ఆఖరిసారిగా ఆమె నోటి వెంట వినకూడని మాట విన్నాడు. రవితేజ తోడబుట్టిన వాడని తెలిసింది. అతను ఏ విధంగా తనకు సోదరుడు అయ్యాడు?
అతని మరణ వార్తను విని తట్టుకోలేకనే తన తల్లి ఈ స్థితికి వచ్చింది.
అంటే, అతని పట్ల తన తల్లికి వున్న ప్రేమాభిమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నో రకాల ఆలోచనలు అతని మనసుని తొలచి వేస్తున్నాయి.
అసలు నిజం తెలియాలంటే తన తల్లి గళం విప్పాలి!
* * * *
హోటల్ అశోకా ఇంటర్నేషనల్__
ధీరజ రిసెప్షన్ ముందు ఆగింది.
"ఎకామడేషన్ ప్లీజ్...."
ఆమె వేసుకున్న బెల్ బాటమ్ టైట్ షర్ట్ లోపల వున్న శరీర భాగాలను ఊహించుకుటున్నరిసెప్షనిస్ట్ ఆమె స్వీట్ వాయిస్ ఉలికిపడ్డాడు.
చిరునవ్వుతో మోచేతులను కౌంటర్ పై ఆనించి నిలుచుని వుంది ఆమె.
రిసెప్షనిస్ట్ చూపులు ఆ ప్రయత్నంగా ఆమె ఎద పైకి మరలాయి.
పై బటన్ పెట్టకపోవడం వలన లోనెక్ బ్రాలో నుంచి కనిపించీ కనిపించినట్టు ఎద పొంగులు తొంగి చూస్తున్నాయి.ముందుకు వంగి వుండడం వలన ఆ అందాల ఒంపుల సొంపులు మరింత రెచ్చగొడుతునట్టు వున్నాయి.
అతను పెదవులను తడుపుకున్నాడు.
"మిస్టర్... నేను రూమ్ కావాలని అడుగుతుంటే మీరు చేస్తున్న పనేమిటి?"
ఆమె గొంతులో చిలిపితనం వుంది తప్ప మదలింపు లేకపోయే సరికి అతనికి దైర్యం వచ్చింది.
"చూస్తున్నాను మేడమ్..."
"ఏమిటి?"
అదే... అది... అది.."
"ఏమిటిది?"
అబ్బే... ఏమీలేదు... ఇక్కడ సంతకం చేయండి. ఈ గది మీ స్వంతం అవుతుంది" రిజస్టర్ ఆమె ముందు వుంచుతూ గబా గబా చెప్పాడతను.
"స్వంతం కావడం ఏమిటి?"
"అబ్బే... మీకు కాదు... అవి నాకు స్వంతం అవుతాయి..."
"ఏమిటి మిస్టర్... తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు. మతి ఏమయినా చలించిందా?" క్రీగంట అతనని చూస్తూ ధీరజ కామెంట్ విసిరింది.
"అవును మేడమ్.... ఇప్పటిదాకా బాగానే వున్నాను. ఇప్పుడే నాకు ఏదో అయినట్టు తెలుస్తుంది"
వాలెట్ లోనుంచి రెండు వందల రూపాయల నోట్లు తీసి అందిస్తూ, అతడు ఇచ్చిన రూమ్ తాళం అందుకుంటూ సూట్ కేసుని తీసుకుని ధీరజ ముందుకు కదిలింది.
"మేడమ్ వెయిట్ ఎ మినిట్... సర్వీస్ బాయ్ ఉండగా మీకెందుకా శ్రమ...."
బెల్ నొక్కి సర్వీస్ బాయ్ ని పిలిచాడు.
ధీరజ లిఫ్ట్ లోకి అడుగు పెడుతూ ఓరగా రిసెప్షనిస్ట్ వేపు ఒక లుక్ వేసింది.
ఆ చూపులకు డంగయిపోయాడతను....
లిఫ్ట్ పైకి వెళ్ళాక తనలో తనే నవ్వుకుందామె.
"పాపం పూర్ ఫెలో... అరగంట తిరిగేసరికల్లా ఏం కావాలి మేడమ్ అంటూ తనముందు వుండి తీరతాడు" అనుకున్నది ధీరజ.
ఆమె వూహించినట్టుగానే అరగంట కూడా కాకముందే వచ్చి వాలాడు.
"మేడమ్.... ఇఫ్ యూ డోంట్ మైండ్.... మీకు ఏది కావాలన్నా నాతో చెప్పండి. మీలాంటి అందమైన వారికి హెల్స్ చేయడం అంటే నాకు సరదా... మై నేమ్ ఈజ్ సతీష్! మీరు ఏమీ అనుకోనంటే ఒక మాట చెప్పమంటారా?"
ధీరజ చెప్పమన్నట్టు చిరునవ్వుతో తలూపింది.
"మీరు ఏ డ్రస్ వేసుకున్నా అందంగానే వుంటారు. మీరేరె అందముగా ఉంటారో, లేక మీ ఒంటిపైకి వచ్చాక ఆ డ్రస్ కే అందం చేకూరుతుందో చెప్పడం కష్టం"
ధీరజ అతని మాటలకు ఫక్కున నవ్వింది.
"లవ్లీ స్మైల్... మీ నవ్వు వింటుంటే మల్లెలవర్షం కురుస్తున్నట్టు ఉంది మేడమ్"
"థాంక్స్ మిస్టర్ సతీష్....మీలాంటి స్నేహితుడు దొరకడం నాకు చాలా ఆనందంగా వుంది."
"మేడమ్! మీరు ఏ పనిమీద వచ్చారో, ఎన్నిరోజులు వుంటారో తెలుసుకోవచ్చా?"
"ఓ ఎస్... నేను వచ్చిన పని నీలాంటి ఆత్మీయుల వలనే అవుతుంది కూడా"
ఆమె మాటలకు సతీష్ గుండె ఝల్లుమంది.
"చెప్పండి మేడమ్.... నేను మీకు ఏ సహాయం చేయగలను..."
"మా అంకుల్ కు బొంబాయిలో వ్యాపారం వుంది. చిన్నతనంలోనే మా ఫ్యామిలీ బొంబాయి వెళ్ళిపోయింది. మా అంకుల్ వ్యాపారం పనిమీద అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తుంటాడు.
కొన్ని రోజుల క్రితం తన ఇద్దరు పార్టనర్స్ తో ఈ వూరు వచ్చి మీ హోటల్లోనే దిగాడు.
తర్వాత నాకు ఫోన్ చేసి అర్ధం పర్దంకాని రీతిలో అదేదో మాట్లాడి ఫోన్ పెట్టేశాడు.
"తర్వాత ఎవరో హత్యచేసినట్టు తెలిసింది" ధీరజ బాధను నటిస్తూ చెప్పింది.
"ఓ.. ఆ విషయమా... ఆ ముగ్గురిలో ఒకరు మీ అంకుల్ అన్నమాట... ఆ మూడు హత్యలు అప్పుడు సంచలనం సృష్టించాయి కూడా. ఆరోజు డ్యూటీలో వున్నది నేనే. ఆ సంఘటన జరగబోయే కొన్ని నిమిషాల క్రితం వాళ్ళు దిగిన పక్కరూమ్ వెకేట్ చేస్తుంటే ఆ గది చెక్ చేసి తిరిగి వెళుతుండగా హత్య జరిగిన విషయం నాకు తెలిసింది మేడమ్..."
"వెరీగుడ్...! నువ్వే ఆరోజు డ్యూటీలో ఉన్నావు కాబట్టి నీకు తప్పనిసరిగా తెలిసే వుంటుంది" ధీరజ అతని ముందుకు వంగుతూ అన్నది.
