు వేసి వచ్చాక
మంచంమీద
కూచుని తల పట్టుకున్నాడు.
బట్టలు కట్టుకొని బాత్రూంలోంచి బయటకు వచ్చింది చాందిని.
ఆమె మొహంలోకి చూడాలంటేనే భయంగావుంది. పార్ధసారధికి. తనింటికి ఆశ్రయం కోసం వచ్చిన అమ్మాయిని...తల తీసేసినట్టుంది.
పార్ధసారధి భుజం మీద చేయేసింది చాందిని.
" ఆయామ్ వెరీ సారీ" పార్ధసారధి గొంతు జీరబోయింది.
"అందులో నా తప్పూ వుండి వుండొచ్చు" అంది అతని తలను తన గుండెల మధ్యకు చేర్చుకుని.
ఆశ్చర్యంగా చూసేడు పార్ధసారధి.
"జరిగిందేదో జరిగిపోయింది...నన్ను అన్యాయం చేయొద్దు". అతని తలను మరికాస్త గట్టిగా తన గుండెలకు హత్తుకుంటూ అంది.
"చాందినీ"
"యస్...ఆ దేవుడు మన తల రాతను యిలా రాసాడని సరిపెట్టుకుంటాను. అయినా మీకు...మీకేం తక్కువని...బ్రతికినన్నాళ్లు మీ సేవలో బ్రతుకుతా..."
"చాందినీ...నేను యాభై దాటిన ముసలివాడిని. ఓ పెళ్లీడు కొచ్చిన బొడ్డ తండ్రిని"
"కానీయండి...మీ అమ్మాయి యిక్కడ లేదుగా"
"లేదుకానీ"
"ప్లీజ్...యింకేం మాట్లాడొద్దు" అతన్ని తన మీదికి లాక్కుంటూ తను మంచంమీద వెల్లికిలా పడుకుంటూ అంది.
అతనిలోని మామూలు మగాడు నిద్రలేచాడు. తన బలహీనతను మరో సారి రుజువు చేసుకున్నాడు.
ఈ ప్రపంచంలో సెక్సు పవరేమిటో మరోసారి తెలిసింది.
ఆ రోజంతా పార్ధసారధి బయటకు రాలేదు.
అతడ్ని బోజనానికి పిలిచే సాహసం నౌకర్లు చేయలేదు. ఇంపార్టెంట్ కేసులు కూడా మరో సర్జన్ కి అప్పగించాడు. తను వూళ్ళో వుండడంలేదన్న అబద్ధం కూడా చెప్పేడు.
కూతురితో ఎక్కువసేపు స్పెండ్ చేయలేకపోయాడు. తండ్రి ఆబ్సెంట్ మైండ్ తో వున్నాడన్న అనుమానం కలిగింది కూతురు అపూర్వకు.
అదే విషయం తండ్రిని కూడా అడిగింది.
"డాడీ...మీరు అనిజీగా వున్నట్టురు? ఆర్వూ ఆల్ రైట్?"
తను బాగానే వున్నట్టు చెప్పాడు. ఎప్పుడు కూతురు ఫోన్ పెట్టేస్తుందా? అని ఎదురు చూస్తున్నాడు.
ఆ రోజంతా చాందినితో గడిపాడు. అతనికి ఇరవై యేళ్లు వెనక్కి వెళ్లినట్టనిపించింది.
లంచ్ కు కూడా భోజనం కిందనుంచి తెప్పించుకోలేదు.ఫ్రిజ్ లో వున్న బ్రెడ్,జామ్ తిన్నారు.
రాత్రి అవుతుండగా, ఓ నౌకరుని పంపి నాన్ వెజ్ ఐటమ్స్ హొటల్ నుంచి తీసుకురమ్మని పురమాయించారు.
పార్ధసారధి ప్రవర్తన అనుమానంగా వుంది నౌకర్లకు
* * *
రెండో రోజు నౌకర్ల అనుమానం బలపడింది.
తమ యజమాని పడగ్గదిలో ఎవరో ఓ అమ్మాయి వుందని వాళ్లకు అనుమానం కలిగింది.
లోపల్నుంచి మాటలు వినిపించడం, నవ్వులు వినిపించడం ఎప్పడూ కామ్ గా వుండే పార్ధసారధి నవ్వుతున్నాడు.
మూడ్రోజులు గడిచాయి.
ఈ మూడ్రోజులు మూడు క్షణాల్లా అనిపించాయి పార్ధసారధి కి. అతనిలో కొత్త వుత్సాహం తొంగిచూస్తోంది. చాందిని లేకపోతే తను బ్రతకలేనన్న నిశ్చయానికి వచ్చాడు.
చాందిని ఓట్రంప్ కార్డ్ అయింది. తన అందాలతో, తన సెక్సీ యిన్విటేషన్ తో పార్ధసారధి పూర్తిగా వశపర్చుకుంది.
క్రితంరోజు పార్ధసారధి కూతురు తండ్రికి ఫోన్ చేసినప్పుడు కావాలనే పార్ధసారధి ఫోన్ లిప్ట్ చేయలేదు.
అపూర్వ ఆశ్చర్యపోయింది. తన ఫోన్ రిసీవ్ చేసుకోకుండా తండ్రి కి ఎక్కడికి వెళ్లినట్టు? ఆ అనుమానంతో మరుసటిరోజు హాస్పటల్ కి ఫోన్ చేసింది.
మూడ్రోజులుగా హాస్పటల్ కి రావడం లేదని, యింపార్టెంట్ కేసులు కూడా మరో సర్జన్ కు అప్పగించారని తెలిసింది.
ఆమెకు మిస్టరీగా తోచింది.
వెంటనే యింటికి ఫోన్ చేసింది. నో రెస్పాన్స్. మరో నెంబర్ డయల్ చేసింది అపూర్వ. ఆ ఇంట్లో మూడు ఫోన్ లువున్నాయి.
ఒకటి తండ్రి పర్సనల్ ఫోన్. అది అతని బెడ్రూంలో వుంటుంది.అ నంబర్ తనకి తప్ప మరొకరికి తెలియదు.
కేవలం తనకోసమే ఆ ఫోన్ పెట్టించాడు తండ్రి.
మరొకటి హాలులో.
యింకోటి డ్తెనింగ్ హాలులో.
హాలులో ఫోన్ కూడా ఎవరూ లిప్ట్ చేయడం లేదు.
డ్తెనింగ్ హాలులో వున్న ఫోన్ కు డయల్ చేసింది.
వంట మనిషి అయ్యర్ ఫోన్ ఎత్తాడు చాలా సేపట్నుంచి మోగుతూండడంతో-
"నేను అపూర్వను మాట్లాడుతున్నాను"
"మీరా అమ్మాయి...నేను అయ్యరంకుల్ నమ్మా. ఎలా వున్నావమ్మా"అయ్యర్ గొంతులో సంతోషం.
అపూర్వ చిన్నప్పట్నుంచి అయ్యరంకుల్ అని పిలిచేది.
"నువ్వా అంకుల్...బావున్నావా? డాడీ యింట్లో లేరా?" అపూర్వ అడిగింది.
"అదీ... అదీ..." నసిగాడు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తోచక అయ్యర్.
"చేప్పండంకుల్...డాడీకి ఏం కాలేదుకదా?" అపూర్వ గొంతులో కంగారు స్పష్టంగా తెలుస్తోంది.
" డాడీకి ఏమీ అవ్వలేదమ్మ"
"మరింకేంటి...అసలు డాడీ యింట్లో వున్నారా? లేరా?"
"యింట్లో అంటే?" అయ్యర్ ఇంకా సందేహిస్తూనే వున్నాడు. పెళ్లికాని అమ్మాయి, అందులోనూ యజమాని కూతురు...నీ తండ్రి మరో అమ్మాయితో వున్నాడని చెప్పాలా?
"ఏంటంకుల్ ఆలోచిస్తున్నారు? ఓసారి డాడీని పిలవండి. డాడీ రూమ్ లోని ఫోన్ పాడయిందా?"
"అది...అదీ"
"చెప్పండంకుల్" విసుగ్గా అంది అపూర్వ.
"మళ్లీ ఐదునిమిషాల్లో ఫోన్ చెయండమ్మా...ఈలోగా డాడీకి ఈ విషయం చెప్తాను"
"అలాగే...వెంటనే డాడీతో నేను మాట్లాడాలని చెప్పు" ఫోన్ డిస్ కనెక్ట్ చేసింది.
తలుపుమీద శబ్దం విని, విసుగ్గా లేచాడు పార్ధసారధి. అతని కళ్లు ఎర్రగా జ్యోతుల్లా మెరుస్తున్నాయి.
చాందిని వాళ్లో వున్నాడతను.
తలుపుమీద శబ్దం అతడిని చికాకును కలిగించింది.
"అపూర్వమ్మ ఫోన్ చేసింది. మీ గదిలో ఫోన్ ఎవరూ ఎత్తడంలేదంటే, మరో ఐదు నిమిషాల తర్వాత ఫోన్ చేస్తానంది.మిమ్మల్ని మాట్లాడమంది" భయంగానే చెప్పాడు.
"యూ...స్టుపిడ్... నీకసలు బుద్దివుందా? నిన్నెవరు ఫోన్ ఎత్తమన్నారు. వెళ్లు...వెళ్లిక్కడ్నుంచి...మరోసారి ఈ యింట్లో ఏ ఫోనయినా ఎత్తితే చంపి పాతేస్తాను" కోపంగా అన్నాడు.
తల వంచుకొని వెనుతిరిగాడు అయ్యర్. మూడ్రోజుల్లో ఎంత మార్పు అనుకున్నాడు.
అతని మనసేదో కీడును శంకిస్తోంది. అతనికి క్రితం రాత్రి జరిగిన సంఘటన గుర్తొస్తాంది.
చాలా పోద్దుపోవడంతో తను యింటికి వెళ్లడం కుదరక హాలులోనే పడుకున్నాడు. ఆ విషయం పార్ధసారధికి చెప్పే అవకాశం రాలేదు. అప్పుడప్పుడు ఆలస్యమైతే హాలులో పడుకుంటాడు.
ఆ రోజూ అలాగే పడుకున్నాడు.
అర్దరాత్రి పదకొండు గంటలకు ఓ అమ్మాయి, పార్దసారధి గదిలోంచిబయటకు వచ్చి, హాలులో వున్న ఫోన్ లో నుంచి ఎవరికో ఫోన్ చేసుకుంది. లోగొంతుతో మాట్లాడింది.
తనని ఆ అమ్మాయి గమనించలేదు. కానీ తను ఆ అమ్మాయిని గమనించేడు. అందుకే అతని మనసు కీడును శంకిస్తోంది. ఈ యింటికి అరిష్టమేదో జరగబోతోందని అతని మనసు పదే పదే హెచ్చరిస్తోంది.
ఆ రోజంతా ఫోన్ మోగుతూనే వుంది. కానీ అయ్యర్ ఫోన్ ఎత్తలేదు పార్ధసారధి చెప్పినందువల్ల.
ఆ హాలులోనే కాదు, డైనింగ్ హాలులో కూడా అదే పరిస్ధితి.
అపూర్వకు టెన్షన్ గా వుంది. చివరగా ఓ నిర్ణయానికి వచ్చింది.
కృపాల్ కు ఫోన్ చేయాలన్న నిర్ణయం అది. ఇండియా వచ్చినపుడు ఫ్రెండ్ ద్వారా అనుకోకుండా పరిచయమయ్యాడు.
క్రైం బ్రాంచి ఇన్స్ పెక్టర్ కృపాల్.
తన ఫోన్ నెంబర్ యిచ్చాడోసారి. ఆ విషయం గుర్తొచ్చి కృపాల్ నెంబర్ వెతికింది. లక్కీగా ఆ నంబర్ దొరికింది అపూర్వకు.
* * *
మెల్లగా కళ్లు తెరిచాడు భార్గవ.
ఒక్క క్షణం అంత చీకటిగా కనిపించింది.
మరోసారి కళ్లు నలుముకొని చూసాడు.
మసకఃమసగ్గా కనిపిస్తోంది.
తననో చీకటి గదిలో వంచారని అర్ధమైంది భార్గవకు. తను ఎన్నిరోజులు ఈ చీకటి గదిలో వున్నాడో కూడా గుర్తురావడంలేదు. సన్నని వెలుతురు వస్తోంది చాలా ఎత్తులో వున్న వెంటిలేషన్ లో నుంచి.
వళ్లంతా నొప్పలుగా వున్నట్టు అనిపించింది. కాళ్లు కదపబోయాడు. అప్పుడు కలిగింది అనుమానం.
కాళ్లవ్తెపు చూసుకున్నాడు. రెండు కాళ్లకూ కలిపి గొలుసులాంటిది కట్టాడు. హ్యాండ్ కప్స్ మాదిరిగా వుందా గొలుసు.
కళ్లు నెమ్మదిగా చీకటికి అలవాటుపడ్డాయి.తనని స్టోర్ రూమ్ లాంటి దానిలో పడేసినట్టు అర్ధమైంది. విరిగిన కుర్చీలు, నేలంతా దుమ్ము పట్టి వుంది. ఓ మూలకు సత్తు పళ్లెం వుంది. దీనిమీద మరో పళ్లెం బోర్లించి వుంది. మెల్లగా ఆ పళ్లెం తీసాడు.
నాసిక పుటాలను తాకింది. పాచిపోయిన వాసన అన్నం పాచిపోయి వుంది. క్రితం రోజు అన్నంలా వుంది. తన కోసమా?
బుర్ర వేడెక్కిపోతోంది.
మెల్లిగా లేచి నిలబడ్డానికి ప్రయత్నం చేశాడు. అతి కష్టంమ్మీద నిలబడగాలిగినా కాళ్లు కదల్చడం కష్టమవుతోంది.
రెండు కాళ్లు దాదాపుగా కలిసిపోయినట్టు అయ్యింది గొలుసులు వుండడంవల్ల.
లీలగా గుర్తొస్తోంది.
తను మతిస్దిమితం లేని వ్యక్తిని తీసుకురావడం తలుపు తీయగానే తనని లోపలికి తోయడం-
అంటే యిదంతా ప్లాన్డ్ గా జరిగిందా?
ఆ ఆలోచన భయంకరంగా తోచింది.
భార్గవకు భార్య గుర్తొచ్చింది.
పాపం...తన కోసం స్టేషన్ లో ఎదురుచూసి వుంటుంది. యింటికొచ్చి కంగారుపడిపోతూ వుంటుంది. అసలు తనని యిక్కడ వుంచి ఎన్రోజు లైందో?
తనని ఎందుకిలా బంధించారో అర్ధంకాలేదు. తన మీద ద్వేషం ఎవరికీ వుంటుంది? తను ఎవరికీ హాని చేయలేదు.
తనిలా ఎన్రోజులు వుండాలి. ఏడుపొచ్చేస్తోంది భార్గవకు. బేలగా మారిపోయాడు.
పరిస్ధితులు మనిషి ధైర్యాన్ని దిగజారుస్తాయి. ఇప్పుడు భార్గవ వున్న పరిస్ధితి అలాంటిదే. తననెందుకు యిలా బంధించారో తెలియదు. తనెన్ని రోజులు యిలా వుండాలో తెలియదు. మెల్లిగా తలుపు తెరుచుకుంటోన్న శబ్దం. సన్నటి వెలుతురు తెరుచుకున్న ఆ తలుపు సందు గుండా గదిలో ప్రసరించింది.
'ఎవరూ...ఎవరు?' అడిగాడు భార్గవ.
అతని గొంతు బలహీనంగా వుంది.
"హ...లో...హౌఆర్యూ భార్గవ" ఓ గొంతు వినిపించింది.
ఆ గొంతు వినిపించిన వైపు కళ్లు చిట్లించి చూసేడు. అగ్గిపెట్టె తీసిన శబ్దం. అగ్గిపుల్ల గీచిన శబ్దం. చిన్న వెలుగు. క్యాండిల్ ముట్టించాడు.
క్యాండిల్ వెలుతురు ఆ గదంతా పరుచుకుంది.
ఎదురుగా మతిస్థిమితం లేని వ్యక్తి.
క్యాండిల్ వెలుతురులో అతని మొహం భయంకరంగా కనిపిస్తోంది.
'మీరు...నువ్వు"
"ఓహ్...ఆయామ్ డేవిడ్... జేమ్స్ డేవిడ్" చేయి ముందుకు చాపాడు.
"అంటే మతిస్దిమితం లేని వ్యక్తిగా నటించి".
"నో...నో...నో...నాకు నిజంగానే మతిస్దిమితంగా లేదు. ఎందుకో తెలుసా...నాకు స్దిమితంగా వుంటే నిన్నిలా తీసుకువస్తానా? ప్చ్" అతని మాటలు అదోవిధంగా వున్నాయి.
"ఏమిటిదంతా? అసలు నన్నెందుకు తీసుకువచ్చారు?"
నవ్వాడు జేమ్స్ డేవిడ
"ఏమో...నాకేం తెలుసు"
కోపంగా అన్నాడు భార్గవ 'ఆర్యూ మ్యాడ్, పగలబడి నవ్వాడు జేమ్స్ డేవిడ్.
"యస్...ఆయామ్ మ్యాడ్...ఎనీ డౌట్"అంటూ జేబులో నుంచి నైఫ్ తీసాడు.
భయంగా చూసాడు భార్గవ.
ఆ నైఫ్ తో తన మణికట్టు దగ్గర చిన్న గాటు చేసుకొని భార్గవైపు చూసి నవ్వాడు.
రక్తం చివ్వున చిమ్మింది.
జేమ్స్ డేవిడ్ ఆ రక్తన్ని తన నాలుకతో అద్దాడు.
"స్వీట్...వెరీ స్వీట్...యూనో రక్తం ఎంత స్వీట్ గా వుంటుందో తెలుసా...చూడు..చూడు చూడు...కొద్దిగా టెస్ట్ చేస్తావా?"
ఒళ్లు గగుర్పొడిచింది భార్గవకు.
"రక్తం బావుంటుంది. "ఐలైక్ బ్లడ్" జేమ్స్ డేవిడ్ మాట్లాడుతుంటే పిచ్చేక్కిపోతోంది భార్గవకు.
"నీకు...నీకేం కావాలి?" భార్గవ భయంగా అడిగాడు.
మళ్లీ నవ్వాడు జేమ్స్ డేవిడ్.
"ఏమిస్తావ్...నీ వొంట్లోనీ రక్తాన్నిస్తావా?"
ఒక్క క్షణం బిత్తరపోయి, బిక్కచచ్చి వెనకడుగు వేసాడు భార్గవ.
తనని చంపి తన రక్తం తాగేట్టు వున్నడనిపించింది భార్గవకు.
"పోనీ...నీ రైట్ హ్యాండ్...లేదా లెప్ట్"
"నువ్వలా మాట్లాడొద్దు...నాకు భయమేస్తుంది" నిజంగానే భయంతో వణికిపోతూ అన్నాడు భార్గవ.
"ష్...మాట్లాడొద్దు...నేను చెప్పిందే వినాలి" అన్నట్టు మీ బ్యాంకులో క్యాష్ ఎంతుంది?"
ఒక్క క్షణం గుండె గుభేలుమంది.
"ఎ...ఎందుకు?"
"పోనీ నా ఒంట్లో రక్తం ఎంతుందో చెప్పు?"
గొంతు తడారిపోయింది భార్గవకు.
"భయమేస్తోందా? పోనీ యింటికి వెళ్లిపోతావా? మరి నన్ను పట్టిస్తే యిచ్చే రివార్డు వొద్దా?
"వద్దు...నాకేమీ వద్దు...నన్ను మా యింటికి పంపించేయ్...నీకు పుణ్యముంటుంది...ప్లీజ్"రెండు చేతులు జోడించాడు భార్గవ.
"అప్పడేనా?" జేమ్స్ డేవిడ్ గొంతులో వ్యంగ్యం.
"నాకు భయమేస్తోంది నిజంగా భయమేస్తోంది" చిన్న పిల్లాడిలా వణికి పోతున్నాడు భార్గవ.
"నీకు భయమెందుకు? నేనున్నాగా?" జేమ్స్ డేవిడ్ అన్నాడు.
"అందుకే భయం" అని అన్లేక పోయాడు భార్గవ.
"ఓ.కె.బై..రేపు కలుద్దాం...అన్నట్టు" అంటూ జేబులో నుంచి ఓ కవర్ తీసాడు. ఆ కవర్ లో బస్ వుంది" మూడ్రోజుల క్రితం బన్ను నీ కోసమే తెచ్చాను...తింటావా? తిను తిను?అంటూ ఆ కవర్ భార్గవకు యిచ్చాడు.
"నాకొద్దు...నాకేమి వద్దు...నన్ను పంపించేయ్" బలహీనంగా వుంది భార్గవ గొంతు.
