Previous Page Next Page 
ఆగ్నిశ్వాస పేజి 49


    "ఇట్స్ టూ లేట్"


    "ఇట్ కాంట్ బి" కంపించిపోతూ అరుస్తూంది.


    "నో యూ కాంట్..."


    అవతల ఫోన్ క్రెడిలైన చప్పుడు.


    శిలలా క్షణం నిలబడి యాంత్రికంగా రిసీవర్నుంచింది.


    అంత ధైర్యం కల వినీల లిప్తపాటులో పసిపిల్లగా మారిపోయింది.


    శశాంక షిప్ పైకి ఎందుకు వెళ్ళాడు?


    ఏమైపోతున్నాడు ?


    నిజంగా ఏదన్నా హాని జరిగాకనే తనకి ఫోన్ చేసారా?


    సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఆమె నలిగిపోతుండగానే భగ్గున చప్పుడైంది.


    పగిలిన కిటికీ అద్దాల్లో నుంచి మాస్క్ లు వేసుకున్న నలుగురు వ్యక్తులు ఆమెను చుట్టుముట్టారు మెరుపు వేగంతో.


    రిసీవర్ని అందుకోవాలని వుంది.


    కాని అప్పటికే ఆలస్యమై పోయింది.


    అక్కడ సముద్ర జలాల్లో...


    డెక్ పై 'జంక్స్' చేరిన గార్డులు శశాంక కనిపించక పోవడంతో ముందు ఖంగుతిన్నారు.


    జాకీతోపాటు శశాంక కూడా అక్కడ దాక్కోవడం ముందే చూసిన 'క్రూ' అంతా ఎంత హడావుడి పడ్డారూ అంటే మెరుపు వేగంతో సెర్చి లైట్సు తీసుకుని డెక్ అంతటినీ గాలించడం మొదలుపెట్టారు.


    ప్రయోజనం లేకపోయింది. సహనాన్ని కోల్పోయిన యమగూచీ సెకెండ్ ఆఫీసరుతో ఏదో అన్నాడు.


    మరుక్షణం 'జాకీ' పొట్టలో బలంగా గుద్దిన సెకెండ్ ఆఫీసరు చెప్పు... నీ స్నేహితుడెక్కడ" ఇంగ్లీషులో అడిగాడు.


    జాకీ జవాబు చెప్పలేదు.


    చిత్రహింసలు ఉధృతమయ్యాయి కాని జాకీ పెదవి విప్పలేదు.


    చీఫ్ ఆఫీసర్ ని పిలిచి షిప్ అంగరు వేయించమని ఆదేశించాడు 'ఎకో సౌండర్'తో సముద్రం లోతు చూస్తే అది లంగరుకి అనుకూలంగా లేదు.


    అయినా ఓడ ప్రయాణం ఆగింది అయిదు నిమిషాల్లో లంగరుతో కాదు. కేవలం నీటిపై తేలే 'డ్రిఫ్ట్' పద్ధతిలో.


    ఎంత టార్చర్ చేసినా జాకీ అంతటినీ భరిస్తున్నాడు తప్ప తన మిత్రుడి ఆచూకీ తెలియచేయకపోవడంతో 'డేమిట్' అంటూ తన కేబిన్ లోకి ప్రవేశించాడు యమగూచీ.


    అలా అక్కడకు చేరింది కేబిన్ ఐరన్ సేఫ్ లో 'గోల్డ్' క్షేమంగా వుందో లేదో చెక్ చేయాలనే.


    ఉలికిపడ్డాడు ఓ ఆకారం సేఫ్ పక్క నుంచి వేగంగా వచ్చి రివాల్వర్ పక్క టెముకలకి గుచ్చడంతో.


    గట్టిగా కేకవేయబోయిన అంత భారీ కాయుడికి అరక్షణంలో ఒళ్ళంతా చెమట పట్టేసింది.


    "ఎలా... కేబిన్ లోకి ఎలా వచ్చావు" ఆక్రోశిస్తున్నట్టుగా అడిగాడు శశాంకని.


    "మీరంతా మా రాకని ముందే గుర్తుపట్టారని తెలుసుకున్నాను యమగూచీ! అందుకే నా టెక్నిక్ ని నేను వాడాను. మా కదలిక కోసం ఎదురుచూస్తున్న నీతోబాటు నీ క్రూ మొత్తం దృష్టి మళ్ళించాలని మా వాడిని పంపాను మీరు గుర్తుపట్టేట్టు ముందుకు ప్రాకమని. అంతే జాకీ చేరిన మీరంతా రెండు క్షణాలపాటు అజాగ్రత్త చూపించారు. అదే మేము అవకాశంగా తీసుకున్నది. మిస్టర్ యమగూచీ నా అనుచరుడి ప్రాణం కన్నా నీ ప్రాణం విలువైనదీ అనుకుంటే ముందక్కడ టార్చర్ ఆపమని ఆదేశించు."


    యమగూచీ మెదడు వేగంగా ఆలోచిస్తోంది.


    "వ్యవధి లేదు మిస్టర్ కెప్టెన్. తాత్సారం చేస్తే నీ ప్రాణాలు తీస్తాను" రివాల్వర్ ని మరింత లోపలికి నొక్కి పట్టుకున్నాడు కర్కశంగా చూస్తూ.


    చేసేదేమీ లేనట్టు యమగూచీ కేబిన్ ద్వారాన్ని చేరుకుని 'స్టాప్' అరిచాడు.


    ఇంతవరకు కేబిన్ లోపల యమగూచీ ఏం చేసిందీ అప్పటికి గాని గుర్తించని క్రూ మొత్తం కంగారుగా రెండడుగులు ముందుకేయగానే చివరి హెచ్చరికగా అరిచాడు శశాంక. "మీ స్వామి భక్తిని తర్వాత అభినందిస్తాను ముందు నేను చెప్పింది వరుసగా ఒక్కోటి చేయండి. లేకపోతే మీ కెప్టెన్ ప్రాణాలు పోతాయి. తర్వాత మీ యాజమాన్యానికి సంజాయిషీ ఇవ్వలేక మీ అసలు వ్యవహారం బయటపడిపోతుంది"


    ఈ చివరి వాక్యం ఎంత బలంగా పని చేసిందీ అంటే క్రూ అంతా కట్టెలా బిగుసుకుపోయారు.


    "నెంబర్ వన్... ముందు మీ ఆయుధాలు ఒక్కోటీ సముద్రంలో విసిరేయండి..."


    ఆలోచిస్తున్నారంతా.


    "క్విక్..." ఈసారి మరో రివాల్వర్ యమగూచీ వెన్నెముక్కి ఆనించాడు శశాంక రెండో చేత్తో.


    పరిస్థితి విషమిస్తుందని గ్రహించిన క్రూ అంతా ఒక్కో ఆయుధాన్ని సముద్రంలోకి విసిరేశారు. ఓ క్రూ మెంబర్ కేబిన్ పక్క నుంచి జారుకోబోతుంటే జాకీ అడ్డగించి అతడి ఆయుధాన్ని లాక్కుని నీటిలోకి విసిరాడు.


    "జాకీ! క్రూ మొత్తం డెక్ పై వున్నారో లేదో చెక్ చెయ్"


    రెండు నిమిషాలలో చెప్పాడు కెప్టెన్ తో కలిసి నలభై రెండు మంది డెక్ పైనే వున్నట్టు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS