శ్రీరామ పట్టాభిషేకము
రామ రాజ్యము ఆదర్శ రాజ్యముగా ప్రసిద్దికెక్కినది. కలిమియె కాని లేమియన్నది లేదు; చోర భయము లేదు; అతివృష్టి అనావృష్టులు లేవు; అవసరమైనంత వర్షము సకాలమున పడి క్షేత్రములు (పొలములు) సస్యశ్యామములై భాసిల్లినవి. ఈతి బాధలు లేవు; అకాలమరణములు లేవు! వర్ణాశ్రమ ధర్మములు పాటించబడి సంఘము వర్దిల్లినది.

ఇంద్రుడు శ్రీరామునకు ప్రత్యక్షమై "రామచంద్రా సాధుజన హింసకులగు అసురుల నెల్లరను సంహరించి శిష్టులకు మేలుచేసినావు! నీకు వరమునిచ్చుటకు వచ్చినాను; కోరుకొనుము" అన్నాడు.
శ్రీరాముడు: రణమున మరణించిన వానర భల్లూకయోధుల నందరిని బ్రతికించుము.
వారిని ఇంద్రుడు బ్రతికించినాడు. వారు నిద్ర నుండి మేలుకొన్నట్లు లేచి ఇంద్రునకును శ్రీ రామునకునుమ్రొక్కినారు. అమరేంద్రుడమరావతికి నిష్ర్కమించినాడు.
పిమ్మట శ్రీరాముడు విభీషణ సుగ్రీవులతో ఇట్లనెను: "నేను భరతునితో 'తమ్ముడా కైకేయిదేవి తన వరమున కోరినట్లు నా పదునాలుగేండ్ల వనవాసము పూర్తియైన పిమ్మటలనే అయోధ్యకు తిరిగి వచ్చెదను. నీవునూ ఆమె వరములో అడిగినట్లు రాజ్యపాలనము చేసి తండ్రి మాటను నిలబెట్టుము అన్నాను. 'నీవు తిరిగి వచ్చువరకు మాత్రమే నేను రాజ్యమును చేసెదను. నీ కొరకెదురు చూచుచు , నీ వరుదెంచుటతోనే ఆ రాజ్యమునకు నిన్ను పట్టాభిషిక్తుని కావించెదను. నీవు రానిచో నేను ప్రాణములు విడిచెదను' అన్నాడాతడు.
నేను ఆందోళనతో 'అనుజుడా అట్టి అఘయిత్యమును తలపెట్టకుము. నేను తప్పక తిరిగి వచ్చెదను' అని మాట ఇచ్చినాను.
మా పదునాలుగేండ్లు వనవాస కాలము ఎల్లుండి పంచమి నాడు ముగియును. మేము మువ్వురామునూ త్వరగా నంది గ్రామము చేరుకొనవలేను. నంది గ్రామమును అయోధ్యయూ బహు దూరమున గల ఆర్యావర్త దేశముననున్నవి. ఇచట నుండి ఆర్యవర్తమును చేరుకోనుటకు నూరు యోజనముల సముద్రమునూ దక్షిణాపథము నంతనూ దాటి పోవలెను. చాలా కాలము పట్టును. త్వరగా చేరుకొనుట యెట్లని యోచించుచున్నాను."
విభీషణుడు: రామప్రభూ నా అగ్రజుడు రావణుడు మున్ను కుబేరుని పుష్పకమును బలవంతముగా తెచ్చి వాడుకొన్నాడు. ఇప్పుడు ణా యధీనము నందున్న ఆ విమానములో పోయి అత్యంత రయమున నంది గ్రామమును చేరుకోనవచ్చును... నాదోక్క విన్నపము. విమానములో నేనునూ ణా పట్టమహిషి సరమాదేవియూ నీతో వచ్చి అయోధ్యలోన నీ పట్టాభిషేక మహొత్సవమును తిలకించగోరు చున్నాము; అనుమతించుము.
సుగ్రీవుడు: రామప్రభూ నాకునూ అనుమతి నీయగోరుచున్నాను.
సీత: విమానమును కిష్కింధ వద్ద ఆపి మనతో తారాదేవినీ రుమాదేవినీ కూడ తీసికొని పోవలెనని అభిలషించుచున్నాను; అనుమతించుము.
శ్రీరాముడు: (సంతోషముతో) అనుమతించుట కాదు; ఆహ్వానించుచున్నాను. జాంబవంతుడునూ అంగద హనుమంతులునూ తప్పక రావలెను.
విభీషణుడు: రామప్రభూ పుష్పక విమానముణ కొక విశేషమున్నది, ఎందఱిని తీసికొని పోవాలెనన్ననూ అందు చోటు లభించును.
శ్రీ రాముడు: (సంతోషముతో) ఐనచొ వానర భల్లూక యోదులెల్ల రానందముతో పుష్పకమున చోరబదినారు. విమానము కడు వేగమును సంతరించుకొనుచూ ఉత్తర దిశగా పోయినది.

శ్రీ రాముడు: జానకి త్రికూటగిరిపై డేవశిల్పి విశ్వకర్మ నిర్మించిన లంకాపురి మనకు దూరమగుచున్నది. తిలకించుము... ఇది రణరంగము... అదిగో ఆ దిబ్బ ప్రక్కననె కుంభకర్ణుడు హతుడైనాడు... మన లక్ష్మణుడు ఇంద్రజిత్తును సంహరించిన స్దలమిదిగో... అటు వీక్షించుము. నేను 'రావణుని పది తలలను తఱిగి వధించిన తలమయ్యదియె. నూరు యోజనముల వారధిని ఎంత త్వరితముగ దాటి వచ్చితిమొ గమనించితివా? నలుడు నిర్మించిన శతయోజనముల సేతువులోని శిల్పము అత్యంత రమణీయము, తిలకించుము... దక్షిణా పథమును చేరుకొన్నాము.
