Previous Page Next Page 
మహావృక్షం పేజి 49

మృదులలాగా ప్రవర్తించకముందే నీరజ క్కూడా మంచి సంభందం చూసి పెళ్ళిచేయాలి. ఈ భాధ్యత ఒకటి తన మీద మిగిలిపోయింది. తన ఈ కొత్త జీవితం సెటిల్ అయ్యాక నీరజ సంగతి చూడాలి. ఆ శుభవేళమరో శుభకార్యం జరపాలని అప్పటికప్పుడే నిశ్చయించుకుంది.
వంటాకలు అన్నే రుచి చూసిన భరణి తల్లి మనసారా మెచ్చుకుంది.
"ఎంత బాగుందమ్మా నీ చేతివంట.... మళ్ళీ ఇప్పుడు తింటుంన్నాను."
"శ్యామల చాలా బాగా చేస్తుందండి వంట" అనూష అన్నది.
ఎందుకో ఆవిడని "అత్తయ్యగారూ!" అని ఆయన్ని "మావయ్యగారూ!" అని పిలవాలంటే కొత్తగా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తోంది.
ఆవిడా చాలా చిన్నదానిలా వుంది. సన్నగా,తెల్లాగా. పొట్టిగా వుంది. కోటేరు ముక్కు, చిన్నవైన ఆకర్షణీయంగా వున్న కళ్ళు, సన్నటి పెదాలు, సగం నరిసిన జుట్టు ముడివేసి, ముడి చూట్టూ పూలు పెట్టుకుంది. అయన మంచి ఒద్దు, పొడుగు వుండి, నల్లగా విన్నా, ఆకర్షనీయంగా, గంబీరంగా వున్నాడు. భరణికిఅయన పర్సనాలీటి, ఆవిడా రంగు, మోహం తీరు వచ్చింది. అందుకే అతను అందగాడు అయినాడు అనుకుంది.
అందరికన్నా ముందు వీణ బోజనం ముగించి లేచి, చేయి కడుక్కుమ్ది. నెప్ కిన్  తో చేతులు తుడుచుకుంటూ వచ్చి "అనూ! నను అర్జంటుగా ఓ చోటికి వెళ్ళాలి. నిన్ను మీ ఇంటి దగ్గర కలుస్తాను" అన్నది.
"మళ్ళీ అను ఇంటికి వెళ్ళడం దేనికి? ఈ రాత్రి ఇక్కడే వుండచ్చు కదా!" అన్నది శ్యామల.
"ఏంటి? కూతురికి పెళ్ళిచేసి అత్తారింటికి పంపించకుండా మీ ఇంట్లోనే అట్టిపెట్టుకుంటావా?" వీణ మాటలకి నవ్వారంతా.
"అదికాదు... ఏదో చెప్పబోతున్న స్యామలకి కళ్ళతోటే సైగచేసింది వీణ గ్రహించిన దానిలా శ్యామల మారూమాట్లాడకుండా వూరుకుంది.
వస్తాను... వస్తానండి..." వీణ, భరణి తల్లితండ్రుల దగ్గర సెలవు తీసుకుంది.
"అలాగేనమ్మా వెళ్ళిరా... నీ స్నేహితురాలినే కాదు, మావాడిని కూడా ఓ ఇంటి వాడిని చేసిన పుణ్యం నీకు దక్కింది" అన్నాడాయన.
నాదేం వుండండి.... అంతా దైవ నిర్ణయం" నవ్వింది.
వీణ కారు వెళ్ళిపోయింది.
అందరూ బోజనాలు ముగించారు.
"అమ్మాయ్! నిన్ను ఏకవచనంలో సంబోదించాలంటే నాకు నిజంగా మనసురావడంలేదు. మా కోడలి హొదాలో రాకుండా వుండివుంటే, ణే ముందు మేము చేతులు కట్టుకుని నిలబడల్సిన వాళ్ళం.... కానీ మరి మా అదృష్టమో, మా వాడి అదృష్టమో నువ్వు మా ఇంటికి కోడలివైనావు... ఏది ఏమైనా వీడి గురించి నీకు కొంత చెప్పాలి" బావుజానాలు ముగించి, పెరట్లో కుర్చీలో కూర్చున్నాక అన్నాడు మార్కండేయులు.
"బాగుందండి... అమ్మాయికి పెళ్ళిచేసి పంపిస్తూ అంపకాలు పెడతారు ఎవరయినా. మీరు అబ్బాయికి అంపకాలు పెడతారు ఎవరయినా. మీరు అబ్బాయికి అంపకాలు పెడుతున్నారా?" లక్ష్మి మాటలకి అనూష చిరునవ్వుతో చూసింది.
"అంపకాలు కాదు... రెప్పట్ట్నిమ్చీ వీడిని భరించాల్సింది ఆ అమ్మాయి. వీడి కోపం, పంతం, వగైరా చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? వీడుట్ట మొండివాడమ్మా.... భూమ్యాకాశాలు తల్లకిందులయినావాడు అనుకున్నది సాధించాలి... అంతే!"
"ఆ విషయం మీరు వేరుగా చెప్పాలా మా అనూషను భార్యగా సాదించడంలోనే అతని పట్టుదల తెలిసింది మాకు" శ్యామల చిరునవ్వుతో అంది.
"మంచిమాట అన్నావమ్మా. పోనీలే... ఆలస్యం చేసినా, బంగారంలాంటి భార్యను సంపాదించుకున్నాడు."
అనూష కొంచెం ఇబ్బందిగా అన్నది. "మీరలా మాటిమాటికి పొగుడుతుంటే నాకు ఇబ్బందిగా వుండండి."
"సరేలే... పొగడను.... అన్నట్టు అనూషా! నాకు అప్పుడప్పుడు గుండెల్లో సన్నగా నొప్పి వస్తూ వుంటుందమ్మా. ఇదేమైనా ఎటాక్ సిగ్నల్స్ అంటావా?"
నవ్వింది. "ఎటాక్ వచ్చేముందు సిగ్నల్స్ ఏమ్తూ ఏం వుండవండి. బహుఉసా మీరు వేలకి బోంచేయరేమ. ఎసిటిక్ పెయిన్ వస్తుంది. అంతే మీ బోజనం టైమింగ్స్ ఏంటి?"
"ఆయనకి ఓ టైమా? పాడా తల్లీ.... పెళ్ళి అతిన దగ్గర్నించి చూస్తున్నాను. ఏ వేళకి  తింటారో, ఏ వేళకి వస్తారో యనకి తెలియదు. ఇదుగో వస్తున్నా అంటూ, కబురు చేస్తారు... వస్తారుకదా! అని ఎదురు చూస్తూ అలా వంటింటి గుమ్మంలో కొంగుపరుచుకు పడుకునేదాన్ని. ఎప్పుడో వచ్చి నిద్దర లేపెవారు.... ఇప్పటికీ అదే తంతు..."
"లేదండి మీరు వేళకి బోజనం చేయటం చాలా అవసరం... పెద్దవారు అవుతున్నారుకదా! ఇప్పుడు హెల్త్ కేర్ తీసుకోవడం చాలా అవసరం.... రోజూ మార్నిగ్ వాక్ చేయండి."
"నేనే చేసేదే అది... నిద్దరలేచి, స్నానం చేసి, అరున్నరకల్లా పొలం వైపు బయలుదేరుతాను... అదే వాకింగ్..."
"వెరీగుడ్.... అలాగే బోజనం కూడా వేళకి చేస్తే చాలు... ఏం జబ్బులుండవు..."
సుశీల అందరికీ పాన్ లు చుట్టుకుని తీసుకొచ్చి ఇచ్చింది.... భరణి! వీళ్ళ మాటలతో తనకేం సంబంధం లేనట్టు, ఆశ్రమం మొత్తం కలయతిరిగి వచ్చాడు. ప్రశాంతంగా, పూలమొక్కలతో, కుతీరంలా ఉన్న ఆశ్రమం అతనికి బాగా నచ్చింది.... ముక్యంగా అక్కడివాళ్ళంతా అనూషకి ఇస్తోన్న గౌరవం చూస్తుంటే అతని గుండె గర్వంతో పొంగిపోతుంది. ఆమె వాళ్ళకి ఇచ్చిన సౌకర్యాలు, భద్రతా చూస్తోంటే గర్వంగా అనిపిస్తోంది అతనికి. ఇంతటి గొప్ప స్రీ మూర్తి తన భార్యా? నమ్మలేని నిజాల్లో ఇదోకటి కాబోలు! అనుకున్నాడు. నీరజ కొడుకుతో కాస్పెపు ఆడుకున్నాడు. అతనలా ఆడుకోవడం చూసిన శ్యామల భగవంతుడా! వచ్చే ఏటికల్లా మా అనూష కూడా పండంటి పాపాయిని ఎత్తుకోవాలి అని దీవించు తండ్రీ! అని వేడుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS