Previous Page Next Page 
మహావృక్షం పేజి 48

వాళ్ళు వెళ్ళాక అడిగింది అనూష. "ఏంటి? ఏదో సైగచేశావు.... నాకర్ధంకాలేదు."
"ఇప్పుదర్డంచేసుకుని ఏం చేస్తావు? వాళ్ళిద్దరికి కాళ్ళకు నమస్కరించమన్నాను" అన్నది వీణ.
"అలాగా! ఏవిటో నాకీ ఆలోచనే రాలేదు. అమ్మా, నాన్నా పోయాక ఈ కాళ్ళకి దణ్ణాలు పెట్టడం సంగతే మర్చిపోయాను. సరేలే! పెళ్ళిలో చూద్దాం."
"చూద్దాం ఏంటి? వాళ్ళనేదో ఉద్దరిస్తున్నట్టు.... చూడూ! పెళ్ళి అయిందాకా నువ్వు గొప్ప సర్జన్ అన్న సంగతి మర్చిపో. ఆడపిల్లలా ప్రవర్తించు."
"అంటే! అత్త, మావల సేవలు చేస్తూ, కాళ్ళకి నమస్కరిస్తూ వుండాలా?"
"కాదు. మధ్య, మధ్య కాబోయే భర్త గురించి ఆలోచిస్తూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వుంటే చాలు. చూసి సంతోషిస్తాను."
వీణ మాటలకి ఫకాల్న నవ్వేసింది. "అది సరేకానీ,నువ్వేంటి పెద్ద కట్నకానుకుల గురించి మాట్లాడేస్తున్నావు. నేనిస్తాననేనా?"  
"ఈ ప్రశ్న వాళ్ళు వెళ్ళగానే అడుగుతావనుకున్నాను" అని నవ్వి అన్నది వీణ. "నువ్విస్తావని, ఇవ్వాలని కాదు. నిన్ను నిన్నుగా  కోరుకుంటున్నారా? నీ డబ్బుకోసం కోరుకుంటున్నారా తెలుసుకోవాలని అడిగాను."
"అదంతా సులభంగా తెలుసుకోలేంలే వీణా! ఇలా ఆలోచిస్తూపోతే, జీవితం గడిచి పోతుంది. మార్పు ఏం వుండదు.... అయినా, పెద్దదాన్ని అయాను. ఎలాజాగ్రత్తగా వుండాలో నాకు తెలియదా?"
"నువ్వన్నది నిజమే. అందర్నీ అనిమనిస్తూ పోతే, మనకి మంచివాళ్ళు అంటూ ఎవరూ కనిపించరు. సరే! నేను వెళ్తున్నాను. రేపు ఆశ్రమానికి వెళదాం. శ్యామలతో మాట్లడద్దూ..." అన్నది వీణ బయలుదేరుతూ.
"అలాగే... థాంక్యూ!"
"చంపేస్తాను. మనమధ్య థాంక్యూలేంటి?" అనూష నెత్తిమీద సుతారంగా మొట్టిబయలుదేరింది వీణ.
జీవితంలో మొదటిసారిగా ఓ వింత అనుభూతికి లోనవుతూ, మంచం మీద పడుకుని భవిషత్తువైపు బయలుదేరింది అనూష.

                        *    *    *    *
మర్నాడు ఉదయమే ఫోన్ చేశాడు. అప్పుడే హాస్పిటల్ కి వేల్లాదానికి బయలుదేరుతుంది అనూష.
ఫోన్ మోగగానే రిసీవర్ తీసుకుని "హలో! అనూషా హియర్" అన్నది
"అనూషగారూ.... నేను భరణిని."
అతని స్వరం వినగానే ఒక్కక్షణం ఆమె గుండె లయతప్పింది. కొంచెం ఖంగారుగా "హా... హలో" అన్నది.
"నేనండీ భరణిని.... సారీ! డిస్టర్బ్ చేశావు భరణీ! నీకింత దైర్యం ఎలా వచ్చింది? అనూష గుండె సృశించే అధికారం నీకెవరిచ్చారు?"
"అనూషగారూ! వినిపిస్తుందా? ఏంటి ఫోను బాగాలేదా? ఎనీ ప్రాబ్లమ్స్?" అతని స్వరం గట్టిగా వినిపించటంతో ఉలిక్కిపడి.... "ఆ.... కొంచెం సరిగా వినిపించటంలేదు. చెప్పండి... ఇప్పుడు బాగానే వుంది" అన్నది.
"ఏంలేదు. అమ్మా, నాన్నా ఇవాళ వెళ్ళిపోతున్నారు. మిమ్మల్ని కలవలనుకున్నాను కానీ, కలవలేను. మరోసారి మీ  నోటిమీదుగా మన పెళ్ళి విషయంలో అంగీకారం వినాలనుకుంటున్నాను.... నిజంగా మీకేం అభ్యంతరం లేదు కదూ!"
అతని స్వరంలో వినిపించిన ఆదుర్దా, సందేహం నవ్వు తెప్పించింది.
చిలిపిగా అన్నది. "ఒకవేళ అభ్యంతరం అంతే ఏం చేస్తారు? నిన్న మీ అమ్మాగారు చీర, జాకెట్టు ఇచ్చేశారుగా... రిటర్న్ తీసుకుంటారా?"
"అనూషగారూ! అంత మాటనకండి.... ప్లీజ్."
జాలేసింది అనూషకి.
"నాకు మనస్పూర్తిగా ఇష్టమే.... సరేనా?" మృదువుగా అన్నది.
"థాంక్యూ.... థాంక్యూ వెరీమచ్. ఉంటాను.... రేపు కలుస్తాను. షాపింగ్ కి వెడదాం" ఉద్వేగంగా అంటూ ఫోన్ పెట్టేశాడు.
చిత్రమైన భావాలతో నిండిపోయింది ఆమె మనసు.... ఏమిటది? ఈ మధురోహాలు, ఈ పులకింతలు... ఇంకా నాలో స్పందనలు మిగిలి వున్నాయా? నేనింకా పెద్దదాన్ని కాలేదా? నా గుండె బండబారిపోయిందనుకున్నాను.... నాలో కూడా స్రీ సహజమైన అనుభూతులు వున్నాయన్నమాట... ఆశ్చర్య పోతూ హాస్పిటల్ వెళ్ళిపోయింది.

                       *    *    *    *
సరిగ్గా వారం రోజుల తరువాత, ఒక ప్రయెజనంతో విధివంచితులైన స్రీలకు స్పూర్తినిస్తూ, ఆశ్రమాన్ని కల్పిస్తూ తన చేతులతో, తన ఆస్తితో అనూష నిర్మించుకున్న ఆశ్రమప్రాగణంలో వీణ, డా.... హరిశ్చంద్ర,చిన్నయ్య, భరణి తల్లీతండ్రులు, శ్యామలా, సరాదా, నీరజా మొదలైన ఆశ్రమవాసుల సమక్షంలో.... మంచితనం, మానవత్వం సాక్షిగా అనూష, భారనిల వివాహం జరిగింది.
అందరి అభినందనల పరంపరలో హరిశ్చంద్ర దీవెనల మధ్య డాక్టర్ అనూష, సుప్రసిద్ద కార్డియో దోరాసిక్  సర్జన్, మిసెస్ భరణి అయింది.
వీణ అనూషకి నెక్లెస్ బహూకరించింది.
అనూష, వీణని కౌగలించుకుని నువ్వు కూడా పెళ్ళికూతురు అయితే చూడాలనుందే అన్నది.
వీణ నవ్వింది. కానీ ఆ నవ్వు వెనక దాగిన విషాదం, కాళ్ళ చేమరింపు ద్వారా అనూష కళ్ళలో పడింది.
ఆమె మనసు మూగబోయింది. ఏ నాటికయినా ఈ విషాదం నీ జీవితంలోంచి చేరిపెయాలి వీణా! అనుకుంది.
శ్యామల తనే స్వయంగా వంటచేసింది అందరకీ. సుశీల సాయంచేసింది. పెరట్లో కాసిన నిమ్మకాయలు తెంపి, పులిహొర చేసింది. టమాట పెరుగుపచ్చడి, గుత్తివంకాయ, సాంబరు, పాలకూర పప్పు, అప్పడాలు వడియాలు, వేపుడు ముక్కలు దోసవకాయ, గులాబ్ జామ్, పాయసం వగైరా వంటకాలతో నిండుగా వున్న అరిటాకులు చూస్తుంటే ఇలాంటి శుభకార్యం ఒకటి ఆశ్రమంలో జరపవచ్చు అన్న సంగతి మొదటిసారిగా అర్ధంమైంది అనూషకి.... మృదుల ఒక్క మాట తనతో చెప్పి వుంటే, ఈ ఆశ్రమంలో ఆమె పెళ్ళి జరిపించింది. మృదులను తలచుకోగానే గుండెల్లో ఎక్కడో కలుక్కుమంది. ఆమె వెళ్ళిపోవడంతో ప్రతివాళ్ళు తనని విమర్సించారు. తన దయాగుణం మీద దాడిచేశారు.... కృతజ్ఞరాలు.

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS