"వాళ్లని డబ్బుకోసం తార్చుకొనేవాడివి.
నీ కోసం వాళ్లు తేలికగా సంపాదించి పెట్టేవాళ్ళు."
అంతే!
ప్రశాంత్ మొహం జేవురించింది.
పిడికిళ్లు బిగుసుకున్నాయి.
"యూ బాస్టర్డ్" అంటూ సూరిబాబు మీదకి లంఘించి జుత్తు పట్టుకొని కుర్చీలోంచి కిందికి ఈడ్చి మోకాళ్లతో మొహం పైన కుమ్మేశాడు.
ఓదెబ్బ సూరిబాబు నోటిపైన తగిలింది. ఓ పన్ను పెదవిలో దిగి రక్తం స్రవించసాగింది.
"రాస్కెల్! ఇలాంటి కూతలు కూస్తే నీ రక్తం తాగుతాను!"
"ఏడిశావ్! అయినా అంతరాంతరాల్లో నాలో దాగిన ఓ నగ్న సత్యం నాకు తెలిసింది. లేని అక్క చెల్లెళ్లని అంటేనే పీక్కుని చస్తున్నావు.
అందరు ఆడపిల్లలు అంతేరా!
ఆడదంటే అర్దం తెలీని పశువ్వి నువ్వు. ఆడవాళ్ల విలువలు నీకేం తెలుసురా!
బహుశా నీ అక్కచెల్లెళ్ల నన్నందుకు కాక నిన్ను బ్రోకర్ గాడి వనుకున్నందుకు నీకు కోపం వచ్చి వుండాలి.
నువ్వు నిజంగా ఆ జాతి వెధవ్వే!" అన్నాడు సూరిబాబు ఆవేశంగా.
"వాళ్లని డబ్బుకోసం తార్చుకొనేవాడివి.
నీ కోసం వాళ్లు తేలికగా సంపాదించి పెట్టేవాళ్లు."
"అంతే!
ప్రశాంత్ మొహం జేవురించింది.
పిడికిళ్లు బిగుసుకున్నాయి.
"యూ బాస్టర్డ్" అంటూ సూరిబాబు మీదకి లంఘించి జుత్తు పట్టుకొని కుర్చీలోంచి కిందికి ఈడ్చి మోకాళ్లతో మొహం పైన కుమ్మేశాడు.
ఓ దెబ్బ సూరిబాబు నోటిపైన తగిలింది. ఓ పన్ను పెదవిలో దిగి రక్తం స్రవించసాగింది.
"రాస్కేల్!ఇలాంటి కూతలు కూస్తే నీ రక్తం తాగుతాను"
"ఏడిశావ్!అయినా అంతరాంతరాల్లో నాలో దాగిన ఓ నగ్న సత్యం నాకు తెలిసింది. లేని అక్క చెల్లెళ్లని అంటేనే పీక్కుని చస్తున్నావు.
అందరు ఆడపిల్లలు అంతేరా!
ఆడదంటే అర్దం తెలీని పశువ్వి నువ్వు. ఆడవాళ్ల విలువలు నీకేం తెలుసురా!
బహుశా నీ అక్కచెల్లళ్ల నన్నందుకు కాక నిన్ను బ్రోకర్ గాడి వనుకున్నందుకు నీకు కోపం వచ్చి వుండాలి.
నువ్వు నిజంగా ఆజాతి వెధవ్వే!" అన్నాడు సూరిబాబు ఆవేశంగా.
ప్రశాంత్ క్షణం ఆగాడు.
అతనిలో వాదనలోకి దిగితే తనకే నష్టం. అవతల అర్జంటూ సీరియల్ ఇన్ స్టాల్ మెంట్ ఇవ్వాలి.
ఏదోలా నయానా భయానా చేయించలేక తప్ప వాదనలోకి దిగితే సూరిబాబు వినడని అర్దం అయిపోయింది.
"ఓ. కే. సూరి.
నీ ఇష్టం. వచ్చినట్లు అనుకో.... నేను.... నేను బాధపడను. పట్టించుకోను. నాకు కావాల్సింది స్క్రిప్ట్ వర్క్.
నీకు రెండు రోజులు టైం డైరెక్ట్ నవలకి
మనసు మార్చుకొంటే ఓ. కే. లేకపోతే జీవితమంతా కుళ్లి కుళ్లి ఏడిచేలా చేస్తాను"
"నువ్విందాకా నీ గురించి నువ్వేం చెప్పుకొన్నావు. నువ్వు పిచ్చి కుక్కవని.
ఏదో ఒకరోజు నిజంగా నువ్వు పిచ్చికుక్కలా రోడ్లు పడతావు. ఆ రోజు చాలా దగ్గర్లోనే వుంది" అన్నాడు సూరిబాబు.
ఉద్రేకాన్ని అణుచుకొని అక్కడనించి గబగబా బయటికి నడిచాడు ప్రశాంత్.
26
గుమ్మంలో అలికిడి అయితే చాపమీద కూర్చుని బియ్యంలో రాళ్లు ఏరుతోన్న కామిని తలెత్తి చూసింది.
ప్రశాంత్ గుమ్మంలో నించుని వున్నాడు.
"రండి" అంది కామిని లేచి నిలుచుంటూ.
ఓసారి ఇంట్లోకి చూపుని సారించి సిగరెట్ వెలిగించి లోపలికి వచ్చాడు.
"కూర్చోండి" అని ఆ గదిలో వున్న ఒకే ఒక చెక్క కుర్చీని చూపించింది కామిని.
ప్రశాంత్ కుర్చీలో కూర్చుంటూ.
"అమ్మ లేదా?" అని అడిగాడు.
"గుడికి వెళ్లింది" అని చెప్పింది.
అతను సన్నగా నవ్వుకున్నాడు. సరైన సమయానికే వచ్చానన్న మాట' అనుకున్నాడు.
అతను కామినికేసి చూశాడు.
కామిని పవిట కొంగుని చేతి వేలికి చుట్టుకొంటోంది.
సిగరెట్ ని పెదాలమధ్య బిగించి గట్టిగా దమ్ములాగాడు ప్రశాంత్.
ఒకే తల్లి కడుపున పుట్టినా సూరిబాబుకీ, కామినీకి చాలా తేడావుంది.
సూరిబాబు చాలా అగ్లీగా వుంటాడు. నిజం చెప్పాలంటే రెండు క్షణాలు అతని మొహంలోకి సూటిగా చూస్తే ఎక్కడలేని వికారము కలుగుతుంది.
కానీ కామినీ అలా కాదు.
ఛామన చాయ రంగులో ఆకర్షణీయంగా వుంటుంది.
పెద్ద కళ్లు.
తీర్చిదిద్దినట్లుగా కనుబొమలు.
నున్నని చెంపలు.
కొనతేరిన ముక్కు.
గుండ్రని చిన్ననోరు.
పలుచని పెదిమలు.
చెవులకి రోల్డ్ గోల్డ్ రింగులు పెట్టుకుంది. మెడలో కనీసం చిన్న గొలుసుకూడా లేదు. చేతులకి మట్టిగాజులు వేసుకుంది.
పెద్ద మెడగల జాకెట్ ని వేసుకోవడం వలన ఆమె యవ్వన సంపదలు అర్దనగ్నంగా బహిర్గతం అవుతున్నాయి.
పాత షిపాన్ చీర కట్టుకొంది.
అది ప్రశాంత్ రెండేళ్ల క్రితం ఆమెకు కొనిచ్చాడు.
చీరకీ, జాకెట్ కీ మధ్య పొట్ట కుచ్చెళ్లపైన ఉబికింది.
కామినీ సన్నగా పొడుగ్గా వుంటుంది. ఆమె గొప్ప అందకత్తెల లిస్ట్ లోకి రాకపోయినా చూడగానే చూపరులని ఆకర్షించగల శక్తి ఆమెలో వుంది.
