Previous Page Next Page 
మహావృక్షం పేజి 47

అతని హడావిడి, అనందం చూస్తుంటే వీణకి ముచ్చాటగా అనిపించింది
"మారేజ్ హాలు సత్యసాయి కళ్యాణమండపం మాట్లాడానా? ఆవిడా సర్కిల్ చాలా పెద్దది కాదా!"
అతని జోరుకి అడ్డుపడుతూ అన్నది... "ఏంటి? ఆకాశమంత పందిరి, భూదేవంత పీటా  వేసి చేసుకుంటారా?"
"మీ ఐడియా బాగుందికానీ, తనకి ఈ హడావిడి ఇష్టంలేదు. సింపుల్ గా ఆశ్రమంలో చేసుకుంటానంది. కేవల ఆత్మీయుల సమక్షంలో దండలు మార్చుకోలన్నదితన కోరిక."
"కానీ, అంత అవసరం ఏం వుంది?"
"తెలియదు. బహుసా లేట్ మ్యారేజ్ అని కాబోలు."
"కావచ్చు... కానీ, మొదటి పెళ్ళేగా? ఆవిడకీ, నాకూ కూడా."
"మొదటి పెళ్ళి, రెండో పెళ్ళి ఏంటి భరణి! పెళ్ళంటే ఏంటి? అనురాగంతో పెనవేసుకున్న రెండు హృదయాలు కలిపి బతకడం కోసం సమాజం దగ్గర తీసుకునే లైసెన్స్.... ఆ లైసెన్స్ తీసుకోవాడానికి ఆర్బాటం దేనికి?"
భారానికి కొంచెం అసంతృప్తిగా అనిపించింది. ఇంతకాలం ఎదురుచూసి అనూషలాంటి గొప్ప స్రీని పెళ్ళిచేసుకుంటూ, సిపుల్ గా చేసుకోడం ఏంటి? గ్రాండ్ గా చేసుకుని, తన పేపర్ లో కనీసం పెళ్ళిఫోటో వేయాలి. అనూష తన భార్య అని ఈ ప్రపంచానికి చాటాలి.
అతని అసంతృప్తి గమనించిన దానిలా కొంచెం మృదువుగా అన్నది వీణ. "పెళ్ళి ఎలా చేసుకున్నా, మీరు భార్యభర్తలు అవుతారు... కాదని ఎవరన్నా అనగలరా?"
నిజమే అనుకోండి. కానీ...." సాలోచనగా అన్నాడు. నిజంగానే ఆవిడకి ఆర్బాటం ఇష్టంలేదా?"
"లేదని నా ఉద్దేశం? పోనీ ఓసారి డిస్కస్ చేద్దామా?"
"ఓద్దోద్దు.... ఆవిడకి ఇష్టంలేని పని చేయమని బలవంతం చేయద్దు. ఆవిడా కేలా ఇష్టమయితే అలాగే చేద్దాం" అన్నాడు ఖంగారుగా. అనవసరంగా డిస్కస్ చేసి, అనూషని ఇబ్బందిపెట్టడం, బలవంత పెట్టడం అతనికి ఇష్టంలేదు. మళ్ళీ ఆమె మూడ్ మార్చుకుంటుందేమో అనే భయం కలిగింది.
"మరి.... మీవాళ్ళు రాగానే కబురుచేయండి. నేను వెళ్తాను. మళ్ళీ కలుస్తాను."
"రేపు షాపింగ్ కి వెళదామా?"
"తప్పకుండా ముగ్గురం కలిసే వెడదాం సరేనా?"
"థాంక్యూ.... మీరు ఏం తీసుకోకుండా వెళుతున్నారు..."
"తీసుకుంటాను. పెళ్ళిలో ఆడపడుచు లాంచానాలు."
తప్పకుండా మీక్కూడా మంచి పట్టుచీర పెడతాను."
"ఆడపడుచు లాంచానాలు ఇవ్వాల్సింది మీరుకాదు.... మా అనూష" నవ్వేసి లేచింది.
తన తెలివితక్కువకి నాలుక కోరుక్కున్నాడు. బైటపడిపోయానే అని సిగ్గుపడ్డాడు.
"బై..." వీణ కారు స్టార్ట్ చేసింది.
తగినవాడని భావించానని ఆమె చెబుతుంటే, నా కొడుకు ఇంత గొప్పవాడా! అనిపించింది మార్కండేయులికి. చాలా సంతోషించాడు ఆయన. ఫర్వాలేదు... నా భావాలకి తగినట్టు చేస్తున్నాడు అని మనసులోనే కొడుకుని అభినందించాడు.
భరణిని ఆఫీసు దగ్గర పికప్ చేసుకుని అనూష ఇంటికీ వెళ్ళారు.
అనూష హల్లో కూర్చుని ఎదురుచూస్తోంది. కాటన్ చీరలో హుందాగా వుంది. అంతులేని విజ్ఞానం ముందు పెద్దరికం తలవంచుతుందేమో! ఆమె మొహంలో కనిపిస్తోన్న తేజస్సు చూడగానే అప్రయత్నంగా నమస్కరించారు మార్కండేయులు, లక్ష్మి కూడా. అనూష కూడా నమస్కరించి మర్యదుగా ఆహ్వానించింది.
"కూర్చోండి" అన్నది సోఫా చూపిస్తూ.
"మావాడు నిన్ననే ఫోన్  చేశాడమ్మా.... విషయం చెప్పాడు..." అన్నాడు మార్కండేయులు.
అనూష మాట్లాడలేదు.... వీణవైపు చూసింది.
వీణ గొంతు సవరించుకుని అన్నది. "మీకేమన్నా కోరికలు, ఐడియాస్ వుంటే చెప్పండి సార్... ఐమీన్ కట్నం..."
"ఛ, ఛ" చప్పున అన్నాడు."ఏం మాటలమ్మా? మావాడిని పెళ్ళిచేసుకోవాడానికి ఆవిడా ఒప్పుకోవడమే గొప్ప. కట్నాలు, కానుకలూనా? ఎంత మాటన్నారు?"
"మా అనూష ఇవ్వలేని స్థితిలో లేదు కదండీ... అందుకే అడిగాను."
"నేను డబ్బు ఆశించే మనిషిని కాను. వాడికి బాధ్యత తెలియాలని కొంత కఠినంగా వ్యవహరించిన  మాట నిజం. ఇప్పటికైనా వాడు ఓకింటివాడు అవుతున్నాడంటే చాలా సంతోషంగా వుంది. చూడమ్మా... మా అబ్బాయి స్వభావం గురించి మీకు కొద్దిగా చెప్పాలి. వాడు చాలా మొండివాడు."
ఆ విషయం మాకు  తెలుసండి" చప్పున అన్నది వీణ.
"అంటే.... మొండిపట్టుతో నిన్ను సాధించడా?" అడిగాడాయన అనూషతో.
"అదేం లేదండి" నవ్వింది అనూష. అలా అంటూ భరణివైపు చూసింది. అప్పుడే అతనూ ఆమెవైపు చూశాడు. ఒక్క క్షణం అనూష గుండెజల్లుమంది. వెంటనే చూపులు తిప్పేసుకుంది.
రాజు అందరికీ స్నాక్స్, టీ తీసుకొచ్చి ఇచ్చాడు.
లక్ష్మి అనూషకి బొట్టుపెట్టి, చీర, జాకెట్టు, పూలు, పండ్లు ఇచ్చింది.
అనూష అవి అందుకుని "థాంక్సండీ" అన్నది.
వీణ అనూషకి సైగచేసి, ఊరుకుంది. కాసేపు అన్ని విషయాలూ మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయారు. పెళ్ళి సింపుల్ గా అవాలన్న అనూష కోరికతో మార్కండేయులు ఏకీభవించాడు.

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS